శ్రీసత్యసాయి పద్యసుథ

అతిగ భాషించు శూరత్వమధికమయ్యె

కార్య శూరత శూన్యమై కరగిపోయె

బ్రతుకులాడంబరాలతో భారమాయె

నేటి విద్యార్థి బ్రతుకులీపాటివాయె.(008-230688)

అదియు పూర్ణము ఇదియు పూర్ణము

పూర్ణమున ఉదయించు పూర్ణము

పూర్ణమున పూర్ణము తీసిన

పూర్ణమే శేషించి యుండు. (009-1982)

అదిచేతు ఇదిచేతు ఇంకెన్నియోచేతు

ననుచు ఊహలు అల్లి అలసిపోకు

ఏ విత్తులను నాటి యిచ్చోటనుంటిరో

ఆ ఫలములే మీకు అందుచుండు(009-1-

అద్దమందున ప్రతిబింబమంటనటుల

తామరాకులు నీటిచే తడవనటుల

పాపమంటదు మానవ భక్తి వలన

సత్యమునుజూపు మాట ఈ సాయి మాట. (010-081091)

అన్ని తెలియు వారు అవనియందున లేరు

      ఏమి తెలియకుండ ఎవ్వడుండు?

కొంచెమెరుగు వాడు కించిజ్ఞుడగునయా

ఉన్న మాట తెలుపుచున్న మాట.(011-2003)

అమిత వాంఛల తోడనే అలమటించు

వారు విద్యార్థులగుదుర వాస్తవముగ

విద్యనర్థించు వారికే వినయమబ్బు

వినయమబ్బిన వాడె పో విజ్ఞుడగును. (012-)

అరయ చేతియందు అణుబాంబు ఉంచుక

అరచుచుంద్రు శాంతి శాంతి యనుచు

      చంద్రు చేరగలిగి శాంతి చెందరు కదా

ఉన్న మాట తెలుపుచున్న మాట. (013-)

అరువది నాలుగు విద్యలు

అరుదారగ నేర్చినట్టి యా నారదుడే

నిరవధిక శాంతి కనుగొని

పరమానందము నాడు పొందడు గాదే. (014-)

అర్థ అధికార బలములు అరయనెల్ల

భక్తిముక్తుల సాధింప పనికి రావు

అటులె విద్యాధనముకూడ ఎట్టిదైన

దైవబలమొక్కటె నరుని దరిని జేర్చు.(015-)

అల్పజీవికి మంచి సంకల్పమున్న

గొప్ప గౌరవాదరము గైకొన గలండు

ఉడుతబుడుత రాముని ప్రేమనొందలేదె

ఇంతకన్నను వేరెద్ది ఎఱుక పరతు. (016-)

అల్పబుద్ధినెంత అభిమాన పరచిన

కడకు కీడు చేయు ఘనునినైన

విషపు ఫణినిదెచ్చి విపరీతముగబెంచ

కాటువేయజూడు కనదు మేలు.(017)

అణువు సూక్ష్మమై అలలారుచుండు

ఘనముకంటె ఘనమై కనిపించు

అణువు ఘనముగ ఘనము అణువుగనుండు

అణువు ఆత్మయే అత్మయే అణువు.(17-1

అవతరించుట యనుటలో అర్థమేమి?

నరులపై ప్రీతి వాత్సల్యపరత తోడ

వారి స్థాయికి దైవంబు వచ్చు భువికి

జీవ ప్రజ్ఞతొబాటుగ దైవ ప్రజ్ఞ. (018-)

అవని జల్లినదేదియో అదియె పండు

కారణంబును లేకేల కలుగు భక్తి

చెడ్డకును చెడ్డ మంచికి చెల్లు మంచి

దాని తప్పింప నెవ్వరి తరము కాదు.(019)

అవని మ్యాపుజూచి అన్ని దేశములంత

తెలిసిపోయెనంచు దేలిపోకు

ఒక్క దేశమైన ఒనరంగ వెదకుచు

చూచి తిరిగినపుడె సుఖముగల్గు. (020-)

అహము కలిగిన దేవుడు కానరాడు

అహము చచ్చిన పరమాత్మనందవచ్చు

అహము ఆత్మతో కూడిన అదియె ముక్తి

సత్యమును తెల్పుమాట సాయిమాట.(021)

అత్తలు మొత్తుకున్న మరి భర్తలు కత్తులు నూరుచున్న

నోరెత్తరు, కోపగించరు, ఎటకేగరు, భీతిలబోరు గోపికల్​

పొత్తములందు చిత్తరువురీతిగనుండెను కృష్ణుడు వారిలో!(021-1-)

అమ్మా! మన్నుదినంగ నే శిశువునో యాకొంటినో వెఱ్ఱినో

నమ్మంజూడకు వీరి మాటలు మదిన్​ నన్నీవుగొట్టంగ వీ

రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్​ మదీయాస్యగం

ధమ్మాఫ్రూణము చేసి నా వచనముల్​ తప్పైన దండింపవే.(022-)

అల్లాయంచు మహమ్మదీయులు జహోవాయంచు సత్క్రైస్తవుల్​

ఫుల్లాబ్జాక్షుడటంచు వైష్ణవులు శంభుండంచు శైవుల్​  సదా

ఉల్లాసంబున గొల్వనెల్లరకు నాయుర్భోగభాగ్యాది సం

పల్లాభంబులొసంగి బ్రోచు నొకడే భవ్యుండు భావింపుడీ!(023-250782)

అంధకారంబెల్ల హతమారునేచూడ

వసుధలో దీపంపు వార్త వలన

ఆకొన్న వారికి ఆకలి తీరునే

పంచభక్ష్యపు పేర్లు పరగ విన్న

నిరుపేదవాని పేదరికంబు పోవునే

విత్త ప్రభావంబు విన్నయంత

రోగపీడితుని బల్​ రోగాలు పోవునా

ఔషథ మహిమము అంతవిన్న

శాస్త్రజాలంబునంతయు చదివినంత

దట్టమైనట్టి అజ్ఞాన తమము తెగున

ఆచరణలేని విద్యలు అవనియందు

దండి నేర్చిన ఫలమేమి? గుండుసున్న.(024-290696)

అడిగిన పాలిచ్చు కామధేనువు వుండ

ధనమిచ్చి ఆవును కొనగనేల?

కోరిన ఫలమిచ్చు కల్పవృక్షంబుండ

పెరటి పుష్పమలకై ప్రీతియేల?

మిండెడు కాంతితో మేరుపర్వతముండ

వెండిబంగారులకు వెతలికనేల? (024-1-23-11-1991)

అఖిల మానవులకునానంద మొనగూర్చి

రక్షించుచుండుటే దీక్ష నాకు

సన్మార్గమును వీడి చరియించు వారల

పట్టి కాపాడుటే వ్రతము నాకు

బీదసాదలకైన పెనుబాధ తొలగించి

లేమిని బాపుటే ప్రేమ నాకు

మంచిచెడ్డలు కూడ మనసులో సమముగా

భావించుచుండుటే భక్తి నాకు

అనగబేరొంది నాయండ నలరువారి

నెన్నడును మరువనివాడనన్న మాట

ఎట్టి కుత్సితము మదికి నేర్పకుందు

అట్టి నాపేరు చెడుట ఎట్లగును భువిని! (025)

అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను

మృగజాతి కెవ్వడు మేతబెట్టె

వనచరాదులకు భోజనమెవ్వడిప్పించె

చెట్లకెవ్వడు నీళ్ళు చేది పోసె

స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచె

ఫణులకెవ్వడు పోసె పరగపాలు

మధుపాళికెవ్వడు మకరందమొనగూర్చె

బసులకెవ్వడొసగె బచ్చిపూరి

జీవకోట్లను పోషించ నీవెగాని

వేరు దాత లేడు కదయ్య వెదకి చూడ!(026)

అనిశంబు అత్యంత అనురాగ భోగాను

రక్తులై సుజ్ఞాన సక్తులగుచు

స్వపర భేదము లేక సర్వ జీవుల యందు

సమభావమునుజూపు సరసులగుచు

కష్టజీవులయందు కరుణను చూపించి

తగిన సాయముజేయు దాతలగుచు

దాంపత్య ధర్మంబు ధరణిని వెలయంగ

పరులకు నాదర్శ సరణి యగుచు

జగతి సత్కీర్తిగాంచి శ్రీసాయి కృపను

సాటి మానవులందెప్డు మేటియగుచు

నిత్యమును ధర్మజిజ్ఞాస నిరతులగుచు

ఉత్తమోత్తమ వ్యక్తులైయుంద్రుగాక! (027-231191)

అన్న దానము కన్ననధిక దానంబేది?

తల్లిదండ్రుల కన్న దైవమేది?

జపతపంబుల కన్న సత్యశీలంబేది?

దయ కంటెనెక్కువ ధర్మమేది?

సుజన సంగతి కన్న చూడలాభంబేది?

క్రోధంబు కన్న శత్రుత్వమేది?

ఋణము కంటెను నరునకు రోగమేది?

ధరణినపకీర్తి కంటెను మరణమేది?

సరిగ సత్కీర్తి కంటెను సంపదేది?

స్మరణమునకు మించునాభరణమేది? (028-030690)

అమెరికా మార్గము అరయచూచునుగాని

కాశికా మార్గమ్ము కానరాడు

ఆల్జీబ్రాయంత అరయచూచునుగాని

ఇంటి వైశాల్యమ నెరుగలేడు

అనదినంబును డ్రిల్లుననసరించునుగాని

పద్మాసనమువేయ బాధపడును

వృక్షశాస్త్రంబునెరుగు సమృద్ధిగాను

తులసి ఉపయోగమునెరుగడు మానవుడు.(028-1-12-02-1987)

అహంకార పడకు నరుడా!

వెనుక ముందు తిరిగి చూడు

మమకారము వలదు నీకు

బ్రతికినవాడెవడు లేడు

ఇది నాదని పలుకుదువా

వెంటనెవరుగొనిపోరు

పాపపుణ్యములతో కూడి

మరణింతువు ఓ కిలాడి! (029)

అడుగకువె ఓ మనసా

అడుగు కొలది అది అడుగున పడునని

అడుగకున్న పని వడిగానగునని    ||అడు||

అడుగని శబరిని ఆదరించడే

అడుగక తనకై మడియు జటాయువు

కడకునేగి సద్గతి కల్గించడే      ||అడు||   (030-280992)

అత్తవారింటికేగుమో కొత్త పెండ్లి

కొడుక! అందు నీకెక్కువ సుఖముగల్గు

ముద్దు మరదలు నీతోడ ముచ్చటాడు

వదిన మాటికి నీతోడ వరుసలాడు

ఊరివారంత మన్ననలతిగ సల్ప

మామ కూడ నీకు అడుగుల మడుగులొత్తు

పోయి రావయ్య అత్తవారింటికి నీవు. (031-150192)

అన్నములు వేరు, ఆకలి ఒక్కటే

శృంగారములు వేరు, బంగారమొక్కటే

పశుల వన్నెలు వేరు, పాలు ఒక్కటే

జీవజంతులు వేరు, జీవుండు ఒక్కడే

పూలజాతులు వేరు, పూజలొక్కటే

దర్శనంబులు వేరు దైవమొక్కడే!

అహరవ తవ ఆహ్వాన ప్రచారిత సునితవ ఉదారవాణి

హిందుబౌద్ధశిఖ్​జైన పారశిక ముసల్మాన్​ క్రిస్తానీ

పూరబ్​ పశ్చిమ ఆశే తవ సింహాసన పాసే

ప్రేమహార్​ హొయగాథా జనగణ ఐక్యవిధాయక

జయహే భారత భాగ్యవిధాతా!…. (032)

ఆటలపాటల బాల్యంబాయెను

ప్రాయములో ప్రేమాయణమాయెను

ముదిమిని చింతలు ముదిరేపోయెను

పరబ్రహ్మకాబట్టక పోయెను.(033)

ఆంగ్లవిద్యయె ప్రముఖతనందియంట

ఆత్మవిద్యయు క్షీణించి ఆరిపోయె

కాన చిత్తశుద్ధి ఎటులగాంచగలరు?

చిత్తశుద్ధియె విద్యకు జీవగఱ్ఱ.(033-1-

ఆత్మతత్వమెరుగ ఆనందమబ్బును

తత్త్వమెరుగకున్న తాపమబ్బు

బ్రహ్మమెరిగినంత బ్రహ్మమే అగునయా

సత్యమైన బాట సాయి మాట.(034-11-10-1986)

ఆత్మ నిత్యము దానిని అణచ లేరు

చావులేదాత్మనెవ్వరు చంపలేరు

జీర్ణ వస్త్రము మరలించుదానివోలె

దేహమును వీడి తరువాత దేహమౌను.(035)

ఆత్మశుద్ధి లేని అవని చదువులందు

క్రోధమత్సరములు కూడియుండు

చీకటింటిలోన చేరును గబ్బిలం

 బున్నమాట తెలుపుచున్న మాట.      (036-14-01-1989)

ఆధునిక విద్య పెరిగెను అవధి లేక

ఆత్మ తేజము క్షీణించి తరిగిపోయె

బ్రతుకు ఆడంబరాలతో భారమాయె

నేటి విద్యార్థి బ్రతుకు యీపాటిదాయె. (037-23-06-88)

     ఆత్మవిద్యలు క్షీణించె అవధిలేక

     సత్యధర్మంబు అడుగంటి సమసిపోయె

     సంకుచిత హృదయులైరి

     ఈనాటి విద్యార్థులంత (037-1-

ఆశకు దాసుడైన జగమంతటికి

తాను దాసుడే కదా!

ఆశను జయించినవాడు

అనయంబు దాసుడు లోకంబు.(037-2-22-11-1982)

ఆర్థమునకు పరుగు, ఆఫీసునకు పర్గు

పాఠములకు పరుగు బస్సు పరుగు

పరమశ్రేయమునకు పరుగిడ జాలరు

మరువబోకుడిట్టి మంచిమాట.

ఆస్తిక బుద్ధి పోయె మరియాదల ధర్మము రూపుమాసె బల్​

నాస్తిక బుద్ధి హెచ్చె గురువన్నను శ్రద్ధయు పోయె భక్తికిన్​

స్వస్తి సనాతనప్రభకు స్వస్తివహించెడి కాలమయ్యెడిన్​

నిస్తులగౌరవాదరణ నేలకుగోలకు వచ్చె విద్యలో!(039-030690)

ఆంగ్ల భాషా మోహమావరించిన నాడె

స్వమత విజ్ఞానంబు సన్నగిల్లె

స్వమత విజ్ఞానంబు సన్నగిల్లిన నాడె

సంస్కార భావంబు సమసిపోయె

సంస్కార భావంబు సమసిపోయిన నాడె

ధర్మంబు క్షీణించె ధరణియందు

ధర్మము క్షీణమై ధరణి తొలగిన నాడె

     భారతీయోన్నతి భగ్నమయ్యె

కాన యిపుడైన మీరలు కన్నుదెరచి

తెలివితోగాంచుడో భారతీయులార

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!(039-020174)

ఆకారమే లేని ఆ నిరాకారున

కెట్టి రూపము దిద్దనెవరి తరము!

కరచరణంబులే కలుగని వానికి

ఎట్టి సొంపులు మదినెంచగలరు!

ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపు

అని పల్కెడి పల్కు హాస్యదంబు

కోటి సూర్యుల దీప్తి మేటిగల్గినదంచు

పల్కెడి పల్కులు పావనములె

రూపమేలేని శక్తికి రూపుదెల్ప

నెవరి సాధ్యము ఎవరైన ఎరుగగలరె?

శక్తిరూప రహితయై అనాదినుండి

దిగ్దిగంతములందున దీప్తినొందె.(040-130582)

ఆ నంద బాలుడే ఆనంద బాలుడై

తనవారి గుర్తింప తరలి వచ్చె

ఆ రామచంద్రుడే ఆరామ చంద్రుడై

తన బంటులను కనుగొనగ వచ్చె

ఆ మహావిష్ణువే ఈ మహీవిష్ణువై

తన ఆయుధములు చేకొనగ వచ్చె

ఆ ఈశుడే బాలసాయీశుడై నేడు

తన గుంపుతోనాడుకొనగ వచ్చె

అట్టి పరమాత్మయను బొమ్మలాటగాడు

తాను జీవుల రంగస్థలాన నిలచి

ఆడు ఆనాటి ఈనాటియాటలరసి

సుంత వర్ణించి సంతసము కొంతగనుడు.(041-231173)

ఆనాడె వేణువునై పుట్టియున్నచో

నీ మోవి మధువుల గ్రోలకున్నె

ఆనాడె తోమాలనై యెదనున్నచో

నీ స్పర్శ నన్నోచినేలకున్నె

ఆనాడె గోపినై యలరుచునున్నచో

నీ రూపు నా లోన నిండకున్నె

ఆనాడె గోపార్భకుండనై యున్నచో

నీ మైత్రి భాగ్యంబునొందకున్నె

నాడు కాజాలదింక ఈనాడు స్వామి

నీవు నాడును నేడును నీవె కావ

నాటి ప్రాప్తినియొసగి నన్నేలుకొమ్ము

బాలగోపాల వేణుగోపాలబాల

నన్ను కావుము దేవ శ్రీసాయిదేవ.042-1983)

ఆకుపచ్చ పక్షులన్ని చిలుకల వలె పలుకునా?

పూవులపై పారాడెడు పురుగులు తుమ్మెదలగునా?

పులిచర్మముగప్పినట్టి గాడిద తా పులియగునా?

ఏనుగంత బలిసియున్న పంది ఏనుగగునటయ్యా?(043-221188)

ఆశలనే లతలున్నవి..అల్లుకొనును..పెంచరాదు

కోరికలనే తరువున్నది..పెరుగు..నీరు పోయరాదు

క్రోధమనే పామున్నది..కాటుకు గురికారాదు.(044)

ఇంటిలోని జ్యోతి యెంతయో వెల్గగా

పరుల యింటికగ్గికరుగనేల?

తాను దైవమయ్యు దైవంబు మరచుట

తనను తానె మరచినట్లు కాదె!(045-140796)

 ఇందుగలడందు లేడని

సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెందెందు వెదకి చూచిన

నందందేగలడు దానవాగ్రణి వింటే.(046-231176)

ఇంద్రియములార చేయుడీ ఈశ పూజ

మనస! చేయవే మదనారి మంత్ర జపము

జ్ఞాన భిక్షనొసగెడి ప్రజ్ఞానియతడె

లెమ్ము తెలుసుకో నీలోని ఆత్మశుద్ధి.(053)

ఇచ్చినట్టి పనిని మెచ్చినటుల చేయ

సార్ధకంబులగును సమితులన్ని

అటుల చేయకున్న ఆత్మద్రోహమె కదా!

మరువబోకుడిట్టి మంచి మాట.(047)

ఇది నాదు మాతృదేశము

ఇది నా ప్రియ మాతృభాష ఇది నా మతమం

చెదగొట్టి నుడువనేరక

బ్రదికిన జీవి యొకడైన వసుధను గలడా!(048-020685)

ఇనుప పాత్రయైన హేమపాత్రంబైన

నీటితోటి గుణము వాసికెక్కు

మనసు మంచిదైన తానెటులున్ననేమి?

ఉన్నమాట తెలుపుచున్న మాట.(049)

ఇనుము విరిగినంత ఇరుమారు ముమ్మారు

కాల్చియతకగలడు కమ్మరీడు

మనసు విరిగినంత మరి చేర్పగలరయా

ఉన్నమాట తెలుపుచున్న మాట.(050)

ఇసుకలో వర్షజలధారలింకిపోవు

మధురమై నిల్చు రేగడి మసకనేల

చిప్పలోబడి ముత్యమై చెన్నుమీరు

అటులె ప్రాప్తానుసారమైయలరు విద్య.(051-080796)

ఇక్షురసము కన్న ద్రాక్షరసము కన్న

పువ్వు కన్న పాప నవ్వు కన్న

మధురమోహనములు మాసాయి పలుకులు

శాంతి ప్రేమదాయి శ్రీసత్యసాయి(052-180883)

ఈశ్వరునకు ఏది పుష్పంబు యిష్టమగునొ

క్షమయె ఈశ్వరునకు శాంతియగును

యజ్ఞవాటిని పాటింప ఏమిచేయును

ఇంద్రియముల త్యాగమె యిష్టపడును

ఉన్నమట తెలుపుచున్న మాట.(052-1-

ఇప్పుడో ఇంకనో ఈవొత్తువంచును

ఎప్పటికప్పుడె ఎదురుచూచి

ఈ పొద్దు రేపైన ఏలుదువంచును

ఏ పొద్దు ఆశతో ఎదురుచూచి

ఈనాడొ మరునాడొ ఈవె చూచెదవంచు

ఏనాటికానాడె ఎదురు చూచి

ఇత్తువో దర్శనం వత్తువో నేడంచు

ఏ గంటకాగంట ఎదురు చూచి

వేచియుంటిని నీకునేవేళ మనసు

పుట్టునో నాడె నాకది పుణ్యదినము

అట్టి దినమునకై కాచెద ఆత్మరూప

ఎట్టులైనను నా వాంఛ తీర్పవప్ప(.053)

ఇంద్రియంబుల మనసు నిల్పిన

అంధుడైన మోక్షమొందును

ఇంద్రియముల నిలకడలేనిది

చంద్రుడైన బసంతునొందడు.(053-1-

ఇది ఘటంబిది పటంబిది గృహమ్మిది కుడ్య

మిది అరణ్యము శైలమిదియటంచు

ఇది భూమి యిది జలంబితడు వైశ్వానరుం

డిది గాలి ఆకసంబిదియటంచు

ఇతడు దివాకరుండితడు నిశాకరుం

డివి తారలు గ్రహంబులివియటంచు

ఇవి అచేతనములౌ ఇవి చేతనములంచు

అతడీతడితడాతడేయటంచు

అరయ నాకంటె భిన్నంబులై జడంబు

లైన బాహ్యపదార్థ సహితములెల్ల

సాధనలు లేక ఎఱిగెడి సాక్షివగుచు

నేను చిద్రూపుడంచునునెరుగరయ్య!(054)

ఇది చేతునది చేతునింకెన్నియో చేతు

ననుచునూహలు అల్లి అలసిపోకు

ఏ విత్తులను నాటి ఇచ్చటనుంటివో

ఆ ఫలములే నీకు అందుచుండు

విత్తనంబొకటైన వేరైన ఫలములు

సమకూరుటది ఎట్లు సాధ్యమగును?(055-200990)

ఈ చెరలో నుండి వెళ్ళేనా

ఇక రాముల కన్నులు చూచేనా

ఆ శ్రీరాముల కన్నులు చూసేనా

నాడు పెండ్లాడిన రాముడు

ఇడ నా జాడలో రాకయున్నాడు

ఎన్నడు తన కౌగిలి ఎడబాయకుంటినె

పన్నుగ పది నెలలాయెనె

ఈ చెర నుండి వెళ్ళేనా

ఇక రాముల కన్నులు చూచేనా

ఓ ముద్దు మరది లక్ష్మణా

నిను దోషములాడితి సద్గుణా

నోటి మాటలు ఎంతో

నాకె వచ్చినవి ఏమని దూరితినో

విడిచిపోతివ తండ్రీ!

ఈశ్వరునకు పది పుష్పంబులు యిష్టమగును

ఇంద్రియమ్ముల త్యాగమే యిష్టమగును

క్షమయు ఈశ్వరునకు శాంతియగును

ఉన్నమాట తెలుపుచున్న మాట.(056)

 ఉత్తమ పురుషుల కోసము చేసిన

చిత్తము నిలుచును నిజమండి

మత్తుడై మరి మోహము చెందిన

మొత్తును యముడిట నిజమండీ.(057-140189)

ఉపకారికినుపకారము

విపరీతముగాదు చేయ వివరింపంగా

అపకారికినుపకారము

నెపమెన్నక చేయువాడె నేర్పరి సుమతీ!(058-280391)

ఉన్నదియదియని చెప్పంగగలరుగాని

లేనిదిదియని చెప్పంగలేరు సుమ్మి

ఉన్నదొక్కటె దైవంబు ఎన్నటికిని

లేనిదయ్యను దైవంబు కానరయ్య.(058-1-01-01-2004)

ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిం లేరు కిం

చిద్ద్రోహంబును నీకు చేయరు బలోత్సేకంబుతో చీకటిన్​

భద్రాకారుల పిన్న పాపల రణఫ్రౌఢక్రియాహీనులన్​

నిద్రాసక్తుల సంహరింపనకటా నీ చేతులెట్లాడెనో!(059-290896)

ఉద్యోగములు చేయనువిదిలందరు పోవ

గృహ కృత్యములుదీర్చు గృహిణులెవరు?

ఆల్మగలిరువురు ఆఫీసులకుబోవ

ఇంటి పనులుజేయు ఇంతులెవరు?

పర బాలురకు నేర్ప పాఠశాలలకేగ

తమ బాలురకు నేర్పు తల్లులెవరు?

పుస్తకాల్​ చేబట్టి పురుషుల వలెబోవ

వంటయింటిని దిద్దు వనితలెవరు?

డబ్బు వలన కలుగు యిబ్బంది తీరిన

ఇంటిలోని కొరతలెంతయుండు

సుఖము చూడబోవ సున్నయేయుద్యోగ

పదవియందునున్న పడతికెపుడు.(060-221189)

ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపించకున్నాడయా  ||ఉ||

లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన తిప్పుచున్నాడయా     ||ఉ||

లక్షలాదిగనున్న నక్షత్రములనెల్ల నేల రాల్పక మింట నిల్పుచున్నాడయా     ||ఉ||

ఈ ధారుణీ చక్రమిరుసు లేకుండగా ఎల్లవేళల తిప్పుచున్నాడయా          ||ఉ||

జీతభత్యము లేక ప్రీతితో మనకొరకు గాలిలో సురిటీలు విసరేడయా       ||ఉ||

ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయా            ||ఉ||

పొంగి పొరలుచు వచ్చి పృధ్విపై పడకుండ కడలిరాజు కాళ్ళు ముడిచాడయా||ఉ||

కనిపించకేమి చేస్తున్నాడయా?

తెరచాటు తానుండి తెరముందు ప్రజనుంచి తైతక్కలాడించుచున్నాడయా   ||ఉ||(061-1986)

ఉపకారము చేయని జీవితంబు

కారము లేని వంట

ఆకారము లేని యిల్లు

మమకారము లేని జీవితము

ప్రాకారము లేని మందిరము

ఓంకారము లేని మందిరము

వికారముగానుండు చూడరె!(060-1- 100788)

ఉపకారము చేయని జీవితము

కారములేని వంట

కారములేని ఇల్లు

మమకారములేని స్నేహితము

ప్రాకారములేని మందిరము

ఓంకారములేని మంత్రము

వికారముగనండు చూడరె!(60-1

ఊరక సజ్జనుండొదిగి యుండిననైన దురాత్మకుండు ని

ష్కారణ మోర్వలేక అపకారము చేయుట వాని విద్యగా

చీరలు నూరు టంకములు చేసెడివైనను పెట్టెనుండగా

చేరి చినింగిపోగొరుకు చిమ్మటకేమి ఫలంబు భాస్కరా.(062-240590)

ఎండు మట్టితోడ కుండలు కుమ్మరి

చేయలేడు నీరు చేర్చకుండ

సృష్టి హేతువగును శివశక్తులిరువురు

వినుము భారతీయ వీరసుతుడ!(063)

ఎట్టి కర్మను తనయందు పెట్టుకొనక

దైవమందున నిలిపి తా ధర్మపథము

తప్పకుండగజేసిన నెప్పుడైన

ప్రాణికంటదు సుఖదుఃఖ ఫలమదేది.(064)

ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి

పక్షిజాతులు పశువులు పరమమైన

నీమమునుబూని జీవింప నేర్చియుండ

తెలివి కలిగిన మనుజుడే తెలివిదప్పి

బ్రతుకుచున్నాడు మనుజుకీ తెలివి లేదె

ఉన్నమాట తెసుపుచున్నమాట.(065-180883)

ఎడమచేతి కడాన రెండుతుంటల విల్లు

తోలు పట్టెడగట్టి యాడాలగడతారు

ఏటి వేషాలప్ప యివి

ఇవి కంటితో చూచేటి కాని అవతారాలు.(066)

ఎద్ది లేదనుచుంటిమో అద్ది కలదు

ఎద్ది కలదనుచుంటిమో అద్ది లేదు

ఉన్నదాతడే దైవంబు ఎన్నటికిని

లేనిదయ్యెను విశ్వంబు కానరయ్య.(067-260595)

ఎదుటనున్న స్వామినెరుగంగ లేకను

దేవుడెక్కడనుచు తిరుగుచుంద్రు

వెన్న విడిచి నేయి వెతుకులాడినయట్లు

ఉన్న మాట తెలుపుచున్న మాట.068)

ఎప్పటికెయ్యది ప్రస్తుత

మప్పటికా మాటలాడి అన్యుల మనముల్​

నొప్పించక తా నొవ్వక

తప్పించుక తిరుగు వాడు ధన్యుడు సుమతీ!(069)

ఎన్ని విద్యలైన ఏపారి చదివిన

పొట్టకూటికైన గిట్టబోవు

మట్టిబొమ్మలోని మర్మంబు తెలుపని

చదువులెల్ల పరము చేర్చగలవ(070-151088).

ఎన్ని నిద్యలు నేర్చిన ఏమి ఫలము

నొసటి వ్రాతను తప్పింపనెవరి తరము

చెడ్డ బుద్ధులు తన తల చేరెనేని

ఎండబారును బుద్ధులు బండబారు.(071-210673)

 ఎల్ల భూతములందు తానేకమగుచు

 భిన్న దేహములందున భిన్నమగుచు

 అవ్యయంబై వెల్గొందుచు ఆత్మత్తత్వ

 మరయ జ్ఞానంబె సార్థకంబగును పార్థ!(072)

ఎవతె భార్య యింకెవరో బిడ్డడు

ఎంత చిత్రమో ఈ సంసారము

ఎవరివాడవెవ్వడెటు వచ్చితివి

తత్వమొక్కటె తెలియర తమ్ముడ.(073-270573)

ఎస్​ అనువారికి ఎస్సనురా

నో అనువారికి నో అనురా

నో ఎస్సులు నీ నోటికిగాని

సాయికి సర్వము ఎస్స్​ ఎస్స్​ ఎస్స్​.(073-1-07-07-1996)

ఎట్టి మంటయో అట్టి పొగ

ఎట్టి పొగయో అట్టి మేఘం

ఎట్టి మేఘమో అట్టి వర్షం

ఎట్టి వర్షమో అట్టి పంట

ఎట్టి పంటయో అట్టి వంట

ఎట్టి వంటయో అట్టి భావం.(074-010996)

ఎరుక మరపనకుండ జాగ్రత్స్వప్నసుషుప్తిలో

అరమరలు లేకుండ ఎప్పుడు తరచుగ జీవాత్మ

జదివెడి తారకము సూటెరుగవలెనన్న

సద్గురుని కృపచే తారతమ్యములెరుగవలెనన్న.(074-1-08-09-1996.)

ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడీ

రాతిని బలు ప్రీతిని ధర నాతిగ జేసిన

సీతాధినాధుడైన శ్రీరామచంద్రనామ ||ఎంత||

పోవును దుర్భావము రాబోవు సద్భావముల్​

ద్రావంగ ద్రావగన్​ పాపమెల్ల బాపగన్​

చక్కెరకో నిక్కము బల్​ మెక్కెద మదమెక్కగన్​

గ్రుక్కంగ గ్రుక్కగన్​ కోదండ రామనామ ||ఎంత||

దక్షిణ పరీక్షణ ఉపేక్ష చేయజాల నా

పక్షీంద్ర వాహుడైన పట్టాభిరామనామ.. ||ఎంత||(075)

ఎద్దునెక్కినా గ్రద్దనెక్కినా ఇద్దరు ఒకటే ఓ నరుడా

లింగ లింగ శివలింగ లింగయని రంగని తిట్టకు ఓ మనసా!

ధనధాన్యములు ఎన్ని ఉన్ననూ కడకు రావురా ఓ నరుడా!

పరమ పావన పరమ శివుని శరణు కోరుము ఓ నరుడా!

అప్పు చేసుకొని యాత్రలు చేయుట తప్పుతప్పురా ఓ నరుడా!

ఆడంబరములు ఆవలనెట్టి ఆత్మ దర్శనము చేయుమురా!

జాగుచేయక జీవితమంతయు వేగుచుక్కవలె గడుపుమురా!

చదువుసంధ్యలు ఎన్నినేర్చినా స్వామి సేవతో చాలవురా!

మధురమైన ఆ నామము తలచిన మార్గము నీకే చూపునురా!

చెప్పే మాటలు పెడచెవి పెట్టి తప్పులు చేయకు ఓ నరుడా!

అగ్నివంటి ఆ సత్యము కనుగొని గొప్ప మార్గమున నడువుమురా!(077)

ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏరికైనను తప్పదన్నా!

ఏనాడు ఏతీరు ఎవరు చెప్పాగలరు

అనుభవించుట సిద్ధమన్నా!

రాముడంతటివాడు రమణి సీతను బాసి

పామరుని వలె ఏడ్చెనన్నా!

అలనాటి పాండవులు ఆకులలములు మేసి

అడవిపాలై పోయిరన్నా!078-120795)

78-1 ఎంత వేడుకొందు ఓ రాఘవా! పంతమేలర ఓ రాఘవా! ||ఎంత||

మారు పల్కకుల్నివేమిరా? రామ మారుబల్కకున్నావేమిరా?

జార, చోరా భజనచేసితిరా

సాకేత సదనా మారుబల్కకున్నావేమిరా? మా మనోరమణా!

78-2 ఎంత కాలమీ బాధల్​ కృష్ణా! ఎందుకోసమీ గాథల్​

న్యాము లేదా మాతో వాదా మాపై కరణయె రాదా

మీ గోపికలు మేమవునా కాదా? కించపరచ మర్యాదా! ||ఎంత||

ఏది ఎరిగిన సర్వంబు ఎరుక పడునొ

ఏది తెలియక సర్వంబు ఎరుక పడదొ

అట్టి పరవిద్య నేర్పెడునతడె గురువు

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు.(079-170673)

ఏది ఎరిగిన సర్వంబు ఎరుక పడునొ

ఏది తెలియక సర్వంబు తెలియబడదొ

అదియె పరవిద్యయనబడు నట్టిదాని

తెలిపి బోధించు సద్గురున్​ తెలియనగును.(080)

ఏను దైవంబు తద్భిన్నమేమి కాదు

ఆ అఖండ పరబ్రహ్మమౌదు నేను

వ్యధయు క్లేశముల్​ నన్ను స్పృశింపబోవు

సచ్చిదానందమేను తద్భిన్నమేమి కాదు

నిత్య తృప్తుడ భీతినన్​ చేరబోదు

 ఉల్లమా! పల్కుమోంత్సత్తంచునెపుడు.(081)

ఏమి తా కొని వచ్చె ఏమి తా గొనిపోవు

పుట్టినప్పుడు మరి గిట్టునపుడు

ధనమెక్కడేగు తానేగు నెచటికి

చెప్పరయ్య మనస్సు ఒప్పునటుల.(082-010690)

ఏమిలేని బుఱ్ఱలోన యేమైనను చేర్చవచ్చు

ఏమేమో నిండియున్న బుఱ్ఱ నింప వీలుకాదు

కలి బోధలు నిండియున్న తలబుఱ్ఱది ఖాళియగున

తలబుఱ్ఱది ఖాళికాక యిల సుకృతంబు నింపనగునా!(083-1992)

ఏ హృదయంబునొసగితివొ ఈశ నాకు

మగిడి దానినే యర్పింతు మహితమూర్తి

పరగ వేరేమిదెత్తు నీ అర్చనకును

అంజలి ఘటింతు అందుకోవయ్య నీవు.(084-1985)

ఏ దేశమేగినా నీ నామమే సుమీ

సత్యసాయీయంచు నిత్య పఠన

ఏ యార చూచినా నీ నామమే సుమీ

సత్యసాయీయంచు నిత్య జపము

ఏ నోట విన్నను నీ నామమే సుమీ

సాయిరామాయంచు నిత్య జపము

ఎచ్చోట చూచినా నీ నామమే సుమీ

సత్యసాయీయంచు నిత్య భజన

విశ్వమెల్లడ వ్యాప్తియై వెలయునట్టి

భక్త జనులకు ప్రాపుడై బరగునట్టి

భక్తినొసగి రక్షించెడు శక్తి మయుడు

పర్తివాసుడు మిమ్మేల హత్తుకొనడు!(085)

ఏగుణంబు గణించి యేతెంచెనోనాడు

ప్రహ్లాదు పాలింప పరమపురుషు

డేగుణంబు గణించి యేతెంచెనోనాడు

కరినిగాచెడి తరి కమలనయను

డేగుణంబు గణించి యేతెంచెనోనాడు

ధ్రువకుమారుని సాక రూఢిమీర

ఏగుణంబు గణించి యేతెంచెనోనాడు

పేదకుచేల్బ్రోవ వేదచరితు

డాగుణంబె గణించి యాయమరవంద్యు

డార్తజనులను పాలించునట్టివాడు

శ్రీనివాసుండు లోకైక చిన్మయుండు

వెల్గె పర్తీశుడై నేడు ఫృద్వియందు.(086-231175)

ఏ ప్రేమ శక్తిచే నీ ధారుణీ చక్ర

మిరుసు లేకుండగా తిరుగుచుండు

ఏ ప్రేమ శక్తిచే నెల్ల నక్షత్రాలు

నేల రాలక మింట నిలచియుండు

ఏ ప్రేమ శక్తిచే నీ పుడమి బడక

కడలిరాయడు కాళ్ళు ముడుచుకొనియె

ఏ ప్రేమ శక్తిచే ఏడేడు లోకాలు

గాలి దేవుడు సురిటీలు విసరె

ఆ మహా ప్రేమ శక్తియే ఆత్మ శక్తి

అద్భుతమనంతమద్వితీయమగు శక్తి

నిండియున్నది బ్రంహ్మాండ భాండమెల్ల

ఈ మహా సృష్టియంతయు ప్రేమమయమే.(087-160700)

ఎడమచేతి కడాన ఏందో తెల్తల బిళ్ళ

తోలు పట్టెడ కట్టి యాలాడ గడతారు

ఏటి వేషాలప్ప ఇవి!

కంటితో చూచేకికాని అవతారాలు

ఏటి వేషాలప్ప ఇవి!

పొడుగాటి మీసముల్​ గొరిగి కత్రించి

నాసికముల్​ దగ్ర నాల్గుంచుకుంటారు

ఏటి వేషాలప్ప ఇవి!

ఏలా నిరాశ పర్తీశుండుండా ఏలా నిరాశ

సాయీశుండుండ                         ||ఏలా||

పాలించు స్వామి నీ ప్రక్కన నిలబడి

 ఆలకించుచూ నీకు దాపుగనుండగ       ||ఏలా||

తల్లి బిడ్డలు కూడి వేళవేళలయందు

సాయినాధుని పూజ సలుపుచునుండగ     ||ఏలా||

దీవించు దేవుడు నీ దిక్కైయుండగ

దీన చింతలేలా దిగులొందకె మనసా       ||ఏలా||

పారమార్థికములలో పడరాని బాధలలో

 పడుచున్న భక్తులకు పట్టుకొమ్మైయుండ               ||ఏలా||

ప్రేమించు సాయి నీ ప్రాపైయుండగ

పశ్చాత్తాపములలో పడబోకు ఓ మనసా    ||ఏలా||(088-230385)

88-3 ఏలా నీ దయరాదూ పరాకుజేసేవేలా సమయమూ కాదూ

బాల కనకమయ చేల సుజన పరిపాల

జలధి గంభీర దనుజ సంహార దశరథ కుమార

సకల శ్రుతిసార నాదుపై ||ఏలా||(088-3-

ఏమి కాలము వచ్చెనో ఓ జనులారా!

ఏమి కాలము వచ్చెనో……

ఫేసుపౌడరవతరించి మోసగించె పసుపు పోయె

ఏమి కాలంబు వచ్చెనో ఓ జనులారా!

ఏమి కాలంబు వచ్చెనో…

కాసుల దండలు పోయి మోసగించె చైనులొచ్చె

ఏమి కాలంబు వచ్చెనో….

ఏడవకు పసిబాల ఏడవకు తండ్రీ!

ఏడిస్తె నిను భరతవీరుడనరయ్యా…జో…జో…

హంతకుడు హిట్లరు అమర రష్యాపై

దండెత్తి వచ్చెనని జడిసి ఏడ్చితివా…జో..జో..

హిట్లరును చంపుటకు ఎర్రసైన్యంబు

వీరుడౌ స్టాలిను కలరు ఏడువకు…జో…జో..

ఇంకెందుకుర నాన్న అట్టులేడ్చెదవు

ప్రజకైక్యత లేదటంచు ఏడ్చితివా

ఐక్యతగ ప్రజలంత చేరి పోరాడి

స్వాతంత్య్రమును పొందగలరు ఏడువకు…జో..జో..(088-1-211003)

ఐకమత్యంబు జ్ఞానంబునందజేసి

జ్ఞాన జ్యోతిని వెలిగించు దేశమిదియె

ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార.(089)

ఐకమత్యమె సుఖమందరి క్షేమంబు

ఎంత కార్యమైన నెగ్గవచ్చు

చిన్న చీమలన్ని సర్పంబునున్​బట్టి

చంపుచుండలేదె జగతియందు.(090-160400)

ఒకటి మంచియనుచు ఒకటి చెడ్డయటంచు

సృష్టియందు నిర్ణయింపనగునె

ఇదియునదియు ఒక్క ఆశ్వరుండె చేసె

ఉన్నమాట తెలుపుచున్న మాట.(091-190896)

ఒక్క పొద్దు మాట కుక్కయేమెరుగును?

అటుకుల రుచి ఎద్దుకెటుల తెలియు?

ఖరముకేమి తెలియు గంధంబు వాసన?

సత్యనిత్యంబు జ్ఞానంబనంతమైన

ఆత్మత్తత్వమెరుంగుడో ఆర్యులార!(092)

92-1 ఓం ఆశబ్దమె బ్రహ్మవాచకము

సర్వము పుట్టినశించునందులో

ఆ శబ్దము జపించి సోహమను సాత్విక

బ్రహ్మపదంబు చేర్చుటన్​. (092-1-23-11-1971)

ఒకరి మేలునుజూచి ఓర్వలేకున్నారు

ఈ అసూయ బుద్ధి నీకేలనయ్య?

ఒకరి పదవిజూసి ఓర్వలేకున్నారు

ఈ ఈర్ష్యబుద్ధి నీకేలనయ్య?

ఒకరి సంపదజూచి ఓర్వలేకున్నావు

ఈ నీచ బుద్ధి నీకేలనయ్య?

ఒకరి శక్తిజూచి ఓర్వలేకున్నావు

ఈ హీన బుద్ధి నీకేలనయ్య? (095-211096)

ఒక్క గూటి పిట్టలం

ఒక్క తీగ  పువ్వులం

ఒక్క తల్లి పిల్లలం

ఒక్క జాతి బిడ్డలం

మనలో మనకు కలతలెందుకు.(096)

   ఓంకారమనియేటి ఒక తొట్టిలోను

తత్త్వమసియనియేటి పరుపు తా పరచి

ఎరుకనే బాలుని ఏమరక ఉంచి

ఏడు జగముల వారు ఏకమై ఊప జోజో..(097-310591)

ఓంకార రూపుడు ఉపదేశకాయుడు

నవనీత చోరుడు నరసఖుండు

మోహనరూపుడు ముక్తి ప్రదాయుడు

భక్తార్తి శమనుండు భవహరుండు

గర్వాపహారుడు కమనీయ చేలుడు

వనమాలధారుడు భవహితుండు

తేజస్వరూపుడు ప్రేమస్వభావుడు

వారిజ నయనుండు కారణుండు

సుజన మానస చోరుడు సుందరుండు

దేవకీగర్భ రత్నంబు దేవకుండు

వాసుదేవుడు యదువంశ వర్థనుండు

భక్త హృదయాంతరుండు మీ తోడ నుండు.(098-310883)

ఓయిరామా! సాయిరామా! నీవు నా అండనుండు కోదండరామా!

మంచిగానె వచ్చి ఈ సంసార వార్థి

నన్ను ముంచివేసెనయ్య ఈ మోహవార్థి

ఎంచిచూడ నీకేది మించదయ్య

దయయుంచి దరి చేర్చవయ్య ఓడవౌచు              ||ఓ||

పాపాల పుట్టినిల్లు పావనాంగ

ఈ కోపమన్న రావణుండు కోమలాంగ

ఏపుమీర పదితలల పాపరాజు

వారి రూపు మాపి నా తాపము బాపవయ్య           ||ఓ||

వానరములనెల్లనేలి వానివల్ల కాని

కార్యమలరజేసి బ్రోచినావె

వానికన్న నేను తీసిపోను రామా

గాన నన్నుకూడ వేగ దిద్ది కావరావె!                ||ఓ||(099-170673)

99-1 ఓ కృష్ణా! నా మొర వినుమా

ఎవరేమనినా వెతలెన్నిడినా

నీ పదములె మా గతియని

తలచే గోపికలను విడచి

మోముచూపకనె మధుర పోయెదవా(099-1-

కంచునందె మ్రోత ఘనముగానుండును

కనకమందు మ్రోత కానరాదు

అల్పులందునుండు ఆడంబరము మెండు

పరగ మెరుగులేల భక్తులకును.(100-090796)

కంటిగ్రుడ్డుకు కాటుక అంటనట్లు

జిడ్డునేమాత్రమంటక జిహ్వయుండు

బురద అంటని తామరపూవునట్లు

దేనినంటకయుండును దివ్యమాత్మ.(101-080387)

కట్టెలందున నిప్పులు కలుగునట్లు

తిలలయందున తైలంబు వెలయు పగిది

ఎందుజూచిన దైవంబె యిమిడియుండు

విశ్వసించుడు మదిని విద్యార్థులార!(102-280687)

కనిపించునదే నిజమందురు

కనిపించనిదెల్ల కల్లయందురు

కనిపించనిదే తినిపించును మీ

కర్మ ఫలంబుల మర్మము జీవా!(103)

కన్నీరు తెప్పించు కన్నీరు తప్పించు

జోగి భోగిగజేయు భోగి జోగినజేయు

పిచ్చిని పట్టించు పిచ్చిని పోగొట్టు

పుట్టించు రక్షించు హతమొనర్చు. (103-1-23-11-1987)

కనులకగుపడు దృశ్యంబుగాంచి మీరు

సత్యమిదియని ఎంచక సంబరమున

తెరను దాగిన సత్యంబు తెలిసికొనగ

విశ్రమింపక నాతోడ వెడలి రండు.(104-120673)

కనులలోన కలుగు కాంతియే దేవుండు

పిలుపులోన కలుగు ప్రియమునతడె

మేథ ఉన్నదంచు మీరకు దైవాజ్ఞ

కూలద్రోయజూచు కుటిలునెపుడు.(105-140189)

కన్నులందు నెప్డు కారుణ్య దృష్టియే

పలుకులెపుడు ప్రీతులొలుకుచుండు

నగుమోము నిత్యమునమృత భావమే

హృదయమెప్పుడు ముదముగూర్చు.(106)

కప్పురంబు తెలుపు కామధేనువు తెల్పు

చుక్క తెలుపు హంస రెక్క తెలుపు

అందమైన సాయి మందహాసము తెల్పు

ఉన్నమాట తెలుపుచున్న మాట.(107-1982)

కరవాలము పట్టగనే శూరత్వము కుదురునా?

ధనుర్భాణము పట్టినంత విలుకాడగునా?

వీణ చేతబట్టినంత నాదశుద్ధి కలుగునా?

పెన్ను చేత పట్టినంత పాండిత్యము పొందునా?(108)

కర్మమునబుట్టు జంతువు

కర్మముననె వృద్ధిపొందు కర్మమున చనున్​

కర్మమె నరునకు దైవము

కర్మమె సుఖదుఃఖములకు కారణమిలలో.(109-130286)

కర్మలందు జన్మ కలుగుచునుండును

కర్మమున సుఖము కలుగుచుండు

కర్మచేయుటకె కలిగె ప్రపంచము

సుఖము దుఃఖము యిలలో అస్థిరము(109-1- 07-10-1986)

కర్మమును చేయ నరునకుగలదు హక్కు

కర్మఫలమీయ ధాతకు కలదు హక్కు

అడుగ ఫలముల ఏరికి హక్కు లేదు

ఇంతకన్నను వేరెద్ది  ఎరుక పరతు.(110)

 కర్మచేతను జ్ఞానంబు కలుగుగాని

జ్ఞానియొనరించు కర్మ అజ్ఞాని కొరకె

పూజ్యులరసిన మార్గంబు పూనిరేని

ఆత్మ జ్ఞానము యలవడు అవనిలోన.(111)

కర్మలచేత భువిని త్యాగముచేత

ప్రేమభావమలను పెంపుజేసి

దానవత్వమడంచి దైవచింతనచేసి

నిత్యజీవితంబు నెరపుమయ్య.(111-1- 20-11-1985)

కర్మ మార్గంబు విడరాని కాలిబాట

భక్తి మార్గంబు సులువైన బండిబాట

జ్ఞానమన విమానంబుపై యానమరయ

యోగమననింక జలధిపైయోడగాదె.(112-170273)

కలతదీర్చునొకట కలలోన కనిపించి

ధ్యానమందుదోచి దరికి పిలుచు

మనసులోనెయుండి మంచికి నడిపించు

శాంతి సౌఖ్యదాయి సత్యసాయి. (113)

కలిమి కలుగు నాడు కైలాసపతినైన

ధిక్కరించి పాపి తిరుగుచుండు

కలిమి తీరగానే కనుపించు దైవంబు

ఉన్నమాట తెలుపుచున్నమాట.(114)

కష్టసుఖములు ఒకటిగా కాంచవలయు

కలిమిలేములు విడదీసి గాంచరాదు

కీర్తి అపకీర్తులను సమముగా భావించి

భావమందున గాంచుటే భక్తి యగును.(115-080796)

కష్టసుఖములు రెండును కలసియుండు

వాని విడదీయనెవరికి వశముగాదు

సుఖము ప్రత్యేకముగనెందు చూడబోము

కష్టము ఫలించెనేని సుఖంబటంద్రు.(116-210592)

 కాంక్షతోడనెందు కర్మంబులొనరింప

దక్కబోదు ఫలము ధరణియందు

కాంక్ష వదలి భక్తి కర్మలు ఒనరింప

ఫలితమొసగుచుండు పర్తివిభుడు. (117)

                                కాగడాలుగాని కరదీపములుగాని

దారి చూపలేవు ధరణియందు

ధర్మదీపమొకటె దారి చూపును సుమీ!

సత్యమైన మాట సాయి మాట.(118)

కాగితంబునందు కల్గినయక్షరాల్​

చదివినంత ధరణి చతురుడగున

అక్షరంబులందునర్థంబు నెరుగుచు

చదువునట్టివాడె చతురడగును.(119)

కానిదిదియని చెప్పంగగలరుగాని

బ్రహ్మమిదియని చెప్పంగ వశము కాదు

నిత్యసత్యమనంతంబు జ్ఞానమొకటె

అదియె బ్రహ్మంబు వాక్కునకలవి కాదు. (120-230573)

కానిపించెడి జగతిలో కానరాక

అందు వెలుగొందు చైతన్యమాత్మరూపు

మణులయందున సూత్రంబు మాదిరిగను

విశ్వమంతయు వ్యాపించె విశ్వవిభుడు.(121-120291)

కామశక్తియె అధికమీ కాలమందు

వాని మిత్రుడు క్రోధము వీరిరువుర

జేర్చుకొన్నట్టి జనులకు చేటుకలుగు

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు.(122)

కామము క్రోథము లోభము మోహము

విడువుము నేనెవ్వడననియనుకో

తమ్ముతామెరుగని దద్దమ్మలకగు

నరకము లోపల నానా బాధలు.(123-090673)

కామితార్థంబులెల్లను కల్పతరువు

వలెను దయచేయు దేవుండు కలడొకండు

దుర్లభంబగు నరజన్మ దొరకు కతన

అతని గాంచుట పరమ లక్ష్యంబు మీకు.(124-221179)

   కారణమున కల్గు ఘనమోహ బంధంబు

మోహమందు పెరుగు మూర్ఖ బుద్ధి

మూర్ఖ బుద్ధియందు మురియును కర్మంబు

కర్మ ఫలము వలన కలుగు జన్మ.(125-111083)

కాలగతి సర్వ సంపదలు కోలుపోయె

మిగులు సిరి నేను మీకును మీరు నాకు

కాన ఏ కలవారికైన అమ్ముకొని

ఈ ఋషి ఋుణము తీర్చుకొమ్ము.126)

కాలు జారిన మరలింప గలరుగాని

నోరు జారిన మరలింప లేరు సుమ్మి

పాడిదప్పినయట్టి ఈ మానవులను

పూని రక్షింపనగునె ఈ పృథ్విలోన.(127-1-120796)

కించిద్భగవద్గీతా పఠనము

కొంచెము గంగా తీర్థము పానము

హరిపూజన మొకపరిగావించిన

అతనిని యముడేమని తర్కించును.(128-010673)

కుసుమ మల్లెమాల కోతికి తగిలించి

పట్టు పుట్టములను పదిల పరచి

రత్న సింహాసనమున రమ్యంబుగాజేర్చ

వదలునా తన జాతి వక్రబుద్ధి.(129)

కులములో నొకండు గుణవంతుడుండిన

కులము వెలయు వాని గుణము వెలయు

వెలయు వనములోన మలయజంబున్నట్లు(129-1-22-05-1996)

కుక్క తిన్నవాడు గురుదేవ జంగము

పంది తిన్నవాడు పరమ యోగి

ఏనుగు తిన్నవాడు ఎంతటి విజ్ఞానియో

విశ్వదాభిరామ వినురవేమా!(129-2-23-11-1968)

కృారమృగముదెచ్చి కూర్మితోబెంచిన

ఆకలయ్యెనేని అదిమి పట్టు

దుష్టగుణంబులుగల దుర్జన స్నేహంబు

కృారమృగము కంటె ఘోరమగును.(130)

కోపము కల్గినవానికి

ఏ పనియు ఫలింపకుండు ఎగ్గులు కల్గున్​

పాపపు పనులు చేయచు

ఛీ పమ్మనిపించుకొనును (130-3-22-05-1996)

కాదు మానవుండు ప్రేమయే లేకున్న

కాదు క్రైస్తవుండు కాదు సిక్కు

కాదు హైదవుండు కాదు ముస్లిమ్​

వాడె రాక్షసుండు వసుథ పైన.(131)

కొన్న కూర బేడ కూలియా పావలా

ఇదియె నాగరికత యిపుడు మనకు

ఎవరి పనులు వారు ఏమరకుండగ

నిర్వహించుకొనుట నేర్వవలయు.

కొలది కొలదిగ పుట్టును తొలుత చెదలు

కొరికి తినివేయు త్వరలోన కొయ్యనంత

దుష్టగుణములు సూక్ష్మమైతోచు మొదలు

పిదప నాశంబు చేయు నేపెద్దనైన.131-2-210896

కోపము కలిగిన వానికి

ఏపనియు ఫలింపకుండు ఎగ్గులు కలుగున్​

పాపపు పనులను చేయుచు

ఛీ! పొమ్మనిపించుకొనుట చేకూరు సుమీ!(130-1-220596)

కోపమున్నవారి కోరి చేరగవచ్చు

పాము ప్రక్కనైన పండవచ్చు

మత్సరంబు కల్గు మనుజుని స్నేహంబు

కృార మృగము కంటె ఘోరమగును.

కోమలత్వంబు నిస్వార్థ గుణము కల్గి

సేవ చేయుట నిజమైన సేవయగును

స్నేహ భావంబుతో కూడి సేవచేయ

      శాంతిధామంబు చేరుట సత్యమయ్య.(131-1-191197)

కొలది కొలదిగ పుట్టు చెదలు

కొరికి తినివేయు త్వరలోన

చెడ్డ బుద్ధులు మదిలోన చేరెనేని

పిదప నాశనము చేయ ఏ పెద్దనైన.(131-2-21-08-1996)

కోరు కోర్కెలవన్నియు తీరుచున్న

భక్తి దైవముపై హెచ్చు రక్తి పెరుగు

కోరు కోరికలన్నియు తీరకున్న

భక్తి తరుగును దైవ విరక్తి పెరుగు.(131-3-031083)

కోకిలము కూత కూయగ కాకులెల్ల

దాని పొడవగ చూచుట గాంచలేదె

మంచివారిని చూచిన మత్సరించు

జగతి దుర్భుద్ధికిది సహజంబు కాద!

కట్టడ యైనయట్టి నిజ కర్మము చుట్టుచు వచ్చి యే గతిం

బెట్టునో పెట్టినట్లనుభవింపక తీరదు కాళ్ళు మీదుగా

గిట్టక వ్రేలుడంచు దలక్రిందుగ గట్టిరె యెవ్వరైన నా

చెట్టున గబ్బిలంబులకు జేరిన కర్మము గాక మానవా!(132-1)

కర్మము కంటెనెక్కుడగు కార్యము లేదిల మానవాళికిన్​

కర్మముచేయుచుండవలె కర్మ ఫలంబును కాంచకుండ ఆ

కర్మకధీనుడై మెలగి కర్మమొనర్పుడు యింతకంటె ఏ

కర్మయు లేదు ప్రాణులకు కర్మయె సౌఖ్యమొసగు నుర్వినిన్​.(132)

కలయో వైష్ణవ మాయయో యితర సంకల్పార్థమో సత్యమో

తలపన్నేరక యున్నదాననో యశోదాదేవిగానొ పర

స్థలమో బాలకుడెంత యాతని ముఖస్థంబై యజాండంబు ప్ర

జ్వలమై యుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్​.(133-290696)

కాలముబట్టి సర్వమును కల్గుచుండును మంచిచెడ్డలున్​

కాలముబట్టి వచ్చెడివి కల్మికి లేమికి రాకపోకలున్​

కాలమె అన్నిరీతులను కారణమెంచుచు చూడగాను నీ

కాలమె లొంగదీయని మనుష్యుడొకండును లేడుగా ధరన్​.(134-010191)

 కురుచ బుద్ధులా కౌరవులు మరల తిరిగి మన పొత్తుకొత్తురా

  అగ్నిలో మల్లెపూలు వెదజల్లు లీల ముష్కరుల మ్రోల నీ

  హితోక్తులు ఏలా! గుణజాల! ఏల సంధి మాటలిక గోపాలా!

  ఉత్తరదక్షిణ ధృవములు కలియునా యుద్ధము సిద్ధమన కాలహరణమికేల!(135-270696)

కొడుకుల్​ పుట్టరటంచు నేడ్తురవివేకుల్​ జీవన భ్రాంతులై

కొడుకుల్​ పుట్టరే కౌరవేంద్రున కనేకుల్​ వారిచే నేగతుల్​

వడసె బుత్రులు లేని యా శుకునకున్​ వాటిల్లెనే దుర్గతుల్​

చెడునే మోక్ష పదంబపుత్రనకున్​…….(136)

కొడకులపట్టి చంపెనను కోపమునొందదు బాలఫూతకున్​

విడువుమటంచు చెప్పెడిని వెఱ్ఱిది ద్రౌపది వీడు విప్రుడే

విడువగనేల చంపుడటు వీనిని మీరలు చంపరేని నా

పిడికిటి పోటునన్​ శిరము భిన్నము చేసెద చూడుడందరున్​.(137-191168)

కారే రాజులు రాజ్యముల్​ గలుగవే గర్వోన్నతిం బోందరే

వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై

బోరైనం గలదే శిబిప్రముఖులుం బ్రీతిన్​ యశఃకాములై

యీరే కోర్కులు వారలన్​ మరచిరే యిక్కాలమున్​ భార్గవా!

కన్నీరు తెప్పించు కన్నీరు తప్పించు

చిన్మయమూర్తి ఓ చిన్నిరామా!

పిచ్చిని పట్టించు పిచ్చిని పోగొట్టు

సచ్చిదానందుడు సాయిరామ!

జోగి భోగిగజేయు భోగి జోగిగజేయు

భాగవతాగ్నిని బాలరామ!(138) ……….

కనులుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన

నీ మూర్తి దర్శింపనేరరైరి

చెవులుండి చెవుటులై అతి మనోహరమైన

నీ వాక్కు లాలింపనేరరైరి

పాణిపంకజమందు పర్తీశుడున్నను

పాడు సంసారము కోరుచుంద్రు

మించెడి కాంతితో మేరు పర్వతముండ

వెండిబంగారుకై వెదకుచుంద్రు

విశ్వ హృదయమందు వినిపించు ప్రణవంబు

వినుడు శ్రద్ధతోడ వీనులలర

కామ్యముక్తులనిడ కల్పకంబిదె సుమ్మి

మరువబోకుడిట్టి మంచిమాట. (139-301286)

కమలాక్షునర్చించు కరములు కరములు

శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ

సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు

శేషసాయికి మ్రొక్కు శిరము శిరము

విష్ణునాకర్ణించు వీనులు వీనులు

మధువైరి దవిలిన మనము మనము

భగవంతు వలగొను పదములు పదములు

పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి

దేవదేవుని చింతించు దినము దినము

చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు

కుంబినీధవు చెప్పెడి గురువు గురువు

తండ్రి హరి చేరుమనియడి తండ్రి తండ్రి.(140)

కరుణింప నీకంటె ఘనుడెవ్వడని కదా

ఆశ్రయించితి నీదు పాదాంబుజంబుల

మొరపెట్టుకొనగ వమ్ము చేయవనిగదా

ఎలుగెత్తి పిలిచితి యిపుడు నిన్ను

ఏది వచ్చిన నీవె ఏలెదవని కదా

నమ్మితి నిను నా మనంబులోన

అర్థించినపుడు లేదననేరవని కదా

చేతులొగ్గితి నీదు చిత్తమునకు

ఏమని తలచుచుంటివి యిప్పుడింక

ఉద్ధరింపకయుంట నీ యాహయేమి

ఎంత కాలము నిన్ను నేనిట్లుగొలుతు

వచ్చి రక్షింపు జాలము వలదు వలదు.(141)

కామితార్థంబిచ్చు కామధేనువు రాగ

ధనమిచ్చి యావును కొనగనేల?

మించెడి కాంతితో మేరు పర్వతముండ

వెండిబంగారుకై వెతలికేల?

కామిత ఫలమిచ్చు కల్పవృక్షమెయుండ

పెరటి వృక్షమునకై ప్రీతి ఏల?

భక్తిముక్తులనిచ్చు భగవంతుడిందుండ

పాడు సంసారము కోరనేల?(142)…

కల్లు పెల్లుగ ద్రావి నల్లమందును మ్రింగి

భంగును సేవించు భవ్యమతులు

సారాయి చెడగ్రోలి చావు తిండిని తిని

మాంసంబు నమిలెడి మహిత యశులు

జీవుడు చావడు జీవహింసలు లేవ

టంచు పీకలు ద్రెంచునట్టి ఘనులు

మరుగున వైష్ణవ మతమని సారాయి

గ్రోలి మాంసము తిను గురువులకును

తలకు కైపెక్కి శుష్క వేదాంతమందు

ప్రముఖులై తర్కవాదముల్​ బల్పసందు

నొప్పగా నెందరో చిత్రయోగులట్లు

తలచి చెడిపోవునని భీతి వలదు నీకు.(143)

క్రమము తప్పక మింట ప్రతిదినంబును భాను

డుదయాస్తమయముల నొందనేల?

గగనంబునకు కాంతికైసేయు తారలు

పగలు మాత్రము దాగు భంగియేల?

క్షణమైన విశ్రాంతిగొనక తా పవనుండు

జీవకోటుల బ్రోవ వీవనేల?

అనిశంబు కలకల ధ్వనుల నవ్వుచు నది

సలిలమై ప్రవహించు చందమేల?

ప్రకృతిలొనెందు చూచిన భ్రమయె ఏల?

భువిని ధన కుల మత జాతి భేదమేల?

ఎవరియానతి యిది ఎల్లనిట్లు జరుగు

నతడెయితడని యీతడెయతడనుచు

సర్వులకధిపతి యనుచు కాంచరయ్య!(144-190293)

కాయంబుతోజేయు కార్యంబులెల్లను

మాటలాడుచునుండు మాటలెల్ల

తన మనస్సునగల తలపులన్నిటికిని

పది యింద్రియముల పనులనెల్ల

బుద్ధితో కలిగెడు పూనికలెల్లను

చిత్తంబునందలి చింతలెల్ల

అనుదినంబును సల్పు ఆచారములనెల్ల

నియమంబుతో జేయు నిష్ఠలెల్ల

వైదికంబులు లౌకిక వర్తనములు

ఏమి చేసిన నవియన్ని ఈశ్వరునకు

తాను చేసెడి సేవగా తలచియున్న

సార్ధకంబౌను శ్రీసాయి సంస్థలెల్ల.(145-191190)

కాషాయ వస్త్రంబు కట్టిన మాత్రాన

కరతలా మలకంబు కాదు భక్తి

నోటితో మంత్రంబు నుచ్చరించినయంత

చేసిన పాపంబు చెదిరి పోదు

గీతను చేబట్టి కేకలు వేసిన

పుణ్యము మనయింట ప్రోవు పడదు

చెప్పు మాటలకును చేయు పనులకును

సామ్యముండెడి వాడె సాధువగును

అహము పరనిందయను పాడు కుళ్ళు తీసి

సర్వ జీవులందు సర్వేశ్వరుండు ఒక్కడే అన్న

భావమ్ము మదియందు నిల్పుకున్న

ఆనాడె సాధుసంఘంబు అభివృద్ధిగాంచునయ్య.(146-040187)

కుప్పించి ఎగసిన కుండలముల కాంతి

గగన భాగంబెల్ల గప్పికొనగ

నురికిన నోర్వక యుదరంబులోనున్న

జగముల వ్రేగున జగతి కదల

జక్రంబు చేబట్టి చనుదెంచు రయమున

బైనున్న పచ్చని పటము జార

నమ్మితి నా లావు నగుబాటు సేయక

మన్నింపుమని క్రీడి మరల దిగువ

గరికి లంఘించు సింహంబు కరణి మెరసి

నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు

విడువమర్జున యనుచు మద్విశిఖవృష్టి

దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.(147)

కోటి పూసల కొక్క కొల్కి పల్కేగాని

నీటి మాటల కోటి నేరడితడు

చచ్చి పుట్టుట మాన్పు చదువు వచ్చునెగాని

చచ్చు విద్యలు రావు సాయికెపుడు

మనసిచ్చుకొను ప్రేమ మాటలాడునెగాని

సాయి ఉపన్యాసమీయలేడు

తన యదార్థత తాను తప్పక చనుగాని

ఎదుటి తప్పుల బాబ ఎన్నలేడు

కల్లకపటాలు తెలియని పిల్లవాడు

ఎల్ల జీవుల తనవలె యెంచువాడు

ఇట్టి మునీసు జన్మించినాడు

పట్టుబడినాడు భక్తికి బాబగాను.(148)

కోటీశ్వరులకైన కూడుగుడ్డయెగాని

బంగారమును తిని బ్రతుక లేరు

కాలమేగాకున్న కఱ్ఱయే పామగు

కలసి వచ్చిన మట్టి కనకమగును

పండితుడొకచోట పశువుగా మారును

మూర్ఖుండొక తరిని మునిగ మారు

ధనవంతునొక పరి దారిద్య్ర దేవత

ప్రేమించి వానితో వరుసలాడు

ప్రాకులాటయెగాని ప్రాప్తియే లేకున్న

దమ్మిడయిన నీకు దరికి రాదు

వద్దు బాబు వద్దు హద్దు మీరిన ఆశ

బుద్ధి కలిగి మెలగు పెద్ద మనిషి

బుద్ధితో మెలగుము సాయి వద్ద.(149-1-300387)

కౌసల్య వరసుక్తి గర్భమౌటను గదా

రాముడు దేవుడై రమణ గాంచె

సీతా మహాసాధ్వి చెలగి పెంచుట కదా

కవలు కుశలవులు ఘనులునైరి

జిజియా లలామయే చెలగి పెంచుట కదా

వీర శివాజీయు పేరుగాంచె

పుతలిబాయియె రంజిల్లి పెంచుట కదా

గాంధి మహాత్ముడై ఘనతగాంచె

ఈశ్వరంబాసాధ్వి యెత్తి పెంచుట కదా

సత్యనారాయణుండు విశ్వశాంతి కెదిగె

ప్రాణికోటి యీ విధి పరిమళించె

అహరంబున బ్రోచెడి అమ్మ కంటె

ఆదరంబగు వస్తువు అవని కలదె

అమ్మ ప్రధమాక్షరంబె ఆద్యక్షరంబు.(150-1)

కంసుని కాలేజీయందు కృష్ణుడు చదివెనా

హిరణ్యకశిపు కాలేజీయందు ప్రహ్లాదుడు చదివెనా

సద్గుణము నేర్పుటకు బడిపంతులు కావలెనా

బ్రహ్మజ్ఞానంబు నేర్పుటకు ఆశ్రమ మవసరమా

చెరకులోని చక్కెరవలెనున్నది నీలో సుగుణము.(151)

కదలదు నీదు సంకల్పము లేనిది గడ్డిపోచయును

అదియునిదియు ననగనేల పిపీలకాది బ్రహ్మ పర్యంతము నీవె

అది ఎరుంగరు మది గలంగరు భువిని కొందరు

వివేకమున వర్తించెదమని కడు విఱ్ఱవీగెదరుగాని

చివరికేవేళ ఏమి సంభవించునో తెలియజాలరు ఎంతవారైనా.(152)

కనులకు కనిపించెనంట నందునియింట గోపాలుడంట

దీపాన కనిపించెనంట ఆ దీపాన కనిపించెనంట

సుగుణకు కనిపించెనంట మన సుగుణకు కనిపించెనంట

నందునియింట గోపాలుడంట దీపాన కనిపించెనంట

అదే వేలికి తగిలిన మంట మన సుగుణకు కనిపించెనంట.(153)

కృష్ణా హరే చిన్నికృష్ణా హరే ముద్దుకృష్ణాహరే యని పిలచెదరా!

విష్ణుస్వరూపా సృష్టినిరూపా దుష్టసంహరా నిన్​ రమ్మందురా ||కృ||

కృష్ణా! శతకోటి మర్తాండతేజుడౌ నీ ముద్దు చేతులకు గొలస కట్టెదరా

ముంగురులు దువ్వి మురళి చేతికి యిచ్చి అందమైన మోము చూచెదరా ||కృ||(153-1

కన్నూమిన్నూ కానని వారికి జీవితమంతా పన్నీరా!

అన్నెముపున్నెము ఎరుగని వారికి జీవితమంతయు కన్నీరా!

మిత్రులెవరు? శత్రులెవరు? దేవుడెవరు? దాసుడెవరు!

గురుడెవ్వరు? శిష్యుడెవరు? కవి ఎవ్వరు? నటకుడెవరు!

తెలుసుకొనే తలయున్నదా? తెలిసిన సంశయమున్నదా!

తెలియలేని తలయున్నచో వానరుడన్న తప్పున్నదా!(154)

 కన్నువిప్పి చూడరోరన్నా శ్రీసాయిదేవుని ఎన్నగా ఎందైన కలడన్నా

మున్ను షిరిడి నేడు పర్తి ఉన్నవాడని పేరెగాని

తన్ను భావనజేయు భక్తుల కన్నులందే మెలగునన్నా   ||కన్ను||

ఉత్తమాటలచేత చిత్తము సత్తు చిత్తానందము నొందదు

విత్తనంబులు లేని భూమిలో మొత్తముగ పంటేమి పండదు   ||కన్ను||

     రోగమును అరికట్టనేరక యోగియైనను పతనమొందును

భోగమును విడనాడు వారికే యోగమది లభించునయ్యా           ||కన్ను||

ఒట్టిమాటల వాడు కాడన్నా ఈ సాయిదేవుడు బుట్టబొమ్మల చూడబోడన్నా

పట్టుబట్టలుగట్టి భక్తుల చుట్టు తిరిగే పుట్టస్వామిని                                    ||కన్ను||

ఇంద్రియములు మనసు నిల్పిన అంధుడైనను ముక్తినొందును

ఇంద్రియములు నిగ్రహించని ఇంద్రుడైన పతనమొందును  ||కన్ను||

నీతినియమము లేక తిరిగిన ధాతకైన అజ్ఞానమొదలదు

జ్యోతి  లేనిదె అంధకారము భూతలంబున లేదటంచును  ||కన్ను||

బుద్ధి నిలకడలేని మనుజుడు పొందజాలడు శాంతి సుఖములు

విషయసుఖముల వెంట పరుగిడు వెఱ్ఱిజీవికి ఎచట శాంతి   ||కన్ను||

అల్పగురువుల చెంతజేరకు స్వల్పగుణముల చింత చేయకు

తలపులన్నియు నిలిపివేసిన తనువుకెప్పుడు జన్మ లేదు    ||కన్ను||

అన్ని మతములు తననెజూపును అన్ని మూర్తులు తనవె రూపులు

అన్నిచెంతల తానెయుండగ అదియెకదా బ్రహ్మపదము    ||కన్ను||

మతము మతమునకు మధ్య ద్వేషము జాతిజాతికి మధ్య జగడము

దేశదేశమునందు రగడలు దేనికయ్యా మత ప్రబోధలు    ||కన్ను||(155)

కన్నుల నిచ్చిన దెందుకొ తెలుసా!

అన్నియు చూచేటందులకా? కాదు  కాదు

దేవదేవుడైన కైలాసవాసుని చూచేటందులకు (156)

చెవులను యిచ్చినదెందుకొ తెలుసా!

శబ్దము వినేటందులకా? కానేకాదు

భగవానుని కీర్తన వినేటందులకు(157)

నోటిని యిచ్చినదెందుకొ తెలుసా!

మాటలు పలికేటందులకా

ఆర్తామనుడౌ దేవదేవుని కీర్తన పాడేటందులకు.(158)

చేతులనిచ్చిన దెందుకొ తెలుసా!

మూతికి ముద్దందించుటకా

పతితపావనుడౌ శివుని పూజలు

చేతులార చేసేటందుకురా.(159)

పొందుగ పాదములిచ్చినదెందుకు!

సందులు గొందులు తిరుగుటకా?

అందుకు కాదు, నందివాహనుని

మందిరమ్మున తిరుగుటకు.(160)

తెలివిని యిచ్చినదెందుకొ తెలుసా!

కలిమిని సంపాదించుటకా? కాదుకాదు

నాలుగు రోజుల నాటకమిదియని

నగ్నసత్యమును ఎఱుగుటకు.(161)

దేహమునిచ్చినదెందుకొ తెలుసా!

దేశములన్నీ చుట్టుటకా!

పరోపకారార్థమిదం శరీరమను

పదమును ఆచరణలోనుంచుటకు.(162)

కలసిమెలసి తిరుగుదాం కలసిమెలసి పెరుగుదాం

కలసిమెలసి కలిమిచెలిమి బలముగుణము పెంచుదాం

కలసిమెలసి తెలుసుకొన్న తెలివిని పోషించుదాం

కలసిమెలసి కలిమితోడ చెలిమిగ జీవించుదాం

శాంతిశాంతి శాంతియని శాంతిపూజ చేయుదాం

ఓంఓంఓం అనుచు ఓంకారము పాడుదాం.(163-040187)

కర్మ దాట వశమా  నరుడా కర్మ దాట వశమా

చిన్న చెలమలో ముంచిననైనా  సప్తసాగరాల్​ నించిననైనా

కడవెంతో నీరంతేరా కావాలన్నా ఎక్కువ రాదుర             ||కర్మ||

ధనికుడు తృటిలో బికారికాడా పండితుడింతలో పశువైపోడా

కఱ్ఱపామై కరవను రాదా కర్మ హేతువు కర్మే మూలము       ||కర్మ||

భుజబలమెంతో చూపినగాని మొనగాడనుచు మురిసిననైన

ముక్కును త్రాడై ముందుకులాగే ఆముగదాడే కర్మరా

ఘన పాఠంబులు చదివినగాని కులదేవతలను కొలచినగాని

కారడవులకే పోయినగాని కఠిన తపస్సులే చేసినగాని       ||కర్మ||(164-220385)

కారణ సమష్ఠి స్వరూపము…ఈశ్వరుడు

కార్య వ్యష్ఠి స్వరూపము…ప్రాజ్ఞుడు

కారణ వ్యష్ఠి స్వరూపము…జీవుడు

సూక్ష్మ సమష్ఠి స్వరూపము…హిరణ్యగర్భుడు

సూక్ష్మ వ్యష్ఠి స్వరూపము…తైజసుడు

స్థూల వ్యష్ఠి స్వరూపము…విశ్వుడు.(165)

165-1 కారుమబ్బులకు కలికాంతులలో కాంతిజ్యోతి వెలిగించండి

ఆ కాంతితోనె మీ భ్రాంతులు దాటి శాంతిప్రదేశము చేరండి ||కారు||

జీవడను వత్తి తీసి విషయవాసనల నీరు పిండి

భక్తిసారము నూనె వేసి

ఆత్మజ్యోతి వెలిగించి నిర్భయశాంతిప్రదేశము చేరండి       ||కారు|| (165-1-17-06-1973)

కాషాయవస్త్రములె కట్టి కరతాళములను చేతబట్టి

దట్టీలను నడుముకు కట్టి కామక్రోధములను కొట్టి

పండరీ మార్గము పట్టి జైజై రంగా జైజై రంగా

జైజై రంగా జైజై రంగా…..

కొక్కొరో కోయని కోడి కూయగనె

చక్కగా నిద్రమంచమునుండి లెమ్ము

పలుదోముకొని దేహ బాధ తీర్చుకొని

జలకమాడి దుస్తులు ధరించి చల్ది భుజించి

హితమైన వస్తువు ఎంతయు నమిలి

మితముగ భుజించిన మేలగు నీకు

బడికేగి శ్రద్ధగా పాఠాల్​ నేర్చి

అణకువగల బాలుడని అనిపించుకొనుము

తేమలోనెప్పుడు తిరుగంగబోకు

మురికి గుంటలచెంత పోబోకుమెపుడు

పరుగుడు, చెడుగుడు, బంతులాటయును

సరైన వేళళ సలుపుచునుండు

పై రీతుల  నీవు పరిగణింతువేని

ఆరోగ్య భాగ్యంబులనుభవించెదవు.(166)

కొలనుకు కలువయే శృంగారము

ఆకాశమునకు చంద్రుడే శృంగారము

సముద్రమునకు అలలే శృంగారము

మానవులకు గుణమే శృంగారము.(167)

కోరిక తీరిన వేళ నన్​ గొప్పగ పొగడెదరోయి

కోరిక  తీరకపోతే ఊరక తెగడుదురోయి

పాపంబౌ పని చేసి ఫలమాపద కలిగిన రోసి

కాపాడవు నీవనుచు నింద నాపై మోపెదరోయి.(168)

168-1 కోట ఏడు చుట్టురా కోటలోపల తోటరా

తోటలోకి పోదమంటే దారి తెలియదు ఎట్లరా

రామభజన చేయరా రాజ్యమంతా వెలగురా!

సారమైనది చమరురా సత్యమైనది వత్తిరా

వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరూ రారురా

రామభజన చేయరా రాజ్యమంతా వెలుగురా!

పాటు అయినది చెట్టురా పట్టు అయినది కొమ్మరా

పాటు తప్పి పట్టు విడిచితె పరబ్రహ్మమె చేరురా!

రామభజన చేయరా రాజ్యమంతా వెలుగురా!(168-1

ఖండఖండాంతర ఖ్యాతి నార్జించిన

మహనీయులను గన్న మాతృభూమి

పాశ్యాత్య వీరుల పారద్రోలించియు

స్వాతంత్య్రమును గన్న సమరభూమి

పాండిత్యమున చాల ప్రఖ్యాతి గాంచియు

ప్రతిభ చూపించిన భరతభూమి

సంగీతసాహిత్య శాస్త్రీయ విద్యల

ధీశక్తి చూపిన దివ్యభూమి

చిత్రకళలతోడ చిత్రమైయున్నట్టి

భరతభూమియందు ప్రభవమొంది

భరతమాత ధర్మభాగ్యంబు కాపాడ

బాధ్యతంతయు మీదె బాలులార!(169-160673)

గాలిలోన జ్యోతి కదలాడుచుండును

గాలిలేని చోట కదలకుండు

ఆశయనెడు గాలి అణగదొక్కినయంత

మంచిదౌను మనసు మరుగు విడచి.(170-)

గుండెలదరునట్టి గొప్పసంపదలేల?

కోర్కెలదిమిత్రొక్కి కూలి మేలు

లేదు పూర్ణసఖము లేదు పూర్ణదుఃఖము

లేదు జగతియందు లేదులేదు

ద్వందభావమైన ధరణియందు.(171-2-

గ్రామసేవయన్న రామసేవయె సుమా

 రామరాజ్యమన్న ప్రేమ మయము

ప్రేమ లేక జగతి ఉద్దరించుట కాదు

కాన సేవ చేసి బాగుపడుడు.(171-290996)

గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న

అతడె క్రైస్తవుండు అతడె శిఖ్ఖు

అతడె హైందవుండు ఆతడే ముస్లిము

అతడె మానవుండు అతడె గురువు.(174-1-050701)

గుండెలదరునట్టి గొప్పసంపదలేల?

కోర్కెలదిమిపట్టు కూలి మేలు

పూర్ణ సుఖము లేదు పూర్ణ దుఃఖము లేదు

ద్వంద్వబద్ధమైన ధరణియందు.(171-2-)

గుణము కొంచెముండి గొప్ప చదువులున్న

ఫలమదేమి? వాని విలువదేమి?

పంటలేని భూమి పది ఎకరములేల?

కొంచెమైన చాలు మంచి భూమి.(172-200590)

గుణములన్నిట సత్యమ్ము గొప్ప సుమ్మి

ఎల్లలోకములందు రంజిల్లుచుండు

సత్యసంస్కృతి యమృతంబు సరణినొంది

ఆత్మ మార్గాన వెలయు పుణ్యాత్మకుండు.(173)

173-1 గ్రుడ్డివాడు రవిని గర్తించలేట్లు

ఆహము పెంచుకొన్న ఆడ్డుయుండు

దేవుడైన తనను తలుసుకోలేడయా

ఉన్నమాట తలుపుచున్న మాట. (173-1-27-09-1992)

గుణములేని సుతుడు, గురిలేని విద్యలు

నీతిలేని జాతి నిష్ఫలంబు

శాంతిలేని జీవి శశిలేని నిశి సుమా

వినుము భారతీయ వీరసుతుడ!(174-240696)

174-1 గుండెలోని ప్రేమ పండించుకొనుచున్న

అతడె క్రైస్తవుండు అతడె సిక్కు

అతడె హైందవుండు అతడె ముస్లిము

అతడె మానవుండు అతడె గురువు.(174-1-05-07-2001)

గోడ కట్టువాడు గోడతోబాటుగా

పైకి పోవుచుండు భాగ్యవశత

బావి త్రవ్వువాడు బావితోబాటుగా

అడుగు భాగమునకు అరగుచుండు.(175)

గతజీవుడగు పతిన్​ బ్రతికించుకున్నట్టి

సావిత్రి భారత సతియె కాదె!

తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చె

చంద్రమతి పవిత్ర పడతి కాదె!

కులసతీత్వమునకై గుండాన దూకిన

సీత భారత ధరాజాత కాదె!

కినిసి దుర్మద కిరాతుని బూది గావించె

దమయంతి భారత రమణి కాదె!

సప్త సాగర పరివేష్టితోర్వితలము

భరత జాతి పాతివ్రత్య ప్రవిమలంబు

భావసంపదకిది మహా పంట భూమి

అఖిల దేశములకిది ఉపాధ్యాయి కాదె! (176-190498)

గరిక పోచలు రావె గణనాథు పూజకు

ఇంతకంటెను హీనులైరి జనులు

కావుకావుమటంచు కాకి వేడగ లేదె

ఇంతకంటె నికృష్టులైరి జనులు

అంబఅంబాయని అరవదె లేలేగ

ఇంతకంటెను పల్చనైరి జనులు

రామరామాయంచు కామించదె చిలుక

ఇంతకంటెను తక్కువైరి జనులు

మానవులకంటె మృగములె మంచివేమొ

ఎంత విజ్ఞానముండియు ఏమి ఫలము?

మానవత్వము కోల్పోయి మనిషి నిలచె

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు(177-031084).

గ్రంథంబులన్నియు గాలించి చూచిన

సత్యసాయి పలుకు సత్యవాక్కు

వేదములన్నియు వెదకి చూచినగాని

సత్యసాయి పలుకు సత్యవాక్కు

శాస్త్రములన్నియు చదివి చూచినగాని

సత్యసాయి పలుకు సత్యవాక్కు

గాయత్రి మంత్రంబు ఘనముగా చెప్పిన

సత్యసాయి పలుకు సత్యవాక్కు

ధర్మ శాస్త్రములను తరచి తరచి చూడ

సత్యసాయి పలుకు సత్యవాక్కు

స్తోత్ర పాఠములను శోధించి చూడగ

సత్యసాయి పలుకు సత్యవాక్కు.(178-110787)

గోపాల నీవు దృగ్గోచరంబవకున్న

గోవులు గరికైన కొరకవంట

నీ దర్మనము లేక నీవు చెంతను లేక

గోప బాలురు కూడుగుడవరంట

నీవగుపించక నీ సేవలును లేక

గోపికల్​ నీరంబు గుడువరంట

నీ కథల్​ వినకుండ నీ ముచ్చటల్​ లేక

గోపకుల్​ కంటన్​ కునకరంట

నందనందన గోపికానన్యభక్తి

విశ్వ వ్యాప్తంబు దీనికి  సాటి కలదె!

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!(179-041084)

గరిట పాయసమందున్న రుచులననుభవించునా?

కమలపు మకరందమును కప్పలనుభవించునా?

గంధపు చెక్కల సువాసన రాయి అనుభవించునా?

అంధుడు సౌందర్యము అద్దమందు అనుభవించునా?

దేహమున్నయంతలోనె దైవతత్వమెరునా?(180)

గీతయే భగవానుని దూత గీతయే జగదేక మాత

గీత సాధకుని ఊత గీత సంసారికొక ఊత

గీతయే మంత్రాల మూట గీతయే వేదాంతపు ఊట

గీతయే ఘనరాజబాట గీతయే పుష్పాల తోట.(181)

గుటగుట చనుబాలు గ్రోలుచు

పూతన బట్టి చంపు వింతను చూడనైతి

ఎన్ని తాళ్లను కట్టినా పట్టని

నీ బోజ్జను ముద్దాడనైతి

ప్రసవ వేదన పడుట నా వంతు

నీదు ముచ్చటల్​ పడుట యశోద వంతు

బిడ్డలుండియు నేనొక గొడ్డురాలనైతి

పుత్రుని కనకుండినను పుత్రవతి యయ్యె యశోద.(181-1-280595)

ఘనముగా భువిలోన కడగండ్లు పడనేల

కూలికొరకు పాటు పడగనేల

పక్షికీటకములు బ్రతుకుచుండుటలేదె

అవనిలో ఎట్టి యత్నంబులేక.(181-2)

చదివించిరి నను గురువులు

చదివితి ధర్మార్థ ముఖ్యశాస్త్రంబులెల్లన్​

చదివినవి కలవు పెక్కులు

చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ! (182-260595)

చదువులన్ని చదివి చాల వివేకియై

మగిడి తన్నెరుగడు మందమతుడు

ఎంత చదువు చదివి ఏరీతినున్నను

హీనుడవగుణంబు మానలేడు.(183-221187)

చదువులన్ని చదివి సద్గుణంబులు లేక

పరుల మోసగించి బ్రతుకువాడు

వానికంటె మేలు వసుధలో గాడిద

బరువు మోసి తాను బ్రతుకుచుండు.(184-251289)

చాతకము కోరునేవేళ చంద్ర కాంతి

తుమ్మెదలు కోరు పూవుల తనివి గ్రోలి

రోగి కాక్షించు మందులు రచికరంబు

పర్తివాసుడు వాంఛించు భక్త జనుల.(185-210886)

చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు

ఆదిమధ్యాంత రహితుడనాదివాడు

తాను పుట్టక చావక చంపబడక

ఆత్మరూపుడై అంతట వెలసియుండు.(186-140100)

చిత్రంబులు త్రైలోక్యప

విత్రంబులు భవలతాల విత్రంబులు స

న్మిత్రంబులు ముని జన వన

చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్​.(187-030988)

చిత్తమనెడి వేరు శిధిలమైనప్పుడు

ప్రకృతి అనెడు చెట్టు పడును పిదప

కోరికలను పెద్ద కొమ్మలు ఎండును

ఉన్నమాట తెలుపుచున్న మాట.(188)

చిత్తశుద్ధి తోడ చేసెడు పూజకు

మట్టిపాత్ర చాలు మహిని చూడ

విత్తమున్నదనుచు విఱ్ఱవీగెడివాడు

పతనమగుట నిజము పర్తిసూక్తి.(188-1)

చిత్తశద్ధిని చేకూర్చు సేవకొరకు

 జీవితము నంకితముజేసి చెలగు నరుడ

పరుల కొసగుచు నీ శక్తి బలము తుదకు

చివరి శ్వాసను వీడుమా సేవలోన.189-201185)

చిత్త శుద్ధి లేని రిత్త సాధకులకు

ఆత్మత్తత్వమెట్లు అలవియగును?

ఆత్మత్తత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే

సత్యమైన బాట సాయి మాట.(190-240896)

చిత్త శుద్ధి లేని రిత్త మానవులందు

క్రోధమత్సరంబు కూడియుండు

చీకటింటిలోన చేరును గబ్బిళాల్​

మరువబోకుడిట్టి మంచి మాట.(191-230590)

చిత్తశుద్ధిలేని శివపూజ ఏటికి

ఆత్మశుద్ధిలేని ఆచారమదియేల?

పాత్రశుద్ధిలేని పాకమదియేల?

ఉన్నమాట తెలపచున్న మాట.(191-1- 02-09-1996)

చిత్త శుద్ధి లేని క్షుద్ర మానవునకు

ఆత్మత్తత్వమెట్లు అబ్బునొక్కొ?

ఆత్మత్తత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే

ఉన్న మాట తెలుపుచున్న మాట.(192-020996)

చినుకు పడినయంత చెరువులు నిండునా?

ఉమ్మి మ్రింగ దాహముడుగునొక్కో?

ఊపిరి బిగబట్ట ఉదరంబు పెరుగునా?

బొచ్చు కాల్చినంత బొగ్గులగునా?(193)

చీమ స్వార్థంబు కలిగిన జీవి కాదు

పెక్కు చీమలు గుమిగూడి మెక్కుచుండు

దానికున్నట్టి బుద్ధి యీ మానవులకు

గలుగదేటికి చిత్రంబుగాదె చూడ!(194)

చెంబు బావియందు చెరువునందును కూడ

పట్టినంతె నీరు పొట్ట నింపు

ప్రాప్తి ఎంతొ అంతె ఫలము ఎందేగినా

ఉన్న మాట తెలుపుచున్న మాట.(195)

చేతులారంగ శివుని పూజింపడేని

నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని

దయయు సత్యంబు లోనుగా దలపడేని

గలుగనేటికి దల్లుల కడుపు చేటు.(

చెడ్డ చూడరాదు చెప్పరాదెప్పుడు

వినగరాదెపుడును విశ్వమందు

మూడు కోతులు గల మూర్తిని తలచుడు

ఉన్న మాట తెలుపుచున్న మాట.(196-260590)

చెడ్డ పని చేసి మంచిని చెందబోరు

మంచి పని చేసి కీడును గాంచబోరు

నింబమును నాట చూత ఫలంబు గనున?

చూతమును నాటి నింబంబు పొందనగునె?(197-130673)

చెప్పుట సులభమ్ము చేయుట కష్టము

ధాతకైన వాని తాతకైన

చెప్పవచ్చు కోటి  చేయరు ఒక్కటి

ఉన్న మాట తెలుపుచున్న మాట.(198)

చెవులకెవ్వండు విను శక్తి చేర్చెనోయి

కనులకెవ్వండు యిచ్చెను కాంతిరేఖ

అట్టి వానిని వెతికెడు నతడు నరుడు

ఉన్న మాట  తెలుపుచున్న మాట.(199)

చేతులారంగ శివుని పూజింపడేని

నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువడేని

దయయు సత్యంబు లోనుగా దలపడేని

పుట్టనేటికి తల్లుల కడుపుచేటు(200)

చక్కెర కంటె తీపి దధిసారము కంటెను రుచ్యమౌను పెం

పెక్కిన తేనె కన్న అతి తృప్తినిడున్​ మరి పల్కపల్కగా

మిక్కిలి కమ్మనౌ అమృతమే అనిపించును కాన నిత్యమున్​

చక్కగ దాని మీరు మనసా స్మరియింపుడు రామనామమున్​(201-030490)

చదువుల్​ నేర్చితినంచు గర్వము వహించన్​రాదు నీకున్న యా

చదువేపాటిది, విద్యకున్​ వినయమే సద్రూపమౌ, నేర్వద

గ్గది యెంతో కలదంచు గర్వదురహంకారమ్ములన్​ బాయుడీ

హృది దానన్​ తలపోయుచుండు సుగతీ! ఓయీ అవిద్యాపతీ!(202-141287)

చుక్కలన్నియు బ్రహ్మ సూర్యుండు అది బ్రహ్మ

చంద్రుడన్నను బ్రహ్మ జలము బ్రహ్మ

స్వర్గమన్నను బ్రహ్మ వైకుంఠమది బ్రహ్మ

తల్లియన్నను బ్రహ్మ తండ్రి బ్రహ్మ

భాగ్యమన్నను బ్రహ్మ వాల్లభ్యమది బ్రహ్మ

జీవరాసులు బ్రహ్మ జీవి బ్రహ్మ

పుట్టించుటది బ్రహ్మ పోషించుటది బ్రహ్మ

గిట్టించుటది బ్రహ్మ గృహిణి బ్రహ్మ

కర్మలన్నియు బ్రహ్మ కాలంబు బ్రహ్మ

ప్రకృతియంతయు బ్రహ్మ ఆదిశక్తి బ్రహ్మ

సర్వమును బ్రహ్మ మరియు ఈ సభయు బ్రహ్మ

సత్యమును దెల్పు ఈ సత్యసాయి బ్రహ్మ.(203-300796)

చూచితే దైవాన్ని చూడవలెనే గాని

వేరుచూపులు చూడ వెఱ్ఱితనము

నడిచితే విభునితో నడవ వలెనే గాని

వేరు మార్గము పోవ వెఱ్ఱితనము

పలికితే సత్యాన్ని పలుకవలెనే గాని

వేరు పలుకులెల్ల వెఱ్ఱితనము

పాడితే తత్వాలు పాడవలెనే గాని

వేరు పాటలు పాడ వెఱ్ఱితనము

వినిన హరి భజనంబులు వినగ వలయు

చూడగోరిన దైవాన్ని చూడవలయు

చేరవలసిన దైవాన్ని చేరవలయు

ఇంతకంటెను పరతత్వమేమి కలదు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!(204-240391)

చెంత చేర్చెననుచు సంతసించెదరన్న

వెంటనే ఎడబాసి చింతగూర్చు

ఏడిపించుట సాయి వేడుకయందురా

కడుపుబ్బ నవ్వించు నడుమ నడుమ

పొగడుచున్నాడని పొంగిపోయెదరేమొ

తప్పకప్పుడె ఎగతాళి చేయు

అభయమిచ్చెనుగాన హాయినుండెదరన్న

పడు బాథలకు అంతుబట్టకుండు

వెనుకకేగనీడు చననీడు ముందుకు

మనసు మరులు గొల్పి మధన పెట్టు

ఇట్టి చిన్ని సాయి చిన్మయమూర్తిని

ఎట్టులెలుగగలరు ఇలను మీరు.(205-231184)

చెట్టుకొమ్మల పూలు పుట్టించు చేతితో

మీ మనంబున భక్తి నాటుకొల్పు!

పూవులోపల పిందె పొడమించు చేతితో

మీ మనంబున రక్తి నాటుకొల్పు!

పిందెలోపల విత్తు పుట్టించు చేతితో

మీ మనంబున శక్తి నాటుకొల్పు!

విత్తులోపల చెట్టు పెరిగించు చేతితో

మీ మనంబున ముక్తి నాటుకొల్పు

దినదినమ్మున అభివృద్ధి వచ్చునట్లు

కడకు యియ్యది ఫలసిద్ధి గాంచునట్లు

ఎల్లవేళల సాయి మీ చెంత ఉండునట్లు

దీవెనలు పొందు …….. సాయితోడ! (205-1)

చైతన్యమనియన్న క్షేత్రజ్ఞుడనియన్న

జ్ఞానమన్నను అహంకారమన్న

ఈశ్వరుడన్నను ఇల విష్ణువన్నను

బ్రహ్మమన్న ఆదిశక్తియన్న

ఆనందమదియన్న పరమపదంబన్న

ప్రకృతియనగ ఆత్మకు పలు పేర్లు.(206-250208)

చక్రము  లేని రథము నీరెరువులు లేని పెంట

చంద్రకళలు లేని రాత్రి సింథూరము లేని గృహిణి

వెన్న తీసినట్టి పాలు రుచి ప్రకాశములెట్లు కలిగియుండు?

భక్తిలేని జీవితము పుణ్యమా పురుషార్థమా?(207)

చదివి వ్రాయ నేర్చినవారందరు విద్యావంతులేనా?

 కాలేజి డిగ్రీని పొంద విద్యావంతుడగునా?

సుజ్ఞానము సుకృతములు లేని విద్యలు విద్యలగునా?

బ్రతుకుటకై విద్యయన్న పశు పక్షులు బ్రతుకలేదె!(208-221108)

చెడ్డ చింత చేసిచేసి గ్రుడ్డియాటలాడియాడి

ఊడిపడే దేహానికి బూటకపు ఆటలాడి

ప్రారబ్దము తీరగనే కపట వేషాలు విడనాడి

పుణ్యపాపములతో కూడి మరణింతువు ఓ కిలాడి.(209)

 చెర్లోన మీ మామ శనగలెయ్యంగ

భాగమిమ్మని పొమ్ము బాలశంకరుడా

ఏసిననాడు లేవు కోసిననాడు లేవు

ఏందిస్తురా భాగంబు నీకు (అంటే)

మా అమ్మ నీతోడబుట్టినది కాదా

తగవుకే పోదాము ధర్మచావడికి (అన్నాడుట)

ధర్మచావడిలోని పెద్దాలందరు

భాగమిమ్మని బిడ్డనిమ్మనిరి.(210-310591)

చిక్కిన సాయిని వక్కలేయక చక్కచేసుకోండి

పోయిన చిక్కదు పర్తీశుని పాదసేవయండి

భక్తిని యిచ్చి శక్తిని యిచ్చి ముక్తిచేర్చునండి

ఇతరుల మాటలు యింపుగ నమ్మి కొంపతీయకండి

నేర్చుకోండి నేర్చుకోండి బుద్ధులన్ని తీర్చుకోండి కర్మ.(210-1-14-01-1999)

జనన మరణాలు రెండును జంటనుండు

రెండు చక్రాలు బండికి నుండునటుల

ఒకటి పోయిన సృష్టియే ఓడిపోవు

ఇదియె సృష్టి రహస్యమీ థరణియందు.(211-270591)

జగతిని జయింపగలిగిన జాణ ఎవడు?

సత్యమోర్వంగనేర్చిన సజ్జనుండు

ఎవరిని ఈశునివలె పూజింపనగును?

కరణతోడుత వెలసిన ఘనుడె సుమ్మి!(211-1

జపము యజ్ఞమందు జన్మలన్నియు పోయె

మనసు కుదరదాయె మానవునకు

జపము యజ్ఞములకు జన్మమీడేరునా?

మనసు నిలపకున్న మందమతికి.(212-071089)

జాతి గౌరవంబు నీతిపై నిలుచును

నీతిలేకయున్న జాతి చెడును

నీతి కల్గు జాతి నిజమైన జాతిరా

వినుము భారతీయ వీరసుతుడ!(213-1-020690)

    జీర్ణకోశాలు దేహాన జేర్చునెవరు?

    జనన మరణాలు ఎవరిచే కలుగుచుండు?

   వారినెరుగంగ నేర్చుటే జ్ఞానమగును

   మరువబోకుడిటువంటి మంచి మాట.(213-201088)

జగతి జీవించువాడు మనుజుడు కావలె మొదట

దనుజుల దుష్క్రృతములనెల్ల పొడుచుండు వాడె చవట

బ్రహ్మవిద్య నేర్చి యిచట ఆధ్యాత్మను కనుగొనుట

రాజయోగమునకు బాట అదియె శృతులు చెప్పుమాట. (214-170788)

జనన మరణ మధ్యమందు జగన్నాటక రంగమందు

కామ క్రోథ గానములు లోభమోహ గీతములు

మదమాత్సర్య ద్వేషములు వ్యామోహముల నాటకములు

నవ విధముల ప్రదర్శనలు తుదకు శాంతి పాఠములు.(215-160673)

జేనెడు పొట్ట నింపుకొన చిక్కులనొందుచు కోటి విద్యలన్​

పూనికమీర నేర్చి పరిపూర్ణసుఖంబును పొందలేక యీ

మానవజాతి దుఃఖముల మ్రగ్గగనేటికి శ్రీపరాత్పరున్​

ధ్యానముజేయు భక్తులకు దారినిజూపకయున్నె మానవా!(215-270596)

జనని గర్భమునుండి జన్మించినప్పుడు

కంఠమాలలవేమి కానరావు

మంచి ముత్యపు సరుల్​మచ్చునకును లేవు

మేల్మి బంగరుదండ మెడకు లేదు

రత్నాల హారముల్​ రంజిల్లగా లేవు

పచ్చలు కెంపులు పరగ లేవు

వజ్రాల హారముల్​ వర్థిల్లగా లేవు

గోమేథికంబులు తోడులేవు

కలదు కలదొక్క మాల మీ కంఠమందు

ఎన్ని చేసిన అవియన్ని ఎంచి ఎంచి

మంచిదైనను చెడుగైన త్రుంచకుండ

బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల

కర్మలన్నియు చేర్చిన కంఠమాల!(217-240590)

జపమహా నిత్యాగ్ని తపములు చేసిన

సరిరావు హరినామ స్మరణకన్న

తీర్థయాత్రలు కొన్ని తిరిగి సేవించిన

సరిరావు హరినామ స్మరణకన్న

ఉపవాస వ్రతములు విడువక చేసిన

సరిరావు హరినామ స్మరణకన్న

అశ్వమేధంబులు అమితంబుగా జేయ

సరిరావు హరినామ స్మరణకన్న

అడవిలోపల ఆకులలములు తినుచు

సంచరించిన ఫలమేమి సాధువర్య

ఎంచి చూడగ యివియన్ని ఏమి ఫలము?

స్మరణ లేక హరి కరుణ కలుగబోదు.(218-260287)

జాతి భేదము లేక జనులకాశ్రయమిచ్చి

సర్వ సమత్వంబు చాటు తరులు

తనువుకై మనకింత తమకంబు వలదంచు

చలియెండ వానల సైచు గిరులు

రేపుమాపు కొరకు వాపోవ వలదంచు

విహగముల్​ సంతుష్టి విద్య గరపు

జగము నిత్యము కాదు సంసారమది భ్రాంతి

యని ప్రాణముల్​ వీడి చనెడువారు

నేను, నాదను భావమనిత్యమనుచు

ప్రకృతి జనని తెల్పుచుండు భాష్పవృష్టి

ప్రాణి సుజ్ఞాన మార్జింప ప్రకృతి ఒకటె

పాఠశాల, సద్గురుడు శ్రీసాయి కాదె!(219-27283)

జన్మమెత్తిన వెనుక జాగ్రత్త కావలె

దుర్మార్గులను జేర దొసగు కల్గు

చెడును జీవితమెల్ల చెడును బుద్దులు భక్తి

చెడు దుష్టుడై తాను చెడును కడకు

చెడక మునుపె మంచి స్నేహంబు లొనరించి

పెడమార్గములనెల్ల వీడియున్న

ఆయురారోగ్యంబులఖిల సంపదలను

ఆధ్యాత్మిక చిత్తమబ్బునప్ప

అంతియేకాదు, మోక్షంబు చెంత నిలుచు

ఇంతకన్నఉ వేరెద్ది ఎరుక పరతు

సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులార! (220-221180)

జనుడు తనకు తాను నరుడనియే తలచినాడు

ఏదెరిగిన నరజన్మము సార్థకమౌనో తెలియదు

నరజన్మమునందు పుట్టి నరజన్మమునందు పెరిగి

నరసింగములైనవారు తొలి సంగతి మరచినారు

కులమత భేదములు పెంచి అసురత్వము స్వీకరించి

సమరాలను స్వాగతించి శాంతి సభలు జరుపుతారు

తనకొరకై బ్రతుకువాడు మనుజుడెట్లౌనురా?(221-290786)

221-1 జన్మమున నిజజనులై జన్మించివారెందరు

జన్మము తరవాత మిగుల జన్మించినవారెందరు

జన్మమెత్తి ధర్మకర్మ శూన్యులైనవారెందరు

జన్మమంత తిరిగి నరజన్మమును కనుగొనలేరు

జన్మించినవారెందరు జన్మమెత్తినవారెందరు.(221-1-16-06-1973)

జీవుడుండు దేహమందు హృదయమందు దేవుడుండు

రెండుకూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుంద్రు

బొమ్మలాటలాడించే సూత్రధారి కలడొకండు

మంచి చెడ్డ బొమ్మలందు ఒకటిలోనె రెండు ఉండు.(222-)

తగదు తగదు ధనదాహము నరుడా

మంచి బుద్ధితో మానుము కోర్కెలు

కర్మ ఫలితమే కదరా విత్తము

కలిగినంతలో కనరా తృప్తిని.(223-070788)

తత్త్వమడుగంటె సినిమాలు తలకుబట్టె

ఒప్పులన్నియు సంఫూన తప్పులయ్యె

యుక్తి కేంద్రాలుగా మారె భక్తియందు

సత్యమును తెల్పు మాట శ్రీసాయి మాట.(224-151088)

తత్త్వమెరిగిన వానికి తపమదేల?

సత్యమున్నట్టి వానికి సాధనేల?

కల్లకపటాలు లేకున్న క్రతువులేల?

సత్యమును తెల్పు మాట ఈ సాయి మాట.(225-280591)

తనదు తప్పు తాను తరచును సుజ్ఞాని

పరుల తప్పులెల్ల పట్టువాడు

తనను తానెరుగడు తన తప్పునెరుగడు

ఇట్టి వాడు భువిని పుట్టనేల?(226-051285)

తనదు బాగు కోరి తత్త్వంబు బోధించు

గురుడు తిట్టవచ్చు బాగ కొట్టవచ్చు

తల్లి బుగ్గ గిల్లి త్రాపును మందును

మరువబోకుడిట్టి మంచి మాట.(227-1-060593)

తన కలిమి భంగ పుచ్చును

తనకుంగల గౌరవంబు దగ్ధము చేయున్​

తన వారల కెడ సేయును

జనులకు గర్వంబు వలన సర్వంబు చెడున్​.(228-120796)

తన కోపమె తన శత్రువు

తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ

తన సంతోషమె స్వర్గము

తన దుఃఖమె నరకమంద్రు….. (228-1-25-11-1993)

తనకె తెలియునంచు తత్త్వంబు సర్వంబు

విఱ్ఱవీగరాదు విబుధుడెపుడు

తెలిసియున్న దాని తెలివితో చేయుట

నీతి మార్గగామి నిత్యవిధులు.(229)

తనువనిత్యము సంపదలన్నియు మాయ

సుతులు పెండ్లాము తెరవెన్క బొమ్మలైరి

తాను చేసిన పుణ్యంబు చెడని ఫలము

అనుచు మదిలోన నెంచువాడె నరుడు.(2300

తమరు చేయంగ గల కార్యముల గూర్చి

మంచి చెడ్డలు చక్కగా నెంచి చూచి

చేయుచుందురుగాన యేచింత లేక

వేగిరించినచొనది విషమె యగును.(231)

తరచి చదువు చదవ తర్కవాదమెగాని

పూర్ణజ్ఞానమెపుడు పొందలేడు

చదువులన్ని చదివి చావంగనేటికి

చావులేని చదువు చదవ వలయు.(232-250590)

తరువ తరవబుట్టు తరువున ననలంబు

తరువ తరువబుట్టు దధిని ఘృతము

తరువ తరువబుట్టు తనువున త్తత్త్వంబు

ఉన్నమాట తెలుపుచున్న మాట(233-070996).

తలచినట్టి పనులు తారుమారైనచో

తొణక వలదు ఎవరు బెణక వలదు

చీకుచింత వీడి చిరునవ్వు నవ్విన

అతని గుండె పండినట్టి గుండె.(234–140199)

తలచినట్టి పనులు తారుమారైన

చీకుచింతలేక చిరునవ్వుతోడ

వారిగుండెనిండి రసోవైసః

అను సూక్తి రంజిల్లునప్ప (234-1-02-10-1986)

తలపులందు వేరు దైవంబు కలడని

తలచి నరుడు తన్ను తానె మరచు

తలపులన్ని వీడ తానె దైవంబగు

తలపు భ్రాంతి వీడి తరలి రండు.(235)

తల్లి కన్న మిగుల దైవమే దగ్గర

సన్నిహితుడు తండ్రి కన్న చాల

అట్టి ఆత్మ వదల అబ్బును పాపంబు

ఉన్న మాట తెలుపుచున్న మాట.(236)

తల్లి సేవ మదిని తగిలిన తనయుడు

వాని పాపమెల్ల వదలుచుండు

శివుడు మెచ్చు తనకు చిరకీర్తి నందించు

దుఃఖరాసినెల్ల తొలగచేయు.(237)

తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు

పుట్టనేల వాడు గిట్టనేల?

పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా?

విశ్వదాభిరామ వినురవేమ! (238)

తాను చేయకున్న తగవు పుట్టదుగాని

ఒరుల పెట్టుచూసి ఓర్వలేరు

దాత దరిని చేరి తనది పోయినట్లు

జిహ్వతోడ చాడిలు చెప్పుచంద్రు.(239)

తామరాకుపై తళతళలాడే

నీటి బోట్టు వలె నిలకడ లేనిది

బ్రతుకభిమానపు తెగులు పుట్టరా

దిగులు దుఃఖముల తెరరా లోకము.(240-020673)

తామసంబు విడక త్తత్త్వంబు కనరాదు

రాజసంబు విడక రాదు భక్తి

సాత్వికంబె భక్తి సాధనంబగునయా

       ఉన్నమాట తెలుపుచున్న మాట.(241-030796)

త్యాగభావంబు మీలోన దనరకున్న

మలిన బుద్ధులు మీలోన మారకున్న

పార్టి వేరుచేసినగాని ఫలము సున్న

పక్షపాతము విడకున్న ఫలము సున్న.(242)

తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు

తిరిగి కుందేటి కొమ్ము సాధింప వచ్చు

భజన లేకుండ పరభక్తి పరగ రాదు

తత్త్వమెరుగక భవవార్థి దాటలేరు.(243)

తిండికోసము పెక్కు తిప్పలు పడుచుంద్రు

ప్రకతి సుఖములనెల్ల పొందగోరు

చేర దైవముకడ చేయరు యత్నము

ఉన్నమాట తెలుపుచున్న మాట243-1-12-06-1988)

తుప్పు పట్టిన దానిని తుడవవచ్చు

పొట్టు విత్తనముల విడగొట్టవచ్చు

కోరి యజ్ఞాన తిమిరంబు తరుమ వచ్చు

కాని మూర్ఖుని రంజింప కాదు సుమ్మి. (244-230182)

తెలివితేటలు మరి ఎన్ని కలిగియున్న

కర్మ దాటగ జాలిన ఘనుడు లేడు

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు

సాథు సద్గుణ గణ్యులౌ సభ్యులార!(245)

తెలియబడచున్న లోకంబె దృశ్యమంద్రు

తెలివినై సర్వమును గాంచు ద్రష్ట నేను

మిగుల నా కంటె అన్యంబు ఏది లేదు

సత్యమిది సర్వ వేదాంత సంగ్రహంబు.(246-110787)

తెలివిని యిచ్చినదెందుకొ తెలుసా?

కలిమిని సంపాదించుటకా? కాదు కాదు

నాలుగు రోజుల నాటకమిదియను

నగ్న సత్యమును నెరుగుటకు.(247)

తేలు విషము కన్న  తెంపరాకుల కన్న

పదును కత్తి కన్న పాము కన్న

మత్సరంబు కల్గు మనుజుండు యిలలోన

కుత్సితుండు వాడె తుచ్ఛితుండు.(248)

తొమ్మిది చిల్లులుండు తోలు తిత్తియెగాని

కాంతి కలుగు వజ్రఘటము కాదు

నిముష నిముషమునకు నీచులూరునెగాని

పునుగు జవ్వాదీలు పుట్టబోవు(249).

తన్ను నిశాచరుల్​ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో

పన్నగశాయి! ఓ దనుజభంజన! ఓ జగదీశ! ఓ మహా

పన్న శరణ్య! ఓ నిఖిల పావన! యనుచు నుతించెగాని తా

కన్నుల నీరు తేడు, భయకంపసమేతుడుకాడు భూవరా!(250-230590)

 

తామర మొగ్గరంబు బలదర్పిత శాత్రవ గర్వ భంజనో

ద్ధాముడు కుంభజుండు మరి దానిని పన్నిన వాడు భీష్మ సం

గ్రామము భార్య గర్భవతి కాలమెటుండునో చెప్పలేము మీ

మామయు తండ్రి లేరిచట మానుము నీ తలపింక పుత్రకా!(251-210793)

తగిన సేవలు చేయు దాసదాసీలున్న

గుణవంతురాలగు కోడలున్న

అమిత ప్రేమగ చూచు అక్కసెల్లెండ్రున్న

తన యాజ్ఞ పాలించు తమ్ములున్న

మైత్రి నిత్యముగోరు మిత్ర బృందమున్న

తగినట్టి అధికార యోగమున్న

విశ్వవ్యాప్తిని గాంచు విద్యలెన్నియొయున్న

చక్రవర్తులకున్న సంపదున్న

దైవ ప్రేమయె లేకున్న ధరణియందు

సర్వ సంపద వ్యర్థమే చనెడు వేళ

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు

సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులార!(252-030692)

తప్పుగానక సర్వమొప్పుగా భావించి

    శ్లాఘించుచుందురు సరస జనులు

తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా

    ప్రకటించుచుందురు ప్రాజ్ఞజనులు

ఒప్పును తెలియక తప్పుగా భావించి

    దూషించుచుందురు దుష్టజనులు

ఒప్పులన్నియు బలిమి తప్పులుగాజేసి

    కలహించుచుందురు కలుష జనులు

వెనుకజూడ మూడిట నొక విధము కలదు

నాల్గవ స్థాయి యందున్న నరునినరయ

వీని కంటెను రాక్షసుండెవరు కలరు?

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!(253-210673)

తమ జీవితంబులు త్యాగంబు గావించు

ధర్మాత్ములుందురీ ధరణియందు

పరుల సౌఖ్యముగోరి బలియైన వారలుంద్రు

కొందరీకాలమునందు కూడ

కలలోన కూడను ఇలలోని సౌఖ్యముల్​

కలవరింపని వారు కలరు ధరణి

కాని దేహేంద్రియములరికట్టిి నిలిపి

మనసునంతర్ముఖము చేసి యనవరతము

నిశ్చల సమాధి చిత్తుడై నిలచి నేడు

సత్య సేవ గావింప నాసక్తు లెవరు?9254)

తల్లికౌగిలికినై తారాడి తారాడి

ఎలుగెత్తి పసికూన ఏడ్చినట్లు

మంద లోపలనుండి మరలిన దూడకై

ఆవు అంబాయని అరచినట్లు

భర్త బాయగ కాంత విరహవేదన సొక్కి

మూలమూలలొదిగి మూల్గినట్లు

నిరుపేద ఆకట నీరసంబొందుచు

కూటికి అల్లాడి ఏడ్చినట్లు

సర్వము త్యజియించి స్వామి చింత చేసి

సాయి సాయి యంచు హాయి గనుడు(255-110384)

తల్లి కైవడి అన్ని తప్పులు సైచియు

పుణ్యమొసగునట్టి పూజ్యభూమి

వలదన్న సద్గ్రంధ పఠనంబు లేకయే

పలు శాస్త్రములు నేర్పు పాఠశాల

శ్రమలేక తనయందు సర్వంబు సమకూర్చి

ఆనందమొనగూర్చు విహార భూమి

అజహరాదులనైన పసిపాపల జేయు

మహిమను చేకూర్చు మంత్రశాల

సతుల అనురాగ సర్వార్థ  సాధనంబు

శాంతి సౌభాగ్య కళ్యాణ కల్పకంబు

ప్రణయ త్యాగోపదేశ వైరాగ్య శాల

పతి గృహంబె సతులకు పాఠశాల.(256)

తల్లి గర్భమునుండి ధనము తేడెవ్వడు

వెళ్ళిపోయేనాడు వెంటరాదు

లక్షాధికారైన లవణమన్నమెగాని

మెరుగు బంగారము మ్రింగబోడు

విత్తమార్జన చేసి విఱ్ఱవీగుటెగాని

కూడబెట్టిన సొమ్ము తోడు రాదు

పొందుగా మరుగైన భూమిలోపల పెట్టి

దాన ధర్మము లేక దాచిదాచి

తుదకు దొంగలకిత్తురో దొరల కగునో

తనదియనియెడునట్టిది ధనము కాదు

ఆత్మ ఒక్కటె శాశ్వతమరసి చూడ

సాధుసద్గుణగణ్యులౌ సభ్యులార!(257-060503)

తారకంబనియెడి బంగారు మనకుండ

పర శాస్త్రముల యెడ భక్తి ఏల?

హైందవ ధర్మ హిమాద్రులు మనకుండ

పరధర్మమను పర్వతంబులేల?

భరతనీతియనెడి సారజలంబుండ

పరనీతియను ఉప్పునీరు ఏల?

యోగశాస్త్రంబను యోగ్యశాస్త్రంబుండ

పరయోగములందు పరత ఏల?

ఏనుగెట్టుల తన బలమెరుగలేదొ

అట్టులైనారు భారతీయులును నేడు

ఇంతకన్నను వేరెద్దిఎరుక పరతు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!(258)

తారకాఖ్యాసురు దర్పమణచువేళ

గౌరి తనయుకిడ్డ వీర రక్ష

శంభరాసురవీరు జంపగా జనులేళ

భారవిసుతుకిడ్డ భవ్య రక్ష

మతృ దాసిత్వంబు మాన్పనరగువేళ

వినత పుత్రునకిడ్డ విమల రక్ష

జనకుయానతి పాలింప వనికేగెడిన్​ వేళ

తల్లి రాఘవుకిడ్డ ధన్య రక్ష

అట్టి శ్రీరక్ష ధీరక్ష అంగరక్ష

రక్షలందున దివ్యమౌ రామరక్ష

తోడునీడయై నిన్ను కాపాడు గాక

తనయా! తోడునీడై నిన్ను కాపాడు గాక!(259-240391)

తలుపు తీయునంతలోనె తత్తరమది ఏలనోయి?

తలుపు తీతు కొంతసేపు తాళుము కృష్ణా!

పతి నిద్దురపోవలేదు మది సంశయమొందునేమొ

తలుపు తీతు కొంతసేపు ఆగుము కృష్ణా!(260)

తారకము సూటెరుగవలెనన్నా

సద్గురుని కృపచే తారతమ్యము తరచి కనుమన్నా!

మరపు తెర పడకుండ జాగ్రత నిరతము స్వప్నా సుషుప్తిలో

అరమరలు లేకుండ ఎప్పుడు

తరచుగ జీవాత్మ చదివెడి.   |తారకము|(261)

తుమ్మెదా! ఒకసారి కన్నెత్తి చూడమని

చెప్పవే నా మాట శ్రీకృష్ణునకు

మబ్బు గ్రమ్మిన నాదు మానస వీధిలో

కృష్ణభానుని తేజము నిలుపమనుము

ఎండబారిన నాదు జీవిత వృక్షమునకు

చిగురు పెట్టగ వేగ చేయమనవె

చెదరిపోయన నాదు జీవిత సుమ మాల

చెల్వారగూర్చి ధరియించమనవె.(262-270595)

త్వరపడుమా త్వరపడుమా

ప్రభుసాయీశుని ప్రేమ పిలుపులవి

వినబడుచున్నవి రమ్మనుచు

పరమార్థము చేకొనుమనుచు ||త్వరపడుమా||

యోగసాధనల పనియేలేదట

ఉపదేశంబులు లేవు కదే

ప్రజలకు తరుణోపాయంబగు

శ్రీసాయీశుని నామమటె ||త్వరపడుమా||

మత భేదంబుల మాటే లేదట

మానవ సేవయె జేయునటె

మానుగ బాధలు బాపి భక్తులను

మరువక బ్రోచే సాయియటె ||త్వరపడుమా||(263)

తైతై తైతై తైబొమ్మా!

దీని తమాష చూడర మాయబొమ్మ!

ఖ్యాతిగ దీనికి ముందువెన్కగల

కథ వివరింతును విను జీవా!  ||తై తై||

మాతృగర్భమున మలమూత్రముల

రోతల నీవు రోదింప

ప్రీతిగ వీరలు పేరంటమ్ములు

చేతురిదెంతటి చిత్రమురా!                 ||తై తై||

పుట్టితి మతి కోల్పోయితి దుర్గతి

పుట్టితినని నేనేడువగా

అట్టే నవ్వుచు నానందించెద

రిట్టి వీరు నీకెవరయ్యా? ||తై తై||

మసిలో మట్టిన మలమూత్రములన్​

మసలుచు సిగ్గను మాటయె లేక

పసిపాపడవై ఏడ్చుచు లేచుచు

దినమొక నాటకమాడవకొ. ||తై తై||

తోడి వారలతొ కూడియాడుచు

వేడుకతో పలు విద్యలు నేర్చుచు

చూడచూడగ చోద్యపు కళతో

ఎడేడునకు ఎదిగే బొమ్మా. ||తై తై||

సతియని పతియని సరస భావమున

జత జేరుచు సంసార రంగమున

అతి కౌతుకమున నంతకన్ననిక

అన్యము లేదని ఆడితిరే ||తై తై||

బొమ్మను బొమ్మను పొందు పరచి పలు

బొమ్మలు సేయుర బ్రహ్మయ్య

నమ్ముటవన్నియు నావేయని థిం

థిమ్మని వానితొ నాడుదుగా ||తై తై||

ధనము గూర్చునెడ దాచిపెట్టునెడ

దానిబెంచ నది చనినపుడున్​

తనువుతోడ నీ మనసుతోడ నీ

తాండవమెన్నగ తరమౌనా ||తై తై||

కామము, క్రోథము గట్టి కోలగా

తామసంబు ముకుదాడులుగాగన్​

కామినియున్​ కనకంబు చేతిలో

గంగిరెద్దులై గంతులు వేసే ||తై తై||

సాగుచున్నదని లోగిన వారిని

సంకట పెట్టుట సంతసమా?

ఈగ కాలియంతె వికటించిన

నీ గతి తైతకలే కదా! ||తై తై||

ఉరిమి చూచుచును కరములూచుచును

ఒడలెరుగని శవమొందుచును

అరచుచునెగురుచు అందరు నవ్వగ

ఆగ్రహమను దయ్యము పట్టిన ||తై తై||

చదువెందులకని సంగతి మరచి

ఉదర పూర్తికై ఉరుకులెత్తుచు

ఎదుటి గొప్ప సహింపకేడ్చుచు

సతమతమయ్యే చదువుల బొమ్మా ||తై తై||

గుట్టుగ నీ చెడుకోర్కె చెల్లెనని

లొట్టలు కొట్టకు రోరన్నా

చిట్టా రాసే చిత్రగుప్తు కం

డ్లెటుల గంతలు కట్టుదురా! ||తై తై||

అందము ప్రాయము ఇంద్రియశక్తియు

ఉందని నిక్కకురోరన్నా

ముందున్నదిరా తొందరలోనే

ముసలితనమ్మను ముసుళ్ళ పండుగ ||తై తై||

మసలలేవు కనుమసకలు మోమున

ముడతలు పడె తల నెరిసెనుగా

ముసలి కోతియని పసివారలు నిన్​

ముసిముసి నవ్వగ కసరే బొమ్మా ||తై తై||

చచ్చు దాక సంసార చింతలో

పుచ్చిన లాభము వచ్చేనా!

అచట నీ యమయాతన కడ్డము

వచ్చేదేదిర పిచ్చయ్యా? ||తై తై||

బుఱ్ఱుమనుచు జీవుండను పిట్ట

బుట్టబొమ్మను విడిపోగా

బిఱ్ఱుగ నీల్గిన కఱ్ఱ బొమ్మ యిది

బఱ్ఱున బయటకి పట్టి లాగే ||తై తై||

పంచభూత సంభవమౌ మేనికి

పంచత్వము ప్రాప్తించు కదా!

వంచితుడై నాదంచు దీనికై

వాంఛగొంచు దుఃఖించే జీవా! ||తై తై||

బంధువులందరు వాకిటి దాకను

వల్లకాటికిని వత్తురుగా

బంధమణచి నిను బాయని ఆప

ద్బంధువు భగవన్నామమెరా! ||తై తై||

నమ్ముకొనకు నిత్యమ్మని దేహము

పుట్టి ముంచునది నట్టేటన్​

తుమ్మునంతలో తూలిపోవునీ

తొమ్మిది తొఱ్ఱల తోలుబొమ్మ ||తై తై||

ఆపదలన్​ సౌఖ్యములందున

ఏపుమీరగా ఏడ్చుచు నవ్వుచు

ఆ పరమేశ్వరునానతి మేరకు

ఆడే భోగము తాపా బొమ్మా ||తై తై||

ధర్మకర్మ సూత్రంబులకొని నిన్​

తానాడింపగ దైవంబు

మర్మమెరుంగక మాయేటందువు

మాధవుచేతి కీల్మొమ్మా ||తై తై||

తరతరమును సుస్థిరమనిపించును

పరమావస్థల పాలుచేయుచు

మరునిమిషంబిది మరుగున పడురా

పరమాత్ముడు సల్పిన మాయ బొమ్మ ||తై తై||

చెట్టైపుట్టై చీమైదోమై

చిలుకై కొండచిలువయునై

పుట్టుచు గిట్టుచు కొట్టుకొనుచు

గట్టే వెతకని కర్మజీవా! ||తై తై||

అరుదుగ దొరికెను నరజన్మంబిది

అరనిముసము వృధా పరుపకురా

తెరువు నెరుగు చని పరమాత్ముని గని

చిరసుఖమొందర చింతాజీవా! ||తై తై||

నీ యదృష్టమున సాయికృష్ణుడై

ఆ యఖిలేశుండగుపడురా

హాయిగ సత్యసాయినాత్మలో

అరయుచు నిను నీవే ఎరుగుమురా ||తై తై||

నీటుగ మాటలు కోటి పల్కినా

నీ కడుపింతయు నిండదురా

సూటిగ నాత్మజ్యోతిని కన్ననె

ఆటవిడుపు నీకగునయ్యా ||తై తై||

వ్యర్థంబగు నీ వెఱ్ఱి బఱ్ఱకథ

విని అజ్ఞానము వీడుము జీవా

సార్థక సత్యసాయి బుఱ్ఱకథ

కని ప్రజ్ఞానము గొనరన్నా ||తై తై||

       దక్షిణాంగుష్ఠమిచ్చిన దానజేసి

బాణ సంధాన లాఘవ భంగమయిన

నెఱుకు విలువిద్య కలిమికి హీనుడయ్యె

బార్థునకు మనోరుజయును బాసెనంత.265)

దూషణంబు హింస దూరంబుగానెట్టి

ప్రేమభావమును పెంపుజేసి

సర్వమేకమన్న సద్బుద్ధి కల్గిన

జనులె భూమిని స్వర్గముగ మార్చు.(265-1-25-12-2001)

దుష్టగుణములు వదలిన శిష్ఠుడగును

చింత వదలిన దొరకును చిత్తశుద్ధి

త్యాగగుణమున్న స్వచ్ఛందతత్త్వమబ్బు

మరువబోకుడిటువంటి మంచిమాట(265-3

దాధర్మములేక దయయు సత్యములేక

మానసంబున మంచి నీతిలేక

చెడుగుంబులతో చెలగారుచున్నట్టి

హీనుడు యిలను చెడున పరము చెడును.(265-5-27-07-1996)

దంతములకు మధ్య ఎంతొ నేర్పుగలిగి

నాల్క తిరుగుచుండు నలిగిపోక

నరుడుకూడ అటులె నడచుట మేలయా

మరువబోకుడిటువంటి మంచిమాట(265-6-10-09-1996)

దాధర్మములేక దయయు సత్యములేక

మానత్వంబున మంచి నీతిలేక

దుర్గుణంబులతో చెగారుచున్నట్టి

హీనుడు యిహము చెడును పరము చెడును

చెడుగుణములతో చెలగారుచున్నట్టి

మనుజుడు యిలను చెడును పరము చెడును.(265-8-07-01-1988)

దానముగాని యజ్ఞసముదాయముగాని

గానముగాని తపంబుగాని విజ్ఞానముగాని

తేజిత సత్యసంధాముగాని మరి యేదైనన్​

దమంబుకు పురుడు రాదు విచారించి చూచినన్​

చర్చించి చూచినన్​ శోధించి చూచినన్​. (265-9-04-11-1993)

దానముగాని యజ్ఞసముదాయముగాని

గానముగాని తపంబుగాని విజ్ఞానముగాని

తేజిత సత్యసంధాముగాని మరి యేదైనన్​

మతృప్రేమకు సాటిరాదు విచారించి చూచినన్​ (265-10-

దానధర్మము లేక దయయు సత్యము లేక

మానసమున మంచి నీతి లేక

చెడుగుణములతోడ చెలగాడుచున్నట్టి

వానికిహము చెడును పరము చెడును.

దీన శుభము లేదు దివ్యకీర్తియు లేదు

జగతి బుట్టిపుట్టి చచ్చిచచ్చి

పొరలనేల మరల బుట్టని చావని

త్రోవ వెదకికొనుట దొడ్డబుద్ది.(

దోషచింతనమున దోషియౌ చిత్తంబు

సద్గుణంపు చింత శాంతి నిచ్చు

దైవచింతనమున దైవంబె యగునయా

ఉన్నమాట తెలుపుచున్న మాట.(266-020484)

దుర్గుణంబులు సవరించి తొడరుటకును

సాధు సంరక్షణమ్ము సల్పుటకును

గర్భ దుఃఖ మొకింతయు కాంచకుండ

పుట్టుచుండును స్వేచ్ఛగా పుడమి సాయి.

దుష్టసంకల్పములచేత దుఃఖితుడగును

సత్యసంకల్పముచేత సాధువగును

సకలసంకల్పశూన్యుడే శాంతినొందు

సత్యమును తెల్పు బాట శ్రీసాయి మాట.

దుష్టగుణములు వదలిన శిష్ఠుడగును

చింత వదలిన దొరకును చిత్తశుద్ధి

త్యాగ గుణమున్న స్వచ్ఛంద తత్వమబ్బు

మరువగాబోకుడిటువంటి మంచిమాట.(265-3-)

దూషణంబు హింస దూరంబుగానెట్టి

దైవచింత తాను దండిపరచి

ప్రిమతోడ తాను ప్రజలను చూచిన

దైవప్రేమ తనకె దండి ఉండు.

దూషణములనెల్ల దూరంబుగానెట్టి

ప్రేమభావములను పెంపుచేసి

సర్వమేకమన్న సద్బుద్ధి కలిగిన

జనులవలన భూమి స్వర్గమగును.(265-1-251201)

దేవదేవుని సేవకే దేహమమరె

కనుక దేవుని దాసుడై మనగ వలయు

విషయ దాసులు కాకుడు వసుధలోన

సత్యమునుజూపు మాట శ్రీసాయి మాట.(267)

దేవ సేవకుండు దేశనాయకుడైన

స్వార్థ రహిత సేవ సలుప గలడు

పదవి కాంక్షవాడు పరశుద్ధ హృదయుడ

ఉన్నమాట తెలుపుచున్న మాట.(268)

దేవుడనగ వేరు దేశమున లేడు

దేవుడనగ తనదు దేహమందె

పపమనగ వేరు పరదేశమున లేదు

తానుచేయు పనుల తగిలియుండు (269-1-

దేవుడన్నమాట తెలియునందరికి

మాట తలిసినంత మూటయేమి

దేవుడన్నయట్టి ధన్యుని పూజించి

దేవుడన్నమాట తెలియరయ్య (269-2-17-07-1981)

దేవునెరుగునట్టి తెలివి ఒక్కటె చాలు

తత్తరంపు తెలివి తట్టెడేల?

దేవునెరుగనట్టి తెలివేమి తెలివయా?

ఉదర పోషణ కొరకు వట్టి తెలివి.(269-3-240783)

దేవుడెక్కడనుచు దేవులాడగనేల!

హృదయమందు లేడె ఈశ్వరుండు

ఇచ్చుకొనుము సేవ పుచ్చుకొనుము ప్రేమ

అటులచేసి ఆత్మతత్త్వమనుభవించు.(267-1-220896)

దేవుడన్నమాట తెలియునందరికిని

మాట తెలిసినంత మూటయేమి!

దేవు పొందునట్టి దివ్యగుణములు లేక

దేవునెట్లు మీరు చూడగలరు!269-2-170781)

దేహభ్రాంతి లేని మోహమింతయు లేని

త్యాగనిరతులైన యోగివరులు

గురులు నాడు నేడు గురువులట్టివారలె

సత్యమైన బాట సాయి మాట.269-111002)

దేహమునిచ్చినదెందుకొ తెలుసా

దేశములన్నీ చుట్టుటకా! కాదు కాదు

పరోపకారమిదం శరీరమను పదము

ఆచరణలో నుంచుటకు.(270)

దైవభావంబు హృదయాన తలపనీక

రెండు దోషాలు వెంటాడుచుండు నరుని

తనదు లక్షల దోషాలు దాచుకొనుచు

పరుల దోషంపు నలుసును బయట పెట్టు.(271-250493)

ధనము వచ్చును పోవును ధరణియందు

నీతి ధర్మాలు నిలుచును నిజమగాను

నీతి ధర్మాలు హృదయాన నిలుపుకొన్న

సార్థకంబగు మానవ జన్మ భువిని.(272)

ధనమెచ్చిన మదమెచ్చును

మదమెచ్చిన దుర్గుణములు మానక హెచ్చున్​

ధనముడిగిన మదముడుగును

మదముడిగిన దుర్గుణములు మానును వేమా!(273)

దేహము పాంచభౌతికము దేహము కూలక తప్పదెప్పుడున్​

దేహి నిరామయుండు గణుతింపగ దేహికి చావుపుట్టుకల్​

మోహనిబంధ బంధనల ముద్రలు లేవు నిజంబుజూడ యా

దేహియె దేవదేవుడు మదిన్​ గణుతింపగ ఆత్మరూపుడౌ!(274-081081)

దేహంబు క్షీణించు దినమెవ్వరెరుగరు

కష్టంబులొచ్చుట గాంచలేరు

జగతిపైనెవరైన జన్మించుటెరుగరు

దివి భువి సుఖములన్​ దెలియలేరు

మాయ లోపల చిక్కి మమత వీడగజాల

రించుక తమ మర్మమెరుగలేరు

మానవ ధర్మంబు మాటయే మరతురు

దేనినొనర్తురో తెలియలేరు

ఇన్ని తీరులు కూడ దైవేచ్ఛగాన

దీన వత్సలుడతని ప్రార్థింతురేని

సృష్టి చిత్రంబులెంత విచిత్రమైన

భక్తిశక్తియు ముక్తియు బాబ యిచ్చు.(275)

ధనధాన్యములును ధర్మగుణంబున్న

సంతతి లేదను చింతయుండు

విద్యాధికారియై విఱ్ఱవీగుచు నున్న

ఉద్యోగములు లేక వెతలనొందు

దైవభక్తి కలిగి ధర్మగుణంబున్న

ధనము లేదని యెంతొ తల్లడిల్లు

కుడువంగ లేకను అల్లాడుచున్నట్టి

నిరుపేదకెందరో బిడ్డలుంద్రు

సంపదలుండియు సంతోషమున్నను

లోపల పెద్దగ లోభముండు(276)

ధనమున్నదని పెద్దలను జెన్కనగుగాని

పుడమి నద్దానిచే ముక్తి రాదు

బలమున్నదని మిట్టి పడవచ్చునేగాని

పుడమి నద్దానిచే ముక్తి రాదు

విద్వాంసుడని పెద్ద బిరుదొందనగుగాని

పుడమి నద్దానిచే ముక్తి రాదు

భక్తి సంపాదనముచే ముక్తి కలుగు

రామ భక్తులు కాకున్న రాదు ముక్తి

శాశ్వతముగావు మిగతవి సత్యముగను

భక్తియేయున్న నీ సాయి సర్వమొసగు.(277)

ధనము ధారగ పోయ దరికాని

ఆనందమును మీరలందుకొనుడి

తీర్థయాత్రలనెన్నొ తరిగినన్​ కనరాని

ఆనందమును మీరలందుకొనుడి

విద్యలన్నియున్​ వల్లెవేసినన్​ కనరాని

ఆనందమును మీరలందుకొనుడి

ప్రాణముల్​ బిగపట్టి పరుమార్లు కనరాని

ఆనందమును మీరలందుకొనుడి

కాసు ఖర్చు లేదు కాయకష్టము లేదు

లేదు చదువు సాధనాది బాధ

మనసొకింత యిచ్చి మరి సాయికడనుండి

అందరాని ఫలము పొందరయ్య.(278-251284)

ధనము దైవంబయ్యె దర్పంబె మతమయ్యె

స్వార్థమే బుద్ధికి స్థానమయ్యె

అహము ఫ్యాషను అయ్యె ఆశలందంబయ్యె

ధర్మంబు వమ్మయ్యె ధాత్రిలోన

దయయు హీనంబయ్యె నయము శూన్యంబయ్యె

కపటమే జీవుల కాంతులయ్యె

ప్రేమానురాగముల్​ రోగాల పాలాయె

కామాంధులుగ జేసె కలిని చదువు

బ్రతుకు బరువయ్యె మతులకు గతులు తప్పె

జాగుచేసిన నేగతి జగతి కానో!

విద్య యందున నైతిక విలువ జేర్చి

భరత సంస్కృతిని మీరు బడయరయ్య.(279-221183)

దినకరుడు శాంతుడై తోచె దినములింక

కురచనయ్యె చలిగాలి చురుకు హెచ్చె

పొలములన్​ రేయి గ్రుడ్డి వెన్నెలలోన

కుప్పలన్​ నూర్పు కాపులు గొంతులెత్తి

పదములన్​ పాడదొడగిరి పచ్చపూలు

జనపచేలకు ముత్యాల సరులుగూర్చె

మిరప పండ్లకు కుంకుమ మెరుపుదాల్చి

బంతిపువ్వుల మొగములల్లంత విప్పి

మన గృహంబుల ధాన్యసంపదలు నిల్పి

సరసురాలైన పుష్యమాసంబునందు

పరగనొప్పుచు సంక్రాంతి పండుగొచ్చె.(280-140103)

దుర్బుద్ధులు తలనున్న దూరులు విను చెవులున్న

పొంచి చూచుకనులున్న పంచల విను మనసున్న

వంచన గుణ చిత్తమున్న వంచించే పలుకున్న

ఈ వికృతులు చూడగనే న్యాయమింక బ్రతుకదన్నా

ఏ గుణంబును హృదయంబున నిలువదన్నా.(281-230590)

దేహమందు జీవుడుండు హృదయమందు దేవుడుండు

రెండుకూడియాటలాడి ఒకరినొరు వీడుచుంద్రు

బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకడు కలడు

ఒకటిలోనె రెండునుండు రెండు చేరి ఒకటియగును.(282-231183)

దయచేత ధన్యులు కావలెరా ఎంతటివారు    ||దయ||

అసురుడైన భూసురుడైన అఖండ తెలివిగలవాడైన    ||దయ||

విద్య నేర్చి వాదాడినగాని పద్యములెంతో పాడినగాని

కొండగుహలలో నుండినగాని కూర్చుని జపములు చేసినగాని    ||దయ||

యోగాభ్యాసము చేసినగాని భాగవతాదులు చదివినగాని

బాగుగ గెడ్డము పెంచినగాని పట్టెనామములు పెట్టినగాని            ||దయ||

ముక్కుమూసి జపమాచరించిన మొక్కుచు బాగా నిలచియుండిన

వెక్కివెక్కి ఏడ్చినగాని మొరలిడినను నీకు కరుగదు మనసు    ||దయ||

కాషాయ వస్త్రము వేసినగాని కంఠమాల ధరియించినగాని

గడగడమని జపమాల తిప్పిన కడకు నీయొద్దకు రావలె బాబా      ||దయ||

భక్తితో మిమ్ము గొలిచినగాని పుట్టపర్తికే వచ్చినగాని

పూజలు బాగా చేసినగాని పుడమియంతయును తిరిగినగాని    ||దయ||(283-)

దైవనామమను మిఠాయి యిదిగో రండి భక్తులార!

వేదసారమను గోధుమ పిండితో

వేదవాక్యమను క్షీరము పోసి

ఆధారమైన పెద్ద బాండువ తీసి

ఆదిమునులు దీనిని బాగుగ కలిపిరి. ||దైవ||

భక్తియను ఖండచక్కెర తెచ్చి

సుబుద్ధియను ఆవునేయి పోసి

అబద్ధమనియెడి మలినము తీసి

ఆదిమునులు దీనిని బాగుగ పంచిరి. ||దైవ||

రకరకమైనది దైవ ప్రసాదము

సకల రోగ నివారణమోయి

ఒక కాసైనను ఖర్ఛు లోదోయి

తకరార్​ చేయక పంచుకోండోయి. ||దైవ||(284-191088)

దేవుని మరువకురా ఉన్నది దేవుడు ఒక్కడురా

హెచ్చుగ సంపదలొచ్చినగాని

ఏనుగు గుఱ్ఱములెక్కినగాని

పిచ్చోడని పేరొచ్చినగాని ||దేవుని||

దుష్టజనులు దూషించినగాని

కష్టములొచ్చినగాని (283-1-14-01-1982)

దొరికె దొరికె ‘బాలభాస్కర’ బాలకులార! రండి బాలకులారా!

కడుపుబ్బరము, కాళ్ళవాపులు, చేతిమోదలను చెడుగులనుండి

అజాగరూక పోషణనుండి అజీర్ణవిరేచనములనుండి

అన్నిటికీ ఇది బాగవునండీ, బాలకులార! రండి బాలకులార!

అది ఎక్కడ అని అడిగేరన్నా, అదిగదిగో కొట్టె సుబ్బన్న

అంగడియందే దొరకును అన్నా, పండిత శ్రీగోపాలాచార్యుల టానిక్కన్నా…(283-2)

నగలు పెట్టిన కోతికి సొగసు రాదు

కన్ను విప్పిన అంధుడు కనగలేడు

భక్తి కలుగదు మూర్ఖునకు యుక్తిచేత

ఉన్నమాట తెలుపుచున్నమాట (25-12-1988)

నగలు పెట్టిన కోతికి సోగసు రాదు

కనులు విప్పిన అంధుడు కనగలేడు

భక్తి పొందడు మూర్ఖుడు యుక్తి చేత

ఉన్నమాట తెలుపుచున్న మాట.(285-1-251288)

నమ్మకమను రెండు నయనంబులే లేని

అంధులైరి మనుజులవనియందు

తాము చూడకున్న దైవంబు లేడకొ

తనకు లేడుగాని మనకు లేడ!(285-070796)

నమ్మక చెడిన వారలున్నారుకాని

నమ్మి చెడిన వారేనాడు లేరటంచు

బుధుల వాక్కును మీరాలకించుడోయి

సంశమును వీడి సాయిని చెరరోయి.

నమ్మి కొల్వ రాయి నారాయణుండౌను

నమ్మకున్న వట్టి దిమ్మె సుమ్మి

నమ్మి చెడినవారు నరులయందున లేరు

ఉన్న మాట తెలుపుచున్న మాట.(286-190189)

నదిని దాటు వరకు నావ యవసరంబు

దివ్యపదము చేర దేహమట్లు

అవసరంబుగాన ఆరోగ్యమందుడీ

మలినమైన తిండి మానరయ్య.

నరుని జీవితంబు నల్లుల మంచము

పుడమినొడలు రోగమొడవు కొంప

సంతసమును చూడ ఎంత దూరమొ కదా

ఉన్న మట తెలుపుచున్న మాట.287-290896

నీటియందె పుట్టి నీటనే తేలుచు

నీటియందడంగు నీటి బుడగ

నరుడు బుద్బుదంబు నారాయణుడు నీరు

ఉన్న మాట తెలుపుచున్న మాట.(288-231188)

నీటియందె పుట్టి నీటియందె జీవించి

జలమునందె చేప మరణమొందు

జలముకంటె పాలు గొప్పవైనప్పుడు

పాలయందు చేప ప్రాణము విడుచు(288-1

నీటియందు పడవ నిలచియుండుట మేలు

నీరు పడవయందు నిలువ కీడు

జగములోన నిలచి జనులుండుటయే మేలు

జగము మదిని నిలువ జనము చెడును.(289-300884)

నీతినియమాలు నరునకు ఖ్యాతిగూర్చు

బాల్య దశయందె యియ్యవి పట్టుబడును

ఇట్టి రీతుల తెలిపెడినట్టి జనుల

నెంచి అధ్యాపకులనొనరించరయ్య.(290)

నీతినియమాలు నరునకు ఖ్యాతినిచ్చు

బాల్మందున యవియన్ని పట్టుబడును

నీతిబోధలు చేసెడి నిజగురువు

ఆత్మయె బ్రహ్మము బ్రహ్మయె ఆత్మయు.(290-1-03-11-1993)

నీతి బోధలెన్నొ నిజముగా తెలిపిన

పట్టుపడవు మదిని పామరులకు

మునగబెండు నీళ్ళముంచినా మునగదు

విడవగానె పైకి వెడలి వచ్చు.(291)

నీతినియమాలు గ్రంధాన నిలచిపోయె

హృదయమంతయు దుర్గంధ సదనమయ్యె

చేతలంతయు స్వార్థంపు చేతలయ్యె

ఇదియె ప్రోగ్గ్రెస్సు ఈనాటి విద్యలందు(292-280591).

నీతినియమములేక తిరిగిన

ధాతకైన అ జ్ఞానముడుగదు

జ్యోతి లేనిది అంధకారము

భూతలంబున బాయదెందును (292-1

నీతినియమాలు లేక తిరిగిన

ధాతకైన అజ్ఞానముడుగునో

ఝ్యెాతి లేనిదె అంధకారము

భూతలంబున బాయకుండు.(

నీలో నాలో నిజమొక విష్ణువె

ఓపికలేనీ కోపము వ్యర్థము

ఎల్లెడ సమమై ఉల్లంబుంటే

అపుడె అనుభవమగు విష్ణుత్వము.(293-250573))

 నేటి విద్యార్థులార నా మాట వినుడు

 పరుష భాషయు దుష్టమౌ పనులు చేయ

వదలవయ్యవి మనపైన వచ్చు పిదప

సత్యమును జూపు బాట ఈ సాయి మాట.(294)

నేటి విద్యార్థులార! నా మాట వినుడి

పరుషవాక్యము ఎప్పుడు పలుకకు

పరుషవాక్యములు హానియగును

రూమురూముకు పోవుట రోగమగును

విద్యార్థి జీవితము లైటు కావలయును (294-1-15-08-1996)

నేటి విద్య తెలివితేటలనే పెంచు

కొంచెమైన గుణము పెంచబోదు

కోటి విద్యలుండి గుణము లేకున్నచో

అట్టి విద్య కన్న మట్టి మిన్న.(295-1-260696)

నేటి విద్యలెల్ల నిధి సేకరణకౌను

పూర్వ విద్యలన్ని పూజ్యమయ్యె

పక్షి పల్కులిడదె బహువిధ బోధలన్​

సత్యమైన బాట  సాయి మాట.(296)

నేటి విద్యార్థులందున నూటికొకరు

పాఠ్యగ్రంధాలు చదువంగ పాటు పడరు

పాసు కావలెనంచును పరితపింత్రు

బూటకంబుగ మారెను నేటి విద్య.(297-220592)

నేను నేనుగా ఉన్నంత నీవుగావు

నీవునీవుగా ఉన్నంత నేనుగాను

నీకునాకును యిందులో నెలవు లేదు

ఉన్నదొక్కటె హృదయంబు ఎన్నగాను.(298-231188)

నేను నేనున్నదానిలో లేనునేను

జీవునీవున్న దానిలో లేనునేను

నీవునేనును ఏకమై నిలచియున్న

అట్టి సర్వంబు ఉండునక్కడ (298-1-12-08-1989)

నేను దైవంబు తద్భిన్నమేమికాదు

ఆ అఖండపరబ్రహ్మమౌదు నేను

వ్యధాక్లేశములు నన్ను స్ఫురింపబోవు

సచ్చిదానందము తద్భన్నమేమికాదు

నిత్యతృప్తుడను నేను భీతి ననచేరబోదు

ఉల్లమా పల్కు తత్​సత్​ఓమ్​ అటంచు(298-2-23-11-1982)

నేను వెలుగులోనున్నాను నేనెవెలుగు

వెలుగు నాలోన ఉన్నది వెలుగు నేనె

అనుచు తలచుచు చిత్తాన హత్తుకొన్న

అట్టి జ్ఞానియె బ్రహ్మలో ఐక్యమగును.(299-241187)

నేను సాయిని తెలియుము నిక్కముగను

మమత బాయుము యత్నముల్​ మానుకొనుము

బాసె మీకు నాతోడి సంబంధమింక

కాదు నన్పట్ట మరి యెట్టి ఘనునికైన.(299-1-201190)

నో అను వారికి నో అనురా

ఎస్సనువారికి ఎస్సనురా

నో యస్సులు మన నోటికి గాని

సాయికి సర్వము ఎస్​ ఎస్​ ఎస్​.(300-140785)

నల్లనివాడు పద్మనయంబులవాడు కృపారసంబు పై

జల్లెడువాడు మౌళిపరిసర్పిత పింఛమువాడు నవ్వురా

జిల్లెడు మొమువాడొకడు చెల్వల మానధనంబు దోచెనో

మల్లియలార! మీ పొదల మాటున లేడుగదమ్మ చెప్పరే!(301-190186)

నిద్దురనుండి లేచి మరి నిద్దుర పోయెడుదాక పొట్టకై

హద్దును పద్దు లేక వ్యయమందగ జేయుచు జీవితంబు నీ

విద్దెల ధారపోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ

పద్ద సుఖంబు నొందితివొ ప్రీతిగ యోచనచేయు మానవా!(302-2-220801)

నవనవోజ్వల శిల్పనైపుణ్య ధోరణి

తనరారు లలిత సౌందర్యరాశి

శిల్పకళా పరిచిత్రితంబగు వర్ణ

దీపికల్​ చిందెడి దివ్యకీర్తి

కోటి శిల్పుల తోడ కొంగుబంగారైన

భవ్యదివ్య స్ఫూర్తి ప్రాభవంబు

ప్రాచీన మందిర వాస్తుశాస్త్రస్ఫూర్తి

భూనభో వ్యాప్తి సమర్చితంబు

శుభముహూర్తాన మంగళసూచకముగ

తరలి భారతదేశ ప్రధానమంత్రి

విశ్వకళ్యాణ భవనమావిష్కరించె

సర్వజన మాన్య నరసింహ సార్వభౌమ!(303-290892)

నా రాక ఎరిగినంతనె వేగ రమ్మని

ద్వారపాలకునిచే ఆజ్ఞనంపె

నను చూచినంతనె దిగ్గున గద్దె దిగి

నగుమోముతో నన్ను నండజేర్చె

నను చూచి మోము వాచినయటుల

ఎగదిగా చూచి కౌగిటం బిగుచికొనియె

దేవి! ఏమందు నాతని దీనపరత

పేదకుచేలునటుకులు పిడికెడు తిని

బహుళభాగ్యంబు నందించు వారు కలర!

ప్రేమయే ఆతడాతడే ప్రేమయగును.(304-190696)

నారాయణుని బోధ నమ్మియుండిన చాలు

సామవేదము మీరు చదివినట్లె

నారాయణుని వాక్కు నమ్మియుండిన చాలు

ఇల యజుర్వేదము తెలిసినట్లె

నారాయణుని వాక్కు నమ్మియుండిన చాలు

పుడమి ఋగ్వేదము నుడివినట్లె

నారాయణుని వాక్కు నమ్మియుండిన చాలు

సరి అథర్వణమును చదివినట్లె

తుచ్ఛభావాలు మదిలోన తొలగియున్న

నిశ్చలంబుగ బుద్ధి నిలుపుకొన్న

ఇంతకన్నను శివరాత్రి ఏమికలదు?

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!(305-1990)

నిరత సత్యఫ్రౌడి ధరణినేలిన హరి

శ్చంద్రుడీ ధరబాసి చనగలేదె

ఎల్ల లోకములేలె ఎసగ శ్రీనలరాజు

తనవెంట భూమిని గొనుచు చనెనె

కృతయుగంబును నలంకృతి చేయు మాంథాత

సిరి మూటగట్టుక అరగినాడె

జలధి సేతువుగట్టె అలనాడు శ్రీరాము

డుర్విపై నిప్పుడు ఉన్నవాడె

ఎందరెందరు రాజులు ఏగినారొ

ఒక్కరును వెంటగొనిపోరు నుర్వితలము

నీవు మాత్రము రాజ్యంబు భోగములను

తలను కట్టుక పోదువా ధర్మహృదయ!(306-1-090283)

నీ కతంబునకాదె నిలువ నీడయు లేక

మన తల్లి పరునింట మసల వలసె

నీ మూలమునగాదె నిండైన సభలోన

మన కాంత దుఃఖించె మానమడసి

నీ కతంబున కాదె నా ముద్దు కొమరుడు

లేవయస్సున ధాత్రి లీనమయ్యె

నీ మాట విని కదా నిన్నమొన్నటిదాక

పడరాని యిక్కట్లు పడగ వలసె

అనుగు తమ్ములనెంతేని అలయజేసి

భరతకుల గౌరవమ్మును భంగ పరచి

ధనకనకవాహనములను ధారపోసి

ఎట్లు భరియించియున్నాడవిపుడు నీవు?(307)

నిగమాలు హరియించి నిండు దూషణ చేసి

సోమకాసురుడేమి సుఖమునొందె?

పరసతినాశించి పదితలల్వాడేమి

కట్టుకు పోయెను గట్టిగాను?

ఇల సూదిమొనయంత ఈయజాలనటన్న

దుర్యోధనుండేమి దోచుకొనియె?

పసిపాపలనుకూడ కసిపట్టి చంపిన

కంసుడేపాటి ప్రాణంబు కాచుకొనియె?

నేటి దుర్మార్గులకు కూడ నిదియె గతియు

నేడు కాకున్న రేపైన నిలువరిచట

పెట్టుకొనబోకు ఏ ఆశ పెద్దగాను

మితము కలగియుండుటే మేలు నీకు (308-88)

నరహరిని నమ్మక నరులను నమ్మితే

నరజన్మమీడేర తరమె మనసా?

నీళ్ళుండగా ఉమ్మినీళ్ళను మింగితే

దాహము తీరునా ధరను మనసా?

చెరకుండగా వెఱ్ఱిచెరకును నమిలితే

రుచి ఎట్లు జిహ్వకు శుచిగ మనసా?

కాళ్ళుండ మోకాళ్ళ కాశికి నడిచితే

చేరంగ సాధ్యమా చెప్పు మనసా?(309)

నరరాక్షసులు చేరి పురవీధుల తరుమ

బాధలెన్ని పడిరో బలరామ కృష్ణులు

పసికందులగు మీపై కంసభూపాలుండు

మదగజంబు వదల మనసెట్టులొప్పెనో?

కన్ననాటి మొదలు కష్టాల్​ పాల్జేసి

కంటితోజూడు మా కర్మ ఫలమదేమొ!(310-190673)

నవ్వుచు నవ్వుచు జీవితంబను నది దాటెడువారు

ఏడ్చిఏడ్చి తేలిమునుగుచు ఈతరాని వారినిజూచి

జాలి తలచక లోతెంతయని అడుగువారలు నరులేనా?311-181175)

నిను కనుగొనగలమా కృష్ణా! నిను కనుగొనగలమా!

అణువుకంటె అతి సూక్ష్మరూపుడవు

ఘనముకంటె అతి ఘననీయుడవు

ఎనుబదినాలుగు లక్షల జీవముల

అనయమ్మును నెడబాయకుందువట

అణురేణు తృణకాష్టము మొదలుగ

అఖండ రూపుడవై వెలయుచుందువట

ఘనమగు దొంగలలో గజదొంగవు

నిను కనుగొనగలమా కృష్ణా! (312)

నేనునీవాయెను నీవునేనాయను

నీవునేనుకూడి నిజబోధలాయె

నీవునేనుకూడి నిజబోధ సల్పితే

మానాభిమానలు మరియు లేవాయె

క్షరమునేనౌదు అక్షరమునేనౌదు

క్షరమక్షరములుకూడి శాశ్వత వెలిగితె

అమనస్కందమౌను అంతతానౌను

మాయెకులోనౌచు మాయకుతానౌచు

మాయ యిరువదిగీదు మర్మములగును

మాయ యిరువదియైదు మర్మము తెలిసితే

మాయమాయమాయ మరిబలవును

రామాసీతారామా (312-1-09-06-1973)

నిలువ నీడలేని బ్రతుకు నీకొరకని మోయుదాన కృష్ణా!

నిలువదురా నా మనసు నీ నగవులు దూరమైన

కలలో నా కనులకు కానగరాదా కృష్ణా!

నిన్ను విడచి నిలువ లేనురా కానగరారా కృష్ణా!

కనుపాపవు మాటకు పసిపాపవు మనసుకు

నిను విడచి అరనిముషము నిలువగలేరా కృష్ణా!(313)

నీలాల సౌధాల్లొ నీ ఆశ గాథలలో

నా మనో వేదనలొ నా హృదయ రోదనలొ

ఉండేది కృష్ణుడే ఊరకుండేది కృష్ణుడే

మదిలోని భావాల్లో కదలేటి కోరికలలో

తీయని ఊహలలో తూగుటుయ్యాలలో

ఉండేది కృష్ణుడే ఊపుచుండేది కృష్ణుడే

తలచేటి తలపులలో వలచేటి వలపులలో

పిలిచేటి పిలుపులలో కలలు కనే కనులలో

ఉండేది కృష్ణుడే ఊ కొట్టుచుండేది కృష్ణుడే!

నావాడనేననుచు నాదాన నీవనుచు

దరిచేరి దూరమగుచు ఉండేది కృష్ణుడే

దూరమగుచుండేది కృష్ణుడే!(314-070985)

నీవు బాలవే కద గౌరమ్మా

సాంబశివుడు ముసలివాడమ్మా

తలనిండా జడలవాడమ్మా

తాను కట్టింది పులిచర్మమమ్మా

ఎద్దు వాహనమెక్కుతాడు

ఏ ప్రొద్దూ తిరుగుచుండువాడు

పుట్టలోని పాములు చుట్టుకున్నాడమ్మా

గుట్టు తెలియక నీవెట్లు వరించితివి?(314-1)

పక్వఫలము వృక్షమునుండి పడిన భంగి

జ్ఞాని కడతేరు కర్మశేషంబు వీడి

సంచితానికి వడ్డీని పెంచుకొనుచు

పాపి వర్థిల్లు దినదిన ప్రాభవమున.(315)

పగటి దృశ్యంబు స్వప్నాన పారిపోవు

స్వప్న దృశ్యంబు పగటిలో వాలిపోవు

పగలు రేకలలందున పరిణమించు

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు.(316)

పచ్చకప్రపు మడిలోన పాదుచేసి

కమ్మ కస్తూరి ఎరువుగా కుమ్మరించి

మంచి పన్నీరు పోయుచు పెంచిరేని

ఉజ్జగించునె తన కంపు ఉల్లిపాయ.(317-010996)

పతుల మాటకు ఎదురు చెప్పంగబోదు

వారి సేవలు చేయగా తీరదనదు

తనకునున్నట్టి దానితో తృప్తిగనును

ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.(318-090796)

పత్రమో పుష్పమో ఫలమో తోయమో

భక్తి కలిగినవానికి వశుడవగుట

సత్యమేని జీవు ఈ తులసీ

దళమునకు తూగదువుగాక! (318-1-30-06-1996)

పనులయందలి పాపపుణ్యముల బట్టి

అనుభవముదీర జీవులునవని బుట్టె

కనుక సత్కార్యములు చేయగల్గిరేని

దైవమే తోడుగానుండు ధరణియందు. (319)

పర్వతశ్రేష్ఠి పుత్రిక పతి విరోధి

అన్న పెండ్లాము అత్తనుగన్న తండ్రి

ప్రేమమీరంగ నాతని పెద్ద బిడ్డ

సున్నమిప్పుడు తేగదే సన్నుతాంగి.(320-250689)

పరుగు జీవితములె పరిపాటి కలిలోన

పరుగులిడకయున్న పనులు చెడును

బస్సులు సినిమాలు పరుగులకే చిక్కు

ఉన్నమాట తెలుపుచున్న మాట.(321-170788)

పరుల దూరుచున్న పాప ఫలంబబ్బు

విడవదెన్నటికిని విశ్వమందు

పరులు పరులు కాదు పరమాత్ముడేయగు

ఉన్నమాట తెలుపుచున్న మాట.(322-080387)

పరులు దూషింప నీవునూ వారివలెనే

తిరిగి దూషింప నీదు ఆధిక్యతేమి?

ఏది తప్పని నీవు ఎరిగినావో

దాని చేయక యుండుటే ధర్మపథము.

పరులు నిందజేయ బాధలు పడవద్దు

నిన్ను పరులు పొగడ నీల్గ వద్దు

కలిమి లేకయున్న ఖేదమొందగ వద్దు

ఉన్నదొకడే నీకు కన్న తండ్రి.(323)

పరులను నిందింప ఒప్పుకుందురుగాని

తనను తానిందింప తలచబోరు

వేరు రూపము చూచి వెక్కిరింతురుగాని

తన రూపు చూచి తలువబోడు(323-1-

ఇతరుల మాటలను హేళనచేయుదురు

తన మాట తప్పును తలచబోరు

పుట్టినప్పుడె ఈ బుత్ధీ పట్టుబడియె

ఇంతకన్నను పాపమింకొకటి కలద! 14-01-1990

 పలికి బొంకని వాడె పో పండితుండు

ఆడి తప్పని మనుజుండె అర్చకుండు

ఆశ వదలిన వాడె పో ఆత్మబలుడు

సత్యమును తెల్పు మాట ఈ సాయి మాట.(324-140188)

పలికెడిది భాగవతమట

పలికించెడి వాడు రామభద్రుండట నే

పలికిన భవహరమగునట

పలికెద వేరొండు గాథ పలుకగ నేలా!(325-190689)

పలు మతముల వారిచ్చట

నలుమూలలనుండి వచ్చి నయభయములతో

కలిమియు లేమిని తలపక

పలు బాధలకోర్చియుంద్రు బాబా కొరకై.(326-251087)

పక్షి బలమున ఎగిరెడు పక్షులట్లు

అది విహగ మార్గంబుననుసరించి

చేరవలయును గమ్యంబు శీఘ్రగతిని

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు.(

ప్రళయనిర్ఘాతమరచేత పట్టవచ్చు

హేమశైలంబు కొనవ్రేలనెత్త వచ్చు

దివిని భువిని రెండిటిని సంధింప వచ్చు

ధర హరిశ్చంద్రు బొకింప తరము కాదు.(327)

పాడుము గీతానామ సహస్రము

భావింపుము భగవంతుని రూపము

సజ్జన సాంగత్యమునెప్పుడు సలుపుము

దీనజనులకై చేయుము దానము.(328)

పాప కర్మ నరుడు ఓపికతో చేయు

పాప ఫలము కుడువ నోపకుండు

పుణ్యకర్మ వీడు బుద్ధిపూర్వకముగ

పుణ్యఫలము విడువబోవడెపుడు.(329)

పాపభీతి లేని పామరత్వముబట్టి

దైవప్రీతి లేనిదారి పట్టి

మావత్వమణగె మానవులందున

విశ్వశాంతికిదియె విప్లవంబు.(330-300896)

పాపపుణ్యములన పరదేశమున లేవు

తాను చేయు పనుల దగిలియుండు

వేపవిత్తు నాట వెలగవృక్షము కాదు

కర్మ ఫలము వలన కలుగు జన్మ.(331-280984)

పాలు చిలికిన వెన్ననుబడయవచ్చు

నీరు చిలికిన తప్పక నిప్పు వచ్చు

పనికిమాలిన మాటల విలువ సున్న

మరువబోకుడిటువంటి మంచి మాట.(332)

ప్రాణాయామము ప్రత్యాహారము

నిత్యానిత్య వివేక విచారము

మంత్రము తోడ సమాధి నిధానము

జాగ్రత్తగ నిశ్చలముగ చేయుము.(333-260573)

పిలచి అడుగ చెఱకు చిట్టునా బెల్లంబు

పిప్పిగొట్టి రసము పీల్చకున్న

జాతివజ్రమునైన సానబట్టగవలయు

గురువు తీర్చకున్న గుణము సున్న(333-1

ప్రాణికోటికి నెవ్వాడు ప్రియతముండు?

సత్యమణకువ మధుర భాషాభియుతుడు

అంధుడగువాడెవ్వడీ అవనియందు?

చదువుకల్గియు చెడును సలుపువాడు.(334-260689)

ఫిల్మురికార్డింగు ప్లేటును చూచిన

ఒక్కరీతిగానె ఒనరియుండు

సౌండుబాక్సునందు సవరించి చూచిన

పాటలెన్నొ అందు పలుకుచుండు.(335-250896)

పుట్టినప్పుడమృత పుత్రులైయుంటిరి

వెండి చేరె లోక విషయమెల్ల

విషయవాంఛ చేత విషతుల్యులైతిరి

సకల శ్రుతుల ఊట సాయిమాట.(336-030996)

పుట్టపై మర్దించిన పాము మరణమొందునా

తనువును తా దండించిన విషయభోగములడగునా

తానెవరో తెలియకున్న తత్త్వజ్ఞానియెట్లగు!(336-1-

పుడమి, కన్నతల్లి పూజనీయులు కదా!

వారి మించువారు వసుధ లేరు

కన్న తల్లి సేవకన్న మించినదేది!

జన్మభమి కన్న స్వర్గమేది!(

పుణ్యకర్మచేత పుడమి త్యాగముచేత

ప్రేమ భావములను పెంపుజేసి

దానవత్వమణచి దైవచింతన చేత

నిత్య జీవితంబు నెరపు నరుడ!(337-040796)

పుణ్యఫలముచేత పుట్టెను మనుజుడై

దుష్టవాంఛలచేత దుష్టుడయ్యె

జ్ఞానమార్గము వీడి మావత్వము వీడి

ఇంతకన్నను రాక్షసత్వమేది? (337-1-26-05-1995)

పుత్ర సంతతి యున్నను భోగమున్న

బంధుగణమున్న సహజాతసంపదున్న

వైభవంబున్న ధనమున్న భాగ్యమున్న

భక్తి లేకున్న అన్ని నిష్ఫలము కాదె!(338)

పుత్రోత్సాహము తండ్రికి

పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జనులా

పుత్రుని కనుగొని పొగడగ

పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!(339)

పుస్తకములనిండ మస్తుగ చదువుండె

మస్తకములనిండ మట్టియుండె

నేటి చదువు పొట్టకూటికోసమె కదా

వినుము భారతీయ వీరసుతుడ!(340)

పుస్తకములనెన్ని పఠియించియున్నను

భ్రాంతి వీడిపోదు భావమందు

బయలు తానెరిగిన భావమెరుగ

భ్రాంతి వీడిపోవు భావమందు.(341)

        పువ్వు లేక కాయ పుట్టదు చెట్టున

కాయలేక ఫలము కలుగబోదు

కర్మనిష్ట లేక కలుగదు భక్తియు

భక్తి లేక జ్ఞాన భరితుడగున!(342-071081)

పూర్ణ ప్రేమయందె పుట్టును సౌఖ్యంబు

సత్య త్యాగ శాంతి క్షమలునబ్బు

ప్రేమ లేకయున్న క్షేమంబు లేదయా

సత్యమైన బాట ఈ సాయి మాట(343-280792).

పూలగుత్తులు తెచ్చి పూజెంత చేసిన

మెచ్చుకొనడు తాను పుచ్చుకొనడు

హృదయకమలమివ్వ సదయుడై గ్రహియించు

సత్యసాయి శాంతి ప్రేమదాయి.(344-170796)

పూవుపూవునందు నవ్వుచునుండును

నవ్వునందె ప్రేమ నాట్యమాడు

పూలు కోయుటెట్లు మల కట్టుటెట్లు

గొంతునందు సూది గుచ్చుటెట్లు?(344-1-13-04-2003)

పూలయందున పరిమళమెట్లు కలదొ

అటులె దేవుండు నీలోన అలరుజూడ

మేథ చెడిపోయి కస్తూరి మృగమువోలె

ఏల వెతికెదు దేవుని వెఱ్ఱివాడ!(345-250593)

పెక్కు విద్యలు నేర్చిన ఒక్కడైన

సరస సద్గుణవంతుడై సాధుబుద్ధి

సత్యవర్తనంబు సాధుసత్వగుణము

గడపనేర్చిన విద్యార్థి కలడె యిలను?(346)

పొగకు మూలము నిప్పులపుంజముండ

రైలుబండిని నడిపించు డ్రైవరుండ

ఆటొమేటికు లైటుకు అధిపుడుండ

ఒకడు ప్రకృతిని సృష్టింపనుండవలదె.(348-280390)

పొట్టకూటిని చేకూర్చునట్టి విద్య

నీతి ధార్మిక దృష్టిని నేర్పగలదె?

సహజ ధార్మిక దృష్టినే చంపివేయు

సత్యమునుదెల్పు మాట శ్రీసాయి మాట.(349-180796)

పొట్ట మలమూత్రంబుల తొట్టి సుమ్మి

దేహమంతయు దుర్గంధ దిబ్బ సుమ్మి

ఆత్మ దేహమున కిదియె వింత కొంప

మరువబోకుడిట్టి మంచి మాట.(350-051089)

పెద్దలన్న మాట పెరుగన్నమునుబోలు

స్వీకరించ వలయు చిత్తమందు

అట్లు చేయకున్న హానియు కలుగును

ఉన్నమాట తెలుపుచున్న మాట.(351)

పేలములపైన పేరాశ విడువలేక

బోనునందెలుకలు పడిపోయినట్లు

తుచ్ఛవిషయసుఖాసక్తి దూలి నరుడు

వద్దనేయున్న ఆనంద పదవి వదలు.(352)

ప్రేమ లేనట్టి మనసది ప్రేతభూమి

అనగనొప్పారు నిజముగ అవనియందు

శ్వాసనిశ్వాసలను రెండు సలుపుచుండు

కొలిమి తిత్తిని ప్రాణిగా తలపగలమె!(353)

ప్రేమ సేవలు రెండు రెక్కలు మనకు

పక్షమై విహరించు పక్షివోలె

ఆ విహంగ మార్గముననుసరించి

చేరవలయును గమ్యంబు శ్రీఘ్రగతిని(353-1-21-11-1988)

ప్రేమరూపంబు బ్రహ్మంబు ప్రేమమయము

ప్రేమ ప్రేమతొ సంధింప నీమమగును

కాన ప్రేమను గట్టిగా కల్గియున్న

అద్వితీయమునొందగ అర్హుడగును. (354-2-270689))

ప్రేమయనెడి పంట పండింప నలవికాదు

ప్రేమ అమ్ముట అదియంత వీలుకాదు

అహము వదలివేయనావిర్భవించు ప్రేమ

మరువబోకుడిట్టి మంచి మాట.(355-120289)

ప్రేమతత్వం ప్రబోధించి

సమత మమతలు పొందుపరచి

మానవత్వపు విలువలు తెలిపిన

అతడె దైవము, అతడె సాయి.(357-1-140195)

 ప్రేమ దైవంబు జగమెల్ల ప్రేమమయము

 ప్రేమరూపముగొని వచ్చి పేర్మిబ్రోవ

  ప్రేమసుధలను బంధించి ప్రేమగూర్పు

  ప్రేమ అవతారి శ్రీమాత సాయిమాత!(358-1-130891)

పచ్చని రాజవంశవని పాడొనరింప జనించినాడు కా

ర్చిచ్చయి  రేడు సూతసుతు స్నేహము దానికి తోడు గాడుపై

కచ్చలు రేపెనాశకునిగాడు రగుల్కొనె మంట మింట వి

వ్వచ్చునివింటనింక శరవర్షము తప్పదు విశ్వశాంతికై.(359)

ప్రబలి కఫంబు కంఠమున బాధలు పెట్టెడు వేళ బంధువుల్​

గబగబ బైటపెట్టుడిక లాభము లేదనువేళ కింకరుల్​

దబదబ ప్రాణపాశములు లాగెడువేళల ఆలుబిడ్డలున్​

లబలబ ఏడ్చువేళ తరమా హరినామము నోట పల్కగన్​!(360-190673)

పరగన్​ మా మగవారలందరును మున్​ బాణప్రయోగోపసం

హరణాద్యాయుధ విద్యలన్నియును ద్రోణాచార్యుచే నభ్యసిం

చిరి పుత్రాకృతినున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశమున్​

గరుణాసంగము లేక శిష్యసుతులన్​ ఖండింపగా బాడియే!(361-260696)

పాప భయంబు పోయె పరిపాటయిపోయెను దుష్కృతంబిలన్​

శ్రీపతి భక్తిపోయె వివరింపగ లేని దురంత కృత్యముల్​

దాపురమయ్యె లోకమున తాపసలోక శరణ్యుడైన ఆ

శ్రీపతి నామచింతనయె చేకురచేయు సుఖంబు మానవా!(362-211186)

పుట్టపైన మర్దించిన పాము మరణమొందునా?

తనువును తా దండించిన విషయభోగములుడుగునా?

ఆకలిదప్పులు మానినంత ఆత్మజ్ఞానియగునా?

తానెవరో తెలియకున్న తత్త్వజ్ఞానమెటులబ్బు?(363-081283)

పుట్టితి పూజ్యుడౌ ద్రుపద భూపతికిన్​ జగజెట్టి పాండు సా

మ్రాట్టుకు కోడలైతి నభిమానధనుల్​ ఘనులైనవారి జే

పట్టితి శౌర్యధైర్య గుణపాత్రుల పుత్రులగంటి నూడిగం

బెట్టుల జేయజాలుదు నిసీ మగవారలు సిగ్గుమాలినన్​!(364)

పుస్తకముల్​ పఠించితిని పూర్తిగజూచితి సర్వ శాస్త్రముల్​

నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల? నీ

హస్తయుగంబు మోడ్చి పరమాత్మను భక్తితొ కొల్వలేని యీ

ప్రస్తుత విద్యలన్నియును పాడగు విద్యలె చూడ మానవా!(365-040187)

ప్రేమ మయుడు శ్రీధరుడు ప్రేమయె అతని దివ్యరూపమౌ

ప్రేమయె సర్వమానవుల ప్రీతికి తారకమంత్రమట్టి స

త్ప్రేమ రవంతయైన వివరింపగలేక జగంబునందు త

త్కామిత సత్పధార్ధమెటు గాంచగనేర్తురటయ్య మానవా!(366-221096)

పంకజాక్షుని చింత పలుమారు సేయక

పరుల నిందించుట పాడికాదు

విష్ణుసంకీర్తనల్​ వీనుల వినకుండ

పరుల స్తుతులజేయ భ్రాంతికాదె

శేషశయనుజాల చెలగి కీర్తింపక

పరుల కీర్తించుట భావ్యమగునె

దామోదరుని రూపు ధ్యానము చేయక

పరుల దూషించుట పాడియగునె

శ్రీరమానాథునెప్పుడు చిత్తమందు

తలచువారికి మోక్షంబు తధ్యమప్ప

ఇంతకన్నను వేఱెద్ది ఎరుక పఱతు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!(367)

పట్టినదేదియో పట్టనే పట్టితి

పట్టునెగ్గెడుదాక అట్టెయుండు

కోరినదేదియో కోరనే కోరితి

కోర్కె చెల్లెడుదాక కొలచియుండు

అడిగినదేదియో అడగనే అడిగితి

వడిగినదిడుదాక విడువకుండు

తలచినదేదియో తలచనే తలచితి

తలపు తీరెడుదాక తరలకుండు

పోరు పడలేక తానైన బ్రోవవలయు

ఒడలు తెలియక నీవైన ఉడుగవలయు

అంతియేగాని మధ్యలో ఆపివేసి

తిరిగి పోవుట భక్తుని దీక్షకాదు.(368-230590)

పది దినంబులనుండి పస్తుండు వానికి

మంచి భోజనము లభించినట్లు

చెఱువు బావులనీళ్లు కరవయినప్పుడు

వరుసగా వర్షంబు కురిసినట్లు

సంతతి లేకను చింతిల్లు వానికి

పుణ్యసుపుత్రుండు పుట్టినట్లు

అన్నవస్త్రంబుల కల్లాడుచుండిన

నిరుపేదకర్థంబు బెరయునట్లు

ధర్మనాశనమగుచున్న ధరణియందు

ప్రభవమందెను శ్రీసాయి పర్తియందు

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!369-140890)

పరమ పావనమైన భారతావనియందు

సహనమన్నదె మనకు చక్కదనము

వ్రతములన్నింటను వన్నెగాంచినయట్టి

ఘనసత్యశీలమే కఠిన తపము

మథుర భావంబేది మన దేశమందన్న

మాతృభావము కంటె మాన్యమెద్ది

ప్రాణంబు కంటెను మానంబె ఘనమను

మన దేశ నీతిని మంటగలిపి

నేటికిచ్చిరి పరదేశ నీతులరసి

వెస విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తి

ఔర! ఏమందు భరత పాలనంబు

ఏనుగెట్టుల తన బలమెరుగలేదొ

అట్టులైనారు భారతీయులు నేడు.(370-020691)

పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు

ప్రవహింపజేయుటే పరమ భక్తి

ప్రతి మానవుండును బ్రతికి తానుండుట

స్వార్థంబునకు కాదు సంఘసేవ

చేయుటకే అన్న శ్రేష్ఠభావంబుతో

మెలగుచునుండిన మేలు కలుగు

మరచియు తనుతాను మానవ సేవకు

అంకితమగుటయే ఆత్మతృప్తి

నిష్కళంకపు ప్రేమను నిల్పి హృదిని

సకల జీవుల కుపకృతి సలుపకున్న

పుట్టి ఫలమేమి నరుడుగా పుడమియందు

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!(371-040483)

పరసతి నాశించి పదితలలవాడేమి

పట్టుకపోయెను గట్టిగాను!

నిగమముల్​ హరియించి నిండు దూషణచేసి

సోమకాసురుడేమి సుఖము నొందె!

ఇల సూదిమొన మోప యియ్యజాలనటన్న

దుర్యోధనుండేమి దోచుకొనియె!

పసిపాపలను కూడ కసిపట్టి చంపిన

కంసుడేపాటిగా కాచుకొనియె!

నేటి దుర్మార్గులకు కూడ నిదియె గతియు

సత్యమును దెల్పు మాట ఈ సాయిమాట.(

పరుగు జీవితములె పరిపాటి కలిలోన

పరుగులిడకయున్న పనులు చెడును

బస్సుకై పరుగులు బైస్కోపు పరుగులు

పరుగులిడకయున్న పనులు చెడును

ఆర్జనల పరుగు ఆఫీసుల పరుగు

పరుగులిడకయున్న పనులు చెడును

పదవులకు పరుగు పగదీర్పగ పరుగు

పరుగులిడకయున్న పనులు చెడును(372)

ప్రకృతి మాయలచేత బంధింపబడుటచే

నేనె బ్రహ్మంబను నెఱుక  పోయె

పంచేంద్రియంబుల వంచింపబడుటచే

జీవుడే దేవుడన్​ తెలివి పోయె

మమతాద్యహంకార మాయలో బడుటచే

ఏకత్వ భావంబు లేకపోయె

దేహాభిమానంబు మోహానబడుటచే

ఆత్మదర్శనముపై నాశపోయె

బ్రహ్మలో నీవు నీలోన బ్రహ్మయుండ

నీకు బ్రహ్మకు భేదము లేకపోయె

నేనె బ్రహ్మమనుటను యిప్పుడెరుగు

సాయి ప్రేమబోధల గ్రోలి హాయిమీర.(373)

ప్రజలకునింపైన పనులుసేయకయున్న

మాట యింపుగ పల్కి మసలరయ్య

సత్సంగమునుజేరి సంఘవృద్ధినిగాంచి

కర్మయందనురక్తి కలుగరయ్య

పశులక్షణము వీడి పశుపతి కావలె

జీవోద్ధరణమును చేయుడయ్య

దయగల హృదయమే దైవమందిరమౌను

దయలేని హృదయమే దయ్యమయ్య

అహము, పరనిందలను పాడుకుళ్ళు తీసి

ఈశ్వరుండును జీవులనెల్లయెడల

ననెడి భావంబు వదలక ననవరతము

మనుడు మరువబోకుడిట్టి మంచిమాట!(374)

ప్రవహించు నేపురి పరిధిగా పాయలై

చిత్రావతీనది చిత్రగతుల

క్రాలునీ పట్టణ కళ్యాణకరముగా

చుట్టును మేలైన చూతతరువు

కాన్పించు నేపురి కడలివంశమునందు

పార్వతీశ్వరుడెప్డు బాయకుండు

కొలువుండు నేపురి విలసితంబగు మధ్య

మహిమాన్వితుండైన సాయివిభుడు

మండలావని గణుతించు మెండుమహిమ

చిక్కవడియలు కట్టిన చెఱువు తోడ

బుక్కరాయల చిరకీర్తి భువనమెంచ

పొసగ చాటునేపురము పుట్టపురము.(375-181101)

ప్రాచీన ఋషులకు పాఠముల్​ నేర్పింప

జాలిన వేదాంత సారమతులు

నిర్జీవ శిలలచే నృత్యమాడించెడి

నేర్పు కల్గిన కళానిపుణమతులు

పరవీరశిరములు బంతులాడించుచు

క్రీడింపగలిగిన వాడిమగలు

సర్వసర్వంసహా చక్రపాలనజేసి

నడిపించగలిగిన నాయకులును

కలరు భారతభువిని పెక్కండ్రు చూడ

ఉండి ఫలమేమి వారిలో ఒక్కరైన

అనుదినంబును వినిపించు ఆర్తరవము

ఆలకింప దలంపరో ఆర్యులార!(376-221186)

పాంచభౌతికము దుర్బలమైన కాయంబు

ఎప్పుడో విడిచేది ఎరుకలేదు

శత వర్షములదాక మితము చెప్పిరిగాని

నమ్మరాదామాట నెమ్మనమున

బాల్యమందో మంచి ప్రాయమందో లేక

ముదిమియందో లేక ముసలియందో

ఊరనో అడవినో ఉదక మధ్యంబునో

ఎక్కడో విడిచేది ఎఱుక లేదు

మరణమే నిశ్చయమ్మది మానవునకు

బుద్ధిమంతుడై తన దేహమున్నయపుడె

తన్ను తా తెలియుట ధర్మతత్వ మరయ

సత్యమైనట్టి బాట శ్రీసాయి మాట!(377)

పాశ్చాత్య విద్యల ప్రాభవమదియేమొ

సంస్కృతమడుగంటి సన్నగిల్లె

పాశ్చాత్య విద్యల ప్రాభవమదియేమొ

పరిణయ ధర్మముల్​ వమ్ములయ్య

పాశ్చాత్య విద్యల ప్రాభవమదియేమొ

ఆర్యధర్మములెల్ల ఆరిపోయె

పాశ్చాత్య విద్యల ప్రాభవమదియేమొ

వేషభాషలయందు మోజు హెచ్చె

తల్లి భాషను మాట్లాడ తప్పుదోచె

సంఘమర్యాద పాటింప జంకు పుట్టె

ధర్మమన్నది బోధింప తప్పిపోయె

ఇట్టులైనది భారతజాతి నేడు.(378)

పుట్టుటయే చింత భూమినుండుట చింత

సంసారమొక చింత చావు చింత

బాల్యమంతయు చింత వార్థక్యమొక చింత

జీవించుటొక చింత చెడుపు చింత

కర్మలన్నియు చింత కష్టంబులొక చింత

సంతసమొక చింత వింత చింత

ప్రాపంచకము చింత ప్రకృతంతయు చింత

సంతసమొక చింత వింత చింత

సర్వ చింతలు బాపెడు సాయి భక్తి

గొనుడు యికనైన జనులార కోర్కె మీర

ఇంతకన్నను వేరెద్ది  ఎరుక పరతు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!(379)

 పుడమికి సరిమధ్య పుట్టపర్తియనగను

ఆత్మ విద్యలునందె అవతరించె

విశ్వమానవకోటి విజ్ఞానమందంగ

విశ్వవిద్యాలయంబిచట వెలసె

శాంతిపౌఖ్యములను సర్వదేశములందు

వెదజల్లు విజ్ఞులు వెలసిరిచట

నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు

వేల లక్షలు కోట్లు వెలసిరిచట

సత్యధర్మశాంతిప్రేమలు జగతికి

చాటి చెప్పబూని సాయివిభుడు

సత్యసాయిజూడ సంపూర్ణప్రేమయే

యగుచు పుట్టెనిచట మోదమలర!(380-231189)

 పనిపాటలందె మీ బ్రతుకంత తెల్లారె

ఇదియె జీవితమని ఎంచినార

మూడు పూటలు మీరు భుజియించి తృప్తిగా

ఇదియె జీవితమని ఎంచినార

అలసటదీరగా హాయిగా నిదురించి

ఇదియె జీవితమని ఎంచినార

కాదు జీవిత రహస్యమెరుగు కొరకు

ఇందుకే దేవుడు నిచ్చె జన్మ

తెలివితేటలు కల్గియు తెలిసికొనక

కాలమంతయు నూరక గడుపనేల?

మనిషిగా మీరలికనైన మసలరయ్య

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు.(390-201096)

పేకాటనాడుచు ప్రీతితో నారాత్రి

గడిపినందులకె జాగరణమగునె

చేపలకొరకునై చెరువులో జాలర్లు

పొంచి చూచెడు దృష్టి ముక్తికగునె

తప్పసారాత్రాగి తన మేను మరచిన

మాత్రాన పరమ తన్మయతనగునె

భార్యపై నల్గియు పస్తు పరుండిన

వాడెల్ల నొకనుపవాసి యగునె

తలపు నీయందె యుంచిన కలదుగాని

భక్తి సుంతైన లేనిదే ముక్తి కలదె!

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!(391)

పరమాత్ముని పవిత్ర పదములు విశ్వమువలెను విరాట్రూపములు

గగనము వలెను సువిశాలములు, పాతాళమునను పరివ్యాప్తములు

ఆయన దాల్చిన ఆ కిరీటము – బ్రహ్మాండమునకు అతీతము!

ఆ భగవంతుడు అగమ్యుడు! అగోచరుడు! అతులితుడు!

ప్రమిద, నూనె, వత్తి గలదు దీపము తా వెలుగునా?

సువర్ణము, రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగునా?

పూలు, సూది, దారము కలవు, పుష్పమాల  తానగునా?(392)

పాటువైనది చెట్టురా పట్టువైనది కొమ్మరా

పాటు తప్పి పట్టు విడిచితె పరబ్రహ్మమె చేరురా

సారమైనది చమురురా సత్యమైనది వత్తిరా

వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరు రారురా!

కోట ఏడు చుట్టురా కోటలోపల తోటరా

తోటలోనికి పోదమంటె దారి తెలియదు ఎట్లరా?

మదిలొ పొంగే ప్రీతి ఊట అనురాగమనే ఆ నీట

తడుపబడిన హృదయతోట ప్రేమ మొలక అందులో నాట

మనసులోని మన మాట అదియె మథుర బాట.(393)

       పలుకులె మహా రుచి పలుకులు

పలుకులె పరిమళపు పూతలు

పలుకులె అతి మథుర మకరందములు

పలుకులె నాలుగు వేదాలు

పలుకులె శ్రుతిస్మృతి పలుకులు

       పలుకులె బంధమోక్ష సుఖదుఃఖ కారణాలు.(394-251292)

పాట పడుమా కృష్ణా! పలుకు తేనెలొలుకునటుల

మాటలాడుమా ముకుంద మనసు తీరగా….

వేదసారమంత తీసి నాదరూపముగను మార్చి

వేణువందు తిరుగబోసి గానరూపముగను మార్చి    |పాట|(395-270595)

పాటలు పాడిన ఫలమేమి?

మంచి మాటలు నేర్చిన మహిమేమి?

సూటిగ సాయి బాటలో నడచిన

సుఖమను మూటలు దొరకునుగా

ఇహపరసఖమను మూటలు దొరకునుగా(395-1-15-01-1987)

పుట్టినపుడు ఏడ్చినారు చచ్చినపుడు ఏడ్చినారు

మధ్యమధ్య విషయాలకు ఎందుకెందుకొ ఏడుస్తారు

ధర్మగ్లాని సంభవింప ఉద్ధరింప ఏడ్చినార?

సత్యస్వరూపునికై ఏడ్చినార ఎపుడైన?

ఎందుకోసమేడ్చినారు? ఏడ్పుకోసమేడ్చినారు.(396-22188)

పొట్టకోసం విద్యకాదని ప్రజ్ఞకోసం చదువుకొమ్మని

చదువు మర్మం తెలిసినట్టి సత్యరూపుడె నిత్యగురువు

ప్రేమ తత్వం ప్రబోధించి మమత సమతను పొందు పరచి

మానవత్వం తెలిపినట్టి ప్రేమరూపుడె సత్యగురువు.(397-211187)

పొట్టకోసము క్రిమి పక్షి మృగాదులు బ్రతుకలేదె

కాన వాంఛించకయె  తృప్తి కలుగునంచు

గట్టిగా తెలిసి గమ్యంబు చేరకున్న

ఇతర జీవులకన్న అరయ నరుడు

అథముడేగాని పరికింప అథికుడగునా!(398)

పోయిరావమ్మ తల్లి అత్తవారింటికి పోయిరా

నడివీధులవెంట తిరుగకమ్మ

పక్క యింటి వారినిజూచి ఈర్ష్యపడకమ్మ

ఓర్పును శాంతిని ఫణముగా ఒడ్డియుండుమమ్మా

పతి మాటలకు పలుమారు బదులాడకమ్మ

పతి  సేవయే పరమ కర్తవ్యమని తలపుమమ్మా

ఎవరెన్ని చెప్పినను మౌనము వహించుమమ్మా

పెద్దలయెడ గౌరవముంచుమమ్మా

అత్తమామల సేవ అతి భక్తితో చేయుమమ్మా

సర్వవేళల భగవంతుని ధ్యానించుచుండుమమ్మా.(399)

పెట్టినది తినవు గొల్లల

పట్టులకుంబోయి వెన్న పట్టెడులుగ లో

గుట్టున తినెదవు నీతో

పుట్టెను రట్టళ్ళు కృష్ణ! పొమ్ము కుమారా!(400)

ఫేసుపౌడరు అవతరించె మోసగించి పసుపు పోయె

ఏమికాలమొచ్చెనో జనులార ఏమికాలమొచ్చెనో

కాసుల దండలన్ని పోయె మోసగించి చైనులొచ్చె

ఏమికాలమొచ్చెనో జనులార ఏమికాలమొచ్చెనో

ప్రేమ కలిగె ఆ లేడియందు ప్రాణనాథ వేడుకొందు

నా మనంబు కోరిక తీర్చమందు రామచంద్ర దాని తెమ్ము

మరిది నిర్మించిన పర్ణశాలయందు

దానితొ పొద్దు గడుపుకొందు.(401)

ఫలమివ్వని వృక్షమువలె రసములేని ఫలమువలె

పాలియ్యని గోవువలె తలివిలేని పశువువలె

పట్టిగిట్టి ఏమి ఫలము? ఫలమెరుగక పుట్టినావు

ఫలమెరుగక మరణించిన నేనెవరో తెలియకున్న

ఇక తెలిసినదేమన్నా? (401-1-23-11-1968)

బహుళ విద్యలన్ని పాకశాస్త్రముబోలు

వంటకములబోలు భక్తియొకటె

వంటకములు వీడి పాకశాస్త్రమదేల!

వినుము భారతీయ వీరసుతుడ!(403)

బహుళ విద్యలయ్యె వాంఛలు మితిమీరె

పలుకులందు హీరో పనికి జీరో

తెలివితేటలు ఎన్ని వుండి ఫలంబేమి?

కొంచెమైన ఆచరించరయ్య (403-1-01-02-1996)

బ్రతుకులన్నియు మాయ

భవబంధములు మాయ

సంసారమది మాయ చావు మాయ

మయబ్రతుకుకింత మాయలో పడనేల?(403-2-02-07-1996)

బహుళ విద్యలయ్యె వాంఛలు మితిమీరె

పలుకులందు హీరో పనికి జీరో

తెలివితేటలవల్ల కలుగు లాభంబేమి?

కొంచెమైన ఆచరించరయ్య!

బ్రతికినన్నినాళ్ళు ఫలమిచ్చుటే కాదు

చచ్చికూడ చీల్చి యిచ్చు తనువు

త్యాగ భావమునకు తరువులే గురువులు

ఉన్నమాట తెలుపుచున్న మాట.(404-081296)

బ్రహ్మ దర్శన భాగ్యంబు బడయగోరి

వెదుకబోదువువెచటికే వెఱ్ఱి మనస

అదియు నీలోననున్నది అరుగుమచట

సత్యమునుదెల్పు మాట ఈ సాయి మాట.(405-300987)

బ్రతుకులన్నియు మాయ

భవబంధములు మాయ

సంసారమది మాయ చావు మాయ

మాయ బ్రతుకు కింత మాయలో పడనేల!

బ్రహ్మజ్ఞానంబునెరుగక బ్రాహ్మణుండ?

సమతభావంబు లేకున్న సజ్జనుండ?

మంచితనమును లేకున్న మానవుండ?

చెప్పరయ్య మీరలె ఒప్పుకొందు.(406-120289)

బ్రహ్మవిద్య గూర్చి బహుళ ప్రచారము

సలుపువారు కలరు చాలమంది

కాని ఆచరించు ఘనుడు ఒక్కడు లేడు

సత్యమైన బాట సాయి మాట.(407-310591)

బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండములనెల్ల

విష్ణువన్ని పెంచి వృద్ధి చేయు

పరమ శివుడు ద్రుంచు పాపిష్టి జీవుల

గురువు మూడు క్రియల సలుపునొకడె.(408)

బ్రహ్మలోని మాయ బ్రహ్మను చెందదు

జగతినాశ్రయించి మోహపరచు

పాము కోరవిషము పామును చంపునా?

వినుము భారతీయ వీరసుతుడ!(409)

బాలబాలికలెల్లరు భవ్యమైన

దివ్య విద్యల నేర్వగ దీక్షబూని

భరత సంస్కృతి నెలకొల్పవలయు నేడు

భక్తి క్రమశిక్ష మనసున పాదుకొల్పి.(410)

బాల్యమందున తత్త్వంబు పట్టుబడని

కారణంబున సంఘంబు కాలగతిని

ప్రగతి  లేకను దిగజారి పతనమయ్యె

ఇంతకన్నను దుర్గతి ఏమి కలదు?(411)

బుద్ధి బలము మరియు భుజబలమున్నను

దైవ బలము లేక దీనుడగును

కర్ణుడంతవాడు కడపటికేమయ్యె

మరువబోకుడిట్టి మంచి మాట.(412-230787)

భక్తి లేకుండ భజనలు సలిపెనేని

శ్రద్ధ లేకుండ సాధనల్​ సలిపెనేని

శుద్ధి లేకుండ సమితిలో చేరెనేని

అయ్యదెల్ల సత్య వ్యవహారమగునె!(413)

భరతదేశము వేదాల పట్టుగొమ్మ

యజ్ఞయాగాది క్రతువులకాటపట్టు

పెక్కు అవతారములగన్న పెద్ద తల్లి

నీతినియమాలజూపెడి త్యాగభూమి(414-231182)

భర్త దుర్మార్గుడై కీడు బడయు వేళ

మంత్రి యట్టుల మేల్​ కీడు మనవి జేసి

పతికి హితము గఱుపగా పడతులెపుడు

నడువవలెను మండోదరి యట్లు భువిని(

భారతావని గురుశిష్య భావముడిగె

సత్యసంపద క్రమచర్య సన్నగిల్లె

భక్తివిశ్వాసములయందు రక్తిదొలగె

బాధ్యతలు లేని స్వాతంత్య్రపరత హెచ్చె.(415-210573)

భరతదేశము ఆరంజిపండు పోల్చ

కనగ జాతులును మతములు తొనలు కాదె

భిన్న తెగలు వృత్తులు ఎన్నియున్న

భరతదేశాన పుట్టుటె భాగ్యమగును

ఐకమత్యంబు జ్ఞానంబునందజేయు

దివ్యజ్యోతిని వెలిగించు దేశమిదియె.(416-231190)

భవ్యభావాలు కల్గిన భారతీయ

దివ్య సంస్కృతి తత్త్వంబు తెలిసికొనగ

భారతీయులె యత్నింపనేరరైరి

ఇంతకన్నను దౌర్భాగ్యమేమి కలదు?(417-231187)

భావసంశుద్ధి కలుగుటే భక్తియగును

పుణ్యకార్యాలు చేయుటే పూజయగును

పరులకుపకార మిడుటె తపంబులగును

మరువబోవకుడిటువంటి మంచిమాట.(

భావమందు తుచ్ఛభావాలు వీడుటే

త్యాగమగును అదియె యోగమగును

ఆస్తి ఆలిని వీడి అడవికేగుట కాదు

సత్యమైన బాట సాయి మాట(418-161083)).

భావసంశుద్ధి కలుగుటే భక్తియగును

పుణ్యకార్యాలు చేయుటే పూజయగన

పరులకుపకారమొసగుటే తపసుయగును

మరువబోకుడిటువంటి మంచిమాట (418-1-25-12-1988)

భుక్తి విద్యలెల్ల బోధించి తెల్పేటి

గురువులెల్ల పరము గూర్పగలర?

ముక్తి విద్య తెలిపి మోహంబు తెగటార్చు

గురువు కలడు సత్యగురువరుండు.(419)

భుక్తి విద్యలన్ని భక్తితో చదివేరు

ముక్తి చదువుకెవరు ముందు రారు

ఇట్టివారు నన్ను ఎరుగంగనేర్తురా

ఎట్టి విద్యలుండి ఏమి ఫలము!(420-150187)

భుజబలంబు మంచి బుద్ధిబలంబుండి

దైవబలంబులేక దీనుడయ్యె

కర్ణుడంతటివాడు కడపటికేమయ్యె

మరువబోకుడిట్టి మంచిమాట (420-1-30-06-1996)

భువిని త్యాగము చేత పుణ్య కర్మల చేత

ప్రేమ భావములను పెంపుజేసి

దానవత్వమడంచి దైవచింతన చేసి

నిత్య జీవితంబు నెరపుమయ్య.(

భోగభాగ్యంబులివి ఎన్ని పొందియున్న

తృప్తి మనిషికి లేదని తెలియరయ్య

ఆత్మతత్త్వము చేరినయపుడు కాని

తృప్తి శాంతియు మనిషికి ప్రాప్తి రాదు.(421-280592)

భోగభాగ్యములేల

చదవుయేల? గొప్పసంపదేల?

చాలు జాలిగుండె సంతోషశాంతులు

చాలు మావతకు చాలు(421-1-

భోగభాగ్యంబలు ఎన్నియో పొందియున&

మసునందున శాంతి మరుగుపడిన

మానవత్వంబు గుర్తింప మరచిరంత

సత్యమును తెలుపు మాట సాయిమాట (421-2-23-07-2002)

భర్త దుర్మార్గుడై కీడుబడయువేళ

మంత్రియట్టుల మేల్​కీళ్ళు మనవిజేసి

పతికి హితమను గరపగా పడతులెపుడు

అరయవలయును మండోదరియట్లు (421-3-19-10-1996)

భోగభాగ్యంబులెన్నియో పొందియున్న

మనసునందున శాంతియే మరుగుపడియె

మానవత్వముగుర్తింప మరచిరంత

సత్యమును తెల్పుమాట ఈ సాయిమాట.

బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా

జాలండోయని దాని క్రింద నిలువన్​ శంకింపగా బోలదీ

శైలాంభోనిధి జంతుసంయుత ధరాచక్రంబుపైబడ్డ నా

కేలల్లాడదు, బంధులార! నిలుడీ క్రిందంబ్రమోదంబునన్​!(422)

బావను హస్తినాపురము పంపెడిచో నిదమిత్థమంచు నా

భావములోని భావమును స్పష్టము చేయదలంచియున్​ శుభం

భావుకు సంధియాత్ర కశుభంబని మ్రింగితి మిన్నకుంటి మా

బావ సుఖంబుగాదిరిగి వచ్చెనిదే పదివేలు నేటికిన్​(423-270696)

బ్రహ్మాండమంతయు బొజ్జలోనుండంగ

   భక్ష్యభోజ్యము నాకు పెట్టనగునె

సర్వజీవులయందు సంచరించెడి నాకు

సరియైన పేరిడ సాధ్యమగున

సర్వజలంబుల సంచరించెడి నాకు

స్నానంబు చేయింపనలవియగున

కోటిసూర్యుల కాంతి మేటి కల్గిన నాకు

ప్రమిద దీపమునెట్లు పెట్టగలరు

అజహరాదులకైనను అందనట్టి

ఇట్టి నా రూపు కనుగొన నెవరి తరము

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!(424-231188)

బాల్యమందున పలువురతోగూడి

ఆటపాటలందు ఐక్యుడగును

యవ్వనంబలరిన అలరు విల్తుని పోల్కి

కామినీ లోలుడై క్రాలుచుండు

అర్థవయస్సున ఐహికంబున మున్గి

ద్రవ్యమార్జించుటన్​ దవిలియుండు

ముదిమి వచ్చినయంత మురహరి తలవక

అదియిది లేదని అలమటించు

వివిధ దుర్వ్యసనంబులు వీడలేక

భక్తి మార్గంబు వెతుకునాసక్తి లేక

కర్మపంకిలమునబడి క్రాలుచుండు

మట్టి కలుపును జన్మంబు మానవుండు.(425-230573)

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు

ఏక గర్భజులంచు ఎన్నరయ్య

అన్నలు ద్విజులు శూద్రులును మిన్నగ

తమ్ములందు ప్రేమ తలపరయ్య

గుణముల క్రియలచేగూడు వర్ణములెల్ల

గుణమును గ్రహియింపగూడునయ్య

ద్విజుడు దుర్గుణుడైన శూద్రుడె

సుగుణి శూద్రుండు భూసురుడు కాడె

వీడువాడను భేదంబు వీడి మీరు

ఐకమత్యంబు అన్నింట అధిక పరచి

కలత విడనాడి ఐక్యంబు కాంచరయ్య

అపుడ దేశంబు అభివృద్ధినందునయ్య(426-231190).

భక్తిరసానంద పారవశ్యముచేత

భవబంధ భూతముల్​ పారిపోవు

భవబంధ భూతముల్​ వదలిన తోడనే

మోక్షాభిమానంబు మొలకలెత్తు

మోక్షాభిమానంబు మొలకెత్తినంతనే

జ్ఞానోదయప్రాప్తి కలుగు వెంట

జ్ఞానోదయప్రాప్తి కలిగిన వెంటనే

తన్ను తానెరిగెడి తత్వమబ్బు

జగము మాయమై పోవుచో నిగమవినుతు

నిత్య సౌభాగ్య రూపంబు నిలుచుగాదె

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!(427)

భక్తులందరుజేరి భగవంతుడాయంచు

చెవులకింపుగ నుతిచేయు దినము

బీదల వెతలన్ని ప్రీతితో తొలగించి

అన్నదమ్ముల మాడ్కినున్న దినము

దైవచింతనజేయు దాసబృందములకు

ప్రీతి మృష్ఠాన్నము పెట్టు దినము

మహనీయులెవరైన మనకడకేతెంచి

చెలిమి బాబా కథల్​ చెప్పు దినము

భావమున భక్తిగూర్చు సౌభాగ్య దినము

దినముగాని తక్కినవన్ని దినములగునె

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!(428-050987)

భరతశాస్త్రంబనును బంగారు మనకుండ

పరశాస్త్రములయెడ భక్తి ఏల?

హైందవంబనియెడి హైమాద్రి మనకుండ

పరధర్మములను పర్వతము ఏల?

భారతనీతులన్​ భవ్యజలమ్ముండ

పరనీతియను ఉప్పునీరు ఏల?

మించెడి కాంతితో మేరు పర్వతముండ

వెండిబంగారుకై వెతలికేల?

అడిగిన పాలిచ్చు కామధేనువుండ

ధనమిచ్చి ఆవును కొనగనేల?

పంకజాక్షు పూజ పలుమరు సేయక

పరుల నింద సేయ పాడియగునె?

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!(429)

భానుతేజముకంటె భాసిల్లుచుండును

మంచుతెలుపుకంటె మించియుండు

ఆకసంబునకంటె అతి సూక్ష్మమైయుండు

సర్వ జీవులలోన పర్వియుండు

పరమాత్మ లేనిది పరమాణువును లేదు

అంతటనిండి తానంటకుండు

పరమాత్మ సందర్శ భవ్యవికాసము

నిఖిల లోకాలలో నిండియుండు

బ్రహ్మమందు మీరు మీలోన బ్రహ్మంబు

మీరె బ్రహ్మ బ్రహ్మ మీరెయయ్యు

బ్రహ్మమయులు మీరు బ్రహ్మమేయగుదురు

కాని మోహవశత కానరైరి. (430-160288)

భుజబలంబున పెద్దపులుల చంపగవచ్చు

పాము కంఠము చక్కబట్టవచ్చు

బ్రహ్మరాక్షసకోట్లు పారద్రోలగవచ్చు

మనుజుల రోగముల్​ మాన్పవచ్చు

జిహ్వకిష్టములేని చేదు మ్రింగగవచ్చు

పదును ఖడ్గముచేత అదమవచ్చు

కష్టమందుచు మహాకంపలో చొరవచ్చు

తిట్టుబోతుల నోళ్లు కట్టవచ్చు

కాని పుడమిలో మూర్ఖుల బోధచేసి

సజ్జనుగ మార్చలేడెంత చతురుడైన

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!(431)

    బుద్ధి చెప్పెద రావణా! ఈ లంక నీకింక లేదుర దుర్గుణా

   బుద్ధి చెప్పెద వినుము నీవిక సద్దుసేయక నాదు పలుకులు

   బుద్ధికిని యోచించక చావుకు బద్ధుడైతివి పాపమతివై |బుద్ధి|

   లోకములకు తల్లిరా! ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా

   లోకమాతను తెచ్చి యిప్పుడు పాతకమునకొడిగట్టుకుంటివి

   ఏక శరమున నీదు శిరములు ఏకమారుగ త్రుంచు రాముడు |బుద్ధి|

  సీతతొ భాషించితి రాముల చేతి ముద్దుటుంగరమందించితి

  పాతకుడ! నీ వనముగాచిన  పలు రాక్షసవీరులజంపితి

   కోతినంచు నాతో పోరి యమపురి పాలాయె దైత్యులు |బుద్ధి|(432-161088)

భయమను  దయ్యమును పారద్రోలినిర్భయముగ నుండరయ్య

పాపంబన భయముండవలెనయ్యా లోకముతోటి భయము నీకేలనయ్యా?

అందరికి భయపడి దేవదేవుని భజన చేయగలేక

భ్రమచెంది మరణించు సమయమందున

బలిమి మీరగ యముడు రమ్మిక రమ్మనుచు లాగంగ అప్పుడు

అయ్యయ్యో అని ఏడ్వంగ నెవరడ్డగింప వత్తురయ్యా?(433-220689)

   భయంభయం బ్రతుకు భయం అన్నా

  మనకీలోకం పన్నిన పద్మవ్యూహం

  గతిలేని మానవులకు చితికిన సంసారములకు

  కష్టాలే బంధువులా! కన్నీళ్లే కానుకలా! (433-1-10-09-1996)

మంచి కాలము పదవులు మంచి బ్రతుకు

కోరుచుందురు మనుజులు కోరబోరు

మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు.(434-210802)

మంచి చెడ్డ నడత మనుజులయందుండు

పైకి కానరాదు బయటపడదు

వారివారి నడత వారికేనిచ్చు

మరల జన్మమందు మార్గమిచ్చు.(435-220385)

మంచిమాట వినరు మనసిచ్చి చెప్పిన

చెడ్డమాట ముందు చెవిని పడును

ఇట్టివారు నన్ను ఎరుగంగనేర్తురే

ఎట్టి తెలివియున్న ఏమి ఫలము?(436-201001)

మంచివారు మేలు మరువకయుందురు

కష్టకాలమందు కాచియుంద్రు

కామధేనువొసగు కడగి క్షీరముగాని

విషమునెట్లొసగు విమల చరిత!((439)

మంచివారి పొందు మహిలోన దొరకదు

దుష్టులెందరైన దొరుకుచుంద్రు

కలికి రాళ్లు భువిని కలవెన్నియైనను

వెలనుబోలు వజ్రమెతుకవలయు.(438-180782)

మంచి తలపులు మాటలు మంచి చేత

మంచి వినికిడి చూపులు మంచితనము

మంచి ఆరోగ్యమునిచ్చు మానవునకు

సత్యమును తెల్పు మాట ఈ సాయిమాట.(439-081083)

మంచి తత్త్వంబు మరచిరి మనుషులంత

ధర్మమడుగంటె సంఫూన ఖర్మకాలి

నిలువ నీడయె లేకుండె నీతికెచట

ఇంతకన్నను దౌర్భాగ్యమేమి కలదు?( 440-180789)

మంచి మందులేదు మందహాసముకన్న

వైద్యుడెంత గొప్పవాడు అయిన

అవని మందులన్ని అనుపానములెగాని

అసలుసిసలు మందు (440-1-16-12-1995)

మంచితనమునందు మానవత్వమునందు

నీతియందు నిండునిజమునందు

ఆచరించి చెప్పు ఆచరించి చూపు ఆదర్శములనెల్ల

అతడె యువకుడు ఆమె యువతికాదె

అట్టివారె బెష్టు ఫ్రెండ్సు మీకు

అట్టివారె బెష్టు ఫ్రెండ్సు నాకు.(441-

మంచి మనసు, నడత మంచిగ లేకున్న

మిమ్ము సాయి ఎట్లు మెచ్చుకొనును?

శాంతిప్రేమదాయి సంతోషసుఖదాయి

ప్రేమ సాయి ఎట్లు పెంచుకొనును?(441-1-

మట్టితో చేరి యినుముకు పట్టుతుప్పు

అగ్నిలో చేర యినుమును అదియె వీడు

సాహచర్యముచే నిట్లు జరుగుచుండు

సత్యమైనట్టి బాట శ్రీసాయి మాట.(442-080796)

మట్టినుండి పుట్టిన చెట్టు మట్టియగును

బ్రహ్మనుండి పుట్టిన సృష్టి బ్రహ్మయగును

కాని దృష్టికి భిన్నమై కానిపించు

సత్యమునుదెల్పు మాట ఈ సాయిమాట.(443-30076)

మతములన్ని చేరి మంచినే బోధించె

తెలిసి మెలగ వలయు తెలివితోడ

మతులు మంచివైన మతమేది చెడ్డది

వినుము భారతీయ వీరసుతుడ!(4-231179)

మతము క్రమశిక్ష నేర్పును హితముగూర్చు

ఆత్మశక్తియు తేజమునధిక పరచు

దాని మర్మంబునెరుగక కొట్టుకొన్న

జాతి సంస్కృతి క్షీణించి జబ్బు పడును.(445-251291)

మదగజంబు పట్ట మరి అంకుశము మందు

మహిషములను తోల మందు బడిత

వ్యాధి తోల మందు వర రసాయనమది

ఖలుని మార్చు మందు కలదె భువిని!(445-1-

మదిని గెలిచిన శాంతికి మార్గమరయ

శాంతిగల్గిన అన్నింట సమతదోచు

మంచిచెడ్డలు మానాభిమానములను

హితులునహితులునొక్క బ్రహ్మంబు కాదె!(446-

మధురమైన భాష మంజల గళముతో

భక్తకోటి హృదిని భర్తి చేయు

సూటి మాట పల్కి సూక్ష్మధర్మంబులే

చెప్పుచుండు సాయి ఒప్పుమీర.(47-

మనసు బుద్ధి చిత్తమది అహంకారంబు

ఎందు పుట్టి పరిగె ఎందునణగు

అదియె శివుడు ఆత్మ అరయంగజూడను

మరువబోకుడిట్టి మంచి మాట.(448-151083)

మనసునాధారముగగొను మానవుండు

పశువు కంటెను హీనమై పతనమగును

బుద్ధినాధారముగగొను బుధజనుండు

పశుపతిగ మారునని పల్కె పర్తివిభుడు.(449-140785)

మనసునందు మంచి మాటలందున మంచి

నడతలందు మంచి పొడమకున్న

సాయి మిమ్ము మెచ్చి సంతోషమెటులిచ్చు?

శాంతి ప్రేమదాయి సత్యసాయి.(450-

      మంచి మనసు నడత మంచిగ లేకున్న

సాయి ఎట్లు మిమ్ము మెచ్చుకొనును?

శాంతిప్రేమదాయి సంతోషసుఖదాయి

ప్రేమసాయి మిమ్మ ఎట్లు పంచుకొనును? (450-1-21-11-1987)

మనసే హేతువు మనుజుని

మనుగడకును బంధమునకు మాన్యతకెల్లన్​

మనసే ముఖ్యము ముక్తికి

మనసే దుఃఖమును తెచ్చు మైమరపించున్​.(451-00789)

మనసు నిల్పినవాడెపో మానవుండు

బుద్ధినెరిగిన మనుజుండె బుధవరుండు

చెప్పుచేతలు ఒకటైన శ్రేష్ఠుడగును

ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతు (451-1-06-07-1989)

మనసు మాలిన్యములనెల్ల మట్టుబెట్టి

పరమ పరిశుద్ధ భావముల్​ పాదుగొల్పి

జ్ఞానదృష్టియునేర్పడ కాననగును

విశ్వమంతయు బ్రహ్మమై వెలుగు నిండు.(452-090283)

మనసులోనున్న భావంబు మంచిదైన

కలిగి తీరును ఫలసిద్ధి కార్యమందు

మనసులోపలి భావము మలినమైన

ఫలము కూడనునారీతి మలినమౌను.(453-250696)

మనసు నిర్మలంబు మంచికి మార్గంబు

మనసు నిర్మలంబు మహితశక్తి

మనసు నిర్మలంబు మనిషికి ముఖ్యము

మరువబోకుడిట్టి మంచి మాట.(454-260590)

మనసు, మాట, నడత మనిషికి ఒకటైన

సత్యవంతుడగును సరళితోడ

సత్యవంతు దైవ సాన్నిధ్యమందున

ఉండుచుండు పరమునొందుచుండు. (455-100983)

మనసు బద్ధి చిత్తము మరి హంకారముతొ

జనుడు తెలివితప్పి

పరమశివుడు ఆత్మకనుగొన్న అదియె విభుడు

ఆత్మ, ఆనందముగ భక్తులార! (455-1-30-09-198

మనసె కారణంబు మరియందునుండిన

ఇల్లు అడవి ముక్తినీయలేవు

మనసు లేనివాడు మందిరముననున్న

కాననముననున్న కార్యమేమి?(456-211187)

మనసుచేత జీవి మరల జననమొందు

మనసుచేత జీవి మాయమగును

పుడమి మనసుచేత పురుషార్థములనొందు

మనసుచేత యోగ సిద్ధి మహిని పొందు.(457-100786)

మనసే హేతువు మనుగడకు, బంధమునకు

మాన్యతకు, మనసే ముక్తికి ముఖ్యము

మనసే నరకంబు తెచ్చు

మైమరపించు (457-1-24-05-1990)

మనసొకచో నిలువదాయె, ఏమి పాపమో

మర్కటమై తిరుగసాగె ఏమి శాపమో

ఇది నాది అది నాదను తాపత్రయమెక్కువాయె

నిలకడ అన్నదే లేక నిధిపైనే మనసాయె.(458-

మనిషి పుట్టినప్పుడు అమృతపుత్రుడై జన్మించు

పిదప వాసనలతోడ విషయుడగును

విషయవాంఛలతోడ విషతుల్యుడగునయా

సర్వశ్రుతుల ఊట సాయి మాట.(459-030996)

      మన జాతి ఒక్కటే అది మానవజాతి

మన ఆరాధన ఒక్కటే దైవము

మన కులము ఒక్కటే అదే మానవకులము

మన భాష ఒక్కటే అరీ హృదయభాష (459-1-20-10-1988)

మనుజుడైనవాడు తన దుర్గుణమ్ముల

వరుసనొకటినొకటి వదల వలయు

పశుగుణంబు వీడి పశుపతి  కావలె

సత్యమైన బాట సాయి మాట.(460-

మబ్బులేనట్టి జీవిత మార్గమందు

వెలుగునకు ఎన్నడైనను విలువ కలదె?

బాధనొందక లభియించు భాగ్యమందు

ఎంత వెతికిన దొరకదు సంతసమ్ము.(461-

మర్మమెరిగినట్టి మహనీయులెందరో

మాయ నెరుగలేక మాయమైరి

మర్మమెరిగినట్టి మహనీయులెవరయా?

ఇందులోన ఒక్కరైన గలర!(461-1-

మల్లెకుసుమ మాల మర్కటంబునకిచ్చి

పట్టువస్త్రములను పదిల పరచి

రమ్యమైన రత్నసింహాసనమిడిన

వదలునే తనదగు వక్రబుద్ధి.(462-

మర్మమెరిగినట్టి మహనీయులెందరో

మాయ గేలువలేక మాయమైరి

మర్మమెరిగినట్టి మహనీయులెవరయ్య

ఇందులో ఒక్కరున్నవారా! (462-1-13-07-1996)

మళ్ళీ పుట్టుట మళ్ళీ గిట్టుట

అమ్మ కడుపులో అణగియుండుట

అంతులేని సంసారము దయతో

దాటింపుము నను దబ్బున దేవా!(463-080673)

మరచి నిన్నగూర్చి మరచి రేపటిగూర్చి

ఈ ప్రపంచమందు ఈ క్షణాన

చేసిచూపు చేయవలసినవన్ని

అతని హదయమె పండినట్టివాడు

అతని గుండె పండినట్టివాడు (463-1-15-02-1999)

మాటలందు తీపి మనసున చేదుంచ

మంచికాదు మీకు మచ్చగాని

మచ్చలేని బ్రతుకె మహిలోన చెల్లురా

ఉన్నమాట తెలుపుచున్న మాట.(464-

మాట చెప్పినట్లు మనజుండు నడచిన

మనిషికాడు వాడు మహితుడగును

మాట చెప్పినట్లు మనిషి నడువడేని

మనిషికాడు వాడు మృగమెగాని.(465-26098)

      దూషణంబు హింస దూరంబుగాబెట్టి

ప్రేమభావమును పెంపుజేసి

సర్వమేకమన్న సద్భుద్ధి కలిగిన

జనులె భువిని స్వర్గముగ మార్చు (465-1-25-12-2001)

దుష్టగుణములు వదలిన శిష్ఠుడగును

చింత వదలిన దొరకును చిత్తశుద్ధి

త్యాగగుణమున్న స్వచ్ఛందతత్త్వమబ్బు

మరువబోకుడిటువంటి మంచిమాట(465-3-

మాటలందు తీపి మనసున చేదుంచ

మంచికాదు మీకు మచ్చగాని

మత్సరంబు లేని మనుజుడే మనుజుండు

 వినుము భారతీయ వీరసుతుడ!(466-26076)

మానవత్వమనగ మనసు మాట క్రియయు

అన్ని ఒక్కటిగనె అతికియుండు

మనసునందు ఒకటి మాటయు క్రియయును

వేరువేరులైన విలువదేమి?(467-240987)

మానము, మౌనము రెండును

మానవునకునెల్లవేళల మాన్యతదెచ్చున్​

మానవిహీనునకెందున్​

మానుగ సౌఖ్యంబుగలదె మహిలో పుత్రా!(468-

మానవత్వమొచ్చె మాధవులోనుండి

మాధవత్వమేల మరుగుపడియె?

మాయ మాయ యిదియె మహిలోన నరుడయ్యె

మాయనరుడె కాదె మానవుండు.(469-061092)

మాను దిద్ద వచ్చు మరి వంపు లేకుండ

దిద్దవచ్చు రాయి తిన్నగాను

మనసు దిద్దగలర మరి వంపు లేకుండ

ఉన్న మాట తెలుపుచున్న మాట.(470-230502)

ముక్తి కోరి నరుడు ముక్కోటి దేవతల్​

వేడుచుండుగాని వెతలుబోవు

తనదులోని అహము తాజంపగలిగిన

ముక్తి ఏల? తానె ముక్తి కాడె.(471-250283)

ముక్తియనగ వేరాకసమునను లేదు

చిత్తవృత్తులడంచి నిశ్చింతనుండు

స్థితియె మోక్షము దాన నశించు మాయ

ఆత్మయేయగు సర్వమన్యంబుగాదు.(472-

ముడుపులందుచు ధనమును మూటగట్టి

బిచ్చగానికి మెతుకైన పెట్టకుండ

వెంకటేశుని హుండిలో వేయు లోభి

సత్యమును దెల్పుమాట ఈసాయిమాట.473-

మోహమందున మునుగును మూర్ఖబుద్ధి

ముక్తియననేమొ తెలియదు ముగ్ధబుద్ధి

చెడ్డయననేమొయెరుగదు దొడ్డబుద్ధి

చెడ్డ చేయుచునుండును గొడ్డుబుద్ధి.(474-

మేఘములు మింటిపైనను మెదలుచుండ

వాటి దాపున విద్యుత్తు వరలునట్లు

విద్య వెనుకను జ్ఞానంబు వెలయవలయు

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు.(475-030881)

మేలుచేసిన వానికే కీడుచేయు

కూడు పెట్టిన దాతనే కూలదోయు

విద్య చెప్పిన గురువునే వెక్కింరించు

ఇదియె ప్రోగ్గెస్సు ఈనాటి విద్యయందు.(476-221186)

మనసనునాయుధంబు మన మానవ జాతికినిచ్చె తొల్లి యీ

మనసును శిక్షలో నిలుపు మానవుడె విజయుండు భూమిపై

మనసుకు దాసుడైన మహి మానవుడెన్నడు శాంతిసౌఖ్యముల్​

కనుగొన జాలినట్లు వినగల్గుట కల్గదు స్వప్నమందునన్​.(477-211184)

మలినపు కొంప రోగముల మ్రగ్గెడు సేవకగంప జాతసం

చలనముపొందు దుంప భవసాగరమీదగలేని కంప అం

బుంబులపొది  లెమ్ము చూడ మన ముప్పుదలంపగ దేహమింక ని

శ్చలమని నమ్మబోకు మనసా! హరి పాదములాశ్రయింపవే.(478-200585)

మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్​

నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండినందాక ఎం

తోయల్లాడిన ఈ శరీరమిపుడిందుం కట్టెలన్​గాలుచో

ఆ యిల్లాలును ఆకుమారుడును తోడై రారు తప్పింపగన్​(479-060889).

మకర సంపీడిత మత్తేభమును నాడు

వీక్షించి బ్రోచు నా ప్రేమఫలము

వలువలూడ్చెడునాడు వైదర్భి వదినను

వడిగాచినట్టి యవ్యాజ కరుణ

ఆహ్లాదమొప్ప నా ప్రహ్లాదు సరగునన్​

పాలించినట్టి యపార కృపయు

దుష్టులన్​ దెగటార్చి శిష్టులన్​ దరిచేర్చ

పలుమార్లు పుట్టు నా చలువ యెల్ల

తెలిసికొమ్ము కస్తూరి నా తేనె మనసు

జన్మదినమున దీవెనలందుకొమ్ము!(479-1-

మతములన్నియు వేరు మార్గంబు ఒక్కటే

వస్త్రభేదము వేరు దారమొకటె

శృంగారములు వేరు బంగారమొక్కటే

పశుల వన్నెలు వేరు పాలు ఒకటె

జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే

కులములన్నియు వేరు పుట్టుకొకటె

దర్శనంబులు వేరు దైవంబు ఒక్కడే

పూల వన్నెలు వేరు పూజ ఒకటె

తలియలేకను మానవుల్​ తెలివిదప్పి

బ్రతుకు కోసము బహుబంధ బద్దులైరి

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!(480-1-170290)

మనసందు అత్యంత అనురాగ భోగాది

భాగ్యంబు కాపాడు భవ్యజనులు

స్వపర భేదము లేక సర్వజీవులయందు

సమభావమును చూపు సరస జనులు

అనిశంబు అత్యంత అనురాగ భోగాది

భాగ్యముల్​ కల్గెడి భవ్యజనులు

కష్టజీవులయందు కరుణ చూపించుచూ

దాతృత్వమును జూపు ధన్యజనులు

సంసారధర్మ సత్యత్వ సుజ్ఞానులై

పరులకాదర్శంబు చూపు జనులు

భువిని సత్కీర్తిగాంచి సన్మార్గమరసి

తోటివారలలో సదా మేటియగుచు

నిత్యమును ధర్మజిజ్ఞాస నిరతులగుచు

ఉత్తమోత్తమ వ్యక్తులై ఉంద్రు గాక.(481-1

మరిమరి నన్నట్లు మాయలో త్రోతువా

రాధమ్మతో చెప్పి రచ్చ చేతు

ఇట్టులేనిక్కట్లు పట్టుగాజేతువా

భక్తాళి కెరిగించి పరువు తీతు

ఇపుడైన నా కోర్కె నెరవేర్పకుంటివా

గోపికాళికి చెప్పి గోలచేతు

చూడక నన్నిట్లు శోధించుచుంటివా

మా యశోదమ్మతో మనవిజేతు

నన్ను నీవేమి చేసిన నిన్ను విడుతు

ననుట ముమ్మాటికిని కల్ల నందతనయ!

స్వప్నమందైన విడువ నీ పాదములను

అరసి నన్నేలుమా నీవు సారసాక్ష.(481-181072)

మేథమేటిక్సును మరువక జపియించు

గణితశాస్త్రము వంకజూడబోడు

అమెరికా మార్గంబునరయజూచునుగాని

కాశికా మార్గంబు కానరాడు

ఆల్జిబ్రాయంతను అరసిజూచునుగాని

ఇంటి వైశాల్యమునెరుగబోడు

అనుదినంబును డ్రిల్లుననుసరించునుగాని

పద్మాసనము వేయ బాధ పడును

వృక్షశాస్త్రమెరుగు సమృద్ధిగను తులసి

ఉపయోగమెరుగడు మానవుండు.(482-

మైత్రియు కరుణయు మాన్యముపేక్షయు

వాసనల్​ నాలుగై వసుధనుండె

సుఖకరంబుగనుండి సుఖమందు జనులతో

సఖ్యంబై మైత్రితో జనులకెల్ల

దుఃఖితులనుజూచి దూరంబు పోవక

కనికరించుటదియె కరుణయగును

పాపాత్ములంజూచి పరిహసించుట కన్న

వీక్షింపకున్ననుపేక్షయగును

పుణ్యవంతులజూచి పూని కొల్చుచునుండి

సంతసించుట మాన్యసరణియగును

ఇట్టి వాసనల్​ ధరగలయట్టి జనుల

నాదరించును శ్రీహరి అధికముగను

దర్శనంబును తానిచ్చు తనియజూచు

సంతసంబున వారిని చెంతజేర్చు.(483-

మేనమామంచని మేలుగానెంచక

కంసభూపాలుని హింసజేసె

స్త్రీయని యింతయు చింతయే లేకను

తాటకి గాత్రంబు తరిగివేసె

బిక్షమడిగిన లేదనకిచ్చె బలియును

అతని పాతాళంబునకణగ ద్రొక్కె

ఏమందు దయలేని హరిని భువిని.(484-280686)

మౌళిగుల్కెడు చంద్రమఃఖండ కళతోడ

బెడగారు గుల్కెడు జడలతోడ

జడలలో ప్రవహించు చదలేటి జిగితోడ

డంబైన ఫాలనేత్రంబుతోడ

నల్లనేరెడువంటి నల్లని మెడతోడ

కరమున నాగకంకణముతోడ

నడుమును చుట్టిన నాగచర్మముతోడ

మైనిండ నలరు భస్మంబుతోడ

నుదుట తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో

తాంబూల రాగాధరంబుతోడ

ఆరు శాస్త్రములందున నందగించి

నల్ల కలువల హసియించి కొల్లలాడు

మెరుగు చామనచాయ మేనితోడ

పర్తివాసుడు నేడు సాక్షాత్కరించె.(485-130302)

మాయయందు పుట్టి మాయయందు పెరిగి

మాయనెరుగలేరు మందమతులు

బ్రతుకుట మాయ పుట్టుట మాయ

సంసారమ్ము మాయ చావు మాయ

భవబంధములు మాయ బాగుగానెరుగరే!

మాయ బ్రతుకటంచు మాయలో పడనేల?(486-300796)

మాట ఒకటి వినరె మంచిమాట ఒకటి వినరె

మాట వినక పిచ్చియాటలాడుదురె ||మంచి||

మాటిమాటికి రాదు మానవ జన్మము

బాట ఒకటేరా బాయకురా దాని నీవు ||మంచి||

వాసనలు వదల వగతెలియక మీరు ఆశలు అరమరచేతిరేమి

వాసనక్లేశము ద్వేషము వదలి దాసుడై సాయీశుని వేడుము ||మంచి||(486-1-

మాయకు లోనాయె మాయకు మీదాయె

మాయా యిరవైఐదు మర్మములాయె

మాయా యిరవైఐదు మర్మముదెలిపితే

మాయలోన గుట్టు దా మరినిల్వదాయె. (487-

మురళిగాన విలోల గోపాలబాలా

మోము చూపవదేల గోపికాలోలా?

మాతృదేవి ప్రేమ మరచితివో తండ్రీ!

మధురకే పోయితివా? మమత వీడితివా?

ఇదిగిదిగొ వత్తువని యిందాక చూచితిని

నిలువజాలను రార! నిను వీడి మనలేనురా!(488-190673)

మేము జలకమాడుచుండ చీరలన్ని మూటకట్టి

పొన్నచెట్టుపైననుండి ఎంత వేడిననీయడమ్మా

అడగవె తల్లి! అడగవె

అర్థరాత్రివేళ మా మిద్దెలెక్కి వచ్చి

నిద్రపోవు స్త్రీల జడలెత్తి కట్టి వచ్చె

అడగవె తల్లి! అడగవె

అమ్మా! నేను నీదు పక్కలో కదలక మెదలక పడుకొనియుంటినే

అర్థరాత్రివేళ నేనెప్పుడు వెళ్లివస్తినో చెప్పవే తల్లి చెప్పవే.(489-040996)

మోహనమురళీనూదుచునొకపరి

 గానము చేయగదె బాబా గానము చేయగదె |మోహ|

 కఠిన హృదయములు పాషాణంబులు

కరగికరగి నీరై ప్రవహింపగ

మోహనమురళినూదుచునొకపరి

గానము చేయగదే కృష్ణా! గానము చేయగదె |మోహ|

ప్రేమరహితమగు భూములలో

ప్రేమావేశముతో

ప్రేమసుధావర్షము వర్షింపగ

ప్రేమనదులు ప్రవహింపగ మురళీ

సకల మహీధర వనసంయుతమై

జలనిధి జంతువితానయుతమై

సంతోషంబలరా ప్రకృతి సతీమణి పరవశతను

నీ చెంతనె నృత్యము చేయుచు

మురళీ గానము చేయగదే కృష్ణా! గానముచేయగదే!(490-190673)

మనసొకచో నిలువదాయె ఏమి పాపమో

మర్కటమై తిరుగసాగె ఏమి శాపమో

ఇది నాది అది నాదను తాపత్రయమెక్కువాయె

నిలకడన్నదేలేక నిధిపైనే మనసాయె

మనసొకచో నిలువదాయె ఏమి పాపమో

మర్కటమై తిరుగసాగె ఏమి శాపమో

మల్లెపూవులాంటి మనసు నీ పదములకర్పితము

కలకాదు నిజము ఈ జీవితమే సమర్పితము (490-1-17-07-1988)

 యుగయుగంబులనుండి యీయుర్విపైన

ఖ్యాతిగన్నట్టి భరతమాత కీర్తి

సాయి సిద్ధాంతములచేత సానబెట్టి

వన్నెబెట్టుడు మీరింక సున్నితంబుగ.(491-

యోగియైనను మరి భోగియునైనను

సంసారైనను సన్యాసైనను

స్వాంతము సత్యముననుభవించితే

యానందమె ఆనందమునందము.(492-300593)

‘యస్​’ అనువారికి ‘యస్​’ అనురా

‘నో’ అనువారికి ‘నో’ అనురా

‘నో’,’యస్​’లు మీ నోటికిగాని

సాయికి సర్వం ‘యస్​,యస్​,యస్​’.

యం.యేలు బియ్యేలు ప్యాసయి వచ్చియు

పేరుగాంచిన పెద్దవారలైన

సంపదలుండియు సద్దాన పరులయి

పుడమి కీర్తి గనిన పుణ్యులైన

ఆయురారోగ్యంబు లనవరతమునుండి

పరిపూర్ణ బలులగు వారలైన

సతతంబు తపములు జపములు సేయుచు

వేదంబులను నేర్పు విప్రులైన

సాటిరారు భక్తులకు నేనాటికైన

దైవమును కొల్వనిదె రాదు భక్తి

దైవ భక్తులు కానిదే రాదు ముక్తి

ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!

యుగధర్మ పద్ధతుల్​ విగళితమైయుండ

నయమార్గమునదిప్పి నడపుకొరకు

లోకంబులెల్ల కల్లోలమై చెడియుంట

నిష్కల్మషముచేసి నిలుపు కొరకు

దుర్మార్గ వర్తనుల్​ త్రుళ్ళుచునుండుట

సాధు సంరక్షణ సలుపు కొరకు

కాల సందిగ్ధ విగ్రహసూక్తులైయుంట

భాష్యార్థ గోప్యముల్​ పలుకు కొరకు

క్ష్మా భరము బాపి భూదేవి మనుపు కొరకు

త్రేతనొసగిన కోర్కెలదీర్చు కొరకు

అవతరించెను అచ్యుతుడవనియందు

వాసుదేవాఖ్య శ్రీసాయి వసుధశౌరి.(493-231179)

రిత్త కోరికలను మోపునెత్తుకొనుచు

తిరుగుచున్నారు నిజరూపు తెలియలేక

తిలలయందున తైలంబు వెలయునటుల

దేవుడున్నాడు మీలోన తెలియరయ్య.(494-081089)

రేయింబవళ్ళు సాయంపొద్దులు

చలివేసవులు సారెకు మారును

కాలక్రీడల గతిచేనాయువు

అయినా వదలదు ఆశావాయువు.(495-280593)

రక్తము మాంసశల్యముల రాశియు దేహము మీరు కాదు సు

వ్యక్తము కాని కోరికలు వ్యర్థమనస్సును మీరు కాదుగా

ముక్తికి బంధకారమగు మోహపు భ్రాంతియు మీరు కాదు మీ

శక్తిని మీరెరుంగగల శాశ్వితుడౌ పరమాత్మ మీరెగా!(496-200590)

రఫుపతి కార్యంబీడేర్చిన కపిరాజ శిఖామణి యితడయ్యా!

అధములు పురిగొని జగముల వెలసిన హనుమత్కరుడు యితడయ్యా!

పరిపరి లంకాపురమునుజొచ్చి పురమరసిన వాడితడయ్యా!

పరిపరి విధముల జానకి వెదకిన అమిత పరాక్రముడితడయ్యా!(497-

రామనామము మిఠాయి యిదిగో రండి భక్తులారా!

వేదసారము గోధుమపిండిలో వేదవాక్యమను క్షీరము పోసి

ఆనందమనే పెద్ద బాండువ తీసి ఆదిమునులు దీనిని బాగుగ కలిపిరి ||రామ||

రుచికరమైనది రామమిఠాయి సకలరోగనివారణమోయీ

ఒకేక కాసైన ఖర్చులేదోయి ఆనందముగ మీరు అందుకోండోయి ||రామ||(497-1-

23-11-1987

రామరామ రామసీత …. రామరామ రామసీత

శ్రీమద్రవికులమందు జనించి సీతాదేవిని ప్రీతి వరించి

ప్రేమనహల్యా శాపముదీర్చి ప్రియభక్తుల రక్షించిన శ్రీరఫు        ||రామ||

గురువాజ్ఞను వనమందొనరించి గుహుని భక్తికానందము చెంది

పరమాదరమున భరతునిగాంచి పాదుకలొసగిన పావనచరితుడు   ||రామ||

ఖరదూషణాది దనుజుల ద్రుంచి కరుణ జటాయువు గతి సవరించి

శరభంగాది మునీంద్రుల బ్రోచి శబరి ఫలములు ప్రేమ భుజించిన |రామ||

ముందుగ హనుమంతుని దీవించి ముదమలరగ రవిసుతు పాలించి

చెంగిన కినుకతొ వాలిని ద్రుంచి చేరిన వానరవీరుల బ్రోచిన      ||రామ||

పావని సాహస మొరలాలించి ఆ వనరాశని నీట బంధించి

మోదము మీరగ లంకనుజేరి ఆదరముగ విభీషను బ్రోచిన       ||రామ||

రావణాది సురవైరుల ద్రుంచి రమణితోడ సాధుల పాలించి

దేవతలెల్ల నుతింపగజేసి దేవిగూడి పురిజేరిన శ్రీరఫు     ||రామ||

నిజ సహోదరులు నిను సేవింపగ నిన్నుగూడి ప్రజలెల్ల సుఖింపగ

అజహరాది సురులెల్ల నుతింపగ ఆనందముతోనయోధ్యనేలిన     ||రామ|| (498-

180673)

రారా గోపాలబాల నీ చరణ రాధను కానా

ఘల్లుఘల్లుమని మ్రోగ కాళింగ పడగపై నిలచి

థిమిథిమ్మని ఆడినవాడు మా దేవర నల్లని వాడు

మా దీనత బాపిన వాడు మా దిగులే తీర్చిన వాడు.(499-

రాబోకు రాబోకురా చందమామ

రాబోకు రాహువు పొంచి ఉన్నాడు త్రోవలోనా

 తరులెక్కి గిరులెక్కి తిరిగి చూచేవు

మబ్బుమేఘములలోన మాయమ్యేవు ||రాబోకు|| (499-1-1985 శివరాత్రి)

రార మా ఇంటిదాక రార మా ఇంటిదాక

రఫువీర సుకుమార నే మ్రొక్కెద  ||రార||

రారా దశరథకుమారా నన్నేలుకోరా నే తాళలేరా ||రార||(499-2

రారే చూడగ పోదాము రాముని పెండ్లి

శ్రీలు మించిన దిక్కుటాలు

వింతల బంగళాలు ముత్యపు తోరణాలు

మూలల కిటికిటీలు వజ్రాల తలుపులు

తాపిన నీలాలు నీలాలు వేయార్లునూరార్లు బజార్లు

స్త్రీలకెక్కువ భూషణాలు ఉత్తర ద్వారాలు

సీతకు రాముడు సూత్రము కట్టుతాడు

ఇద్దరినొక్క ఈడుజోడుగ కూర్చినాడు

సీతకు తగువాడు శ్రీరాముడు ||రారె||

మంచిమగల కడనుంచి సిగ్గున తలవంచి

వశిష్ఠు రప్పించి ఖడ్గములు తెప్పించి

దూలాలపై గుప్పించి యిప్పించి

రప్పించి మెప్పించి ||రారె||(500-210596)

రామా నీ దయ రాదా ఆనందనిలయా రామా నీ దయ రాదా

ముందు జన్మాంతర ఫలమేమందు మాతుపితబంధు

నీవనుచు నమ్మియుందు దయాసింథోరామా (500-2-22-05-1996)

లావుగలవాని కంటెను

భావింపగ నీతిపరుడు బలవంతుండౌ

గ్రావంబంత గజంబును

మావటివాడెక్కినట్లు మహిలోగనరే!9501-

లోకమందు పెక్కు భీకర కృత్యముల్​

జరుగు కారణంబు అరయవలయు

స్వార్థరహిత సేవ సన్నగిల్లుటచేత

అర్థరహిత వాంఛలధికమయ్యె.(502-281089)

లోభివానిజంప లోకంబులోపల

కొట్టవద్దు వాని తిట్టవద్దు

ధనమునడిగినంత దబ్బున తాచచ్చు

ఉన్నమాట తెలుపుచున్న మాట.(503-

లోని శత్రువులకు లొంగిపోయినవాడు

బయటి రిపులనెట్లు పట్టగలడు?

తత్త్వమెరిగినంత ధన్యుడౌ నరుడిల

ఉన్నమాట తెలుపుచున్న మాట.(504-0910860

లోకములన్నియున్​ ఘడియలోన జయించినవాడవింద్రియా

నీకముజిత్తమున్​ గెలువనేరవు నిను నిబద్దుజేయు నీ

భీకర శత్రులార్వుర ప్రభిన్నులజేయుము ప్రాణికోటిలో

నీకు విరోధి లేడొకడు లేడు, నేర్పునజూడుము దానవేశ్వరా!(505-

లెమ్ము థనుంజయా! విధి బలీయము ధర్మము గెల్చు నిల్చు స

త్యమ్ము, నశించు స్వార్థము సదా యుగధర్మమిదే కదోయి క

న్గొమ్మిక నంత్యకాలమున నూర్గురు బిడ్డల తండ్రికైన పిం

డమ్మిడు దిక్కుకల్గ రకటా! గ్రహచారము తప్పివచ్చినన్​.(506-100893)

వడ్లుజల్లునెడను వరిచేను పండును

పేలములనుజల్ల పెరుగునొక్కొ

జన్మరహితుడగును జ్ఞానార్థుడగుటచే

వినుము భారతీయ వీరసుతుడ!(507-

వదలవలయునునీ జగద్భావములను

తెలియవలయును నీ జీవదివ్యతత్త్వ

మరుగవలయు బ్రహ్మపదము

కలుగు ఆనందమిదియని తెలుపతరమ!(508-040187)

వదలవలసిన దానిని వదలినంత

తెలియవలసిన దానిని తెలిసినంత

చేరవలసిన దానిని చేరినంత

కలుగు ఆనందమిదియని తెలుప వశమె!(509-2-040187)

వ్యక్తిగా జీవుడే సమష్ఠిగనుజూడ

ఈశ్వరుండగు, రెండునునశ్వరములె

కారణముగూర్చి వెతకిన కానరాదు

నిర్గుణానందబ్రహ్మమె నిలచియుండు(510-.

వ్యక్తి మోక్షము కోరుట స్వార్థమగును

తాను గమ్యము చేరుట ధర్మమగున!

పరుల గమ్యము చేర్చుటే పాడియగును

ఇట్టి మనుజుడే నిజమైన మానవుండు.(511-

వాన వచ్చినంత వసుధపై పండునె

ఫృధ్వి నాటకున్న విత్తనములు

విత్తనంబు నాట వెలయెంత పెట్టినా

వాన లేకయున్న ఫలము సున్న.(512-150493)

విద్య డిగ్రీల కొరకని వెఱ్ఱివీడి

సేవకా వృత్తికై మీరు చేరబోక

స్వీయదేశీయ సౌభాగ్యమరసి

జగతి శ్రామిక విద్యలన్​ చదువ వలయు.(513-221191)

విద్య నేర్పిన వానినే వెక్కిరించు

కూడు పెట్టిన వానినే కూలద్రోయు

మేలు చేసిన వానికే కీడుచేయు

ఇదియె ప్రోగ్గెస్సు ఈనాటి విద్యయందు (513-1-28-05-1991)

విమలభావంబు కలుగుటే విద్యయగును

సరసగుణములు కలుగుటే చదువులగును

సహజభావము కలుగుటే సరసమగును

మంచి నడతలు కలవాడె మానవుండు.(514-020789)

విలువలేని యినుప పెట్టె ఈ దేహము

పెట్టెలోన నగలు పెట్టినట్లు

దేహమందు ఆత్మదేవుడుండెను సుమా

సత్యమైన బాట సాయి మాట.(515-210590)

వివిధ శాస్త్రచయము వేదవేదాంగముల్​

జీవి మనసు తెరను చీల్చలేవు

తెరకు యివల జీవి దేవుడవ్వల నుండు

కార్యమివలనవల కారణంబు (516-040986)

విశ్వమందు విభుడు వెల్గుచునుండును

విభునియందు వెలుగు విశ్వమెపుడు

విభుడు వెలగకున్న విశ్వంబు వెలుగదు

విశ్వవిభుల మైత్రి శాశ్వతంబు.(517-080387)

విశ్వచింతజేయు విజ్ఞాన రహితుడు

విష్ణుచింతజేయు విబుధవరుడు

ఒకడు విశ్వమొందునొకడు విష్ణుని పొందు

ఉన్నమాట తెలుపుచున్న మాట.(518-050996)

విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్పు

సంకుచిత భావములనెల్ల సమయజేసి

ఐహిక సహజీవనాదికమెల్లగూర్చి

సమత నేర్పుటయె కాదె సరసవిద్య.(519-200596)

విశ్వహృదయమందు వినపించు ప్రణవము

వినుడు శ్రద్ధతోడ వీనులలర

కామ్యముక్తులనిడ కల్పకంబిదెసుమ్మి

మరువబోకుడిట్టి మంచిమాట.(520-011087)

విరుల వాసనకాదను వెఱ్ఱులుండ

వెన్నెల దుఃఖమిచ్చునను వికటులుండ

మధుర ద్రవ్యము వలదను మనుజులుండ

సాయిసంస్థల దెగడు దౌర్భాగ్యులుంద్రు.(521-

వేదములు చెప్పునట్టిదె విహితకర్మ

చెప్పబడనట్టివెల్ల నిషిద్ధకర్మ

విధి నిషిద్ధమెవ్వారు విస్మరింత్రు

వాని పాపాత్ముడని వేరు ఎన్ననగునె.(522-

వేదవిద్యలన్ని వెలయంగ చదివియు

నేర్పు మాటలందు నిపుణులయ్యు

సద్గుణుండు కాక సంస్కారి కాకున్న

పదునులేని భూమి పండనట్లె.(523-

వేదవేదాంగములు వల్లెవేసియున్న

గద్యపద్యంబులను పాడగల్గియున్న

చిత్తశుద్ధి లేకున్న చెడును వాడు

సత్యమును దెల్పుమాట ఈసాయి మాట(523-1

వేదవేదాంగముల వల్లెవేయవచ్చు

పద్యగద్యంబుగూర్పజేయవచ్చు

చిత్తశుద్ధియె శ్రుతులకు జీవనాడి

సామవేదపు ఊట శ్రీసాయిమాట (523-2-04-10-1989)

వానలు వచ్చెనంచు భువి పండునే విత్తులు నాటకున్న ఆ

వానలు రానిచో ఫలము వచ్చునె బీజము నాటియున్ననెం

దైనను రెండు కూడిన మహత్తర సిద్ధి లభించు సుమ్మి దై

వాను గతిన్​ లభించు పురుషార్థ విధానము మేలునిచ్చటన్​.(524-030292)

విశ్వస్తుత్యుడు శక్రసూనుడు మహావీరుండు ఘోరాసిచే

నశ్వద్థామ శిరోజముల్​దరగి చూడాంతర్మహారత్నమున్​

శశ్వత్కీర్తి వెలుంగబుచ్చుకొని పాశవ్రాత బంధమ్ములన్​

విశ్వాసంబుననూడ్చి త్రోచె శిబిరోర్వీభాగము బాసిపోన్​.(525-290896)

వెఱువక కుంభజాతి కురువీరులపై మృగరాజువోలె నే

నుఱుకుచునుండ ఖండనికరోన్నత దివ్యమహాస్త్రపంక్తి నిం

బఱుపుచు గెల్చి రమ్ము సుత భద్రము నీకగునంచు పల్కకీ

తెఱగున పోకుపోకుమని తీవ్రతనాపుట నీకు పాడియా!(526-210793)

వెఱచినవాని దైన్యమున వేదననొందినవాని నిద్ర మై

మఱచినవాని సౌఖ్యమున మద్యము ద్రావినవాని భగ్నుడై

పఱచినవాని సాధుజడభావమువానిని కావుమంచు వా

చఱచినవాని కామినిన్​ చంపుట ధర్మముకాదు అర్జునా!527-210596)

వాల్మీకి ఎవ్వని వంశమందలివాడు?

నందుండు ఏ పల్లెయందు పుట్టె?

ధర కుచేలుండెంత ధనవంతుడైయుండె?

గజరాజు ఏ విద్యగలిగియుండె?

వసుధ ధ్రువుండెంత వయసు కలిగియుండె?

శబరికినెంతటి శక్తియుండె?

విదురునకెంతటి వితరణమతియుండె?

తిన్ననికెంతటి తెలివియుండె?

భక్తి కలిగిన వారికి వశుడనయ్య

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!(528-

విద్య నేర్చితినంచు విఱ్ఱవీగకబోకు

భాగ్యవంతడనటంచు పలుకబోకు

ధనవంతుడనుచు తరచు నిక్కగబోకు

పుత్రవంతుడటంచు పొగడబోకు

నేను దాతననుచు నెగడుచుండగబోకు

భృత్యుడను నేనంచు పొగడబోకు

శౌర్యవంతుడటంచు సంతసిల్లబోకు

కార్యశూరుడటంచు కరగబోకు

నలుగురికి మెప్పుగా నీవు నడచుకొన్న

నళినదళనేత్రుడు నిన్ను ఆకర్షించునయ్య

నళినదళనేత్రుడు నిన్ను ఆశార్వదించునయ్య (528-1-03-10-1989)

     విషయవాంఛలు నిన్ను వెంటాడు తరినీవు

నోరెత్తి సాయీశ శరణమనుము

కష్టపరంపరల్​ కాల్దువ్వినపుడు

కరమెత్తి సాయీశ కావుమనుము

సంసార తాపముల్​ సంఘటిల్లినప్పుడు

మనసార సాయీశ మరువననుము

మది దురహంకారమొదవినయప్పుడు

తలవంచి సాయీశ దాసుడనుము

సత్యభాషివై సాయీశు సాక్షిగనుము

మోక్షమాశించి సాయీశు మ్రోలమనుము

విశ్వమోహన గానము వీనులలర

ఆలపించిన శ్యాముడే ఆతడు నమ్ము.(529-

విష్ణువే గొప్పని వైష్ణవులనుచుండ

శంభుండు గొప్పని శైవులనగ

గణపతి గొప్పని గాణపతులు పల్క

శారద గొప్పని చదువరులన

అల్లాఘనుడటంచునల్ల తురకలు చెప్ప

శాక్తేయులందరు శక్తియనగ

నేను గొప్పయటంచు నాదు భక్తులు చెప్ప

అందరొక్కటేయని కొందరనగ

సర్వమత సమ్మతముగను సత్యమైన

బ్రహ్మమొక్కటేయని మీరు పలుకవలయు

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!(530-251289)

వేదశాస్త్రమ్ములు వివరించి బుధులచే

చదివించ వచ్చు తా చదువ వచ్చు

యజ్ఞయాగ తపములధికార జనులచే

చేయించ వచ్చు తా చేయవచ్చు

ఇలలోనగల తీర్థములనేగనన్యుల

బోధించ వచ్చు తా పోవ వచ్చు

అష్టాంగయోగంబునర్థులకును బోధ

సలుపంగ వచ్చు తా సలుప వచ్చు

కాని తన మనోబుద్ధ్యహంకారములను

నిల్పి అంతర్ముఖము చేసి నియతితోడ

నిశ్చలసమాధి నిష్ఠులై నిలువ లేరు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!(531-031089)

వేదాలు ఈనాడు వాదాల పాలాయె

శాస్త్రంబులన్నచో చప్పబడియె

బహు పురాణంబులు పాతవైపోయెను

శతకంబులన్ని యుజడ్డువడియె

గ్రంధరాజంబులు గంగపాలైపోయె

చక్కనౌ నీతులు చెదలుబట్టె

గురురాజులందరు బరువు భారంబైరి

పెద్దలందరు వట్టి మొద్దులైరి

కల్లలాడు వాడీనాడు పురుషవరుడు

విత్తమున్నట్టివాడె పో ఉత్తముండు

ఔర! కలియుగ ప్రభామేమియందు!(532-

వృక్షంబువై నీవు వర్థిల్లుచుండిన

వల్లికనై నేను అల్లుకొందు

పుష్పంబువై నీవు పొలుపొందుచుండిన

తుమ్మెదనై నేను తిరుగుచుందు

అనంతమైనట్టి ఆకాశమీవైన

చిన్ని చుక్కగ నీలోన చెలగుచుందు

వర సముద్రుడే నీవైయుండిన

వాహినియై నేను ఐక్యమగుదు

మేరుపర్వత భవ్యమేదిని నీవైన

సెలయేటినై నేను చెలగుచుందు. (533-170673)

వాచామగోచరుండవు

నీ చరితములు పొగడ బ్రహ్మాదులకైన తరమా!

హే కృష్టా! కాచుకున్నాను నా మొర ఆలకించి బ్రోవుమయ్య

కాలుడుగొనిపోయిన గురుపుత్రుని తెచ్చి యిచ్చినావు

కాముని మదమణచినావు వసుదేవదేవకీ చెర విడిపించినావు

వెలదియొంటియైన ఆ ద్రౌపది ‘హాష్ణా!కృష్ణా!’ యని మొరలిడ

బ్రోచినావు మేలు పాండవులను గాచినావు.

కుచేలుని ఆర్తిదీర్చినావు

కురూపియైన కుబ్జ వక్రములను పోగొట్టినావు.(534-240783)

వినండయా బోధ వినండయా విని సత్యమార్గమున నడవండయా

నిదురలేచినదాది నిదురపోయెడుదాక ఆస్తికై కుస్తీలు వేస్తారయా

రూపాయి కోసమై లోపాయికారిగా అడ్డమైన గడ్డి తింటారయా

ధనం కోసం దైవధ్యానాలు బోనాలు పెక్కు పన్నాగాలు పన్నేరయా

భమి సూర్యుని చుట్టు జనులు ధనము చుట్టు గిరగిరా తిరుగుతుంటారయా

లింగలింగాయంచు లింగపూజలు చేసి దొంగసాధనలు మీరు చేస్తారయా

స్వార్థంబుకై కీర్తిమర్యాదలాశించి ధూర్తకార్యాలు మీరు చేస్తారయా

కలిమి కల్గిననాడు కప్పగంతులు వేసి కలిమి పోయిననాడు క్రుంగిపోయేరయా

గొప్పకు పోతారు గోవింద కొడతారు డాబులు దంబాలు మానండయా

సర్వభూతములందు సర్వేశ్వరుని మీరు సమముగానెప్పుడు చూడండయా.(535-230290

వింటగత్తెల చెంతబోకు ఖండితముగ కడు నీచుడౌతావు

కులము వారలు నిను కుండ ముట్టనివ్వరు

బంధువులు నిను చూస్తె బయటకెళ్ళగొడతారు

స్నేహితులు నిను చూస్తె చెప్పుతో కొడతారు.(536-

వెతుకుచున్నాను నేను వెతుకుచునే ఉన్నాను

వెతుకుచుంటి నాడు నేడు నిజమానవ ధర్మపరుని

కొదువలేదు నరులకు నన్నూరుకోట్లున్నారు

నరుని రూపములెజూచితి నిజరూపము కాంచనైతి

బురగ కాయలుజూచి మామిడియని భ్రమసినట్లు

వెఱ్ఱిచెరకు చూచి చెఱకని తా నమిలినట్లు

కలికిరాళ్ళ రూపముజూచి కలకండని భ్రమసినట్లు

రూపుజూచి మోసపోకు గుణమే నిజ నరుని రూపు.(537-140673)

 వేయబోవని తలుపు తీయమంటూ పిలుపు

బాబకెందుకొ నవ్వుగొలుపు

నీలోన నాలోన నిదురచెందే వలపు

మేలుకొంటే లేదు పిలుపు

విశ్వమంతా ప్రాణవిభుని మందిరమైన

వీధివాకిలి ఏదటో!

విశ్వవిభుడే నా వెనువెంటనేయుండ

పిలుపేది తలుపేది వీధివాకిలి ఏది?

వీణతంత్రులు మీటి ప్రాణతంత్రులు నాటి

ఆనందభాష్పములు

ఆత్మార్పణము చేసి కైలాసమే చూడరా

ఓ జీవ! వీధివాకిలి కానరా!(538-

శతపత్రంబుల మిత్రుని

సుతుజంపినవాని బావసూనుని మామన్​

సతతము దాల్చెడి యాతని

సుత వాహనవైరి వైరి సున్నంబిదిగో.(539-

శాంతి అంతరించె సత్యంబు కరువయ్యె

ఆయుధంపు ప్రీతి అధికమయ్యె

ఈ దురంతములకు హేతువు స్వార్థమె

ఉన్నమాట తెలుపుచున్న మాట.(540-290591)

శాస్త్రజాలమునంతయు చదువగానె

దట్టమైనట్టి అజ్ఞాన తమము తెగునె?

ఆచరణలేని విద్యలు అవనియందు

నిండియుండియు ఫలమేమి గుండుసున్న,(541-300987)

శిలల పూజలందు శ్రేష్ఠుడు నీవౌచు

ప్రజల మెప్పు కొరకు పాటుపడియు

ఇట్టి పూజలెల్ల ప్రజలు మెచ్చిరిగాని

శివుడు మెచ్చు సేవ చేయరయ్య.(542-181184)

శ్రీకరంబగు దేవుడు నీకు నరుడ!

పగటివేళ చుక్కలు కానబడని పగిది

కానరాకున్న అజ్ఞాన కారణమున

అంతమాత్రాన అతడు లేడనకు సుమ్మి.(543-

శ్రీపుట్టపర్తి నిలయుడు

కాపాడును నిన్నునెపుడు కరుణాకరుడై

చేపట్టి నిన్ను బ్రోచును

ఏపట్టున విడువకుండ ఏలును నిన్నున్​.(544-030400)

శబ్దమునుండి మరి ఏ యితర శబ్దములన్నియు వ్యక్తమౌనో

ఆశబ్దమె మూలమౌ ప్రణవ అకారఉకారమకారాత్మకం

ఆ శబ్దమె బ్రహ్మవాచకము సర్వము పుట్టి నశించునందు

ఆ శబ్దజపంబె సోహమంచు శాశ్వత బ్రహ్మపదంబుజేర్చుటన్​ (544-1-01-08-1996)

శాస్త్రంబునెప్పుడు సత్యంబుగానెంచు

వేదసమ్మతమగు విప్రులార

దేశంబు కొరకునై దేహమర్పణ చేయు

రహిమించు రాజాధిరాజులార!

ధనధాన్యములు కల్గి ధర్మగుణాలతో

అలరుచుండెడి ఆర్యవైశ్యులార!

వ్యవసాయవృత్తిలో వర్థిల్లుచుండియు

సుఖజీవనము చేయు శూద్రులార!

కాలమంతయునూరక గడపనేల?

సర్వజన సమ్మతంబగు సత్యమైన

భక్తిమార్గముగొనుడిహపరములిచ్చి

సత్యముగ మిమ్ము సాకును సాయిబాబ.

శ్రీమంతులకుగాని చిక్కబోడందురా

భక్తకుచేలు ఐశ్వర్యమెంత?

పండితులకుగాని వశము కాడందురా

నిజముగ గుహుని పాండిత్యమెంత?

సౌధంబులంగాని చరియింపడందురా

సరిసరి విదురుని సౌధమెంత?

తాపసులకుగాని చిక్కబోడందురా

ఉడుత తపంబెంత కడిమ ఎంత?

నాటినాటికి విషయచింతనలు వీడి

నేను నాదను గర్వంబు నేడె  వీడి

శరణు వేడుము శ్రీసత్యసాయిదేవు

పాదపద్మంబు మన్మనో భ్రమరరాజ!(546-

శ్రీవారి సన్నిధి శిరసుంచి మ్రొక్కితి

మన్నింప వేడితిననుము హనుమ

పరిపూర్ణ కాముడు శరణార్థులను బ్రోచు

బిరుదులను నిలుపుకోమనుము హనుమ

దశకంఠుడాడిన నిశితోక్తులన్నియు

గడువిచ్చెనను మాట కడకు చెపుమ

కాకాసురునినాటి కమనీయ ప్రేమంబు

స్రుక్కిపోలేదని చెప్పు హనుమ

రెండుదినములు కలవోలె నిండి చనియె

ఇంక నేనెట్లు భరియింతు నిట్టితీరు

ఇనకులస్వామి నెలలోనెనేగుదెంచి

కొనక యుండిన సీత లేదనుమ హనుమ!(547-

శీర్ష పీఠికమునందేమున్నదోగాని

మ్రోగుచున్నది నిన్ను మ్రొక్కినప్పుడు

హృదయ పీఠికమునందేమున్నదోగాని

తొలుకుచున్నది నిన్ను తలచినప్పుడు

ఈ మనఃపీఠమందేమున్నదోగాని

జారుచున్నది నిన్ను కోరినప్పుడు.(548-

శంకరుడైనను శ్రీధరుడైనను

లంకేశ్వరుడగు రావణుడైనను

నారదుడైనను శారదయైనను

వారథి దాటిన వానరుడైనను

రాగప్రియులే నాదప్రియులే

సంగీతామృత  పానప్రియులే!(549-

శృంగారములు వేరు, బంగారమొక్కటే

పశుల వన్నెలు వేరు, పాలు ఒక్కటే

జీవజాతులు వేరు, జీవుండు ఒక్కడే

పూలజాతులు వేరు, పూజ ఒక్కటే

దర్శనంబులు వేరు, దైవము ఒక్కడే.(549-1-

శ్రీరామా నా మనవిని వినుమా

సీతా శిరోరత్నమె గొనుమా

చెలగి విల్లుల లోపలనున్న చిలుక

రీతిని వణుకుచు నీలుచున్న

పలువురు రాక్షస మగువలెల్లరు

బలిమిని ఖడ్గములూపుచు

తలను ద్రుంచే మంటవైచగ

తల్లడిల్లిన సీతజూచితి. (550-150299)

శృంగారములు వేరు, బంగారమొక్కటే

పశుల వన్నెలు వేరు, పాలు ఒక్కటే

జీవ జాతులు వేరు, జీవుండు ఒక్కడే

పూలజాతులు వేరు, పూజ ఒక్కటే

దర్శనంబులు వేరు, దైవమొక్కడే(551-.

సకల వేదాంత గ్రంథాల సారమెల

ఒక్క వాక్యాన చెప్పుదు నొక్కసారి

సకల జీవులయందున్న ఆత్మ నేను

ఒక్కటేయని మనమున దలపరయ్య (551-1-

సకల సద్గుణంబులు చక్కగా లేకున్న

వాడు నరుడుకాడు వాస్తవముగ

బాలబాలికల గుణములే భారతీయ సంపదని

మీరు హృదయాన చింతింపరయ్య(551-2-16-07-1996)

సకల యత్నములను సతతంబు చేయుట

అధిక విద్య నేర్చి అధికుడగుట

భూమి సాగుచేసి భూచక్రమేలుట

కొలువు కూడ పొట్టకూటి కొరకె.

సంఘ సభ్యుల రుచులను సమయమెరిగి

స్వార్థమైనను విడనాడి సంఘమునకు

మేలు చేకూర్చు విధమున మెలగవలయు

నొవ్వు సేయకు ఇతరుల నొచ్చుకొనకు.(552-

సంఘ మర్యాదలన్నియు గంగ కలసె

మనుజ జాతికి తృప్తియే మాయమయ్యె

శీలనీతులు జగతిలో క్షీణమయ్యె

ఇదియె ప్రోగ్గెస్సు యీనాటి విద్యయందు.(553-300591)

సత్యధర్మమహింసయు శాంతిప్రేమ

మానవుని పంచ ప్రాణాలు మహిని వెలయు

పంచప్రాణాలలో ప్రేమ ఎంతొ హెచ్చు

కాన హృదయాన ప్రేమను గట్టి పరచు.(554-240187)

సత్ప్రవర్తన సద్బుద్ధి సత్యనిరతి

భక్తి క్రమశిక్ష కర్తవ్యపాలనంబు

నేర్పునదె విద్య విద్యార్థి నేర్వవలయు

సత్యమును తెల్పు మాట శ్రీసాయి మాట.(555-010881)

సత్సంగముచే సహజ విరక్తి

ఆ విరక్తిచే విగత భ్రాంతి

భ్రాంతి వీడితే శాంతి స్థిమితము

స్థిమిత శాంతిచే జీవన్ముక్తి!(556-

సత్యంబునందుండి సర్వంబు సృష్టించె

సత్యమందణగెను సర్వ సృష్టి

సత్యమహిమ లేని స్థలమేది కనుగొన్న

శుద్ధసత్త్వమిదియె చూడరండి.(557-240591)

సత్య వాక్కు చేత సన్మానములు కల్గు

సత్యవంతుడగును సర్వ సఖుడు

సత్యగుణముకంటె సాటిగనేమిటి?

వినుము భారతీయ వీరసుతుడ!(558-220596)

సత్యవాక్కువలన సన్మానములుకల్గు

సత్యయుతుడు సౌఖ్యమనుభవించు

సత్యజీవితముకన్న నిత్యమేదియు లేదు

ఉన్నమాట తెలుపుచున్న మాట (558-1-22-06-1996)

సత్యధర్మశాంతి నిత్యమైయుండిన

ప్రకృతిమాత ఎంతొ పులకరించు

విశ్వశాంతి హెచ్చు విపుల కీర్తులు హెచ్చు

వినుడు భారతీయ వీరసుతుడ!(559-210596)

సద్గురు చరణాబ్జములపై భక్తే

త్వరగా ముక్తిని చేర్చే మార్గము

ఇంద్రియ మానస సాంద్ర నియమమే

హృదయస్థుని చూపించును దేవుని.(560-

సద్గుణంబు లేక సచ్చింతనలు లేక

ధ్యానమందు మనసు పూనగలదె

ఇల్లు కట్టుటకును యిటుకలు సున్నంబు

కలుగకున్న ఇల్లు కట్టుటెట్లు?(561-280990)

సద్గుణంబులు సద్బుద్ధి సత్యనిరతి

క్రమశిక్ష కర్తవ్యపాలనంబు

నేర్పునదె విద్య విద్యార్థి నేర్వవలయు (561-1-28-12-1982)

సద్గుణంబులు త్యాగంబు సత్యనిష్ట

లేని జీవుడు ప్రాణంబు లేనివాడె

సేవ చేయని జీవుండు చీకటింట

అంధ జీవుడంచుననగ వచ్చు.(562-

సన్నజాజి కన్న సంపంగిలత కన్న

జున్నుగడ్డ కన్న వెన్న కన్న

నెమలికన్ను కన్న నిండువెన్నెల కన్న

కన్నతల్లి ప్రేమ సున్నితంబు.(563-

సర్వవేళల సర్వత్ర పర్వియుండు

ఆత్మ కనిపించదేలకోఅంద్రు జనులు

పాలయందున్న వెన్నను కోరినంత

పొందగలుగుట సాధ్యమా ఎందునైన!(564-

సర్పమింటియందు సంచరించుచునుండ

ఏరికి సుఖనిద్ర కోరివచ్చు

విషయ సర్పముండు విషమయ దేహాన

జీవయాత్ర దేహి చేయుచుండు.(565-

సర్వ మృగములందు సామాన్య తెలివుండు

భుక్తిభోగమెల్ల పొందుచుండు

అట్టి నరుడు భువిని వట్టి మృగంబెగా

మనిషి కాడు వాడు మహిని పుత్ర!(566-140884)

సర్వ సద్గుణములు చక్కగా లేకున్న

వారు గురులు కారు వాస్తవముగ

సవినయుండు కాక సచ్ఛాత్రుడెట్లగు?

ఉన్నమాట తెలుపుచున్న మాట(567-271283).

సకల సద్గుణంబులు చక్కగా లేకున్న

వారు నరులు కారు వస్తవముగ

సదయుడుకాక సచ్చరిత్రుడెట్లగు?

ఉన్నమాట తలుపుచున్నమాట (567-1-27-12-1983)

సర్వభూతదయకు సాటి పుణ్యము లేదు

హింసబోలు పాపమెందులేదు

నారు పెట్టువాడు నీరుపోయకయున్నె

ఉన్నమాట తెలుపుచున్న మాట.(568-

స్వర్గమనగ వేరు పరలోకమున లేదు

నరుల మనమునందెనమరియుండు

తనదులోని అహము తా చంపుకున్నచో

అదియె స్వర్గమగును అవనియందు.(569-

స్వర్గమనగ వేరు సురలోకమున లేదు

నరుల లోకమందె అమరియుండు

సద్గుణంబులు కల్గి సరియైన నడతున్న

స్వర్గమేల ఇదియె స్వర్గమగును (569-1-10-09-1990)

సాటి మానవులను సాధింప నీకేల

ధర్మమెపుడు నీవు తప్పకున్న

భారతమ్ములోని పరమార్థమిదియెగా

ఉన్నమాట తెలుపుచున్న మాట.(570-

సాయిమాట సకల సౌభాగ్యములమూట

సాయిదృష్టి సాయిజ్ఞానదృష్టి

సాయిచేయి తల్లికంటెను హాయి

ఈమాట వినరె విద్యార్థులార! (570-1-

సాధనము చేసి ఫలమేమి శమము లేక

యోగమును పూని ఫలమేమి ఓర్పు లేక

జపము చేసియు ఫలమేమి శాంతి లేక

చవిటి భూమిని దున్నిన చాయకాదె!(571-050796)

సాధుజనులను చూచి చౌకను చేతురు

వారికేమి కొరత వసుధయందు

కుంజరమునుజూచి కుక్క లుమొరుగును

దాని ఘనతకేమి తక్కువగును?(572-090996)

స్వపనమునందు గాంచునది సర్వము స్వప్నముగానెతోచు

ఆ స్వప్నము వీడి జాగ్రతకు వచ్చిన ఏమియు కానరాదు

ఆ స్వప్నము మిథ్యతో కలయ సర్వము లయమును పొందుగాని

సవప్నసుషుప్తిజాగ్రతల సాక్ష్యమే నిష్క్రియమైన ఆత్మయు(572-1-21-10-1996)

సత్యధర్మశాంతి నిత్యమైయుండిన

ప్రకృతిమాత ఎంతొ పులకరించు

విశ్వశాంతి హెచ్చు పుడమి కీర్తి హెచ్చు

వినుడు భారతీయ వీరసుతుడ (572-3-23-10-1996)

సాయి అర్థించు మీ నుండి సద్గుణములు

సర్వమానవ సోదర సఖ్యబుద్ధి

స్వార్థ త్యాగంబు పరిశుద్ధ సంఘసేవ

సాయికిచ్చెడి ధనమిదె సత్యముగను.(573-050395)

సాయికున్నట్టి ఐశ్వర్యసంపదలకు

సాటి ఐశ్వర్యమున్నదెచ్చోటనైన

సాయి ఐశ్వర్యమేమన్న స్వార్థరహిత

నిత్యనిర్మల ప్రేమయె నిజము నిజము(574-231186)

స్వీట్ల పేర్లు వేరువేరుగానుండిన

అందులోని చక్కెరంతనొకటె

వ్యక్తులందరు వేరువేరుగానుండిన

అందులోని తత్త్వమొకటె తెలియ.(575-

సుఖములందు నన్ను చూడరు మానవుల్​

కష్టసమయమందు కావుడంద్రు

ఆపదలను నేను అగపడకున్నచో

తిట్టుచుంద్రు ఏమొ పెట్టినట్లు.(576-

సుఖమునందున దుఃఖంబు జొచ్చియుండు

వీని విడదీయ నెవ్వరివశము కాదు

ఎద్ది సుఖములనిచ్చునో అద్ది దుఃఖ

ములిడు, సుఖదుఃఖము రెండు కలిసియుండు.(

సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు

మేటి వస్తువునందున మేటియగుచు

అంతటను సర్వసాక్షియైయలరునట్టి

ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగును(577-

సేవ చేయునట్టి సేద్యంపు పశువును

చేరి చితక కొట్టు చిత్రముగను

రాతిఎద్దును చూచి రక్తితో పూజించు

ఉన్నమాట తెలుపుచున్న మాట.(578-

సౌఖ్యమనుభవింప జాలని లోభికి

ఎంత కలిగియున్న ఏమి ఫలము?

నీరు గతుకు కుక్కకేరెంత పారినా

ప్రీతి కలుగబోదు పిసినిగొట్టు(579-170673).

సత్యనిత్య సుకృతులెల్ల వికృతిరూపు పొందుచుండె

పవిత్ర ప్రకృతి ప్రతిదినము ప్రజల వీడిపోవుచుండె

ధర్మదయాచరణ సతతం వికృతిరూపు దాల్చుచుండె

వేదమాత ఘోషలన్ని విచారమును పొందుచుండె.(580-

సత్యధర్మ ప్రబోధలు చచ్చెననుచు తలచవద్దు

ఆత్మధర్మ ప్రబోధకులు మహాత్ములనుట మరువవద్దు

వారు వేసిన విత్తనాలె విజ్ఞానవృక్షమనుట నిజము సుమ్మి

సత్యానికి స్థిరము కలదు ధర్మానికి జయము కలదు.(581-

సారము లేనియట్టి భవసాగరమందు మునింగి తేలుచున్​

దారియుతెన్నుగానకయె తత్తరమందెడి మానవుండ నీ

కోరిమి యించుకంత మదినూనుచు భక్తిని కల్గి చూడు శ్రీ

కారుడు సత్యసాయి నిను కావగ వచ్చిన నావగాంచవే!(582-220182)

సిరులను కోరను సర్వభాగ్యతతుల చెల్లారనిమ్మంచు నే

వరముల్​ వేడను, నెల్లవేళలా భవత్పాదారవిందంబు నా

యురమందుంచు శక్తినిమ్మని సదా యుల్లంబునగోరితి

తరమా నిన్ను నుతింప! నీకు దయలేదా సత్యసాయి ప్రభూ!(583-

సంస్కారమే లేని చదువెంత ఉండినా

గలిగించునే మీకు గౌరవంబు?

నీతియే లేకున్న నియమంబు లేకున్న

కలుగునే మీకిల గౌరవంబు?

హద్దులు మీరిన అధికారబలమున్న

కలుగునే యిలలోన ఘనత మీకు?

ధర్మమార్గము వీడి ధర్మంబు బోధింప

మర్యాదనిత్తురే మహిని మీకు?

పాపభీతియు లేనట్టి భావమందు

పాప పనులను చేయక ప్రకృతియందు

ఇంకనైనను ఈ సత్యమెరిగి మీరు

భరతపుత్రులమని పేరుబడయరయ్య.(584-

సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు

శూరుడై రణమున పోరవచ్చు

రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు

హేమభూదానముల్​ యీయవచ్చు

గగనంపు చుక్కలు గణింయింపగావచ్చు

జీవరాసుల పేర్లు చెప్పవచ్చు

అష్టాంగవిద్యలనన్ని నేర్వగవచ్చు

చంద్రమండలయాత్ర సలుపవచ్చు

కాని దేహేంద్రియాదుల కట్టిపెట్టి

మనసు నిల్పియు నంతర్ముఖము చేసి

అనవరత నిశ్చలంబైన ఆత్ములగుచు

నిలువగాలేరు మానవుల్​ నియతితోడ.(585-200591)

సకలశాస్త్రపురాణ సంగ్రహవేత్తయై

వేదాంతవేద్యుడౌ విభుదుడైన

రక్తి యేపారగ రమ్యహర్మ్యంబుల

రహిమించు రాజచంద్రముడునైన

రణరరగమందు పరాభూతరిపుడౌచు

వెల్గొందు జగదేకవీరుడైన

దారిద్య్రదేవతా దాక్షిణ్యమున కుందు

దౌర్భాగ్య విభుడగు దాసుడైన

భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు

భక్తిలేనట్టి ఆ జగద్భర్త కన్న

భక్తిపరుడగు దాసుడే వంద్యుడగును

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!(586-190186)

సత్యధర్మప్రేమశాంతులు లేకున్న

విద్యలన్నియు నేర్చి విలువ సున్న

సత్యధర్మప్రేమశాంతులు లేకున్న

దానధర్మాల సార్థకత సున్న

సత్యధర్మప్రేమశాంతులు లేకున్న

పదవులనేలిన ఫలము సున్న

సత్యధర్మప్రేమశాంతులు లేకున్న

బహుళ సత్కార్య లాభంబు సున్న

ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ

గుణములియ్యవి నాలుగు గోడలప్ప

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!(587-231184)

సత్యామృతంబును చవిచూడకున్నచో

చెల్లునే నరుడన్న చెక్కబొమ్మ?

ధర్మంబునెరుగక దనుజుండెయగుగాని

మానవుండగునెట్లు మహినిబుట్టి?

శాంతిచెందని జీవి శార్దూలమేగాని

మానవుడెట్లగు మనసులేక?

ప్రేమలేకను జీవి బీటలు వారిన

మరుభూమియేగాని మనుజుడగునె?

సత్యధర్మప్రేమ జగతి చక్క వెలయ

కాన నాలుగు గుణములు క్రమముతోడ

పట్టుదలతోడ సాధించి పరమ భక్తి

పూర్ణమానవత్వంబును పొందరయ్య

ఇదియె ఇహమున పరముననిచ్చు సుఖము.(588-112288)

సద్విద్య చదివించి శాంతిని బోధించి

ధర్మము నేర్పెడి తండ్రి తండ్రి

సన్మార్గమును చూపి సభ్యజీవనమిచ్చి

దైవభక్తిని తెల్పు తండ్రి తండ్రి

స్వార్జితంబులనంత చక్కగా పంచిచ్చి

తత్త్వంబు గరపెడి తండ్రి తండ్రి

సత్కుమారునిజూచి తనలోన సంతృప్తి

పొందు మహాత్ముడౌ తండ్రి తండ్రి

అట్టి తండ్రిని గన్నట్టి అమరసుతుడు

అంకితంబగు ఆత్మకు శంకలేక

ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు

సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!(589-

సద్విద్య ఉన్నచో సంస్కారమదియబ్బు

సంస్కారమున్నచో జన్మమదియె

సద్విద్య ఉన్నచో సౌఖ్యంబు చేకూరు

సౌఖ్యంబు వల్లనే కల్గు శాంతి

సద్విద్య ఉన్నచో సత్సంగములు కల్గు

సత్సంగమున్నచో శాంతి అదియె

సద్విద్య ఉన్నచో జన్మ సార్థకమగు

జన్మ సార్థకముచే కలుగు ముక్తి

సత్యనిత్యమైన చదువు చదివినపుడె

సార రహితమౌ సంసార సాగరమున

మునిగి తేలక త్వరలోనె మోక్షమందు

కాన యిట్టి చదువుకై కదలిరండు.(590-100898)

సర్వ సౌఖ్యంబులు సమకూర్చు ధనమన్న

ఎంతవరకది నీ చెంతనుండు?

ఆనందమది ఎంతొ అందించు ధనమన్న

ఎంతవరకది నీ సొంతమగును?

కష్టముల్​ పోగొట్టి శాంతి నిచ్చునదన్న

ఎన్ని కష్టములను ధనము యిచ్చె?

శాశ్వతంబైనట్టి సౌఖ్యంబు కోరక

ధనముకై జన్మను ధారపోసి

ఏమి సాధించితివి నీవు జగతియందు?

ఎంత వరకుండెదవు నీవు జగమునందు?

నేనెవరు నాదు కర్తవ్యమేమిటో

ప్రశ్న వేసుకో నరుడ! సత్యంబు గోచరించు.(591-201096)

సాయినామమె నీకు ప్రతిపన్న భాగ్యంబు

జీవనాధారంబు జీవితంబు

సాయిరాముడే ప్రాకట దైవంబు

భజియింప సేవింప శ్రీకరంబు

సాయికృష్ణుడే నీదు రక్షకరాజంబు

సంసార క్షితినార్ప సత్పథంబు

సాయిశివుడే నీదు సర్వబంధు బలగంబు

సకల భోగఫలంబు సమ్మతంబు

సాయి నామమే నీకింక సుధీమతంబు

సాయి భజనయే నీకింక సుజన విభ్రాజితంబు.(592-

సాయి నామమె హాయి స్మరియించు చుండంచు

వృక్షముల్​ తలలూపి బల్కుచుండు

సాయి నామమె హాయి స్మరియించు చుండంచు

పక్షి సంతానముల్​ పల్కుచుండ

సాయి నామమె హాయి స్మరియించు చుండంచు

కుసుమాలు వాసనల్​ కురియుచుండ

సాయి నామమె హాయి స్మరియించు చుండంచు

తుమ్మెదల్​ ఝుమ్మని క్రమ్ముచుండ

ఆకసమునుండి యివియె శబ్దములు వచ్చు

భూమినుండియు యిదియె శబ్దములు వచ్చు

సాయిబాబా యనుచు సర్వదిక్కులందు

పిక్కటిల్లుచుండును పర్తియందు(593-180789)

స్నానంబు చేయు ఆ జవరాండ్ర చీరలు

కాజేసినందుకా పూజ నీకు?

గొల్లపూబోండ్లతో జల్లులాడిన నాడు

హర్షించినందుకా అర్ఘ్యమిడుట?

చాలునిక కట్టిపెట్టు పంచాంగమింక

పొగడుకొనబోకు చాలించు మూయినోరు

చాలదీ నాల్క శ్రీకృష్ణు సన్నుతింప

నూరు చీల్కలు చీల్తు నోరోరి భీష్మ.(594-120795)

సిరులకేమి ప్రసన్న చిత్తుండవైనచో

చాలదే పదివేలు చాలు తండ్రి

సుఖసంపదలకేమి సుముఖుండవైనచో

చాలదే పదివేలు చాలు తండ్రి

కోర్కెలకేమి నీ కటాక్షమున్నచో

చాలదే పదివేలు చాలు తండ్రి

విభవానికేమి నీ యభిమానమున్నచో

చాలదే పదివేలు చాలు తండ్రి

ఇచ్చినవి ఏవొ ఉన్నవి యింతె చాలు

అధికములకేమి అవి ఎప్పుడైన గలుగు

వీడు నా భక్తుడని ఎల్లవేళ నీకు

ఒక్కరీతి అనుగ్రహమున్న చాలు.(595-

సముద్రమునకు అలలే శృంగారము

గ్రామానికి యిండ్లే శృంగారము

చెఱువుకు కలువయే శృంగారము

ఆకాశమునకు చంద్రుడే శృంగారము

మనిషికి జ్ఞానమే శృంగారము (595-2-01-09-1996)

సత్యధర్మము శాంతిప్రేమలతోనీ నిత్యజీవనయాత్ర సాగించు

యత్నప్రయత్నముల్​ మానవ ధర్మముజయాపజయములు దైవాధీనము.   ||సత్య||

భక్తితోడ భగవంతుని తలచుచు నిత్యకర్మములు నిర్వర్తించిన

అట్టి జనకునకు రాజయోగమున అందరాని మోక్షము అందెనే.  ||సత్య||

అష్టసిద్ధుల  సాధనెందులకు అది వట్టి భ్రమలతొ కట్టివేయునుగా

దట్టమైన ఈ జీవితాటవిలో వట్టి నామమె పట్టపగలౌ. ||సత్య||

హృదయభూమిని సాగుచేయండి మీ మనసు వడకగ గుణములే ఎద్దుల్​

వివేకమను చెలకొలను తీసి విశాలమగు మీ హృదయము దున్నుడు.      ||సత్య||

మానవ ధైర్యము మంచి ఎరువుగా ప్రేమధారలె పంట విత్తులుగ

భక్తే వర్షము భావమె కలుపులు బ్రహ్మానందమె పండెడు పంట. ||సత్య||

ప్రకృతి ధర్మము పట్టు విడకండి కర్మయోగమె జన్మ ధర్మంబు

స్మరణే మానవ జన్మ రహస్యము సాధనే భక్తుల సారలక్షణము ||సత్య||

కష్టసుఖములు ఖర్మలనకండి మన ఇష్ట లోపమె కష్టమౌనండి

పట్టు విడక ఆ పాదము కొలిచిన గట్టు చేర్చుట తన పట్టేను. ||సత్య||

మొదటి పట్టును విడువబోకండి ఆది పట్టులోనే భక్తి పట్టండి

ఎన్ని బాధలను పొందిన భగవ చ్చింతన మాత్రము విడకండి. ||సత్య||

ఎదను విడడు ఎడబాయలేడు మిమ్మేలుచుండు ఏవేళలా

కరుణే అతడు అతడే కరుణని కరుణకె కాచి పొందండి. ||సత్య||(596-170673)

సత్యసారము తెలుసుకోరన్నా ఈ తత్త్వమెరిగి జన్మమొందన్నా

ఈ ధర్మమెరిగి మన్ననొందన్నా పామరత్వము పాడుచేసి

నియమనిష్ఠలు ఎత్తి నిల్పి సత్యసాయిని తెలుసుకోరన్నా

దేహభావము వీడరోరన్నా అందమెందు యిందు లేదన్నా

అందమైన ఆత్మ విడిచి నింద్యమైన తనువు నేనని

తలపు వీడి శాశ్వాతముగ తత్త్వభావము ఎరుగరోరన్నా(596-1-110787)

సాయిసాయి సాయిరామా యని మీరు రయమున పాడగ రారండి!

ప్రేమ మీర ఓ సాయిరామా యని పిలచి తరింతురు లేవండి. ||సాయి||

కుక్క తోకయగు మానవ మనసును చక్కబరచును రారండి

ఒక్క మనస్సుతో నమ్మి సాయిని చక్కగ స్మరణము చేయండి. ||సాయి||

పుట్టుట గిట్టుట రెండే జన్మకు గట్టివనుచు మది తలచండి

వట్టి భ్రమలతో మునిగి కర్మలు ఎట్టివి చేయక మెలగండి. ||సాయి||

కలియుట బాయుట కాలవాహిని కాంక్షలు విడిచి చూడండి

కర్మయోగమే జన్మకు ముఖ్యము ధర్మము నడచి మెలగండి. ||సాయి||

నామస్మరణయె ముఖ్యవిద్యయని నియమముతో సేవించండి

తక్కినవన్నీ హుళక్కి విద్యలని పక్కకు నెట్టుట చూడండి ||సాయి||

తన తలపెల్లఫలింపకున్న యిక దైవము వలదని అనకండి

దయకు ప్రాప్తుడై మెలగిన తలపుల ఫలములు కొరతేముందండి ||సాయి||

కూటికి పేదయు కోటీశ్వరుడును కాటికి ఏగుట సమమండి

కోతిగుణంబులు మాని ఈ పరంజ్యోతి రూపమును జూడండి ||సాయి||

పామరత్వమే ప్రకృతి అందమను పాటను మీరిక మానండి

పరుల బాధలు తమయట్టివియని నియమముగ మదిలో తలచండి ||సాయి||

మానవ ధర్మము మాధవునాజ్ఞని మర్మమెరిగి భజియించండి

సర్వజన ప్రియ సాయీశుండనిసారెకు మదిలో వేడండి ||సాయి||

లోకముకై దిగులొందక మీరు లోకేశుని సేవించండి

వర్ణాశ్రమ ధర్మంబులు వదలక ఓపికతో సాధించండి ||సాయి||

మనసుకు లోనై మరిమాటాడక మాధవ స్మరణము చేయండి

మర్మమెరింగిన మరునిముసములో మనసే వారికి గురువండి ||సాయి||

భక్తిజ్ఞానవైరాగ్యములన మాకు శక్తి చాలదని యనకండి

నామస్మరణతొ కూడినవి నయభయవిశ్వాసములేనండి ||సాయి||

చీకటివెలుగులు కష్టసుఖములు చేసిన కర్మకు ఫలమండి

బాగుగ నమ్మక ఓగున ఏడ్చే పామరత్వమును వదలండి ||సాయి||

జాతినీతి మతశాస్త్రములాదిగ దైవలీలలని తలచండి

ఎట్టి బాధలను పెట్టిన మరువక సాయిరామయని తలచండి ||సాయి||

నరుడైనందుకు పరమాత్మయని తలచిన నరుడని ఎంచండి

భగవన్నామము వలదను నరుని నరపశువని భావించండి ||సాయి||

రామకృష్ణ హరిగోవిందా నారాయణ శివయని తలచండి

అన్ని నామములు పరమాత్మవెయని భేదమడచి భజియించండి ||సాయి||

సృష్టియంతయు భగవత్సంతతి భక్తులమని భావించండి

భక్తులందరు సోదరీసోదర ప్రేమభావములు పెంచండి ||సాయి||

ప్రేమే దైవము దైవమె ప్రేమయని ప్రేమ తత్త్వమును పెంచండి

ప్రేమలలో నిష్కామప్రేమనుపట్టు విడక సాధించండి ||సాయి||

సాయిరామ యని నామము తలచిన సర్వ బాధలు సమయునండి

నియమముతో సేవించువారికి నిశ్చలతత్త్వము కుదురునండి | |సాయి||

పుణ్యకార్యములు చేయకున్నను పాపములను తలపెట్టకండి

పాపములన్నింటికంటె మించినది పరులను నిందించేదండి ||సాయి||

ఇట్టి గుణంబులు నేర్చినవారికి ఇహపర సుఖములు కలుగునండి

సాయిరామయని భజనలు చేసిన అన్ని సౌఖ్యములు కలుగునండి        ||సాయి||

సత్యముధర్మము శాంతముప్రేమ ఉత్తమ స్థితికి త్రోవండి

కామక్రోధ ద్వేషంబులను చుట్టి చూరను పెట్టుట మేలండి ||సాయి||

బీదసాదలను భేదభావములు సాయికి మదిలో లేవండి

పర్తివాసుని పాదము వీడక పదములతో మీరు పాడండి ||సాయి||(597-

శివశివ శివశివ యనరాదా జీవా చింతలెల్ల బాపుకొని మనరాదా

శివసాయీశుని కనరాదా జీవా సువివేకంబును కనరాదా జీవా ||శివ||

శివమెత్తి జగమెల్ల తిరిగేవు ఓ చిత్తమా! నీకెంత సిగ్గులేదె

అవని సుఖంబుల కల్లాడెడి నీకావలికి మిగిలేది ఏది? ||శివ||

పొద్దుపోక యారివారి సుద్దులన్న మీరు సిద్దమౌదురే కడు శ్రద్ధతోడ

ముద్దుముద్దుగాను సాయి ముచ్చటలు చెప్ప నప్పుడొద్దికనుండరె చెవులార ||శివ||

పనిమాలి సినిమాలు పలుమారు మీరు చనిచని కనినను తనివి లేదె

క్షణమును దైవసన్నిధిని నిల్పగ కనులార కడు కష్టమౌగా ||శివ||

అవినీతి రోతమాటలందరితో నీవనుటకు గౌరవమయ్యెనుగా

నవనీతచోరుని నామము పల్కుట నాల్కా అవమానంబగునా ||శివ||

పనిలేని శునకంబువలె నీవు పరుగిడి వగరించి తిరిగేవు

క్షణమును సత్సంగములో నిల్పగ సాధ్యముకాదా చరణములారా ||శివ||

ఇచ్చవచ్చు చెడ్డపనులెల్ల సేయ ఆ ఈశ్వరుండు మిమ్ము సృజియించినాడ

తెచ్చుకొని చేతులా తెల్వి యింకనైన మీరు చెచ్చరను హరిపూజ సేయరారె ||శివ||

పాటలు పాడిన ఫలమేమి? మంచి మాటలు నేర్చిన మహిమేమి?

సూటిగ పెద్దల బాటనె పోయిన సుఖముల మూటలు దొరుకునుగా ||శివ||

సులువుగ దొరికిన సుందర సాయిని చులకన చేయగ చూతువుగా

పలు బొమ్మలకే పడిపడి మ్రొక్కినభయభక్తులతో బ్రతుకుదువా ||శివ||(598-230290)

హరిమయము విశ్వమంతయు

హరి విశ్వమయుండు సంశయము పనిలేదా

హరిమయముగాని ద్రవ్యము

పరమాణువు లేదు వంశపావన వింటే!(600-190189)

హస్తమున అణుబాంబు ఉంచుక

అరచుచుందురు శాంతిశాంతని

చంద్రు చేరగల్గికూడను

చెందజాలరు శాంతిసుఖములు.(601-120289)

హృదయమనే క్షేత్రమందు కలదు దల్పతరువు

దాని చుట్టు కలుపుముండ్లకంప పెరిగియుండు

కలుపు తీసివేస్తె కల్పతరువు కానబడును

అదియె మీ అభీష్టముల నెరవేర్చు కల్పతరువు.(605-040189)

హెచ్చు చదువు చదివి యింద్రియలోలురై

చచ్చువారల కన్న స్వల్పమైరి

ఇంద్రియముల శక్తి యిముడుకొంచునుగాని

అట్టి చదువులు చదివి ఆర్యులౌట

చదువు చదువు చదివి సంతసమును లేక

ఆత్మచింతనొందువాడె చదువరుండు.(599-1-

హరిమయము విశ్వమంతయు

హరివిశ్వమయుండు సందియము పనిలేదు

హరిమయముకాని వస్తువు

యిలలో కనిపించగరాదు (600-19-01-1989)

హస్తమున అణుబాంబు ఉంచుక

అరచుచుందురు శాంతి శాంతియని

చంద్రుచేరగలిగి కూడను

చెందజాలరు శాంతిసుఖములు (601-12-02-1972)

      వాసుకి శయన శ్రీనివాస చిద్విలాస భవపాశముల ద్రుంచి మనోల్లాసమివ్వరా

భాసురకళ్యాణపురవాసుడౌచు శేషగోపదాసుని జగదీశ హృషికేశవేగ శ్రీరమారమణీమనోహరా

సందుగొందులందు మరి అందరందు నీవె ఆనందమొందుచుందువని విందు శ్రీధరా

ఇందువదన సురేంద్ర వందిత పాదారవింద నిత్యవందనంబు నీకు చేసెద

శ్రీరమారమణీమనోహరా

మేటియౌ త్రికుటపీటసాటి యెవరియేటిరాజుపేటనేలుచున్న కపటనాటకాధార

అటపాటల మృదుమాటలచేత భోజరాజు మాటికి పిలిచిన పలకవేటికి శ్రీవంకటేశ

శ్రీరమారమణీమనోహరా!!(602-

హృదమందు ప్రేమ పండించుకొనచున్న

వాడె క్రైస్తవుండు, వాడె సిక్కు

వాడె హైందవుండు, వాడె ముస్లిముకూడ

వాడె మానవుండు వసుథలోన (604-14-02-1999)

హృదయమనే క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు

దాని చుట్టు వనస్పతుల కలపకంప పెరిగియుండు

కలుపు తీసి చూడరయ్య కల్పతరువు కానబడును

అదియె శుభేచ్ఛనొసగు శుభకామధేనువు (605-04-01-1987)

క్షణములోపల పుట్టుచు క్షణములోనె

పెరుగునట్టిది ఎప్పుడు ప్రేమకాదు

చావుపుట్టుక లేనట్టి జీవి హృదిని

నిత్యనిర్మల జ్యోతియై నెగడు ప్రేమ (606-18-07-1989)

క్షణములోపలె పుట్టుచు క్షణములోనె

పెరుగునట్టిది ఎప్పుడు ప్రేమ కాదు

చావుపుట్టుక లేనట్టి జీవి హృదిని

నిత్యనిర్మల జ్యోతియై నెగడు ప్రేమ.(606-180789)

క్షమ సత్యము క్షమ ధర్మము

క్షమ యోగము క్షమయహింస క్షమ యజ్ఞమగున్​

క్షమయాచారము క్షమ దయ

క్షమయే ఆధారమగును సర్వంబునకున్​.

ఓంశ్రీసాయిరాం

విత్తనమొకటైన వేరైన ఫలములు

సంభవించుట అది ఎట్లు సాధ్యమగును.

88-1 ఏడువకు పసిబాల ఏడువకు తండ్రి

130-2 కొన్న కూర బేడ కూలియా పవలా

1 52-1 కర్మదాట వశమా నరుడా కర్మదాట వశమా

273-1 ధనమే కీడును కొనురా 06-06-1973

283-2 దొరికె బాలభాస్కర

285-1 నగలు పెట్టిన కోతికి సొగసు రాదు

కన్ను విప్పిన అంధుడు కనగలేడు

భక్తిగలుగదు మూర్ఖునకు యుక్తిచేత 25-12-1988

332-1 పాపమనగ వేరు పరదేశమున లేదు

తానుచేయు పనల తగిలిండు

402-1 పోకన్మానదు దేహము ఏవిధము పోషించి రక్షించినన్​

రాకన్మానవు హాతీవృద్ధులు మహారణ్యమునన్​ దాగినన్​ 08-09-1996

494-1 రైలు పరుగుకు నడిపించు డ్రైవరుండ

ఆటొమేటిక్​లైటుకు అవధులుండ

ఒకడు జగతిని సృష్టించనుండవలద 10-11-1993

498-1 రామా కోదండరామా 24-03-1991

500-1 సీతారాముల కళ్యాణము చూతము రారండి 21-05-1996

  1. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ

నిర్మమో  నిరహంకారః సమదుఖః సుఖఃక్షమీ

  1. అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యధః

                సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః స మేప్రియః

  1. అనన్యాశ్చిన్తయనో మ్తాం యే జనాః పర్యుపాసతే

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్​

  1. అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరమ్​

                లోకాద్యక్షం  స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్​.

  1. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియతం చ యత్​

                స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే.

  1. అస్ధిరం జీవనం లోకే అస్ధిరం యౌవనం ధనమ్​

                అస్ధిరం దారపుత్రాది ధర్మకీర్తిద్వయం స్ధిరమ్​.

  1. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః

ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్​.

  1. అహింసా ప్రధమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహః

సర్వభూతదయా పుష్పం క్షమాపుష్పం విశేషతః

శాంతిపుష్పం తపఃపుష్పం ధ్యానపుష్పం తథైవ చ

సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్​.

9 ఆకాశామల గాత్రం దైవం తారాశశి రవి నేత్రం దైవమ్​

వ్యపక పవన శశితం దైవం పారావార సాత్వితి దైవమ్​

  1. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ చ

బుద్ధిం తు సారథిం  విద్ధి మనః ప్రగ్రహ మేవ చ.

  1. ఆహార నిద్రా భయ మైధునాని సామాన్యమేతత్పపశుభిర్నరాణామ్​

ఙ్ఞానం నరాణాం అధికం విశేషః ఙ్ఞానేన శూన్యః పశుభిః స్సమానః.

  1. ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమమ్​

షడేతే యత్ర తిష్ఠంతి తత్ర దేవ సహాయకృత్​.

  1. కవిం పురాణమనుశాసితారణోరణీయాంసమమనుస్మరేద్యః

సర్వస్య ధాతార మచింత్యరూప  మాదిత్యవర్ణ్ణం తమసపరస్తాత్​.

  1. కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకమ్​

మౌనేన కలహం నాస్తి నాస్తి జాగరతో భయమ్​.

  1. గుకారోహ్యంధకారస్స్యాత్​ రుకారస్తన్నిరోధకః

అంధకార నిరోధిత్వాత్​ గురురిత్యభిధీయతే.

  1. గృహేగృహేపుస్తక భారభారః పురేపురే పండితయాధయాధః

మఠేమఠే తాపసబృందబృందః న బ్రహ్మవేత్తా న చ కర్మకర్తా.

  1. ఘృష్ణం ఘృష్ణం పునరపి పునః చందనం చారుగంధం

ఛిన్నంఛిన్నం పునరపి పునః స్వాదు యిక్షుకాండమ్​

ధగ్ధంధగ్ధం పునరపి పునః కాంచనం కాంతివర్ణం

న ప్రాణాంతే ప్రకృతివికృతి ర్జాయతే హ్యుత్తమానామ్​.

18 జన్మ దుఃఖం జరా దుఃఖం  జాయా దుఃఖం పునఃపునః

సంసార సాగరం దుఃఖం తస్మాత్​ జాగ్రత జాగ్రత.

  1. జాహ్వాగ్రే వర్తతే లక్ష్మీ జిహ్వాగ్రే మిత్రబాంధవాః

జిహ్వగ్రే బంధనప్రాప్తిః జిహ్వాగ్రే మరణం ధ్రువమ్​.

  1. జిహ్వే రసఙ్ఞే మధుర ప్రియే త్వం సత్యం హితం త్వాం పరమం వదామి

ఆవర్తయ త్వం మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి.

  1. త్యజ దుర్జన సంసర్గం భజ సాధుసమాగమమ్​

కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం.

  1. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ

త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ.

  1. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్​

త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణమ్​.

  1. తిలమధ్యే యథా తైలం క్షీరమధ్యే యధా ఘృతమ్​

పుష్పమధ్యే యధా గంధం ఫలమద్యే యధా రసమ్​

కాష్టాగ్నివత్​ ప్రకాశేత్​ తల్లింగం అచలంప్రభో.

  1. దేహో దేవాలయఃప్రోక్తో జీవో దేవ స్సనాతనః

త్యజేదజ్ఞాననిర్మాల్యం సోహంభావేన పూజయేత్​.

  1. దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణమ్​

తద్వృత్తి సాక్షిణం విద్యాదాత్మానం రాజవత్సదా.

  1. దైవాధీనం జగత్సర్వం సత్యాధీనంతు దైవతమ్​

తత్​ సత్యముత్తమాధీనం ఉత్తమః పరదేవతా.

  1. న తపాంసి న తీర్ధాని న శాస్త్రాణి జపా నహి

 సంసారసాగరోద్ధారే సజ్జనా సేవనం వినా.

  1. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం

న మంత్రో న తీర్ధో న మే దానయజ్ఞం

అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా

సదానందరూపః శివోహం శివోహమ్​.

  1. నమోక్షే నాకాశపుష్పే నపాతాళే భూతలే

అజ్ఞాన హృదయగ్రంధే ర్నాశే మోక్ష ఇతి శృతిః.

  1. నాస్తి లోభసమో వ్యాధిః నాస్తి క్రోధసమో రిపుః

నాస్తి దారిద్య్రవద్దుఃఖం నాస్తి జ్ఞానసమంసుఖమ్​.

  1. నాహం జానామి కేయారే నాహం జానామి కుండలే

నూపురేత్వభిజానామి నిత్యం పాదాభివందనాత్​.

  1. నాస్తి నాస్తి మహాభాగ! కలికాలసమం యుగం

స్మరణాచ్చింతనాదేవ ప్రాప్తాహి పరమాగతిః

  1. నాస్తి విద్యాపరం చక్షుః నాస్తి సత్య పరం తపః

నాస్తి రాగపరం దుఃఖం నాస్తి త్యాగపరం సుఖమ్​.

  1. నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరఞ్జనః

నిర్వికారో నిరాకారో నిత్యముక్తో నిర్మలః.

  1. పంచకోశాది యోగేన తత్తన్మయ ఇవస్ధితః

శుధ్ధాత్మా నీల వస్త్రాది యోగేన స్పటికో యధా.

  1. పంచప్రాణ మనోబుద్ధిదశేంద్రియసమన్వితమ్​

అపంచీకృత భూతోత్ధం సూక్ష్మాంగం భోగసాధనమ్​.

38 పరోపకారాయ ఫలంతి వృక్షః పరోపకారాయ వహంతి నద్యః

పరోపకారాయ దుహంతి గావః పరోపకారార్ధమిదం శరీరమ్​.

  1. ప్రదోషే దీపక శ్చంద్రః ప్రభాతే దీపకో రవిః

త్రైలోక్యే దీపకో ధర్మః సుపుత్రః కులదీపకః.

  1. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.

41 పునర్విత్తం పునర్మిత్రం పునర్భార్యా పునర్మహిః

ఏతత్సర్వం పునర్లభ్యం న శరీరం పునః పునః

  1. పోష విధానే శీతం దైవం శోషవిధానే తపనం దైవమ్​

శిష్ట విధానే వికసత్​ దైవం ప్రళయవిధానే మాలిక దైవమ్​.

  1. పుణ్యస్య ఫలమిచ్ఛంతి పుణ్యం నేచ్ఛంతి మానవాః

న పాప ఫలమిచ్ఛంతి పాపం కుర్వంతి యత్నతః.

  1. పఞ్చీకృత మహాభూత సంభవం కర్మసంఞ్చితం

శరీరం సుఖదుఃఖానాం భోగాయతన ముచ్యతే.

  1. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం

ద్వందాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యమ్​

ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతం

భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి.

  1. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్​

బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా.

  1. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే

సంప్రాప్తే సన్నిహితే కాలే న హి న హి రక్షతి డుకృఞ్​ కరణే.

  1. భ్రమేనాహం భ్రమేనత్వం భ్రమేనోపాసకం మనః

భ్రమే ఈశ్వర భావత్వం భ్రమమూలమిదం జగత్​.

  1. భాస్కర బింబే దీప్తందైవం, లోచన మధ్యే గుప్తం దైవమ్​

శీతలకరణే గుప్తం దైవం త్రిగుణితభువనే వ్యాప్తం దైవమ్​.

  1. భక్తిరేవ పరమార్ధదాయినీ భక్తిరేవ భవమోహనాశినీ

భక్తిరేవ పరవేదన ప్రదా, భక్తిరేవ పరమోక్షకారిణీ.

  1. మదీయ ధనదారాది సర్వస్వం తే సమర్పితమ్​

సర్వలోకైక నాద త్వం రక్ష మాం శరణాగతమ్​.

  1. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనామ్​

మనస్సన్యత్​ వచస్యన్యత్​ కర్మణ్యన్యత్​ దురాత్మనామ్​.

  1. మనఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః

బంధాయ విషయాస క్తం మోక్షే నిర్వషయం స్మృతమ్​.

  1. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధుః సహోదరః

అర్ధం నాస్తి, గృహం నాస్తి తస్మాత్​ జాగ్రత జాగ్రత.

  1. మానంహిత్వా ప్రియోభవతి, క్రోధంహిత్వా నశోచతి

కామంహిత్వార్ధవాన్​ భవతి లోభంహిత్వా సుఖీభవతి.

  1. మా కురు ధన జన యౌవనగర్వం హరతి నిమేషాత్​ కాలః సర్వమ్​

మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా.

  1. మృత్పిండమేకం బహుభాండరూపం, గోక్షీరమేకం బహుధేనుజాతమ్​

సువర్ణమేకం బహుభూషణాని ఏకః పరాత్మా బహుదేహ వర్తీ.

  1. యా చింతా భువి పుత్రమిత్ర భరణే వ్యాపారసంభాషణే

యా చింతా ధన ధాన్య భోగయశసే లాభే సదా జాయతే

సా చింతా భువి నందనందనపదద్వందారవిందేక్షణే

కా చింతా యమరాజభీమసదనద్వారప్రయాణే విభో.

  1. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత

అభ్యుత్ధాన మధర్మస్య తదాత్మానం సృజమామ్యహమ్​.

  1. యత్ర యత్ర మనఃస్ఫూర్తిః తత్ర తత్ర జగత్రయమ్​

యత్ర యత్ర మనో నాస్తి తత్ర తత్ర న కించన.

  1. యల్లబ్ధ్యా పుమాన్​ సిద్ధోభవతి, అమృతో భవతి తృప్తో భవతి

యత్​ జ్ఞాత్వా మత్తో భవతి, స్తబ్ధో భవతి, ఆత్మారామో భవతి.

  1. విద్యానామ నరస్యరూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం

విద్యా భోగకరీ యశశ్శుభకరీ, విద్యా గురూణాం గురుః

విద్యా బంధుజనో విదేశగమనే, విద్యా పరా దేవతా

విద్యా రాజసుపూజితా, న హి ధనం విద్యావిహీనః పశుః.

  1. విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం

పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా

  1. శివ ఏవ సదా జీవో జీవ ఏవ సదాశివః

వేత్య్తైక్యమనయోర్యస్తు స ఆత్మజ్ఞానచేతనః

  1. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాఙ్మయీ

నిత్యానందమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ.

66 శాంతితుల్యం తపో నాస్తి  న సంతోషపరంసుఖం

న తృష్ణాయాః పరో వ్యాధిః న చ దానం దయాసమః.

  1. శ్రవణం కీర్తనం విష్ణోఃస్మరణం పాదసేవనమ్​

అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్​.

  1. సర్వరూపధరం శాంతం సర్వనామధరం శివం

సచ్చిదానందరూపం అద్వైతం సత్యం శివం సుందరం.

  1. స్వగృహే పూజ్యతే మూర్ఖః స్వగ్రామే పూజ్యతే ప్రభుః

స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్​ సర్వత్ర పూజ్యతే.

  1. సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా స్వసా

శాంతిః పత్నీ క్షమా పుత్రః షడేతే సర్వబాంధవాః

  1. సత్యం జన విరోధాయ అసత్యం జనరంజనం

సురా విక్రేయతే స్ధానే దద్యాధికం పీత్వా గృహేగృహే.

  1. సంసారః స్వప్నతుల్యోహి రాగద్వేషాది సంకులః

స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే  సత్యవద్భవేత్. ​

  1. సర్వతః పాణిపాదం తత్సర్వతో క్షిశిరోముఖమ్​

సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి.

  1. సుఖార్ధీచేత్త్యజేత్​ విద్యా విద్యార్ధీచేత్త్యజేత్​ సుఖమ్​

సుఖార్థినః కుతో విద్యా కుతో విద్యార్ధినః సుఖమ్​.

75 సర్వేవై సుఖినస్సంతు సర్వే సంతు నిరామయాః

సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్​ దుఃఖమాప్నుయాత్​

  1. సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితమ్​

కాయః పరహితే యస్య కలి స్తస్య కరోతి కిమ్​?

  1. సత్యానుసారిణీ లక్ష్మీః కీర్తిస్త్యాగానుసారిణీ

అభ్యాసానుసారీ విద్యా బుద్ధిః కర్మానుసారిణీ.

  1. సత్యేనార్కః ప్రతపతి సత్యే తిష్ఠతి మేదినీ

సత్యం ప్రోక్తం పరోధర్మః స్వర్గస్సత్యే ప్రతిష్ఠితః.

  1. స్వబోధే నాన్యబోధేచ్చా బోధరూపతయాత్మనః

న దీపస్యాన్యదీపేచ్ఛా తధాస్వాత్మా ప్రకాశతే.

  1. సర్వజీవస్థితం యోమాం భజత్యేకత్వమాస్థితః

సర్వథా వర్తమానోపి స యోగీ మయివర్తతే.

  1. సువర్ణమేకం బహుభూషణాని మృత్పిండమేకం బహుభాజనాని

గోక్షీరమేకం బహుథేనుజాతమ్​ ఏకఃపరాత్మా బహుదేహవర్తీ

  1. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలమ్​

కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్య్తేవ గతిరన్యధా.

Sow an action reap a tendency

Sow a tendency reap a habit

Sow a habit reap a character

Sow a character reap a destiny

You are the master of your destiny

You can do or undo.

Saythyam is My Prachar

Dharma is My Achar

Santhi is My Swabhava

Prema is My Swarupa.

values for education

education for life

life for love

love for man

man for service

service for society

society for spirituality

spirituality for nation

nation for world

world for peace.

      you are not one person but three

      the one you think you are

      the one others think you are

      the one you really are.

see no evil, see what is good

talk no evil, talk what is good

hear no evil, hear  what is good

do no evil, do what is good

think no evil, think what is good.