Sathya Sai Avatar

యుగధర్మ పద్ధతుల్ విగళితమైయుండ, నయమార్గమునదిప్పి నడపుకొరకు
లోకములు ఇలలో కల్లోలమై చెడియుంట, సన్మార్గ వర్తన సలుపు కొరకు
దుర్మార్గ వర్తనుల్ క్రుంగి దీనత నుంట, సాధు సంరక్షణ సలుపు కొరకు
కాల సందిగ్ధ విగ్రహసూక్తులైయుంట, భాష్యార్థ గోప్యముల్ పలుకు కొరకు
క్ష్మా భరము బాపి భూదేవి మనుపు కొరకు, త్రేతనొసగిన కోర్కెలదీర్చు కొరకు
అవతరించెను అచ్యుతుడవనియందు, వాసుదేవాఖ్య శ్రీసాయి వసుధశౌరి.

Yugadharma pad’dhatul vigaḷitamaiyuṇḍa, nayamārgamunadippi naḍapukoraku
lōkamulu ilalō kallōlamai ceḍiyuṇṭa, sanmārga vartana salupu koraku
durmārga vartanul kruṅgi dīnata nuṇṭa, sādhu sanrakṣaṇa salupu koraku
kāla sandigdha vigrahasūktulaiyuṇṭa, bhāṣyārtha gōpyamul paluku koraku
kṣmā bharamu bāpi bhūdēvi manupu koraku, trētanosagina kōrkeladīrcu koraku
avatarin̄cenu acyutuḍavaniyandu, vāsudēvākhya śrīsāyi vasudhaśauri.

The age has lost its moral compass, so I came to turn it around and give it a new direction

Then world has fallen to chaos and evil, so I came to make it sin-free and set it upright

Those on the wrong path roam about freely, so I came to protect good people

I came to spell out the hidden message of sacred texts blurred by Time

I came to lighten the burden of Bhudevi Earth)

I came to fulfill promises made in the ‘tretha’ era

Just as Vasudevawas called “Krishna”on earth I too have incarnated as “Sai”

 

ఏగుణంబు గణించి యేతెంచెనోనాడు ప్రహ్లాదు పాలింప పరమపురుషు
డేగుణంబు గణించి యేతెంచెనోనాడు కరినిగాచెడి తరి కమలనయను
డేగుణంబు గణించి యేతెంచెనోనాడు ధ్రువకుమారుని సాక రూఢిమీర
ఏగుణంబు గణించి యేతెంచెనోనాడు పేదకుచేల్బ్రోవ వేదచరితు
డాగుణంబె గణించి యాయమరవంద్యు డార్తజనులను పాలించు ననాధనాథుడు
శ్రీ సత్య సాయి నాథు శ్రీనాథు లోకనాథు సచ్చితానంద మూర్తి పుట్టపర్తి షట్చక్రవర్తి

Ēguṇambu gaṇin̄ci yēten̄cenōnāḍu prahlādu pālimpa paramapuruṣu
ḍēguṇambu gaṇin̄ci yēten̄cenōnāḍu karinigāceḍi tari kamalanayanu
ḍēguṇambu gaṇin̄ci yēten̄cenōnāḍu dhruvakumāruni sāka rūḍhimīra
ēguṇambu gaṇin̄ci yēten̄cenōnāḍu pēdakucēlbrōva vēdacaritu
ḍāguṇambe gaṇin̄ci yāyamaravandyu ḍārtajanulanu pālin̄cu nanādhanāthuḍu
śrī satya sāyi nāthu śrīnāthu lōkanāthu saccitānanda mūrti puṭṭaparti ṣaṭcakravarti

Why did the supreme Lord Vishnu show up to look after Prahlada that day?

Why did lotus-eyed Vishnu rush to protect elephant Gajendra that day?

Why did He come determined to the aid of young Dhruva that day?

Why did legendary Krishna go to save poor Kuchela that day?

It’s the same why, He who looks after the helpless, He who looks after the world

The epitome of truth, consciousness and bliss Divine Sri Satya Sai

He has appeared today as the Lord of Puttaparthi

—————————————————————–

కోటి పూసల కొక్క కొల్కి పల్కేగాని, నీటి మాటల కోటి నేరడితడు
చచ్చి పుట్టుట మాన్పు చదువు వచ్చునెగాని, చచ్చు విద్యలు రావు సాయికెపుడు
మనసిచ్చుకొను ప్రేమ మాటలాడునెగాని, సాయి ఉపన్యాసమీయలేడు
తన యదార్థత తాను తప్పక చనుగాని, ఎదుటి తప్పుల బాబ ఎన్నలేడు
కల్లకపటాలు తెలియని పిల్లవాడు, ఎల్ల జీవుల తనవలె యెంచువాడు
ఇట్టి మునీసు జన్మించినాడు, పట్టుబడినాడు భక్తికి బాబగాను.

Kōṭi pūsala kokka kolki palkēgāni, nīṭi māṭala kōṭi nēraḍitaḍu
cacci puṭṭuṭa mānpu caduvu vaccunegāni, caccu vidyalu rāvu sāyikepuḍu
manasiccukonu prēma māṭalāḍunegāni, sāyi upan’yāsamīyalēḍu
tana yadārthata tānu tappaka canugāni, eduṭi tappula bāba ennalēḍu
kallakapaṭālu teliyani pillavāḍu, ella jīvula tanavale yen̄cuvāḍu
iṭṭi munīsu janmin̄cināḍu, paṭṭubaḍināḍu bhaktiki bābagānu.

In lieu of a million words, one And no hypocrisy

Sai cares for education that revives Not for dead degrees

Sai speaks lovingly from the heart Sai doesn’t give sermons

Aware of his own nature, Baba never finds mistakes in others

Like a child who doesn’t know deceit ,He considers all beings as himself

Such a seer of seers was born, And is bound by Love

 

సాయిమాట సకల సౌభాగ్యములమూట

సాయిదృష్టి పారిజాత వృష్టి

సాయిచేయి తల్లిప్రేమలోపల హాయి

ఉన్నమాట తెలుపుచున్నమాట స్వామి

ఈ పద్యం ద్వారా మనకి తమ ప్రేమ తత్వాన్ని వివరించి చెప్తున్నారు. స్వామి మాట వేదాల మూట, స్వామి మాటే వేదం, అదే సత్య. స్వామి చూపు ఒకసారి మనపైన పడితే జన్మ ధన్యమే. స్వామి ఒకసారి మనని స్పృశిస్తే చాలు ఆ హాయి వర్ణనాతీతం. మరి ఆ పద్యాన్ని ఈనాటి సాయి పద్య దీపికలు 25వ భాగంలో విందాం.

Sai Mata Sakala Soubhagyamula Moota Sai Drusti Parijatha Vrusthi Sai Cheyi Thalli Premalopali Hayi Unnamaata Thelupuchunna Maata

This poem beautifully explains Swami’s words, Swami’s glance, Swami’s divine touch. Swami, the all loving mother explains to us that His words are a treasure trove of all prosperity, His glance is like the shower of Parijatha flowers and Swami’s touch is like that of a loving mother which gives solace and succor. This is Swami’s word and it is the truth. Come listen this pad yam in the 25th part of Sai Padya Deepikalu.

 

కప్పురంబు తెలుపు కామధేనువు తెల్పు చుక్క తెలుపు హంస రెక్క తెలుపు అందమైన సాయి మందహాసము తెల్పు ఉన్నమాట తెలుపుచున్న మాట

Camphor is White Kamadhenu is White Stars are White Swan’s feather is White Beautiful Sai’s Smile is White (Pure) I confer on you the truth as it exists This is the Truth, the Word of Sai.

Kappurambu Telupu Kamadhenuvu Telupu Chukka Telupu Hamsa Rekka Telupu Andamaina Sai Mandahasamu Telupu Unnamata Thelupuchunna Mata

In the 26th episode of Sai Padya Deepikalu, let us listen to this wonderful poem describing the purity in Swami’s smile.Swami himself explains that His smile is as white as the camphor, the wish fulfilling cow, the star in the sky. That is the word of Sai.

https://youtu.be/vvSGjkIOkfM

బూచి ఈతండంచు తోచెడి రీతిగా

గుబురు గప్పిన బుట్టబోలు జుట్టు

కులమత చిహ్నాలు కలకగుప్పునదీర్పు

తిలకమేమియులేని పిలక మోము

కనిపించి కపించకయు

పాదములు దాచు బహువన్నియెల

పట్టు నిలువుటంగీ

నైజ శృంగారంపు ఆటపాటలు జూపు

శివశక్తియే ఈతడని యెరుంగు

జుట్టు, బొట్టు కట్టు పుట్టుకలన్నిటా

గట్టినిక్కమునిచ్చి పట్టుదంచు

చిట్టి సత్యసాయి చిన్మయమన్నటు

ఇతని గుట్టెరంగ నెవరి తరము?

 

1974 వ సంవత్సరం వేసవి తరగతుల సందర్భంగా సత్య సాయి భగవానుడు తమ నిజతత్వాన్ని ఈ చక్కని పద్యం ద్వారా వెల్లడి చేశారు. అది వెల్లడి చేస్తూ కూడా ఎంత శ్రమ పడినా ఆ తత్వాన్ని అర్ధం చేసుకోవడం ఎవరి తరమూ కాదని చెప్పారు. ఆ పద్యాన్ని వినండి.

 

Boochi Eethandanchu Thochedi Reethigaa

Guburu Gappina Buttabolu Juttu

Kulamatha Chihnaalu Kalakagappunadeerpu

Thilakamemiyuleni Pilaka Momu

Kanipinchi Kanipinchakayu

Padamulu Daachu Bahuvanniyela

Pattu Niluvutangee

Naija Srungaarampu Aatapatalu Joopu

Shivashaktiye Eethadani Yerungu

Juttu, Bottu, Kattu Puttukalannitaa

Gattinikkamunicchi Pattudanchu

Chitti Sathya Sai Chinmayamannatu

Ithani Gutterunganevari Tharamu?

 

Giving the appearance of a strange person, having a basket-like hair on his head, showing no signs which indicate any particular religion or sect, with no specific mark on his face indicative of any particular caste, he appears quickly in a moment and vanishes equally quickly, then suddenly comes into your presence, wearing a robe that comes right down to his feet and sometimes covers the feet and sometimes does not cover the feet. Inherent beauty and attractiveness are obvious in his playing and singing. These are the aspects of Shiva Sakthi that are contained in him. Neither his hair nor any particular mark on his body nor the kind of robes that he wears give any clue to his divinity. All these signs point to the young Sathya Sai as he appears in his external form. He always smiles. In him, you will find the aspects of Shiva and Sakthi. How is it possible for anyone to understand the secret of Sathya Sai whose form answers this description?

Swami revealed this during the 1974 Summer Course held in Brindavan.

చుక్కలన్నియు బ్రహ్మ – సూర్యుoడు ఒక బ్రహ్మ

చంద్రుడన్నను బ్రహ్మ – జలము బ్రహ్మ

స్వర్గమన్నను బ్రహ్మ – వైకుంఠమది బ్రహ్మ

తల్లియు బ్రహ్మయే – తండ్రి బ్రహ్మ

భాగ్యంబదీ బ్రహ్మ – వాల్లఖ్యమది బ్రహ్మ

జీవించుటది బ్రహ్మ – జీవి బ్రహ్మ

పుట్టించునది బ్రహ్మ – పోషించునది బ్రహ్మ

గిట్టించునది బ్రహ్మ – గృహిణి బ్రహ్మ

కాలమంతయు బ్రహ్మ – కాయంబు బ్రహ్మ

ప్రకృతి అంతయు బ్రహ్మ – మన ప్రేమ బ్రహ్మ

సర్వమును బ్రహ్మ – ఈ సభయు బ్రహ్మ

సత్యమును తెల్పునట్టి ఈ సాయి బ్రహ్మ

ఇంతకంటెను వేరెద్ది ఎరుగపరతు

సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా!

ఈపద్యం లో స్వామి తమ అవతార తత్వాన్ని అధితంగా వెల్లడి చేస్తున్నారు. ఈ చరా చార ప్రపంచమంతా బ్రహ్మ, ఈ సభ కూడా బ్రహమే, ఈ సత్య సాయి కూడా బ్రహ్మమే. అట్టి సత్య సాయి అవతార తత్వాన్ని తెలుసుకోవడం ఎవరి తరము?

Chukalanniyu Brahma – Suryundu Oka Brahma

Chandrudananu Brahma – Jalamu Brahma

Swargamannanu Brahma – Vaikunthamadi Brahma

Thalliyu Brahmaye – Thadri Brahma

Bhagyambadi Brahma – Vaallakhyamdi Brahma

Jeevinchutadi Brahma – Jeevi Brahma

Puttinchutadi Brahma – Poshinchunadi Brahma

Gittinchunadi Brahma – Gruhini Brahma

Kaalamanthayu Brahma – Kaayambu Brahma

Prakruthi Anthayu Brahma – Mana Prema Brahma

Sarvamunu Brahma – Ee Sabhayu Brahma

Sathyamunu Thelpunatti Ee Sai Brahma

Inthakantenu Vereddi Erugaparathu

Sadhu Sadgunaganyulau Sabhyulara!

The stars are Brahma

The Sun is Brahma

The Moon is Brahma

Water is Brahma

Heaven is Brahma

Vaikuntha is Brahma

Mother is Brahma

Father is Brahma

Fortune is Brahma

Power is Brahma

All living beings are Brahma

The Individual is Brahma

The Creator is Brahma

The Sustainer is Brahma

The Destroyer is Brahma

The Homemaker is Brahma

All Times are Brahma

The body is Brahma

Nature is Brahma

Our Love is Brahma

Everything is Brahma

This gathering is Brahma

The Disseminator of this Truth is Sai

Sai indeed is Brahma

There is nothing more to be known than this!

August assembly of good and noble ones!

పుడమికి సరిమధ్య పుట్టపర్తియనగ

ఆత్మ విద్యలిందె అవతరించె

విశ్వమానవకోటి విజ్ఞానమొందంగ

విశ్వవిద్యాలయంబిచట వెలసె

శాంతి సౌఖ్యములను సర్వదేశములందు

వెల్లజిల్లెడి విజ్ఞులిచట వెలసె

నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు

వేలు లక్షలు కోట్లు వెలసిరిచట

సర్వధర్మ ప్రేమ శాంతులు జగతికి

చాటి చెప్పగ బూని సాయి ప్రభువు

సత్య సాయి భువిని సంపూర్ణ ప్రేమ

మూర్తియగుచు పుట్టె మోదమలర

ఈ చక్కని పద్యాన్ని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1989, నవంబర్ 23వ తేదీ నాడు తమ పుట్టినరోజు సందరంభంగా పూర్ణచంద్ర సభామండపంలో తమ మధుర గళంలో పాడారు. దీనిలో పుట్టపర్తి మహత్యం, వైశిష్ట్యం స్వామి వివరించారు. ఈ భూమికి సరిగ్గా మధ్యలో పుట్టపర్తి అనే ప్రదేశం ఉంది. అక్కడ ఆత్మ విద్య అవతరించింది. ఈ విశ్వ మావకోటి అంతా విజ్ఞానాన్ని సంపాదించే విధంగా ఒక విశ్వవిద్యాలయం వెలసింది. ప్రపంచంలో శాంతి సౌఖ్యాలను పంచె మహానుభావువులు విజ్నయులు ఇక్కడ ఉన్నారు. శ్రద్దా భక్తులతో, నియమ నిష్టలతో ఉన్న వేలాది, లక్షలాది, కోట్లాది భక్తులు ఈ పవిత్ర ప్రదేశంలో వెలిశారు అంటూ, స్వామి, ప్రపంచానికి సకల ధర్మ ప్రేమను శాంతిని నేర్పించడానికి నడుంకట్టుకుని సాయి ప్రభువు, సత్య సాయి భగవానుడు ప్రేమ మూర్తిగా అవతరించారు అందరికీ ఆనందాన్ని అందివ్వడానికి.

Pudamiki Sarimadhya Puttaparthiyanaga

Atmavidyalinde Avatarinche

Viswamaanavakoti Vijnanamondanga

Viswavidyaalayambichata Velase

Shanthi Soukhyamulanu Sarvadeshamulandu

Vellajilledi Vijnyulichata Velase

Niyathi Tappani Mahaa Nishtulu Bhaktulu

Velu Lakshalu Kotlu Velasirichata

Sarvadharma Prema Shanthulu Jagathiki

Chati Cheppaga Booni Sai Prabhuvu

Sathya Sai Bhuvini Sampoorna Prema

Moortiyaguchu Putte Modamalara

This beautiful poem was rendered by Bhagawan Sri Sathya Sai Baba on 23rd November 1989 during His Birthday Celebrations. Swami explains the grandeur and glory of Puttaparthi in this poem. He explains that right at the centre of this earth is a place called Puttaparthi where the highest spiritual knowledge has emerged. In order to impart spiritual knowledge the sprang up a university. Knowledgeable people with a mission to spread peace and happiness across the countries of the world have emerged. Thousands, lakhs and crores of devotees, who never leave the path of righteousness and moral living exist here in this abode. With a mission to spread Love and peace to the entire world Sathya Sai taken birth giving happiness to all.

 

Oneness

మన జాతి ఒక్కటే అది మానవజాతి, మన ఆరాధన ఒక్కటే దైవము
మన కులము ఒక్కటే అదే మానవకులము, మన భాష ఒక్కటే అరీ హృదయభాష

Mana jāti okkaṭē adi mānavajāti, mana ārādhana okkaṭē daivamu
mana kulamu okkaṭē adē mānavakulamu, mana bhāṣa okkaṭē arī hr̥dayabhāṣa

We belong to the same race, the human race , The Divinity we worship is the same
We all belong to the caste of humanity, We speak only one language, the language of the heart

పరమాత్ముడు ఒక్కడే, మతములన్నియు వేరు మార్గంబు ఒక్కటే
వస్త్ర భేదము వేరు వస్తువొకటే, శృంగారములు వేరు బంగారమొక్కటే
పశుల వన్నెలు వేరు పాలు ఒకటె, జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే
జాతి నీతులు వేరు జన్మంబు ఒకటె, పూజాతులు వేరు పూజ ఒకటె
బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరి, 

Paramātmuḍu okkaḍē, matamulanniyu vēru mārgambu okkaṭē
vastra bhēdamu vēru vastuvokaṭē, śr̥ṅgāramulu vēru baṅgāramokkaṭē
paśula vannelu vēru pālu okaṭe, jīvajantulu vēru jīvuṇḍu okkaḍē
jāti nītulu vēru janmambu okaṭe, pūjātulu vēru pūja okaṭe
bratuku kōsamu bahubādha baddulairi

There is only one God

Religions are many but their path is the same

Clothes are unique but they are all made from thread

Different ornaments are made of the same gold

Cows come in many colors but milk is always white

It is the same life in all living beings

No matter what the social status we are born the same way

Whatever flower you choose it is the worship that counts

Divisions and diversity occur only to make life easier

Transience

పాంచభౌతికము దుర్బలమైన కాయంబు, ఎప్పుడో విడిచేది ఎరుకలేదు
శత వర్షములదాక మితము చెప్పిరిగాని, నమ్మరాదామాట నెమ్మనమున
బాల్యమందో మంచి ప్రాయమందో లేక, ముదిమియందో లేక ముసలియందో
ఊరనో అడవినో ఉదక మధ్యంబునో, ఎక్కడో విడిచేది ఎఱుక లేదు
మరణమే నిశ్చయమ్మది మానవునకు, బుద్ధిమంతుడై తన దేహమున్నయపుడె
తన్ను తా తెలియుట ధర్మతత్వ మరయ, సత్యమైనట్టి బాట శ్రీసాయి మాట!

Pān̄cabhautikamu durbalamaina kāyambu, eppuḍō viḍicēdi erukalēdu
śata varṣamuladāka mitamu ceppirigāni, nam’marādāmāṭa nem’manamuna
bālyamandō man̄ci prāyamandō lēka, mudimiyandō lēka musaliyandō
ūranō aḍavinō udaka madhyambunō, ekkaḍō viḍicēdi eṟuka lēdu
maraṇamē niścayam’madi mānavunaku, bud’dhimantuḍai tana dēhamunnayapuḍe
tannu tā teliyuṭa dharmatatva maraya, satyamainaṭṭi bāṭa śrīsāyi māṭa!

Made of five elements the body is fragile

No idea when you will leave it

Theoretically, a hundred years but don’t trust that

No idea when and where you will leave this body

In childhood youth, or old age

City or forest, water or in-between spaces

Well, death is certain

So wise up Know yourself and Realize the way of dharma
While you still have this body

This is the correct way forward You have Sri Sai’s word for it

Some Truths

అన్న దానము కన్ననధిక దానంబేది?, తల్లిదండ్రుల కన్న దైవమేది?
జపతపంబుల కన్న సత్యశీలంబేది?,దయ కంటెనెక్కువ ధర్మమేది?
సుజన సంగతి కన్న చూడలాభంబేది?, క్రోధంబు కన్న శత్రుత్వమేది?
ఋణము కంటెను నరునకు రోగమేది?, ధరణినపకీర్తి కంటెను మరణమేది?
సరిగ సత్కీర్తి కంటెను సంపదేది?, స్మరణమునకు మించునాభరణమేది?

Anna dānamu kaṇṭe adhika dānambēdi?, Tallidaṇḍrula kaṇṭe daivamēdi?
Jagadītapamukanna satyaśīlambēdi?, Daya kaṇṭe ekkuva dharmamēdi?
Sujana saṅgati kanna cūḍalābhambēdi?, Krōdhambu kanna śatrutvamēdi?
R̥ṇamu kaṇṭenu narunaku rōgamēdi?, Dharaṇi apakīrti kaṇṭenu maraṇamēdi?
Sarvadā kīrti kaṇṭenu smaraṇa ēdi?

Is there a better donation than food?

Aren’t parents truly gods?

Are there better habits than spiritual discipline?

Is there a better virtue than compassion?

Can you find anything more beneficial than the company of good people?

Is there an enemy worse than anger?

Is there a worse malaise than debt?

Isn’t infamy like death?

Is there a memoir more lasting than fame?

Need for Devotion

పుట్టుటయే చింత భూమినుండుట చింత, సంసారమొక చింత చావు చింత
బాల్యమంతయు చింత వార్థక్యమొక చింత, జీవించుటొక చింత చెడుపు చింత
కర్మలన్నియు చింత కష్టంబులొక చింత, సంతసమొక చింత వింత చింత
సర్వ చింతల బాపెడి సర్వేశ భక్తి, కొనుడు ఇకనైన ప్రజలార కోర్కెమీర

Puṭṭuṭayē cinta bhūminuṇḍuṭa cinta, sansāramoka cinta cāvu cinta
bālyamantayu cinta vārthakyamoka cinta, jīvin̄cuṭoka cinta ceḍupu cinta
karmalanniyu cinta kaṣṭambuloka cinta, santasamoka cinta vinta cinta
sarva cintala bāpeḍi sarvēśa bhakti, konuḍu ikanaina prajalāra kōrkemīra

Birth is a reason to worry, Being on earth is a reason to worry
Living is a reason to worry, Death is a reason to worry
Childhood is a reason to worry, Old age is a reason to worry
Staying alive is a reason to worry, an annoying worry
Duties are a reason to worry, Difficulties are a reason to worry
Happiness is a reason to worry, a strange worry

O’ people, cultivate devotion at least now

 


విషయవాంఛలు నిన్ను వెంటాడు తరినీవు, నోరెత్తి సాయీశ శరణమనుము
కష్టపరంపరల్ కాల్దువ్వినపుడు, కరమెత్తి సాయీశ కావుమనుము
సంసార తాపముల్ సంఘటిల్లినప్పుడు, మనసార సాయీశ మరువననుము
మది దురహంకారమొదవినయప్పుడు, తలవంచి సాయీశ దాసుడనుము
సత్యభాషివై సాయీశు సాక్షిగనుము, మోక్షమాశించి సాయీశు మ్రోలమనుము
విశ్వమోహన గానము వీనులలర, ఆలపించిన శ్యాముడే ఆతడు నమ్ము.

Viṣayavān̄chalu ninnu veṇṭāḍu tarinīvu, nōretti sāyīśa śaraṇamanumu
kaṣṭaparamparal kālduvvinapuḍu, karametti sāyīśa kāvumanumu
sansāra tāpamul saṅghaṭillinappuḍu, manasāra sāyīśa maruvananumu
madi durahaṅkāramodavinayappuḍu, talavan̄ci sāyīśa dāsuḍanumu
satyabhāṣivai sāyīśu sākṣiganumu, mōkṣamāśin̄ci sāyīśu mrōlamanumu
viśvamōhana gānamu vīnulalara, ālapin̄cina śyāmuḍē ātaḍu nam’mu.

When desires hound you Open your mouth and say Sai, you are God, I take refuge in you

When difficulties pounce on you non-stop, Raise your hand and say, Sai, you are God, protect me

When life’s suffering closes in, say, Sai, you are God, I won’t forget you

When your egotistic mind won’t listen, bow your head and say Sai, you are God, I’m your servant

On Truth

గుణము లన్నిటా సత్యము గొప్ప సుమ్మి, ఎల్లా లోకములందు రంజిల్లుచుండు
సత్య సంస్కృతులమృతంబు సారని యందు, ఆత్మ వెలయించువాడే పుణ్యాత్మకుండు

Guṇamu lanniṭā satyamu goppa sum’mi, ellā lōkamulandu ran̄jillucuṇḍu
satya sanskr̥tulamr̥tambu sārani yandu, ātma velayin̄cuvāḍē puṇyātmakuṇḍu

Of all traits, the practice of truth is great, Truth shines in all the worlds
A culture of truth is like ambrosia, The one who radiates truth is a noble soul

Motherland

పరమ పావనమైన భారతావనియందు, సహనమన్నదె మనకు చక్కదనము
వ్రతములన్నింటను వన్నెగాంచినయట్టి, ఘనసత్యశీలమే కఠిన తపము
మథుర భావంబేది మన దేశమందన్న, మాతృభావము కంటె మాన్యమెద్ది
ప్రాణంబు కంటెను మానంబె ఘనమను, మన దేశ నీతిని మంటగలిపి
నేటికిచ్చిరి పరదేశ నీతులరసి, వెస విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తి
ఔర! ఏమందు భరత పాలనంబు, ఏనుగెట్టుల తన బలమెరుగలేదొ
అట్టులైనారు భారతీయులు నేడు.

Parama pāvanamaina bhāratāvaniyandu, sahanamannade manaku cakkadanamu
vratamulanniṇṭanu vannegān̄cinayaṭṭi, ghanasatyaśīlamē kaṭhina tapamu
mathura bhāvambēdi mana dēśamandanna, mātr̥bhāvamu kaṇṭe mān’yameddi
prāṇambu kaṇṭenu mānambe ghanamanu, mana dēśa nītini maṇṭagalipi
nēṭikicciri paradēśa nītularasi, vesa vicitra svēcchayanu viccukatti
aura! Ēmandu bharata pālanambu, ēnugeṭṭula tana balamerugalēdo
aṭṭulaināru bhāratīyulu nēḍu.

In the holy land of India

Endurance our pride, Truth more valued than vows
Motherhood revered tenderly, Honour more precious than life

Alas! What can I say of the state of things today

Our culture tossed in flames Alien ways of life picked up

And the strange fad of “freedom” – a double-edged sword –

Like the elephant ignorant of its own power—Today’s Indians

https://youtu.be/v1bRi7mjaS8


భరతదేశము వేదాల పట్టుగొమ్మ
యజ్ఞయాగాది క్రతువులకాటపట్టు
పెక్కు అవతారములగన్న పెద్ద తల్లి
నీతినియమాలజూపెడి త్యాగభూమి
Bharatadēśamu vēdāla paṭṭugom’ma
yajñayāgādi kratuvulakāṭapaṭṭu
pekku avatāramulaganna pedda talli
nītiniyamālajūpeḍi tyāgabhūmi

India—
A bough laden with vedic knowledge
A stage for the ritual worship of gods
Mother of many divine incarnations
A heroic land where culture is learned

 

భరత దేశంబు ఆరంజి పండు పోల్చ

కనగ జాతులు మతములు తొనలు కాగా

వివిధ తెగలు వృత్తులు అవెన్నియున్న

భరత దేశాన పుట్టుటే భాగ్యమౌర

ఐకమత్యము, జ్ఞానంబు అందజేసి జ్ఞాన జ్యోతిని వెలిగించు దేశమిదియే

ఐకమత్యము, జ్ఞానంబు అందజేసి దివ్యజ్యోతిని వెలిగించు దేశమిదియే

Comparing the Indian Nation to an Orange fruit The various castes and religions become the divisions in the orange fruit How many ever varieties of sects and professions may be there It is indeed a blessing to be born in the land of Bharat By conferring unity and knowledge This is the nation that lights the lamp of wisdom By conferring unity and knowledge This is the nation that lights the divine light

 

https://youtu.be/857kHS-OHzY

సాయి పద్య దీపికలు – Episode 01

ఓం శ్రీ సాయిరాం. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని భారత భాగ్య విధాత  శ్రీ సత్యసాయి నాధుడు మనకి వరప్రసాదంగా అందించిన ఈ పద్యాన్ని మీకోసం అందిస్తున్నాం.

ఖండఖండాంతర ఖ్యాతి నార్జించిన

మహనీయులను గన్న మాతృభూమి

పాశ్యాత్య వీరుల పారద్రోలించియు

స్వాతంత్య్రమును గన్న సమరభూమి

సంగీతసాహిత్య శాస్త్రీయ విద్యలందు

ధీశక్తి చూపిన దివ్యభూమి

చిత్రకళలతోడ చిత్రమైయున్నట్టి

భరతభూమియందు జననమొంది

భరతమాత ధర్మభాగ్యంబు కాపాడ

బాధ్యతంతయు మీదె భక్తులార!

Sai Padya Deepikalu – Episode 01

Om Sri Sai Ram. Independence Day greetings to all. We present to you this beautiful poem which was composed by our dearest Lord, the Bharatha Bhagya Vidhata Bhagawan Sree Sathya Sai Baba.

Lyrics in English –

Khanda Kandanthara Khyathi Narchinchina

Mahaniyulanu Kanna Mathru Bhumi

Paschathya Virula Paradrolinchiyu

Swathanthramunu Kanna Samara Bhumi

Sangitha Sahithya Shasthriya Vidyalandu

Dhishakthi Chupina Divya Bhumi

Chitra Kalala Thoda Chitra Kalala Thoda

Chitramai Yunnatti

Bharatha Bhumi Nandu Jananamundi

Bharatha Matha Dharma Bhagyammu Kapada

Bhajvathanthayu Mide Bhakthulara

Bharatha Matha Dharma Bhagyambu Kapada

Baadhyatantayu Meede Bhakthulara

Baadhyatantayu Meede Bhakthulara

Meaning

This motherland (India) has begotten sons who have earned a reputation in continents far and wide.

This valorous land has produced warriors who earned freedom for the land by driving away from the foreigners.

This divine land had shown excellence in the fields of music and literature.

O devotees! It is entirely your responsibility to uphold the righteousness of the land having been born in that land which is varied with its fineness of art and architecture.

https://youtu.be/GEp1vUnXkLE

Essence of Religion

అల్లాయంచు మహమ్మదీయులు జహోవాయంచు సత్క్రైస్తవుల్, ఫుల్లాబ్జాక్షుడటంచు వైష్ణవులు శంభోయంచు శైవుల్ సదా
ప్రల్లాపంబున గొల్వ అందరికి ఆయురారోగ్య సం, పల్లాభంబులొసంగి బ్రోచు పరమాత్మున్డు ఒక్కడే యంచు భావించుడీ!

Allāyan̄cu maham’madīyulu jahōvāyan̄cu satkraistavul, phullābjākṣuḍaṭan̄cu vaiṣṇavulu śambhōyan̄cu śaivul sadā
prallāpambuna golva andariki āyurārōgya saṁ, pallābhambulosaṅgi brōcu paramātmunḍu okkaḍē yan̄cu bhāvin̄cuḍī

Muslims say “Allah” , Christians, “Jehovah”
Vaishnavites call Him “Vishnu”, And Shaivites, “Shiva”

O’ people, realize

He who fulfills desires and bestows longevity, happiness, fortune and prosperity

on those who pray whole-heartedly is only One

విష్ణువే గొప్పని వైష్ణవులనుచుండ, శంభుండు గొప్పని శైవులనగ
గణపతి గొప్పని గాణపతులు బల్క, శారది గొప్పని చదువరులన
అల్లాఘనుండంచు అల్ల తురకలు చెప్ప, మాకు క్రైస్తు అనుచు క్రీస్తులనగ
నేను గొప్పయటంచు నాదు భక్తులు చెప్ప, అందరొక్కటేయని కొందరనగ
సర్వజన సమ్మతంబ్బైన సత్యమొక్కటే దైవంబు గాంచరయ్య

Viṣṇuvē goppani vaiṣṇavulanucuṇḍa, śambhuṇḍu goppani śaivulanaga
gaṇapati goppani gāṇapatulu balka, śāradi goppani caduvarulana
allāghanuṇḍan̄cu alla turakalu ceppa, māku kraistu anucu krīstulanaga
nēnu goppayaṭan̄cu nādu bhaktulu ceppa, andarokkaṭēyani kondaranaga
sarvajana sam’matambbaina satyamokkaṭē daivambu gān̄carayya

When Vaishnavites say Vishnu’s the greatest
When Shiva’s the greatest say the Shaivites
When Ganapati’s followers call Him the greatest
When Saraswati’s the greatest say the educated

When Muslims say Allah’s almighty
When Christians say it’s Jesus
When my devotees say I am the greatest
When some say all gods are the same

You must understand All religions agree—Truth, Brahman, is One

 


గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న, అతడె క్రైస్తవుండు అతడె శిఖ్ఖు
అతడె హైందవుండు ఆతడే ముస్లిము, అతడె మానవుండు అతడె గురువు.

Guṇḍelōna prēma paṇḍin̄cukonucunna, ataḍe kraistavuṇḍu ataḍe śikhkhu
ataḍe haindavuṇḍu ātaḍē muslimu, ataḍe mānavuṇḍu ataḍe guruvu.

He who plants Love in his heart

Only he—

Only he is Christian, Only he is Sikh
Only he is Hindu, Only he is Muslim

Only he is human, Only he is a Guru

On Love

కాదు మానవుండు ప్రేమయే లేకున్న, కాదు క్రైస్తవుండు కాదు సిక్కు
కాదు హైదవుండు కాదు ముస్లిమ్, వాడె రాక్షసుండు వసుథ పైన.

Kādu mānavuṇḍu prēmayē lēkunna, kādu kraistavuṇḍu kādu sikku
kādu haidavuṇḍu kādu muslim, vāḍe rākṣasuṇḍu vasutha paina.

Without Love, You are Not Human, Not Christian, Not Sikh, Not Hindu, Not Muslim, But A Demon on this Earth

Atma Jnana – Knowledge of The Self

కంటిగ్రుడ్డుకు కాటుక అంటనట్లు, జిడ్డునేమాత్రమంటక జిహ్వయుండు
బురద అంటని తామరపూవునట్లు, దేనినంటకయుండును దివ్యమాత్మ.

Kaṇṭigruḍḍuku kāṭuka aṇṭanaṭlu, jiḍḍunēmātramaṇṭaka jihvayuṇḍu
burada aṇṭani tāmarapūvunaṭlu, dēninaṇṭakayuṇḍunu divyamātma.

Kohl won’t mark eyeballs, Goo washes off the tongue

A lotus can’t be dirtied by muck, The Soul is never tarnished


చిత్త శుద్ధి లేని రిత్త మానవులకు, ఆత్మత్తత్వమెట్లు అబ్బునక్కో?
ఆత్మత్తత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే, వినుడు భారతీయ వీర సుతుడ
Citta śud’dhi lēni ritta mānavulaku, ātmattatvameṭlu abbunakkō?
Ātmattatvamabbu ati śud’dha bud’dhikē, vinuḍu bhāratīya vīra sutuḍa

For so-called seekers with impure minds
how is it possible to find knowledge of Self?

Only for those with a very pure mind

O’ brave children of India
Listen!

సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః

సర్వే భద్రాణి పశ్యన్తు మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ 

May all be with happiness May all be without illness May all witness auspiciousness May none have any bit of distress 

 

మనసునందు మంచి మాటలందున మంచి నడతలందున మంచి పొడువకున్న

సాయి మిమ్ము మెచ్చి సంతోష మెటులిచ్చు విద్యలందు ముఖ్య విలువ ఇదియే

మనసునందు చేదు మాటలందు తీపుంచ మాటలందు చేదు మనసున తీపుంచ

కాని మనసు నందు చేదు మాటలందు తీపి మంచి కాదిది మీకు మచ్చ గాని

మాటలందు చేదు మనసున తీపుంచ మంచి కాదిది మీకు మచ్చ గాని

మనసునందు చేదు మాటలందు తీపి మంచి కాదిది మీకు మచ్చ గాని

మచ్చలేని చదువు మరి మేలు కలుగును మచ్చలేని చదువు మరి మేలు కలుగును

విద్యలందు ముఖ్య విలువ ఇదియే

Goodness in heart Goodness in words Goodness in behavior, if they do not emerge How could Sai applaud you and give you joy? Among all learnings, this indeed is the most important value X 3 If you have bitterness in heart But sweetness in words If you have bitterness in words But sweetness in heart If you have bitterness in heart And sweetness in words This ain’t good for you, it’s a blemish in fact If you have bitterness in words and sweetness in heart This ain’t good for you, it’s a blemish in fact If you have bitterness in heart And sweetness in words This ain’t good for you, it’s a blemish in fact A blemishless education Will benefit you A blemishless education Will benefit you Among all learnings, this indeed is the most important value X 3

****************************************************

దైవ భావంబు హృదయాన తలవనీక దైవ భావంబు హృదయాన తలుపనీక

రెండు దోషాలు వెంటాడుచుండు నరుని తనదు లక్షల దోషాలు దాచుకొనుచూ

తనదు లక్షల దోషాలు దాచుకొనుచూ పరుల దోషంపు నలుసును బయటబెట్టు

పరుల దోషంపు నలుసును బయటబెట్టు

What prevents man from thinking of God in his heart What prevents man from thinking of God in his heart It is two faults that haunt man Burying one’s own mistakes Burying one’s own mistakes Baring the minutest of others’ mistakes Baring the minutest of others’ mistakes

 

దానము కానీ యజ్ఞ సముదాయము కాని

దానము కానీ యజ్ఞ సముదాయము కాని

తేజిత సనాతన ధర్మము కాని సత్య సంధానము కానీ

ప్రేమిత విధానము కాని మరి ఏది అయిననుం కాని

మాతృ ప్రేమకు సాటి రాదు మాతృ ప్రేమకు సాటి రాదు విచారణ జేసి చూచినన్

విచారణ జేసి చూచినన్

Be it charity, or many a Yajna Be it charity, or many a Yajna Be it the enlightened and eternal Dharma Be it the unified Sathya, or an adored modality Be it whatever Match it cannot, the love of the mother Match it cannot, the love of the mother If you deeply inquire If you deeply inquire

 

 

 

హరినామ స్మరణ గొప్పతనం | Greatness of Contemplating on God’s Name | Poem by Sri Sathya Sai Baba

 

స్వామి మన నుండి ఏమి కోరుతున్నారు? | What does Swami seek from us? |

 

ఈర్ష, అసూయ మానవునికి తగదు | Man Should Not Have Envy & Jealousy |

 

 

 

 

స్వభోదే నాన్యబోధశ్చ బోధరూపదయాత్మనః

నదీపశ్చాన్ దీపేచ్చా యదాస్వాత్మ ప్రకాశనే స్వభోదే నాన్యబోదేశ్చ

బోధరూపదయాత్మనః స్వదీపశ్చాన్ దీపేచ్చే యదాస్వాత్మ ప్రకాశనే

To know the omnipresent, effulgent Atma Another type of knowledge is not required. Just as, to search for a flame, Another light is not required.

పుణ్యఫలముచేత పుట్టెను మనుజుడై

దుష్టవాంఛలచేత దుష్టుడై జ్ఞానమార్గము వీడి మానవత్వము వీడే

ఇంతకన్నను రాక్షసుడే మేలు ఇంతకన్నను రాక్షసత్వమేది?

As a result of good deeds, one is born as a human, With bad desires one becomes wicked. Leaving the path of Knowledge, leaving humanity – a demon is better than this! Is there anything more demonic than this!?

సదయం హృదయం యస్య భాషితం (తత్)సత్య భూషితం దేహం పరహితే యస్యాం కలౌ నాస్తి పరం సుఖం

కరుణ నిండిన హృదయం సత్యంతో నిండిన వాక్కు సేవలో నిమగ్నమైన దేహం, కాలిలో దీనికంటే మించిన సుఖం ఏమున్నది?

Sadayam Hridayam Yasya Bhashitam (Tat) Satya Bhooshitam, Deham Para Hiteyasyam Kalau Nasti Param Sukham

A heart full of compassion, Speech full of truth, A body dedicated to service, What greater happiness can be there than this in this Kali age?

పరోపకారాయ ఫలంతి వృక్షా పరోపకారాయ వహంతి నద్యా పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్ధం ఇదం శరీరం

చెట్లు మనకి ఫలాలను ఇచ్చి సేవ చేస్తున్నాయి, నదులు ప్రవహించి నీటిని అందించి సేవను చేస్తున్నరాయి, ఆవులు పాలను ఇచ్చి సేవను చేస్తున్నాయి, మానవునికి ఈ శరీరం ఇచ్చిందే పరులకు ఉపకారామ్ చేయడానికి.

Paropakaaraya Phalanthi Vrukshaah Praopakaaraaya Vahanti Nadyaaha Paropakaaraya Duhanti Gaavaha Paropakaaraardham Idam Shareeram

Just as trees serve by giving fruits, rivers serve by flowing,cows serve by giving milk so too human body is given to serve others.

బ్రహ్మ దర్శన భాగ్యంబు బడయగోరి వెదుకబోదువువెచటికే వెఱ్ఱి మనస అదియు నీలోనెనున్నది కాంచునచట సత్యమునుదెల్పు బాట ఈ సాయి మాట

Brahma Darshana Bhagyambu Badayagori Vedukabovuvechatike Verri Manasa Adiyu Neelonenunnadi Kanchunachata Sathyambu Telupu Baata Ee Sai Maata

ఈ పద్యం లో స్వామి అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మాన్ని వెదుకుతూ ఎందుకు తిరుగుతున్నావని మన మనసుకి చెప్తున్నారు. అది నీలోనే ఉన్నదన్న సత్యాన్ని తెలుపుతూ స్వామి మానని అక్కడ వెదకమంటున్నారు.

Oh foolish mind! Where are you wandering to see the all pervasive Brahman? Brahmam is installed in yourself, go within to find Him. Sai’s word is the Truth.

స్వామి మాటల్లో శివ రూప వర్ణన – నృత్య సమర్పణ | Lord Shiva’s Beautiful Form

చిత్త శుద్ధి లేని రిత్త మానవులందు క్రోధమత్సరములు కూడియుండు చీకటింటిలోన చేరవే గబ్బిళాల్​ మరువబోకుడిట్టి మంచి మాట.

Chitta Shuddhileni Ritta Maanavulandu Krodhamatsaramulu Koodiyundunu Cheekatintilona Cherave Gabbilaal Maruvabokuditti Manchimaata

In the worthless mens’ hearts devoid of purity, Do abide the vices of anger and envy. Don’t bats abound in dens of darkness? Never should you forget this wise saying. In this poem Swami is explaining that we should always keep our heart free from the six vices of Kama Kridha Moha Mada and Matsarya in order to lead a happy and divine life. Come let us us listen to that wise saying through this poem of Swami in the 27th episode of Sai Padya Depikalu.

 

ఇదిచేతు అదిచేతు ఇంకెన్నియోచేతు

ననుచు ఊహలు అల్లి అలసిపోకు

ఏ విత్తులను నాటి యిచ్చోటనుంటిరో

ఆ ఫలములే మీకు అందుచుండు

మనిషి తన జీవితం గురించి ఎన్ని ఊహలల్లుకున్నా, ఎన్ని ఆశలు పెంచుకున్నా మనం చేసుకున్న కర్మ ఫలాలే మనకి అనుభవానికి వస్తాయనే జీవిత సత్యాన్ని ఈ చిన్న పద్యంలో స్వామి మరొకసారి చెప్తున్నారు.

ఈ అద్భుతమైన స్వామి పద్యాన్ని ఈనాటి సాయి పద్య దీపికలు 15వ భాగంలో వినండి.

Idi chetu Adi chetu Inkenniyo chetu

Nanuchu oohalu alli  alasipoku

Ae vitthulanu naati icchotanuntiro

Aa phalamule meeku anduchundu

We might make many plans and have a multitude of hopes for our life. But, what we ultimately get is the results of previous karmas that we had done. In this padyam, Swami gently reminds us not to forget this truth.

Let’s listen to this meaningful padyam in His Divine Voice in today’s episode of “Sri Sathya Sai Padya Deepikalu –  Episode 15”.

https://youtu.be/-9GZJwZ94P8

 

సత్యసాయి భగవానుని 96వ జన్మదిన శుభసందర్భంలో స్వామి తత్వాన్ని మరోసారి మనం గుర్తుచేసుకుందాం. సర్వాంతర్యామి అయిన ఆ సాయి భగవానుని దివ్యాశీస్సులు మనందరి పై ఉండాలని ప్రార్ధిద్దాం.

సర్వరూప ధరమ్ శాంతం

సత్యనామ ధరమ్ శివమ్

సచ్చిదానందరూపం అద్వైతం

సత్యం శివమ్ సుందరం

సర్వరూప ధరమ్ శాంతం

సర్వనామ ధరమ్ శివమ్

సచ్చిదానందరూపం అద్వైతం

సత్యం శివమ్ సుందరం

Sarvarupa Dharam Shantham

Sathyanama Dharam Shivam

Satchidanandam Advaitam

Sathyam Shivam Sundaram

Sarvarupa Dharam Shantham

Sarvanama Dharam Shivam

Satchidanandam Advaitam

Sathyam Shivam Sundaram

All the names and forms are but the manifestations of the Supreme Being who is the embodiment of peace and auspiciousness. He is Existence-Knowledge-Bliss Absolute and non-dual. He is Sathyam, Sivam, Sundaram (Truth, Goodness, Beauty).

https://youtu.be/nPmvh_TtDjM

సర్వ వేళల సర్వత్ర పర్వియున్న

ఆత్మ కనిపించదేలకో అంద్రు జనులు

పాల యందున్న వెన్నను కోరినంత

పొందగలుగుదురా సర్వులు ఆనందమొప్పా!”

ఈ పద్యం లో స్వామి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మను మనం దర్శనం చేసుకోవాలంటే అంత సులభం కాదు. పాలలో ఉన్న వెన్నను చిలికి తీసేస్తేనే గాని రాదన్నట్టు, ఈ చరాచర సృష్టిలో ఉన్న ఆత్మ సాధన ద్వారానే మనకి కనిపిస్తుంది. ఆనంద స్వరూపులమైన మనకి స్వామి ఈవిధంగా బోధిస్తున్నారు.

Sarva Velala Sarvatra Parviiyunna

Atma Kanipinchadelako Andru Janulu

Paalayandunna Vennanu Korinantha

Pondagaluguduraa Sarvulu Anandamoppaa

The meaning of this poem goes this way:At All Times and at all places It (Atma) existsWhy is that Atma not visible? Say peopleIf we just wish to get the butter which is in the milkCan we simply get it? Oh blissful ones!Swami very subtly tells in this poem that if you have to have the vision of the Atma, we need to put in effort. Just like how only after churning the milk you extract the butter, the same way you need to do sadhana in order to see the all pervasive Atma or the Divine Consciousness.

https://youtu.be/cdrV5QmWeN8

“జానెడు పొట్ట నింపుకొన చిక్కుల నొందుచూ

కోటి విద్యలన్ పూనిగ నీరనేర్చి 

పరిపూర్ణ సుఖంబును పొందలేక

ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగ నేటికీ

ఈ పరాత్పరున్ ధ్యానము చేయు భక్తులకు దారిని జూపక ఉన్నే మానవా! మానవా!”

మనిషి తన చిన్ని పొట్టను నింపుకోవడానికి ఎన్నో వ్యయప్రయాసలకు పూనుకుంటాడు. అంతేకాదు ఎన్నెన్నో విద్యలను అభ్యసించే ప్రయత్నం సలుపుతాడు. ఎన్ని విద్యలను నేర్చినప్పటికీ సంపూర్ణంగా ఆనందాన్ని సాధించలేకపోతున్నాడంటారు భగవాన్. మానవుడు జీవితంలో ఆనందనాన్ని పొంది వికాసాన్ని సంపాదించే మార్గాన్ని చూపుతున్నారు. మనం నిరంతరం భగవంతుని ధ్యాసలో ఉన్నప్పుడు నిత్యానందానికి భగవంతుడు ఎందుకు దారి చూపించడంటారు మన స్వామి.

 మనం నిరంతరం దేవుని స్మరణలో ఉండాలని ఈ పద్యం ద్వారా స్వామి మనకి నేర్పిస్తున్నారు

Janedu Pottanimpukona Chikkula Nonduchoo

Koti Vidyalan Puniga Niranerchi

Paripoorna Sukhambunu Pondaleka

Ee Manavajaathi Lokamuna Mroggaga Netikee

Ee Paratparun Dhyanamu Cheyu Bhaktulaku Darini Choopaka Unne Manava! Manava!

Swami explains in this poem how man struggles in his life just to fill his belly. He embarks upon learning many subjects and skills. But even after that he fails to attain complete everlasting happiness. Swami tells in all His compassion that when devotees contemplate and meditate upon Him why will He not show the path to everlasting happiness.

https://youtu.be/KSoPkQEuXU0

బృహదారణ్యక ఉపనిషద్ (1.3.28) లోనించి సత్యసాయి భగవానుడు ఎంతో శ్రావ్యంగా పాడిన శ్లోకం ఇది.

అసతోమా సద్గమయ

తమసోమా జ్యోతిర్గమయ

మృత్యోర్మా అమృతంగమయ

ఈ శ్లోకార్ధం: అసత్యమునుండి సత్యమునకు, తమస్సు అంటే చీకటినుండి వెలుగులోకి, మృత్యువునుండి అమృతత్వమునకు మనల్ని తీసుకొని వెళ్ళమని భగవంతుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం. అద్వైత తరముని వివరిస్తూ విచారణ ద్వారా మనం ఏది సత్యం ఏది అసత్యం తెలుసుకొని మన జీవన గమ్యమైన అమృతత్వమునకు చేర్చమని దేవుని మనము ప్రార్థన సలుపుతున్నాము.

This episode contains a sloka from the Brihadaranyaka Upanishad (1.3.28) sung mellifluously by Bhagawan Sri Sathya Sai Baba. The sloka goes like this:

Asatoma Sadgamaya – Lead me from untruth to Truth

Tamasoma Jyotirgamaya – Lead me from darkness to Light

Mrutyorma Amrutangamaya – Lead me from demise to Immortality

Truth, existence and reality are one and the same, according to Advaita, In Indian philosophy the truth has been successfully dissected by its concept. Advaita says that in all the three periods if the truth exist means it is a real truth. If it is not existed in any of the form in any of the period means it is not an ultimate real.

The first line explains the same to us. Always we should remember to know ourselves. Ultimate goal is to attain the knowledge to know the reality in life. Once you are far away from all the un-realistic things like daily needs. So this is not a prayer asking money, shelter, food, fame, cloth, success, health etc.

So we have to decide which is true.

Pure bliss, pure consciousness and pure existence is said to be as reality.

The second line explains how to lead the life towards knowledge from ignorance which obscures our mind to understand the reality. As our body keeps generating the cells, our Universe with a constant flux, and the earth with constant distance at every moment of time with other astral bodies, we have to travel from darkness to light and death to life. It is also a constant change. Nothing in this world is constant. You feel happy, tomorrow you may be sad, yesterday you might have cried for something. These things are not at all real and constant. As like the universe is a constant change, we should be too.

As we know already that energy nor created or destroyed like soul. We shouldn’t be very keen to love this body. It is unreal. Our soul is real. That’s a constant change. This is the meaning given in the third line of the prayer.

We are leading life journey of knowledge. To know what is self, and to know what we misunderstood from what is truly “I” .

What the mantras really means is “God, please lead me to the understanding that I am not the limited body, mind and intellect, but I am, was and always will be that eternal, absolute, blissful consciousness that serves as their substratum.”

https://youtu.be/17WnfApFanU

 

శాస్త్రంబునెప్పుడు సత్యంబుగానెంచు

వేద సమ్మతమగు విప్రులారా

శాస్త్రంబునెప్పుడు సత్యంబుగానెంచు

వేద సమ్మతమగు విప్రులారా

దేశంబు కొఱకునై దేహమర్పణజేయు

రగిమించు రాజాధి రాజులారా

దేశంబు కొఱకునై దేహమర్పణజేయు

రగిమించు రాజాధి రాజులారా

ధనధాన్యముల్గలిగి ధర్మగుణంబుతో

వరలుచుండెడి ఆర్యవైశ్యులారా

ధనధాన్యముల్గలిగి ధర్మగుణంబుతో

వరలుచుండెడి ఆర్యవైశ్యులారా

వ్యవసాయ వృద్ధిచే…. వ్యవసాయ వృద్ధిచే

వర్ధిల్లుచుండియు సుఖజీవనము చేయు శూద్రులారా

 కాలమంతయు ఊరక గడుపనేల….

కాలమంతయు ఊరక గడుపనేల

సర్వజన సమ్మతంబుగ సత్యమైన

దైవ నామంబు దలుపుడీ ధన్యులౌదు…

O you, who ever trust the scripture as the Sathya,

O Brahmins (priests), endorsed by the Veda!

O you, who ever trust the scripture as the Sathya,

O Brahmins (priests), endorsed by the Veda!

O you, who for your nation lay your life

O kings of kings who thrive!

O you, who for your nation, lay your life

O kings of kings who thrive!

O you, who have wealth and food, and the virtue of charity

O venerable Vaishyas (merchants) who prosper!

O you, who have wealth and food, and the virtue of charity

O venerable Vaishyas (merchants) who prosper!

O you who have the occupation of farming

O Sudras (artisans), who flourish and live happily

Why pass all the time in vain?

That which all did accept,The Name of the Lord that is the truth

Be blessed thinking of that divine Lord’s name!

Guidelines to Devotees

అనిశంబు అత్యంత అనురాగ భోగాను, రక్తులై సుజ్ఞాన సక్తులగుచు
స్వపర భేదము లేక సర్వ జీవుల యందు, సమభావమునుజూపు సరసులగుచు
కష్టజీవులయందు కరుణను చూపించి, తగిన సాయముజేయు దాతలగుచు
దాంపత్య ధర్మంబు ధరణిని వెలయంగ, పరులకు నాదర్శ సరణి యగుచు
జగతి సత్కీర్తిగాంచి శ్రీసాయి కృపను, సాటి మానవులందెప్డు మేటియగుచు
నిత్యమును ధర్మజిజ్ఞాస నిరతులగుచు, ఉత్తమోత్తమ వ్యక్తులైయుంద్రుగాక!

Aniśambu atyanta anurāga bhōgānu, raktulai sujñāna saktulagucu
svapara bhēdamu lēka sarva jīvula yandu, samabhāvamunujūpu sarasulagucu
kaṣṭajīvulayandu karuṇanu cūpin̄ci, tagina sāyamujēyu dātalagucu
dāmpatya dharmambu dharaṇini velayaṅga, parulaku nādarśa saraṇi yagucu
jagati satkīrtigān̄ci śrīsāyi kr̥panu, sāṭi mānavulandepḍu mēṭiyagucu
nityamunu dharmajijñāsa niratulagucu, uttamōttama vyaktulaiyundrugāka!

By the grace of Sri Sai

Always enjoy the good things of life

Have good sense See no difference of ‘yours’ and ‘mine’

Show equal regard for all humans

Become gentle Show compassion to those who suffer

As patrons, help others

Be ideal householders Set an example for others

Earn a good reputation in the world

Keep on becoming a better person

Always be a seeker

Be steadfast in morality

By the grace of Sri Sai—

For sure you will be better than the best

Sadhana – the inward path

స్వర్గమనగ వేరు సుర లోకమున లేదు, నరుల లోక మందే అమరియుండు
సద్గుణంబులు కలిగి సరియైన నడతున్న, స్వర్గ మేల ఇదియె స్వర్గమగును
స్వర్గమనగ వేరు పరలోకమున లేదు, నరుల మనమునందెనమరియుండు
తనదులోని అహము తా చంపుకున్నచో, అదియె స్వర్గమగును అవనియందు.

Svargamanaga vēru sura lōkamuna lēdu, narula lōka mandē amariyuṇḍu
sadguṇambulu kaligi sariyaina naḍatunna, svarga mēla idiye svargamagunu

There’s no separate world of gods called ‘heaven’

No doubt, it’s right here in the human world

When people have good character and are on the correct path

Why wonder about heaven? It’s heaven on earth

 


సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు, శూరుడై రణమున పోరవచ్చు
రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానముల్ యీయవచ్చు
గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు, జీవరాసుల పేర్లు చెప్పవచ్చు
అష్టాంగవిద్యలనన్ని అభ్యసించగవచ్చు, చంద్రమండలమైన చేరవచ్చు
కానీ దేహేంద్రియములనరికట్టి మనసు నిల్పి, నంతర్ముఖము చేసి నిశ్చల నిస్వార్ధ హృదయుడై నిలువగలడా

Sakala vidyalu nērci sabha jayin̄cagavaccu, śūruḍai raṇamuna pōravaccu
rājarājai puṭṭi rājyamēlagavaccu, hēma gōdānamul yīyavaccu
gaganamandunna cukkalu lekkagonavaccu, jīvarāsula pērlu ceppavaccu
aṣṭāṅgavidyalananni abhyasin̄cagavaccu, candramaṇḍalamaina cēravaccu
kānī dēhēndriyamulanarikaṭṭi manasu nilpi, nantarmukhamu cēsi niścala nisvārdha hr̥dayuḍai niluvagalaḍā

You can learn many skills and win audiences over

You can be a hero and fight in a war

You can be born as the king of kings rule over a kingdom and give gifts of land and gold

You can count the many minute dots of stars in the sky

You can identify each and every speciesby its name

You can master the eight branches of yoga

You can go on a journey to the moon

But can you become disciplined restrain sense organs point the mind inwards
Be unwavering, selfless and steady

 


తలపులందు వేరు దైవంబు కలడని, తలచి నరుడు తన్ను తానె మరచు
తలపులన్ని వీడ తానె దైవంబగు, తలపు భ్రాంతి వీడి తరలి రండు.

Talapulandu vēru daivambu kalaḍani, talaci naruḍu tannu tāne maracu
talapulanni vīḍa tāne daivambagu, talapu bhrānti vīḍi tarali raṇḍu.

Imagining God to be someone else, You do not know yoursef

If you can put aside all notions, you yourself are God

Shake off the very thought of the thought

Realize yourself soon 

 


తల్లి కన్న మిగుల దైవమే దగ్గర, సన్నిహితుడు తండ్రి కన్న చాల
అట్టి ఆత్మ వదల అబ్బును పాపంబు, ఉన్న మాట తెలుపుచున్న మాట.

Talli kanna migula daivamē daggara, sannihituḍu taṇḍri kanna cāla
aṭṭi ātma vadala abbunu pāpambu, unna māṭa telupucunna māṭa.

God is more intimate than your mother and closer than your father

It’s an error to forsake such a God, What you’re being told is a fact

Human Values

కొలనుకు కలువయే శృంగారము, ఆకాశమునకు చంద్రుడే శృంగారము
సముద్రమునకు అలలే శృంగారము, మానవులకు గుణమే శృంగారము.

Kolanuku kaluvayē śr̥ṅgāramu, ākāśamunaku candruḍē śr̥ṅgāramu
samudramunaku alalē śr̥ṅgāramu, mānavulaku guṇamē śr̥ṅgāramu.

Just as a lily beautifies a lake, And the moon illumines the sky

As waves adorn the ocean, Virtues enhance human beings


సత్యధర్మమహింసయు శాంతిప్రేమ, మానవుని పంచ ప్రాణాలు మహిని వెలయు
పంచప్రాణాలలో ప్రేమ ఎంతొ హెచ్చు, కాన హృదయాన ప్రేమను గట్టి పరచు.

Satyadharmamahinsayu śāntiprēma, mānavuni pan̄ca prāṇālu mahini velayu
pan̄caprāṇālalō prēma ento heccu, kāna hr̥dayāna prēmanu gaṭṭi paracu.

Truth, morality, non-violence, peace and love

The five life-breaths of man on earth

Of these five breaths Love is the most important

So strengthen the Love in your heart

సత్యధర్మప్రేమశాంతులు లేకున్న, విద్యలన్నియు నేర్చి విలువ సున్న
సత్యధర్మప్రేమశాంతులు లేకున్న, దానధర్మాలు సార్థకత సున్న
సత్యధర్మప్రేమశాంతులు లేకున్న, పదవులన్నియు చేసి ఫలము సున్న
సత్యధర్మప్రేమశాంతులు లేకున్న, బహుళ సత్కార్య లాభంబు సున్న
ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ, గుణములు ఇవి నాల్గు పునాది గోడలప్ప
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు, సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!

Satyadharmaprēmaśāntulu lēkunna, vidyalanniyu nērci viluva sunna
satyadharmaprēmaśāntulu lēkunna, dānadharmālu sārthakata sunna
satyadharmaprēmaśāntulu lēkunna, padavulanniyu cēsi phalamu sunna
satyadharmaprēmaśāntulu lēkunna, bahuḷa satkārya lābhambu sunna
ī sanātana dharma harmyambu niluva, guṇamulu ivi nālgu punādi gōḍalappa
intakannanu vēreddi eruka paratu, sādhusadguṇa gaṇyulau sabhyulāra

In the absence of truth, morality, love and peace, All the skills you’ve learned are worth zero

The end of charity is zero

The results of a big job, zero

The merit from multiple apparently good deeds, zero

The mansion of our timeless dharma Upheld by the four walls of virtues

ప్రేమతత్వం ప్రబోధించి,  సమత మమతలు పొందుపరచి
మానవత్వపు విలువలు తెలిపిన, అతడె దైవము, అతడె సాయి.

Prēmatatvaṁ prabōdhin̄ci, samata mamatalu ponduparaci
mānavatvapu viluvalu telipina, ataḍe daivamu, ataḍe sāyi.

Only He who awakens the spirit of Love

who instills brotherhood and egalitarianism

who teaches human values 

Only He is God
Only He is Sai


సాయి అర్థించు మీ నుండి సద్గుణములు, సర్వమానవ సోదర సఖ్యబుద్ధి
స్వార్థ త్యాగంబు పరిశుద్ధ సంఘసేవ, సాయికిచ్చెడి ధనమిదె సత్యముగను.

Sāyi arthin̄cu mī nuṇḍi sadguṇamulu, sarvamānava sōdara sakhyabud’dhi
svārtha tyāgambu pariśud’dha saṅghasēva, sāyikicceḍi dhanamide satyamuganu.

What Sai wants from you are virtues—

Be brotherly to all Give up selfishness Serve the community with a pure heart

Truly, this is the real wealth you can give Sai

God’s Glory

క్రమము తప్పక మింట ప్రతిదినంబును భాను, డుదయాస్తమయముల నొందనేల?
గగనంబునకు కాంతికాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల?
క్షణమైన విశ్రాంతిగొనక తా పవనుండు కోట్లను బ్రోవ వీవనేల?
అనిశంబు కిలకిల ధ్వనుల నవ్వుచు నది సలిలమై ప్రవహించు చందమేల?
ప్రకృతిలొ ప్రాణికోటి యందు ఎందు చూచిన?
ధన విభవ జాతి మత భేదమేల?

ఎవని ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞను పాలింప అరయరండు

Kramamu tappaka miṇṭa pratidinambunu bhānu ḍudayāstamayamula nondanēla?
Gaganambunaku kāntikājēyu tārakal pagalu mātramu dāgu bhaṅgiyēla?
Kṣaṇamaina viśrāntigonaka tā pavanuṇḍu kōṭlanu brōva vīvanēla?
Aniśambu kilakila dhvanula navvucu nadi salilamai pravahin̄cu candamēla?
Prakr̥tilo prāṇikōṭi yandu endu cūcina?
Dhana vibhava jāti mata bhēdamēla?
Evani ājñaku bad’dhulō evaru prabhuvō atani ājñanu pālimpa arayaraṇḍu

How does the sun rise and set day after day without missing a beat?

How come the stars —the lights of the sky—hide only at daytime

How does the wind support the life of millions without resting a moment

How does river water flow all the time laughing and gurgling?

Wherever you look how is nature full of creativity?

And on earth a diversity of status and riches mindsets and species

Whose command is this? The Lord of All, Behold

Education

సత్ప్రవర్తన సద్బుద్ధి సత్యనిరతి, భక్తి క్రమశిక్ష కర్తవ్యపాలనంబు
నేర్పునదె విద్య విద్యార్థి నేర్వవలయు, సత్యమును తెల్పు మాట శ్రీసాయి మాట.

Satpravartana sadbud’dhi satyanirati, bhakti kramaśikṣa kartavyapālanambu
nērpunade vidya vidyārthi nērvavalayu, satyamunu telpu māṭa śrīsāyi māṭa.

Education is that which teaches

Good conduct, Good thoughts, Love of Truth, Devotion, Discipline, Diligence

A student must learn this

Mark Sai’s word, it points out the truth


విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి, సంకుచిత భావములనెల్ల సమయజేసి
ఐహిక సహజీవనాదికమెల్లగూర్చి, త్వరగ నేర్పుటయె కాదె బ్రహ్మవిద్య.

Viśvaśāntini cēkūrcu vidhamu nērci, saṅkucita bhāvamulanella samayajēsi
aihika sahajīvanādikamellagūrci, tvaraga nērpuṭaye kāde brahmavidya

How to achieve universal peace

Cut back narrow-mindedness

How to live together with egalitarianism here and now

What makes this happen at once—Isn’t that Self-knowledge

అంధకారంబెల్ల హతమారునేచూడ, వసుధలో దీపంపు వార్త వలన
ఆకొన్న వారికి ఆకలి తీరునే, పంచభక్ష్యపు పేర్లు పరగ విన్న
నిరుపేదవాని పేదరికంబు పోవునే, విత్త ప్రభావంబు విన్నయంత
రోగపీడితుని బల్ రోగాలు పోవునా, ఔషథ మహిమము అంతవిన్న
శాస్త్రజాలంబునంతయు చదివినంత, దట్టమైనట్టి అజ్ఞాన తమము తెగున
ఆచరణలేని విద్యలు అవనియందు, దండి నేర్చిన ఫలమేమి? గుండుసున్న.

Andhakārambella hatamārunēcūḍa, vasudhalō dīpampu vārta valana
ākonna vāriki ākali tīrunē, pan̄cabhakṣyapu pērlu paraga vinna
nirupēdavāni pēdarikambu pōvunē, vitta prabhāvambu vinnayanta
rōgapīḍituni bal rōgālu pōvunā, auṣatha mahimamu antavinna
śāstrajālambunantayu cadivinanta, daṭṭamainaṭṭi ajñāna tamamu teguna
ācaraṇalēni vidyalu avaniyandu ,daṇḍi nērcina phalamēmi? Guṇḍusunna

Can news of a lamp dispel all the darkness in the world?

Can names of five kinds of foods satiate a hungry person?

Will hearing what money can do chase away a beggar’s poverty?

Can stories of the power of medications cure a sick man’s diseases?

Can studying a multitude of sciences solve the lack of Self-knowledge and dispel spiritual ignorance? 

Even if you master theory the outcome of education not put into practice is a big zero


చదువులన్ని చదివి చాల వివేకియై మగిడి తన్నెరుగడు మందమతుడు
ఎంత చదువు చదివి ఏరీతినున్నను హీనుడవగుణంబు మానలేడు.
తరచి చదువు చదవ తర్కవాదమెగాని పూర్ణజ్ఞానమెపుడు పొందలేడు
చదువులన్ని చదివి చావంగనేటికి చావులేని చదువు చదవ వలయు.

Caduvulanni cadivi cāla vivēkiyai magiḍi tannerugaḍu mandamatuḍu
enta caduvu cadivi ērītinunnanu hīnuḍavaguṇambu mānalēḍu.
Taraci caduvu cadava tarkavādamegāni pūrṇajñānamepuḍu pondalēḍu
caduvulanni cadivi cāvaṅganēṭiki cāvulēni caduvu cadava valayu.

The dimwit studied all that there is to study and became very bright but he did not know himself

The wretch studied too much of any and every subject but he did not give up his meanness

All that this type of education is good for is logic and argumentation Not holistic knowledge

What’s the point of studying all that there is to study?
Why kill yourself? Study the Self, it does not die

Treasures of Life

గుణము లేని సుతుడు గురి లేని విద్యలు, నీతి లేని జాతి నిశ్ఫలంబు
శాంతి లేని జీవి శశి లేని నిషి సుమి, వినుము భారతీయ వీర సుతుడా

Guṇamu lēni sutuḍu guri lēni vidyalu, nīti lēni jāti niśphalambu
śānti lēni jīvi śaśi lēni niṣi sumi, vinumu bhāratīya vīra sutuḍā

Listen, O’ brave children of India

A child without virtues, A pointless education
A lawless society, One without inner peace

A dark moonless night—All futile

Karma – Action

తల్లి గర్భమునుండి జన్మించినప్పుడు, కంఠమాలలవేమి కానరావు
మంచి ముత్యపు సరుల్ మచ్చునకును లేవు, మేల్మి బంగరుదండ మెడకు లేదు
రత్నాల హారముల్ రంజిల్లగా లేవు, గోమేథికపు మాల కూడ లేదు
వజ్రాల మాల వన్నెగుంకగ లేదు, పచ్చగ పోల్లను పొదగ లేదు
కలదు కలదొక్క మాల అందరి కంఠమందు, గోవ జన్మాల కర్మలు పొందుపరచి
మంచిదైనను చెడుగైన త్రుంచకుండ, బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల
కర్మలన్నియు చేర్చిన కంఠమాల!

Talli garbhamunuṇḍi janmin̄cinappuḍu, kaṇṭhamālalavēmi kānarāvu
man̄ci mutyapu sarulmaccunakunu lēvu, mēlmi baṅgarudaṇḍa meḍaku lēdu
ratnāla hāramul ran̄jillagā lēvu, gōmēthikapu māla kūḍa lēdu
vajrāla māla vanneguṅkaga lēdu, paccaga pōllanu podaga lēdu
kaladu kaladokka māla andari kaṇṭhamandu, gōva janmāla karmalu ponduparaci
man̄cidainanu ceḍugaina trun̄cakuṇḍa, brahma mīkicci pampunu baruvu māla
karmalanniyu cērcina kaṇṭhamāla!

There are no necklaces around your neck When you are born from your mother’s womb

No pearl strings, no gold chains No emeralds-garnets-topaz-diamonds

But What you did in your past lives

Good or bad, each of your actions is counted

without exception and strung into a garland

Yes, Brahma garlands you and sends you here

The weight of your past karmas around your neck

Morality

కొలది కొలదిగ పుట్టును తొలుత చెదలు, కొరికి తినివేయు త్వరలోన కొయ్యనంత
చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, పిదప నాశము చేయు నేపెద్దనైన

Koladi koladiga puṭṭunu toluta cedalu, koriki tinivēyu tvaralōna koyyananta
ceḍḍa bud’dhulu madilōna cēranēni, pidapa nāśamu cēyu nēpeddanaina

A termite infestation is slow to start, Soon they’ve eaten all the wood away

Bad qualities slink into the mind stealthily, Even the great are eventually ruined by them

జాతి గౌరవంబు నీతిపై నిలుచును, నీతిలేకయున్న జాతి చెడును
నీతి కల్గు జాతి నిజమైన జాతిరా, వినుము భారతీయ వీరసుతుడ!

Jāti gauravambu nītipai nilucunu, nītilēkayunna jāti ceḍunu
nīti kalgu jāti nijamaina jātirā, vinumu bhāratīya vīrasutuḍa!

O’ brave children of India, listen

A country’s honour depends on morality

Without morality a country declines

A worthy country is that which has morality

Prema – Love

ప్రేమరూపంబు బ్రహ్మంబు ప్రేమమయము, ప్రేమ ప్రేమతొ సంధింప నీమమగును
కాన ప్రేమను గట్టిగా కల్గియున్న, అద్వితీయమునొందగ అర్హుడగును.

Prēmarūpambu brahmambu prēmamayamu, prēma prēmato sandhimpa nīmamagunu
kāna prēmanu gaṭṭigā kalgiyunna, advitīyamunondaga ar’huḍagunu.

Brahman is Love Nothing but Love

Only Love will merge with Love— so

Anchor yourself in Love, become worthy of Oneness

 


ప్రేమ మయుండు శ్రీధరుడు ప్రేమయె అతని దివ్యరూపము, ఆ ప్రేమయె ఒకింతనైన వివరింపగ
తత్కామిత సత్పధార్ధమెటు, చేకుర చేయు మానవా!
Prēma mayuṇḍu śrīdharuḍu prēmaye atani divyarūpamu
ā prēmaye okintanaina vivarimpaga, tatkāmita satpadhārdhameṭu
cēkura cēyu mānavā!

God is Love
Love is His Divine form
Love makes the world go around

When you cannot feel even the slightest spark of love in this world

O’ man, how will you seek and realize Divine Love

On Dharma

ధనము వచ్చును పోవును ధరణి యందు, నీతి ధర్మాలు నిలుచును నిజముగాను
నీతి ధర్మాలు హృదయాన నింపుకొన్న, సార్థకంబగు మానవ జన్మ భువిని

Dhanamu vaccunu pōvunu dharaṇi yandu, nīti dharmālu nilucunu nijamugānu
nīti dharmālu hr̥dayāna nimpukonna, sārthakambagu mānava janma bhuvini

Fortunes come and go but righteousness endures

When you fill your heart with righteousness, your life as a human on earth is fulfilled

పని పాటులందే మీ బ్రతుకంత తెల్లారే ఇదియె జీవితమని ఎంచినారా

మూడు పూటల యందు భుజియించి తృప్తిగా ఇదియె జీవితమని ఎంచినారా

మానవత్వము చల్లగా నిదురించి శ్రమను దీర్చుదమన్ని దిండు కోసమే జనియించినారా

కాదూ జీవిత రహస్య మెరుగటులకు ఇందుకోసమే దేవుడీజన్మ ఇచ్చినాడు

తెలివితేటలు గలిగియు తెలుసుకొనగా కాలమంతయు ఊరక గడపనేల

మనిషివై ఇంకపైనను బ్రతుకవయ్య

Your entire life has been amidst the daily errands for living Have you believed that this is the way to lead a life? Having sumptuous meals thrice a day, Have you believed that this is the way to lead a life? By keeping human nature to a peaceful sleep, are you only born to direct all efforts for taking rest?! Not at all! But, to know the secret of this life For this purpose alone God granted this life You are not knowing this fact inspite of having the faculty of intellect Why do you vile away the entire time? Henceforth live on by being human! Pani Patulande Mi Bratukanta Tellare Idiye Jivitamani Encinara Mudu Putala Yandu Bhujiyinci Trptiga Idiye Jivitamani Encinara Manavatvamu Challaga Nidurinci Sramanu Dirchudamanni Dindu Kosame Janiyinchinara Kadu Jivita Rahasya Merugatulaku Indukosame Devudijanma Icchinadu Telivitetalu Galigiyu Telusukonaga Kalamantayu Uraka Gadapanela Manishivai Inkapainanu Bratukavayya

పాప భయంబు పోయే పరిపాటయిపోయెను దుష్కృతంబిలన్ శ్రీపతి భక్తిపోయే

వివరింపగ లేని దురంత కృత్యముల్ దాపురమయ్యే లోకమున తాపసలోక శరణ్యుడైన

ఈ శ్రీపతి నామచింతనమే చేకురచేయు సుఖంబు మానవా!

Pāpa bhayambu pōyē paripāṭayipōyenu duṣkr̥tambilan śrīpati bhaktipōyē vivarimpaga lēni duranta kr̥tyamul dāpuramayyē lōkamuna tāpasalōka śaraṇyuḍaina ī śrīpati nāmacintanamē cēkuracēyu sukhambu mānavā!

There is no fear of sin, the wicked and cruel deeds are rampant on earth, devotion towards God has vanished, unspeakable incidents of cruelty and misdeeds happen every day amidst all this chaos, O man!! Chanting the lord’s name, who is the only refuge of the noble, alone will deliver happiness and peace to mankind.

అస్థిరం జీవనం లోకే అస్థిరం యౌవనం ధనమ్

అస్థిరం దారపుత్రాది

సత్యం కీర్తి ద్వయం స్థిరం ధర్మం కీర్తి ద్వయం స్థిరం

Asthiram Jeevanam Loke Asthiram Yauvvanam Dhanam Asthiram Dara-Puthradi Satyam Keerthi Dwayam Sthiram Dharmam Keerthi Dwayam Sthiram

Life in the mundane world is impermanent Youth and wealth are not lasting Wife and children and other relatives are liable to vanish Truth and fame endure forever Righteousness and fame endure forever

 

 

ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపించకున్నాడయా

లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్రు దీపాలు గగనాన త్రిప్పుచున్నాడయా

లక్షలాదిగనున్న నక్షత్రములనెల్ల నేల రాల్పక మింట నిలుపుచున్నాడయా

ఈ ధారుణీ చక్రమిరుసు లేకుండగా ఎల్లవేళల తిప్పుచున్నాడయా

జీతభత్యము లేక ప్రీతితో మనకొరకు గాలితో సురిటీలు విసరేడయా

ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయా

పొంగి పొరలుచు వచ్చి పృధ్విపై పడకుండ కడలిరాయుని కాళ్ళు ముడిచాడయా

కనిపించకేమి చేస్తున్నాడయా? తెరచాటు తానుండి తెరముందు ప్రజనుంచి తైతక్కలాడించుచున్నాడయా

****************************************************************************

God exists. He exists without being visible to our naked eyes. In order to dispel the darkness of the world, He is there and is rotating the lamps called the Sun & the Moon in the sky. He is there by holding the lakhs of stars in the sky without dropping them onto the ground. He is there rotating the wheel of time constantly at all times without breaking it. Without receiving any salary, He is there giving us the wind for us just out of love towards us. He is there stopping the sky from falling that is drifting without any support. He is there by tying the legs of the ocean so that it doesn’t overflow and cover the land. He is there behind the curtain, placing people in front of the curtain, making us all dance to His tunes.

జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ జిహ్వాగ్రే మిత్ర బాంధవాః

జిహ్వాగ్రే బంధన ప్రాప్తిః జిహ్వాగ్రే మరణం ధృవం

Jihvagre Varthathe Lakshmi Jihvagre Mithra Bandhava Jihvagre Bandhanam Prapthi Jihvagre Maranam Dhruvam The tongue is the cause of Truth and Prosperity. The tongue also earns for friends and relatives. It is the tongue that brings bondage and death.

 

 

భావమందు దుష్టభావము వీడుటే త్యాగమగును అదియే యోగమగును ఆస్తి ఆలివీడి అడవికేగుటకాదు సత్యమైన బాట సాయి మాట సత్యమైన పాట సాయి మాట Letting go of evil thoughts becomes true sacrifice in itself and is the highest penance, not by renouncing one’s wife and wealth and going to the forest. This is truth path declared by Sai Sai’s word is the song of Truth.

అడుగకువే ఓ మనసా! ఓ అడుగకువే ఓ మనసా

అడుగు కొలది అది అడుగున పడునని అడుగకున్న పని వడిగానగునని అడుగకువే ఓ మనసా!

అడుగని శబరిని ఆదరించడే అడుగక తనకై మడియు జటాయువు కడకునేగి సద్గతి గలిగించడే అడుగకువే ఓ మనసా!

Do not ask, oh mind! Do not ask, oh mind! The more you ask, the more you will be neglected. You will get what you deserve faster, without asking. Did He not bless Sabari’s wish unasked? Did he not grant liberation to Jatayu (who sacrificed life for His cause) unasked?

మేథమేటిక్సును మరువక జపియించు గణితశాస్త్రము వంక తనగబోరు

అమెరికా మార్గంబునరయచూతురుగాని కాశికా మార్గంబు కానరాదు

ఆల్జిబ్రాయంత అరయజూతురుగాని ఇంటి వైశాల్యంబు నెరుగబోరు

అనుదినంబును డ్రిల్లుననుసరింతురుగాని పద్మాసనము వేయ బాధ పడును

One is an expert in mathematics, but unable to do a small sum in arithmetic People eagerly wait to travel to America, but cannot find a way to the holy place of Kashi. They have mastered algebra, but unable to measure the area of their home They repeat all the physical exercises taught to them: but struggle when asked to sit in the Padmasana.

విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి సంకుచిత భావములనెల్ల సమయజేసి ఐకమత్యము సహజీవనాధికములు పరగ నేర్పుటయే కాదే బ్రహ్మ విద్య

Viswashanthini Chekoorchu Vidhamu Nerchi Sankuchita Bhaavamulanella Samayajesi Aikamatyamu Sahajeevanaadhikamulu Paraga Nerputaye Kaade Brahma Vidya

Making us learn the way to establish universal peace Removing all narrow minded feelings Inculcating unity, fraternity and harmonious living Is that not Brahma Vidya or Knowledge of the Self?

విద్యా నామ నరస్వరూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం

విద్యా భోగకరీ యశస్సుభకరీ విద్యా గురూణాం గురుహు

విద్యా బంధుజనే విదేశ గమనే విద్యా పరం లోచనం

విద్యా రాజసుపూజ్యతే నహి ధనం విద్యా విహీనం పశుమ్

విద్యే మనిషికి అందం, దాగిఉన్న సంపద విద్యే మనిషికి భోగ భాగ్యాలను, కీర్తి, శుభాలను ప్రసాదిస్తుంది విద్యే గురువులకు గురువు విదేశాలకు వెళ్ళినప్పుడు విద్యే నీకు అసలైన మిత్రుడు విద్యే అత్యుత్తమమైన నేత్రము (జ్ఞానాన్ని ప్రసాదించేది) రాజువంటి పూజలు, మర్యాదలు విద్యేకే లభిస్తుంది కానీ ధనానికి కాదు విద్య లేనివాడు వింత పశువుతో సమానం

knowledge is man’s beauty, his most hidden wealth. knowledge bestows enjoyment, fame, and happiness. knowledge is the teacher of teachers. knowledge is your friend in a foreign land. knowledge is like a powerful eye with great vision which helps us understand the true nature, looking with such eye is highly beneficial to us It is knowledge that will receive worship and reverence like kings but not wealth. bereft of knowledge, man is an animal

https://youtu.be/yEQf8d9KFLI

శాంతి అంతరించె సత్యంబు కరువయ్యె ఆయుధముల భీతి అధికమయ్యె ఈ దురంతరములకు హేతువు స్వార్థమె ఉన్నమాట తెలుపుచున్న మాట

Shanthi Antarinche Sathyambu Karuvayye Ayudhamula Bheeti Adhikamayye Ee Durantaramulaku Hetuvu Swardhame Unna Maata Telupuchunna Maata

స్వామి ఈ పద్యంలో మానవుని స్వార్ధపూరిత బుద్ధివలన ప్రస్తుత కాలం ఎలా ఉందొ వివరిస్తున్నారు. శాంతి పూర్తిగా లేకుండా పోయింది. సత్యము పలికే వారి సంఖ్య తగ్గిపోయింది. ఆయుధాల భయం బాగా ఎక్కువైంది. ఇట్టి దుస్థితికి, ఇలాంటి దుష్పరిణామాలకు కారణం మానవుని స్వార్ధం అంటున్నారు స్వామి.

Peace is non-existent, truth is scarce. Fear of weapons has mounted. Selfishness is the cause of these harmful trends. These words convey the truth.

బ్రహ్మవిద్య గూర్చి బహుళ ప్రచారముల్ సలుపువారలు కలరు చాలమంది కాని ఆచరించు ఘనుడు ఒక్కడు లేడు సత్యమైన బాట సాయి మాట.

Having studied Brahma Vidya, There are many who preach at length. But we cannot find even a single hero who practices. Sai’s words are the Truth. In this poem Swami tells us that nowadays there are any number of people who preach the knowledge of the Brahman, but there is none who are putting it into practice. That is Swami’s word which is the truth.

 

సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో సఖా దయా భ్రాతృ శాంతిః భార్యా క్షమా పుత్రః షడయతే జనబాంధవాః

Sathyam Matha Pita Jnanam Dharmo Sakha Daya Bhatru Shanti Bharya Kshama Putra Shadayathe Jana Bandhavaah

Truth is the mother; Wisdom is the father; Righteousness is the brother; Compassion the brother ; Peace is the wife; forbearance the son; These six are man’s true relations.

ఈ పద్యం ద్వారా స్వామి విలువలేని ఈ మానవ దేహంలో ఎంతో అమూల్యమైన, అతి విలువైన సంపద దాగి వుందని వివరిస్తున్నారు. సాక్షాత్తు భగవంతుడు ఆత్మస్వరూపునిగా మనలో ఉన్నాడని స్వామి ఈ పద్యంలో వివరించారు. వినండి సాయి పద్య దీపికలు 24వ భాగం.

In today’s poem of Sai Padya Deepikalu, Swami explains that in this valueless human body, there exists the most valuable of all. God resides in this human body in the form of Atma. Come let us know this truth.

సన్న జాజి కన్న సంపంగి లత కన్న

జున్ను గడ్డ కన్న వెన్న కన్న నెమలి కన్ను కన్న

నిండు వెన్నెల కన్న కన్న తల్లి ప్రేమ సున్నితంబు

కన్నతల్లి ప్రేమలోని సున్నితత్వాన్ని ఈ ద్వారా స్వామి మనకి వెల్లడి చేస్తున్నారు. అందుకే స్వామి మాతృమూర్తికి అంత ప్రాధాన్యతనిస్తారు. తల్లి ప్రేమను మించింది లేడదని, తల్లి మనని కంటికి రెప్పలా కాపాడుతూ అహర్నిశలూ శ్రమించి, మన ఉన్నతికోసం పాటుపడుతుంది.

Sannajaaji Kanna Sampamngi Latha Kanna Junnugadda Kanna Venna Kanna Nemali Kannu Kanna Nindu Vennela Kanna Kanna Thalli Prema Sunnithambu

Swami in this short but sweet poem elaborates the tenderness and the softness of the love of a mother. Be it a Downy Jasmine (it’s also called Spanish Jasmine) Or the flower of michelia Be it milk cheese Or the creamy butter Be it a peacock eye Or the radiant light of the full moon Nothing is softer and delicate Than the inimitable love of a mother.

దినకరుడు శాంతుడై తోచె దినములింత కురుచలయ్యెను

చలిగాలి చురుకు హెచ్చె పొలములన్​ రేడి గ్రుడ్డి

వెన్నెలలోన కుప్పలన్​ ఊర్చు కాపులు గొంతులెత్తి పదములన్​ పాడతొడగుదురు

జనపచేలకు ముత్యాల సరులుగూర్చి మిరప పండ్లకు కుంకుమ మెరుపుదాల్చి

బంతిపువ్వుల మొహము అల్లలంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి

సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చె సరసురాలైన పుష్య మాసంబువొచ్చె

సత్యసాయి భగవానుడు ఈ పద్యంలో సంక్రాంతి పండుగ రాక గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. ప్రకృతి పారవశ్యంతో, రైతుల ఆనందోత్సాహాలతో, సంక్రాంతి పండుగ పుష్య మాసంలో వచ్చి సర్వులకూ ఆనందాన్ని, పవిత్రతను, భగవదనుగ్రహాన్ని తీసుకొని వస్తుంది. ఆ పద్యాన్ని ఈనాటి సాయి పద్య దీపికలు 22వ భాగంలో విందాం.

Dinakarudu Shanthudai Thoche Dinamulintha Kuruchalayyenu Chaligaali Churuku Hecche Polamulan Redi Gruddi Vennelalona Kuppalan Oorchu Kaapulu Gonthuletthi Padamulan Paadathodaguduru Janapachelaku Muthyaala Sarulu Goorchi Mirapa Pandlaku Kunkuma Merupu Daalchi Banthi Puvvula Mohamu Allalantha Vippi Mana Gruhambula Dhaanya Sampadala Nilpi Sarasuraalaina Sankranthi Pandugocche Sarasuraalaina Pushyamaasambu Vacche

Meaning: The sun appears in all his serenity The days have become shorter. And the chill wind is blowin Farmers are singing folk lores from the fields while threshing and winnowing the crops in dim moonlight Jute crop bedecked with string of beautiful flowers Chills radiating with the color of vermillion The blossoming beauty of marigold flowers Having filled our homes with rich harvest The sweet festival of Sankranti has arrived The sweet Month of Pushya has arrived As Sankranthi festival is around the corner, we present to you a wonderful poem delivered by Bhagawan describing the arrival of this beautiful festival Sankranthi which takes us close to the Divine through every aspect of nature which we can see around us. Come let us listen to that poem in the 22nd episode of Sai Padya Deepikalu.

జీవరాసులన్నిటిలో మానవ జన్మ ఉత్తమమైనది. జంతూనాం నరజన్మ దుర్లభం. మానవుడు ఒక్కడే మాధవునిగా మారగలడు. ఏది తాను కాదో, ఏది తనో తెలుసుకోకుండా భ్రాంతిలో ఉండిపోతున్నాడు. నిజము తెలుసుకుంటే అదే ముక్తి. స్వామి చెప్పిన ఈ పద్యం దానినే వివరిస్తుంది.

 

రక్తము మాంస శల్యముల రాశియు దేహము మీరు కాదు

సువ్యక్తము కాని  కోరికలు  వ్యక్త మనస్సును మీరు కాదు

ముక్తికి బంధకారమగు మోహపు భ్రాంతియు మీరు కాదు

మీ శక్తిని మీరెఱుంగగల శాశ్వతుడౌ పరమాత్మ మీరేగా

పరమాత్మడు మీరేగా…. పరమాత్మడు మీరేగా…. అని

మన నిజ తత్వాన్ని సత్యసాయి భగవానుడు చక్కగా వివరిస్తున్నారు.

 Swami in this poem elaborates the significance of human birth and asks us to realise our true innate divinity.

Raktamu Mamsha Shalyamula Rashiyu Dehamu Meeru Kaadu

Suvyaktamu Kaani Korikalu Vyakta Manassunu Meeru Kaadu

Muktiki Bandhakaaramagu Mohapu Bhrantiyu Meeru Kaadu

Mee Shaktini

Mee Shaktini Meererungagala Shasvathudau Paramatma Meeregaa

Mee Shaktini Meererungagala Shasvathudau Paramatma Meeregaa

Mee Shaktini Meererungagala Shasvathudau Paramatmadu Meeregaa

Paramaatmudu Meeregaa…Paramaatma Meeregaa…

దైవాధీనం జగత్సర్వం

సత్యాధీనంతు దేవతమ్

తత్  సత్యం ఉత్తమాధీనమ్

తత్  సత్యం ఉత్తమాధీనమ్

ఉత్తమో పరదేవత

ఉత్తమో పరదేవత

దైవాధీనం జగత్సర్వం

దైవాధీనం జగత్సర్వం

పుడమినందు పుణ్య పురుషులు లేకున్న జగములెట్లు వెలుగు పగలుగాను!! అటువంటి ఉత్తముల శక్తి ఎంతటిదో, ఈ జగత్తు మీద వారి ప్రభావం ఎటువంటిదో స్వామి ఈనాటి పద్యంలో వివరించి చెప్పారు.

ఈనాటి “సాయి పద్య దీపికలు” 19వ భాగంలో ఈ పద్యాన్ని స్వామి గళంలో వినండి.

Daivãdhēnam jagatsarvam

Sathyãdhēnamcha devatham

Tat Sathyam utthamãdhēnam

Utthamõ paradevatha.

Swami once said – “If there are no great souls on this earth, how will the world be illuminated?” Swami explains the importance and power of such noble human beings  very beautifully in this padyam.

Let’s listen to this padyam in Swami’s Voice in today’s episode of “Sai Padya Deepikalu –  Episode 19.”

ప్రేమ సేవలు రెండు రెక్కలును మనకు

ప్రేమ సేవలు రెండు రెక్కలును మనకు

పక్ష బలమున పక్షులు ఎగురునట్లు

పక్షబలమున పక్షులు ఎగురునట్లు

ఈ విహంగమార్గమును అనుసరించి

చేరవలెయును గమ్యంబు శీఘ్రముగను

చేరవలెయును గమ్యంబు శీఘ్రముగను ..   శీఘ్రముగను.

జీవిత గమ్యాన్ని వేగంగా చేరటానికి సులభమైన మార్గం ఏది? అందుకు అవసరమైన బలసహాయాలు మనకి ఎలా లభిస్తాయి? ఇంత ప్రముఖమైన విషయాన్ని స్వామి తమదైన శైలిలోఈ చిన్ని పద్యంలో సులువుగా వివరించారు.

ఈ అందమైన సాయి పద్యాన్ని ఈనాటి “సాయి పద్య దీపికలు” 18వ భాగంలో వినండి.

Prema sevalu rendu rekkalunu manaku

Paksha balamuna pakshulu egurunatlu

Ee/Ē vihanga mãrgamunu anusarinchi

Chéravalayunu gamyambu shēghramuganu.

What is the quickest way to reach our ultimate goal in life? Where do we find the required strength and support? Swami lovingly clears our doubts in His inimitable style in this tiny padyam.

Let’s listen to this beautiful padyam in Swami’s Voice in today’s episode of “Sai Padya Deepikalu –  Episode 18.”

రమణీ శిరోమరుల్ రావచ్చు పోవచ్చు

శాశ్వతమైనది సత్యమొకటే

రమణీ శిరోమరుల్ రావచ్చు పోవచ్చు

శాశ్వతమైనది సత్యమొకటే

రాజ్యభోగములెన్నొ రావచ్చు పోవచ్చు

శాశ్వతమైనది సత్యమొకటే

భ్రాతలు బంధువుల్ రావచ్చు పోవచ్చు

శాశ్వతమైనది సత్యమొకటే

లోకమందు అధికారభోగముల్ రావచ్చు పోవచ్చు

శాశ్వతమైనది సత్యమొకటే

సరస సన్మార్గ తత్వంబు తెలియజెప్పి

అమృతంబు అదియే సకల సౌభాగ్యమందు

భువినీ సత్యంబె పరమ సౌభాగ్యమందు

 

పదవులు, అధికారాలు, భోగభాగ్యాలు ఇవన్నీ వచ్చిపోయే మేఘాల వంటివి అయితే లోకంలో శాశ్వతమైన సౌభాగ్యం ఏమిటనే సందేహం కలగడం సహజమే. ఇందుకు సమాధానాన్ని స్వామి ఇలా వివరించారు.

 

ఈ అద్భుతమైన పద్యాన్ని ఈనాటి “సాయి పద్య దీపికలు” 17వ భాగంలో స్వామి సుమధుర గళంలో వినండి.

 

Ramanī shiromarul rãvachu põvachu

Shãshwathamainadi sathyamokate

Rãjyabhõgamulenno rãvachu põvachu

Shãshwathamainadi sathyamokate

Bhrãthalu bandhuvul rãvachu põvachu

Shãshwathamainadi sathyamokate

Lõkamandu adhikãrabhõgamul rãvachu põvachu

Shãshwathamainadi sathyamokate

Sarasa sanmãrga tatvambu teliyajeppi

Amruthambu adiyé sakala soubhãgyamandu

Bhuvinī sathyambè parama soubhãgyamandu

It might be power or position, family or friends, wealth or worldly pleasures, all these are transient. What is the one thing that is permanent and constant? Swami lovingly explains in this padyam.

Let’s listen to this insightful padyam in His Divine Voice in today’s episode of “Sai Padya Deepikalu –  Episode 16.”

 

 

మనసు మాలిన్యములనెల్ల మట్టుపెట్టి

పరమ పరిశుద్ధ భావముల్ పాదుకొలుప

జ్ఞాన దృష్టియు నేర్పేడి కాననగును

విశ్వమంతయు బ్రహ్మమై వెలుగునటుల

విశ్వమంతయు బ్రహ్మయై వెలుగునటుల

ఈ పద్యంలో స్వామి ఈ విశ్వంలో భగవంతుణ్ణి ఎలా చూడచ్చో చెప్తున్నారు. భగవంతుడు భావ ప్రియుడు. మనం ఏమి ఆలోచించినా, ఏమి మాట్లాడినా, ఏమి చేసినా దాంట్లో పవిత్రను పెంపొందించుకోవాలంటారు. మన మనసులోని మాలిన్యాలను దూరం చేసుకొని, సద్భావములు, సదాలోచనలు అభివృద్ధి పరచుకోవాలి. ఇది చేసినపుడు మనకి జ్ఞాన ద్రుష్టి పెరిగి తద్వారా పరాత్పరుడిని ఈ విశ్వమంతా చూడగలుగుతాము. అంటే అన్నిటికీ మూలము మన మనసులోని భావాలే. అందుకే భగవంతుడు భావప్రియుడు. ఇదే మనం చేయాల్సివున్న సాధన.

Manasu Malinyamulanu Mattupetti

Parama Parishuddha Bhaavamul Padukolupa

Jnana Drustiyu Nerpedi Kananagunu

Viswamanthayu Brahmamai Velugunatula

Viswamanthayu Brahmayai Veluganatula

Swami often tells us that God is Bhavapriya and not Bhayapriya. That is God sees the intentions or the purity of the feeling. So, whatever we think, speak or do it should be full of purity. In this poem Swami explains to us how to see the Lord in the universe around us. He says: “Remove the impurities of the mind and plant noble and pure feelings in it. Then you will develop a vision full of wisdom and you can visualize the Lord in the entire universe.”

సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు

శూరుడై రణమందు పోరవచ్చు

రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు

హేమగోదానముల్ యీయవచ్చు

గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు

జీవరాసుల పేర్లు చెప్పవచ్చు

అష్టాంగవిద్యలు అభ్యసించగవచ్చు

చంద్రమండలమైన చేరవచ్చు

కాని దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి

అంతర్ముఖము చేసి అనవరతము

నిశ్చల సమాన చిత్తుడై  నిలువలేడు .

 

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు ఈ పద్యంలో మానవుని స్థితిని గురించి వివరిస్తున్నారు. భగవంతుడి సృష్టిలో అత్యున్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నవాడు మానవుడు. మానవుడు అనుకుంటే ఏదైనా సాధించగలడు. అన్ని విద్యా రంగాల్లో రాణించి సభా మర్యాదలను పొందగలడు. రణరంగంలో శత్రువులను వీరోచితంగా పోరాడి గెలవగలడు. రారాజే జన్మను ధరించి రాజ్యాలను ఏలగలడు, బంగారము, గోసంపద దానముగా ఇవ్వగలడు. ఆకాశంలో ఉన్న చుక్కలన్నిటినీ లెక్కబెట్టటగలడు కూడా. అంతే కాదు సృష్టిలో ఉన్న జీవరాసులన్నీ పేర్లనూ చెప్పెయ్యగలడు, వివిధ రకాలా యోగ సాధనాలలో ప్రావీణ్యత పొందగలడు. చివరికి చంద్రమండలాన్ని కూడా చేరగలడు. కానీ స్వామి అంటున్నారు… ఇన్ని అసాధ్యమైన కార్యాలను సాధించగలిగిన మానవుడు మాత్రం తన దేహాన్ని, ఇంద్రియాలను మనసును స్వాధీనంలో ఉంచుకొని అంతర్ దృష్టిని పెంపొందించుకొని ఎల్లప్పుడూ సమత్వాన్ని సాధించ లేకపోతున్నాడు అని స్వామి చెప్తున్నారు.

Sai Padma Deepikalu – Episode 07

Sakala Vidyalu Nerchi Sabha Jayinchagavacchu

Shoorudai Ranamuna Poravacchu

Rajarajai Putti Rajyamelagavacchu

Hema Godanamul Eeyavacchu

Gaganamandunna Chukkalu Lekkagonavacchu

Jeevaraasula Perlu Cheppavacchu

Ashtaangavidyalu Abhyasinchagavacchu

Chandramandalamaina Cheravacchu

Kani Dhendriyamularikatti Manasunilpi

Antarmukhamu Chesi Anavarathamu

Nischala Samaana Chittudai Niluvaledu

Swami so beautifully explains in this poem that there is nothing in this world that man cannot achieve. Be it acquiring knowledge through various forms of education and winning over debates, becoming a warrior and fighting battles, taking a kingly birth and ruling over kingdoms and giving gold and cattle as charity. Man is also capable of counting the stars in the sky and naming the varieties of species or mastering various forms of Yoga or be it reaching the moon. But the only thing that man is not able to achieve is to control his mind and senses, constantly turning  it inwards and be equanimous and peaceful.

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం

న మంత్రో న తీర్ధం న వేదా న యఙ్ఞo

అహం భోజనం న భోజనం నైవ భోజ్యం న కర్తో

సదానంద రూపః శివోహం శివోహమ్

సత్య సాయి బాబా వారు ఈ పద్యం ద్వారా భగవంతుని అద్వైత తత్వాన్ని మనకి ఎంతో చక్కగా వివరిస్తున్నారు. నాకు పుణ్యపాపాలు లేవు. నాకు సుఖదుఃఖాలు లేవు. మంత్రాలు, తీర్థాలు, వేదాలు, యజ్ఞాలు నేను కాదు. అనుభవించేవాడిని నేను కాదు. నేను భుజించే పదార్ధాన్ని కానీ , భుజించేవాడిని కానీ, భుజించే కార్యాన్ని కానీ కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను సత్యమును, నేను శివుడను, నేను సుందరమును. అని ఈ పద్యానికి అర్ధం.

 Sai Padya Deepikalu – Episode 06

Na Punyam Na Pâpam

Na Saukhyam Na Dukkham

Na Manthro Na Tîrtham

Na Vedâ  Na yajnam.

Aham Bhojanam Na Bhojanam

Naiva Bhojam Na Kartau

Sadânanda Rûpam Advaitam

Sathyam Sivam Sundaram.

This poem rendered by Bhagawan Sri Sathya Sai Baba explains the Principle of oneness of God. The Advaitha Philosophy at its best. The meaning of the poem goes as follows:

Neither sin nor merit; neither pleasure nor pain.

Neither sacred formulae nor sacred places.

Neither Vedas nor yajnas (rituals).

I am neither the eaten nor the eater nor the act of eating;

I am the ever blissful One, One without a second, Truth, Goodness and Beauty.

I AM THAT

 

 

 

 

సాయి పద్య దీపికలు – Episode 03

ఈ పద్యంలో స్వామి మనషి జీవితంలో భక్తి తీసుకొచ్చే మార్పును, భక్తిని పెంపొందించుకోవడంలో ఉన్న విశిష్టతను వివరించారు.

అద్దమందున ప్రతిబింబమంటనటుల

తామరాకులు నీటిచే తడవనటుల

పాపమంటదు మానవ భక్తి వలన

సత్యమునుజూపు మాట ఈ సాయి మాట

సాయి పద్య దీపికలు – Episode 02

సత్యసాయి భగవానుడు ఈ పద్యంలో, మానవతా విలువలైన సత్యము, ధర్మమూ, ప్రేమ ఎల్లప్పుడూ ఉండినప్పుడు ప్రపంచంలో శాంతి సౌఖ్యములు వెల్లివిరుస్తాయని  వారించారు. సత్య నిరతితో, ధర్మబద్ధంగా అందరిపట్లా ప్రేమ ఆధారణలతో మన జీవితాన్ని గడిపితే, మనకి కావలసినవన్నీ లభిస్తాయంటారు స్వామి.

 

సత్య ధర్మ ప్రేమ నిత్యమైయుండిన

పుడమితల్లి ఎంతొ పులకరించు

విశ్వశాంతినిచ్చు వివిధ సౌఖ్యము హెచ్చు

వినుడు భారతీయ వీర సుతుడ!

Sai Padma Deepikalu – Episode 02

Swami in this poem explains to the youth that when the human values of Truth, Righteousness and Love exist, the world would be full of peace and happiness. Swami calls out to the youth “Oh Valorous Son of Bharath! When you lead your life upholding Truth, following righteousness and loving your fellow beings, will foster all the comforts of your life.”

Satya Dharma Prema Nityamaiyundina

Pudamitalli Entho Pulakarinchu

Vishwashantinicchu Vividha Soukhyamu Hecchu

Vinudu Bhaarateeya Veera Sutuda!

 

 

స్వామి ఈ పద్యం ద్వారా ఎంతో ముఖ్యమైన అంశాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఒకవైపు ఆధునిక విద్యలు పెరిగిపోతున్నా, మరొకపక్క అందరూ తెలుసుకోవలసిన ఆత్మ విద్య క్షీణించిపోతుంది అంటున్నారు. దాని పర్యవసానంగా మానవుని మనసులోని పెంపొందించుకోవలసిన మానవతా విలువలు అడుగంటిపోతున్నాయని, స్వామి చింతిస్తున్నారు.

ఆధునిక విద్య పెరిగెను అంతు  లేక

ఆత్మ విద్యయు క్షీణించె  అవధి లేక

సత్య ధర్మంబులన్నియు సమసిపోయే

ప్రేమ శాంతి అహింసలు పేదబడియె

Swami through this poem explains to us the effect of modern education on man. People run after accumulation of knowledge and education but forget the true principle of the Atma. As a result the human values of Truth, Righteousness, Peace and Love are diminishing in man’s heart. This is Swami’s clarion call for all to start developing these values and understand the principle of oneness in all. As Swami says End of Education is Character. That should be the aim of any type of education and acquisition of knowledge.

Poem:

Adhunika Vidya Perigenu Anthu Leka

Atma Vidyayu Ksheeninche Avadhi Leka

Sathya Dharmambulanniyu Samasipoye

Prema Shanthi Ahimsalu Pedabadiye

స్వామి ఈ పద్యం ద్వారా మనకి ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో మనం దేవుణ్ణి ఒకరు ఏసు అని మరొకరు అల్లా అని కొంతమంది విష్ణు అని మరికొందరు శివ అని వారి వారి మనోభావాలు, వారి వారి అభిరుచులకు అనుగుణంగా కొలిచి ఆరాధిస్తారు. కానీ రూపాలు ఎన్నైనా, నామాలు ఏమైనా భగవంతుడు ఒక్కడే అని మనం తెలుసుకోవాలంటారు సర్వదేవతాతీత స్వరూపులైన మన స్వామి.

 

అల్లాయంచు మహమ్మదీయులు

జహోవాయంచు సత్క్రైస్తవుల్​

ఫుల్లాబ్జాక్షుడటంచు వైష్ణవులు

శంభోయంచు  శైవుల్​  సదా

ప్రహ్లాదంబున గొల్వ అందరికి 

ఆయురారోగ్య సంపద లాభంబు నొసంగి రక్షించు

దేవుండు ఒక్కడే యంచు భావించుడీ!

Sai Padya Deepikalu – Episode 04

In this poem Swami reveals to us the greatest of truths. In this world some call God and worship as Yesu, some as Allah, some as Vishnu and some others as Shiva based on their mindsets and their beliefs. Our beloved Bhagawan guides us to realize the truth that whatever be the name and form, God is only one.

Allayanchu Mahammadeeyulu

Jahovaayanchu Satkriastavul

Pullabjaakshudatanchu Vaishnavul

Shambhoyanchu Shaivul Sadaa

Prahlaadambuna Golva Andarikee

Aayuraarogya Sampada Labhambu Nosangi Rakshinchu

Devundu Okkadeyanchu Bhaavinchudee!